For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హఠాత్తుగా వచ్చే స్ట్రోక్ అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!!

By Swathi
|

స్ట్రోక్ అనేది ప్రాణాణాంతకమైనది. హఠాత్తుగా వచ్చే ఈ పరిణామం వల్ల ప్రాణాలకే ముప్పు ఉంటుంది. రక్తప్రసరణ మెదడుకు అందకుండా పూర్తీగా నిలిచిపోయినప్పుడు స్ట్రోక్ వస్తుంది. దీనివల్ల రక్త కణాలు చనిపోతాయి. కాబట్టి దీనికి ఎలాంటి నివారణ ఉండదు. కానీ దీన్ని ముందుగా అరికట్టవచ్చు. ముందుగా గుర్తించడం వల్ల.. దీన్ని అరికట్టడమనేది ఆధారపడి ఉంటుంది.

స్ట్రోక్ రావడానికి ముందు ముఖం నిర్జీవంగా మారడం, అలసట, చేతుల్లో సత్తువ కోల్పోవడం, మాట్లాడటానికి కష్టంగా మారడం వంటి లక్షణాలు స్ట్రోక్ ని సూచిస్తాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ.. నిర్లక్ష్యం చేయకండి. హార్ట్ ఫెయిల్యూర్, నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి వంటివి కూడా హార్ట్ స్ట్రోక్ కి కారణమవుతాయి.

అయితే కొన్ని మార్పులు, కొన్ని జాగ్రత్తలు, కొన్ని రకాల అలవాట్ల వల్ల.. స్ట్రోక్ రిస్క్ ని తప్పించుకోవచ్చు. లైఫ్ స్టైల్ లో కొద్దిపాటి మార్పులు అంటే డైట్ లో మార్పుల ద్వారా స్ట్రోక్ రిస్క్ ని చాలా ఎఫెక్టివ్ గా నివారించవచ్చు. ఇవే కాదు.. స్ట్రోక్ రాకుండా జాగ్రత్త పడాలంటే.. ఇక్కడ సూచిస్తున్న కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు అంటున్నారు నిపుణులు.

రెగ్యులర్ గా వ్యాయామం

రెగ్యులర్ గా వ్యాయామం

ఆరోగ్యంగా జీవించడానికి వ్యాయామం చాలా ముఖ్యమైనది. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు పొందవచ్చు. క్యాలరీలు కరిగించడానికి, బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ గా ఉండటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా స్ట్రోక్ దరిచేరకుండా ఉండటానికి వ్యాయామం గ్రేట్ గా సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

కొన్ని అధ్యయనాల ప్రకారం అధిక బరువు ఉన్నవాళ్లలో స్ట్రోక్ రిస్క్ ఉంటుంది. కాబట్టి బీఎమ్ఐ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. ఎక్కువగా ఉన్న క్యాలరీలను, కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలి. దీనివల్ల స్ట్రోక్ రాకుండా అరికట్టవచ్చు.

బ్లడ్ ప్రెజర్

బ్లడ్ ప్రెజర్

హై బ్లడ్ ప్రెజర్ ఉన్నవాళ్లకు హార్ట్ స్ట్రోక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. హైపర్ టెన్షన్ కూడా స్ట్రోక్ కి కారణమవుతుంది. ఇది సైలెంట్ కిల్లర్ లాంటిది. కాబట్టి బ్లడ్ ప్రెజర్ ని అండర్ కంట్రోల్ లో ఉంచుకోవడం చాలా అవసరం.

బ్లడ్ షుగర్ లెవెల్

బ్లడ్ షుగర్ లెవెల్

బ్లడ్ షుగర్ లెవెల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఎక్కువ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉంటే.. బ్లడ్ వెజెల్స్ పై దుష్ర్పభావం ఉంటుంది. కాబట్టి.. రెగ్యులర్ గా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటూ ఉండాలి.

స్మోకింగ్ మానేయడం

స్మోకింగ్ మానేయడం

స్మోకింగ్ ఎక్కువగా చేసేవాళ్లలో స్ట్రోక్ కి ఎక్కువ రిస్క్ ఉంటుంది. స్మోకింగ్ చేసేవాళ్లలో హార్ట్ డిసీజ్, స్ట్రోక్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని అధ్యయనాలు తేల్చాయి.

హెల్తీ డైట్

హెల్తీ డైట్

బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవడం వల్ల స్ట్రోక్ కి దూరంగా ఉండవచ్చు. న్యాచురల్, అన్ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవాలి. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల స్ట్రోక్ రిస్క్ తగ్గడమే కాదు.. క్రోనిక్ డిసీజ్ లకు దూరంగా ఉండవచ్చు.

కొలెస్ట్రాల్ లెవెల్

కొలెస్ట్రాల్ లెవెల్

కొలెస్ట్రాల్ లెవెల్ చెక్ చేసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ విషయంలో కేర్ తీసుకోవాలి. ఇది ఎక్కువగా ఉంటే.. స్ట్రోక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ గా కొలెస్ట్రాల్ లెవెల్ పై కన్నేసి ఉండాలి.

ఒత్తిడి

ఒత్తిడి

హార్ట్ ఎటాక్ , స్ట్రోక్ కి ఒత్తిడి ప్రధాన కారణమవుతోంది. ఇది కార్డియోవాస్కులర్ వెజెల్స్ డ్యామేజ్ చేస్తుంది. దీనివల్ల స్ట్రోక్ రావడానికి ఎక్కువ అవకాశాలుంటాయి.

English summary

9 Useful Tips To Prevent A Stroke

9 Useful Tips To Prevent A Stroke. Stroke is a life-threatening medical emergency that happens when the blood flow to the brain gets interrupted or stops completely.
Desktop Bottom Promotion