For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్: థైరాయిడ్ సమస్యను సూచించే లక్షణాలివే.. !

By Swathi
|

థైరాయిడ్ అనేది ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్య. మనం ఫాలో అవుతున్న లైఫ్ స్టైల్, బిజీ లైఫ్ థైరాయిడ్ సమస్యకు కారణమవుతోంది. చాలామందిలో థైరాయిడ్ సమస్య చాలా సాధారణంగా మారింది. కొన్ని సంకేతాలు సాధారణంగా అనిపించినా.. వాటిని ముందుగా గుర్తించడం వల్ల ఈ సమస్యను తేలికగా అధిగమించవచ్చు.

థైరాయిడ్ పేషంట్స్ ఏం తినాలి ? ఏం తినకూడదు ?

కొన్ని సందర్భాల్లో జలుబు, అలర్జీ అంటూ.. చాలా తేలికగా తీసుకుంటూ ఉంటాం. కానీ ఇది అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. మనం ఊహించిన దానికంటే.. ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చిన్న సమస్యలే.. కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ సంకేతమేమో గుర్తించాలి. కొన్ని రకాల సంకేతాలకు వెంటనే అలర్ట్ అవడం చాలా మంచిది. ఇంతకీ థైరాయిడ్ సమస్యను సూచించే.. డేంజర్ సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం..

జుట్టు రాలడం

జుట్టు రాలడం

మీకు జుట్టు ఎక్కువగా రాలిపోతోందా ? గతంలో ఉన్నంత ఒత్తుగా ఇప్పుడు కనిపించడం లేదా ? ఈ లక్షణాలు హైపోథైరాయిడిజం సూచిస్తుందని గుర్తించండి. ఐరన్ లోపం వల్ల థైరాయిడ్ సమస్య తలెత్తుతుంది.

డిప్రెషన్

డిప్రెషన్

థైరాయిడ్ సమస్య మీ మూడ్ మొత్తాన్ని మార్చేస్తుంది. చిన్న థైరాయిడ్ హార్మోన్ అయినా.. సరే హ్యాపీ సెరోటనిన్ పై ప్రభావం చూపుతుంది. మిమ్మల్ని డిప్రెషన్ కి లోనయ్యేలా చేస్తుంది. ఆందోళన, అలసట, చిరాకు వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.

కాన్స్టిపేషన్

కాన్స్టిపేషన్

మీరు కాన్ట్సిపేషన్ సమస్యను ఎదుర్కొంటుంటే.. నిర్లక్ష్యం చేయకండి. ఇది కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ హ్యార్మోన్ ఉత్పత్తి, జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి లక్షణాలను థైరాయిడ్ సమస్యగా గుర్తించి డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

ఎక్కువగా నిద్రపోవడం

ఎక్కువగా నిద్రపోవడం

ఉదయాన్నే నిద్రలేవడం అనేది చాలా పెద్ద సమస్య. కానీ.. ఇది మరీ మించిపోయి.. ఏమాత్రం బెడ్ దిగలేకపోతున్నారు అంటే మాత్రం అలర్ట్ అవ్వాల్సిందే. రోజంతా.. నిద్రమత్తులో ఉండేలా చేస్తుంది థైరాయిడ్. కాబట్టి ఇలాంటి లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకండి.

హఠాత్తుగా బరువు పెరగడం

హఠాత్తుగా బరువు పెరగడం

బరువు పెరగడం అనేది చాలా రకాల సమస్యలతో వస్తుంది. కానీ.. ఉన్నట్టుండి బరువు పెరిగిపోయారు అంటే.. ఆలోచించాల్సిన విషయమే. సాధారణంగా తీసుకున్నట్టే ఆహారం తీసుకున్నా.. లావు అయ్యారంటే.. ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.

గొంతు నొప్పి

గొంతు నొప్పి

గొంతులోనే థైరాయిడ్ ఉంటుంది. కాబట్టి.. అక్కడ నొప్పిగా ఉంది అంటే.. ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. వాయిస్ లో మార్పులు వచ్చాయంటే.. థైరాయిడ్ డిజార్డర్ గా గుర్తించాలి. ఒకవేళ ఈ లక్షణాలు కనిపిస్తే... అద్దంలో మీ గొంతు చూసుకుని.. వాపు వచ్చిందేమో చెక్ చేసుకోవాలి.

అధిక రక్తపోటు

అధిక రక్తపోటు

హైబ్లడ్ ప్రెజర్ కూడా థైరాయిడ్ కి కారణమవుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె, గుండె ఫెయిల్యూర్ సమస్యలకు కారణమవుతుంది.

కాబట్టి.. ఒకసారి థైరాయిడ్ చెక్ చేసుకోవడం మంచిది.

సెక్యువల్ ఇంట్రెస్ట్ లేకపోవడం

సెక్యువల్ ఇంట్రెస్ట్ లేకపోవడం

అధ్యయనాల ప్రకారం థైరాయిడ్ హార్మోన్ తక్కువ లిబిడో కి కారణమవుతుందట. బరువు పెరగడం, ఒళ్లు నొప్పులు, జుట్టు రాలడం వంటి సమస్యలు.. థైరాయిడ్ సమస్యకు మూలకారణమవుతాయి.

కండరాల నొప్పులు

కండరాల నొప్పులు

కండరాల నొప్పులు అంటే చేతులు, భుజాలు, కాళ్లు, పాదాలు.. విపరీతంగా నొప్పిస్తున్నాయి అంటే.. థైరాయిడ్ సమస్యగా గుర్తించాలి. థైరాయిడ్ హార్మోన్ తగ్గడం వల్ల నరాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని థైరాయిడ్ గా గుర్తించాలి.

English summary

9 Warning Signs You Have Thyroid Problems

9 Warning Signs You Have Thyroid Problems. To learn how to spot some of the early warning signs of thyroid issues, scroll down and read these often-overlooked symptoms.
Story first published:Tuesday, April 5, 2016, 11:27 [IST]
Desktop Bottom Promotion