For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో జలుబు, ముక్కు కారడాన్ని నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!!

చలికాలం పిల్లలనీ.. పెద్దలనీ... లేకుండా జలుబు బాధించడం ప్రారంభమైనది. చలికాలం పూర్తయ్యే సరికి కనీసం ఒక్కసారైనా జలుబు చెయ్యని వారుండరనడం అతిశయోక్తి కాదు. కొంత మందికైతే చలికాలం మొదట్లో మొదలైన జలుబు ఎండల

|

ప్రస్తుతం వింటర్ సీజన్.. చలి కొంచెం ఆలస్యంగా పలుకరించినప్పటికీ వారం రోజులుగా చంపుతోంది. చలికాలం పిల్లలనీ.. పెద్దలనీ... లేకుండా జలుబు బాధించడం ప్రారంభమైనది. చలికాలం పూర్తయ్యే సరికి కనీసం ఒక్కసారైనా జలుబు చెయ్యని వారుండరనడం అతిశయోక్తి కాదు. కొంత మందికైతే చలికాలం మొదట్లో మొదలైన జలుబు ఎండలు మొదలయ్యే దాకా కొనసాగుతుంది. ఇక పిల్లల సంగతి అయితే చెప్పనవసరమే లేదు. కాస్త చలిగాలి తాకితే చాలు జలుబు పట్టుకుంటుంది. మామూలు జలుబే కదా అని అనుకుంటాం కానీ ఒక్కోసారి అది మాములు ఇన్‌ఫెక్షన్ కాకుండా మరో దీర్ఘకాల సమస్యకు దారితియ్యవచ్చు.

Effective Home Remedies To Treat Running Nose This Winter

చలికాలంలో జలుబు సాధారణమే. కానీ అలర్జీ వల్ల వచ్చే జలుబు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాధారణ జలుబు కేవలం రెండుమూడు రోజులు లేదంటా నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది. కానీ అలర్జీ వల్ల వచ్చే జలుబు మాత్రం పదిరోజులైనా వదలకపోవచ్చు. ఒక్కోసారి జలుబు చేసిన మొదటి రోజు నుంచే ఆయాసంగా ఉంటుంది. లేదా తెమడలో రక్తం పడుతుంది., లేదా ఊపిరితీసుకునే వేగం ఎక్కువగా ఉంటుంది.

జలుబు మొదలైనప్పటి నుండి తగ్గకపోగా తలనొప్పికి దారితీస్తుంది.ముక్కు నుంచి వచ్చే మ్యూకస్ పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉన్నపుడు ఇది ఇన్‌ఫెక్షన్‌తో కూడిన జలుబుగా భావించాలి. జలుబుతో పాటు ముక్కు కారడం, ముక్కు మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అలర్జిక్ రైనైటీస్‌గా భావించాలి. జలుబుతో పాట దగ్గు ఉండి, మెట్లెక్కడం, నడక వంటి శ్రమతో కూడిన పనులు చేసినపుడు ఆయాసంగా ఉంటే అది బ్రాంకైటీస్ కావచ్చు. ఏ ఇన్‌ఫెక్షనైనా సరే సరైనా సమయంలో చికిత్స తీసుకోకపోతే అది జీవితకాలం వేధించే అస్తమాగా పరిణమించవచ్చు.

కాబట్టి, అలాంటి పరిస్థితి తెచ్చుకోక ముందే కొన్ని ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్, హోం రెమెడీస్ ను ఉపయోగించడం వల్ల రన్నింగ్ నోస్ ను నివారించుకోవచ్చు. ఈ హోం రెమెడీస్ నేచురల్ గా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని నిరూపించబడింది. కాబట్టి, చలికాలంలో రన్నింగ్ నోస్ ను నివారించుకోవడానికి బెస్ట్ ట్రీట్మెంట్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హోం రెమెడీస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం...

హాట్ వాటర్ తో ఆవిరి పట్టాలి:

హాట్ వాటర్ తో ఆవిరి పట్టాలి:

హాట్ వాటర్ బౌల్ తీసుకుని అందులో నీళ్లు నింపాలి. తర్వాత బాగా మరిగించి, కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ లేదా అమ్రుతాంజన్ ను వేసి వేడిగా ఆవిర్లు వచ్చేటప్పుడు ముఖానికి బ్లాకెట్ లేదా పెద్ద టవల్ ను కప్పుకుని స్టీమ్ చేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఆవనూనె:

ఆవనూనె:

ఆవనూనెలో యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి, ఆవనూనెను గోరువెచ్చగా వేడి చేసి, ముక్కులో రెండు రంద్రాల్లో ఒక్కో డ్రాప్ వదలాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది ముక్కుదిబ్బడను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

పసుపు:

పసుపు:

పసుపు పురాతన కాలం నుండి ఒక అద్భుతమైన ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి . ఒక టీస్పూన్ పసుపును తీసుకుని, ఒక గ్లాసు వేడి పాలలో మిక్స్ చేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగడం మంచిది. రాత్రి నిద్రించడానికి ముందు తాగితే మంచిది. ముక్కు కారడాన్ని వెంటనే నివారిస్తుంది.

యూకలిప్టస్ ఆయిల్ :

యూకలిప్టస్ ఆయిల్ :

యూకలిప్టస్ ఆయిల్ ను హ్యాండ్ కర్చీఫ్ లో వేసి అప్పుడప్పుడూ హ్యాడ్ ఖర్చీఫ్ ను వాసన చూస్తుండాలి. ఇది ముక్కు కారడాన్ని నివారిస్తుంది.

సాల్ట్ వాటర్ :

సాల్ట్ వాటర్ :

అరటీస్పూన్ సాల్ట్ వాటర్ ను ఒక బౌల్ వార్మ్ వాటర్ లో మిక్స్ చేయాలి. ఈ వాటర్ ను ముక్కు రంద్రాల్లో రెండు మూడు చుక్కలు వదలాలి. ఇలా చేయడం వల్ల ఎక్సెస్ మ్యూకస్ తొలగిపోతుంది.

తులసి :

తులసి :

జలుబుతో ముక్కు కారుతుంటే, తులసి బెస్ట్ హోం రెమెడీ. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కొన్ని తులసి ఆకులు తీసుకు నమిలి మింగాలి. ఉదయం పరగడపున, రాత్రి నిద్రించడానికి ముందు తింటే మంచి ఫలితం ఉంటుంది.

తేనె :

తేనె :

తేనెలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు, యాంటీ వైరల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇందులో చిటికెడు దాల్చిన చెక్క పొడి, తేనె మిక్స్ చేయాలి. అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది ముక్కుదిబ్బడను నివారిస్తుంది.

 అల్లం :

అల్లం :

అల్లంలో యాంటీవైరల్ యాంటీ ఫంగల్ లక్షణాలున్నాయి. కొద్దిగా అల్లం ముక్క తీసుకుని, నమిలి మింగాలి. లేదా వేడినీళ్ళలో వేసి మరిగించాలి. టీ లాగ తయారుచేసుకుని, తాగాలి. ఇలా చేస్తే ముక్కు కారడం తగ్గుతుంది.

 వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లి యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకటి రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని, 2, 3 సార్లు నమిలి తినాలి. ఇది ముక్కు కారడాన్ని నివారిస్తుంది.

 ఉల్లిపాయ

ఉల్లిపాయ

ఉల్లిపాయల్లో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. వేడి నీటిలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి మరిగించాలి. ఈనీళ్ళను ఆవిరి పట్టడం వల్ల మంచిది. ముక్కు దిబ్బడ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

English summary

Effective Home Remedies To Treat Running Nose This Winter

Running nose is one of the most common problems faced by many, especially during the winter season. If the problem persists for long it gradually tends to give one a bad headache as well. This increased liquid discharge from your nasal chambers makes one irritated and all that you want at that moment is to get rid of it as soon as possible.
Story first published: Friday, December 23, 2016, 15:36 [IST]
Desktop Bottom Promotion