For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిడ్నీ స్టోన్స్ ను శాశ్వతంగా నివారించే 4 అద్భుతమైన రెమెడీస్..!

ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే పవర్ ఫుల్ ఆల్కలైన్ లక్షణాలు, కిడ్నీస్టోన్ కరిగించడం లేదా నివారించడంలో ఒక ఐడియల్ రెమెడీ. ఆపిల్ సైడర్ వెనిగర్ కు కొన్ని కాంబినేషన్ పదార్థాలను చేర్చి ఎలా ఉపయోగించాలో తెలుసుకుం

|

మన శరీరంలో గుండె తర్వాత అత్యంత ప్రధానమైనవి కిడ్నీలు. కిడ్నీ(మూత్ర పిండాలు) తమ విధులను సక్రమంగా నిర్వహించక పోతే, ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొ నాల్సి వస్తుంది. శరీరంలో అధికంగా ఉన్న నీటిని, లవణాలను, ఇతర రసాయనాలను మూత్ర పిండాలు మూత్రం రూపంలో వెలుపలికి తీసుకువెళతాయి. శరీరానికి అవసరమైన నీరు, లవణాలు, ఇతర పదార్థాలు మూత్రం ద్వారా శరీరం కోల్పోకుండా ఇవి కాపాడుతాయి. శరీరానికి సంబంధించినంత వరకూ మూత్ర పిండాలను మాస్టర్‌ కెమిస్టులని పేర్కొనవచ్చు. మూత్రపిండాలు నిర్వహించే బాధ్యతలు ఈ కింది విధంగా ఉన్నాయి.

శరీరంలో ద్రవాలను సరైన స్థాయిలో ఉంచడం, శరీరంలోని రసాయనాల సమ తుల్యతను కాపాడటం, వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి తొలగించడం, వివిధ రకాల హార్మోన్లను విడుదల చేయడం. శరీరంలోని ద్రవాలు శరీరంలోని ద్రవాలను తొలగించడం లేదా నిలువరించడం మూత్రపిండాలు చేసే విధులలో ప్రధానమైనవి.

Effective Ways To Use Apple Cider Vinegar For Kidney Stones

ఎక్కువ మందిలో కనిపించే సమస్య కిడ్నీలో స్టోన్స్‌. తీసుకునే ఆహారం, శరీరతత్వం వంటివి స్టోన్స్‌ ఏర్పడటానికి కారణమ వుతున్నాయి. మూత్రపిండాల్లో రాళ్ళు గట్టిగా క్రిస్టల్‌ రూపంలో ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో గానీ, మూత్రనాళాల్లో గానీ ఏర్పడ తాయి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడినట్లయితే నెఫ్రోలిథియాసిస్‌ అని, మూత్రనాళాల్లో ఉంటే యూరోలిథియాసిస్‌ అని అంటారు. కిడ్నీలో రాళ్ళు ఎవరిలోనైనా ఏర్పడవచ్చు. అయితే స్ర్తీలలో కంటే పురుషుల్లో ఎక్కువగా ఏర్పడతాయి. 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న వారి లో ఈ సమస్య కనిపిస్తుంది. 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సున్నప్పుడు కిడ్నీ స్టోన్స్‌ ఏర్పడితే భవిష్యత్తులో మళ్లీ మళ్లీ రావ డానికి అవకాశాలుంటాయి.

ఒకటి కంటే ఎక్కువ స్టోన్స్‌ ఏర్పడినప్పు డు కూడా సమస్య పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా కొన్నిహోం రెమెడీస్ గురించి ఇంతకు ముందు చాలానే తెలుసుకున్నాం. అయితే అన్నింటిలోకంటే ఆపిల్ సైడర్ వెనిగర్ మరింత ఎఫెక్టివ్ గా కిడ్నీస్టోన్స్ ను కరిగిస్తుందని, రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో తేలింది.

ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే పవర్ ఫుల్ ఆల్కలైన్ లక్షణాలు, కిడ్నీస్టోన్ కరిగించడం లేదా నివారించడంలో ఒక ఐడియల్ రెమెడీ. ఆపిల్ సైడర్ వెనిగర్ కు కొన్ని కాంబినేషన్ పదార్థాలను చేర్చి ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం...

Effective Ways To Use Apple Cider Vinegar For Kidney Stones

1. ఆపిల్ సైడర్ వెనిగర్ , వాటర్: కిడ్నీ స్టోన్స్ చాలా బాధకరమైన విషయం వీటిని డిజాల్వ్ చేసుకోవడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీ ఆపిల్ సైడర్ వెనిగర్ . ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ను ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి బాగా మిక్స్ చేసి, రోజంతా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ చిన్న చిన్న కిడ్నీ స్టోన్స్ ను ఇట్టే కరిగించేస్తుంది.

Effective Ways To Use Apple Cider Vinegar For Kidney Stones

2. ఆపిల్ సైడర్ వెనిగర్ , కొబ్బరి నూనె, వాటర్: కిడ్నీ స్టోన్స్ శాశ్వతంగా నివారించుకోవడానికి మరో ఎఫెక్టివ్ రెమెడీ. ఆపిల్ సైడర్ వెనిగర్ , కొబ్బరి నూనె, వాటర్ మిక్స్ చేయాలి. ఈ రెమెడీని పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఈ మూడు పదార్థాలను ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, ఒక టేబుల్ స్పూన్ వెనిగర్, ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కిడ్నీస్టోన్స్ చాలా సులభంగా యూరిన్ నుండి బయటకు వెళ్లిపోతాయి.

Effective Ways To Use Apple Cider Vinegar For Kidney Stones

3. యాపిల్ సైడర్ వెనిగర్, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ : ఈ కాంబినేషన్ రెమెడీలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి . నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్, ఆలివ్ ఆయిల్లో లూబ్రికేటింగ్ ఫీచర్స్ వల్ల కిడ్నీ స్టోన్స్ ఎఫెక్టివ్ గా కరిగిపోతాయి. కిడ్నీ స్టోన్ లక్షణాల నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ , ఒక టీస్పూన్ నిమ్మరసం, ఆలివ్ ఆియల్ ను ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి రోజుకు రెండు సార్లు తాగాలి. ఇలా చేయడం వల్ల నొప్పి, అసౌకర్యం తొలగిపోతుంది. రెగ్యులర్ గా కొన్ని రోజులు తీసుకుంటుంటే త్వరగా తగ్గిపోతుంది.

Effective Ways To Use Apple Cider Vinegar For Kidney Stones

4. యాపిల్ సైడర్ వెనిగర్ , తేనె: తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి, ఈ రెండింటి కాంబినేషన్ డ్రింక్ వల్ల నొప్పి తగ్గుతుంది, కిడ్నీ స్టోన్స్ తిరిగి ఏర్పడకుండా నివారించబడుతుంది. ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ లో 2 టీస్పూన్ల ఆర్గానిక్ హనీ మిక్స్ చేయాలి. ఈ రెండు పదార్థాలను గ్లాసు నీటిలో మిక్స్ చేసితాగాలి. ఈ రెమెడీ కిడ్నీ పెయిన్ తగ్గిస్తుంది, స్టోన్స్ ను చాలా ఎఫెక్టివ్ గా కరిగిస్తుంది.

English summary

Effective Ways To Use Apple Cider Vinegar For Kidney Stones

Effective Ways To Use Apple Cider Vinegar For Kidney Stones,Kidney stones are tiny masses made of crystals that get formed in the kidneys. Though these stones may not cause a permanent damage, their very presence can pose threats towards an individual's health and wellness.
Story first published: Tuesday, October 18, 2016, 18:34 [IST]
Desktop Bottom Promotion