For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిగుళ్ల వాపు, క్యావిటీలను నివారించే హోంమేడ్ టూత్ పేస్ట్..!

క్యావిటీస్, పంటి నొప్పులతో బాధపడుతుంటే.. వాటిని నివారించడానికి ఎఫెక్టివ్ హోంమేడ్ టూత్ పేస్ట్ సహాయపడుతుంది. మరి అదెలా తయారు చేసుకోవాలో చూద్దామా..

By Swathi
|

ఈ మధ్య చాలామంది.. నోటి శుభ్రత విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాగే.. లైఫ్ స్టైల్ కూడా.. ఆరోగ్యవంతమైన పళ్లు కలిగి ఉండటానికి సహకరించడం లేదు. ఉదయాన్నే ఆఫీస్ కి వెళ్లే హడావుడిలో సరిగా పళ్లను శుభ్రం చేసుకోకపోవడం, తీసుకునే ఆహారం, డ్రింక్స్ పళ్లపై ఎక్కువ ఒత్తిడి, హాని చేస్తున్నాయి.

toothpaste

చాలా టూత్ పేస్ట్ బ్రాండ్స్ పళ్లను తెల్లగా మారుస్తాయంటూ ప్రచారం చేస్తుంటాయి. అయితే... అవన్నీ పంటి ఎనామిల్ పై దుష్ర్పభావం చూపి.. పళ్లను డ్యామేజ్ చేస్తాయి. అలాగే చిగుళ్లు సెన్సిటివ్ గా మారి, ఇరిటేషన్ కి కారణమవుతున్నాయి.

homemade toothpaste

అయితే పంటి ఆరోగ్యంపై దుష్ప్రభావానికి చాలా కారణాలున్నాయి. పంటి ఆరోగ్యంతో పాటు, పళ్లను తెల్లగా మార్చడానికి, క్యావిటీస్ సమస్య రాకుండా అడ్డుకోవడానికి, ఒకవేళ క్యావిటీస్, పంటి నొప్పులతో బాధపడుతుంటే.. వాటిని నివారించడానికి ఎఫెక్టివ్ హోంమేడ్ టూత్ పేస్ట్ సహాయపడుతుంది. మరి అదెలా తయారు చేసుకోవాలో చూద్దామా..

coconut oil

కావాల్సిన పదార్థాలు
1టేబుల్ స్పూన్ కొబ్బరినూనె
1టీస్పూన్ పసుపు
కొద్దిగా పెప్పర్ మింట్ ఆయిల్

peppermint oil

తయారు చేసేవిధానం
కొబ్బరినూనెలో పసుపు కలుపుకోవాలి. కొద్దిగా పిప్పర్ మింట్ ఆయిల్ కూడా మిక్స్ చేసి.. బాగా కలుపుకోవాలి. పసుపు పంటినొప్పిని నివారిస్తుంది. అలాగే చిగుళ్ల వాపు, నొప్పిని తగ్గిస్తుంది. ఈ మిశ్రమాన్ని టూత్ బ్రష్ పై పెట్టుకుని.. రెగ్యులర్ టూత్ పేస్ట్ లా ఉపయోగించాలి.

చాలా మంది సెన్సిటివ్ టీత్ తో బాధపడుతుంటారు. అలాంటి వాళ్లు ఎక్కువగా చిగుళ్ల వాపు సమస్యను ఫేస్ చేస్తుంటారు. కాబట్టి.. వాళ్లు ఈ హోంమేడ్ టూత్ పేస్ట్ ఉపయోగిస్తే.. పంటి సమస్యలు దూరమవడమే కాదు.. పళ్లు తెల్లగా మారి.. మెరిసిపోతాయి.

English summary

Heal Cavities, Gum Disease with This Homemade Toothpaste

Heal Cavities, Gum Disease with This Homemade Toothpaste. Be Your Own Dentist! Know how to prepare homemade toothpaste to deal with Cavities, Gum Disease, and Whiten Teeth.
Story first published: Wednesday, October 26, 2016, 16:52 [IST]
Desktop Bottom Promotion