చేతుల మీద బ్రౌన్ స్పాట్స్ అండ్ బ్రౌన్ ప్యాచెస్ ను మాయం చేసే హోం రెమెడీస్

Posted By:
Subscribe to Boldsky

ఎప్పుడూ ముఖం మీద మాత్రమే ఏకగ్రత్త, జాగ్రత్తలు? మరి చేతుల గురించి ఆలోచించరా? ఫేషియల్ స్కిన్ కోసం జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే, అయితే, అదేవిధంగా చేతుల మీద కూడా ప్రత్యేక శ్రద్దవహించడం కూడా అవసరమే. ముఖ అందం కోసం వివిధ రకాల ఫేస్ ప్యాక్స్, సన్ స్క్రీన్ లోషన్స్, క్రీమ్స్ మరియు లోషన్స్ అప్లై చేస్తుంటారు,. కానీ చేతులను మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. అలాగే ఎక్కువ రోజులు చేతులను నిర్లక్ష్యం చేయడం వల్ల చేతుల మీద బ్రౌన్ అండ్ డార్క్ ప్యాచ్ లు లేదా బ్రౌన్ స్పాట్స్ చేతుల మీద కనబడుతుంటాయి. దాంతో చేతులు అందంగా కనబడవు.

చేతుల మీద బ్రౌన్ స్పాట్స్ సన్ ఎక్స్ఫోజర్, జెనెటిక్స్, ఏజింగ్ , ప్రెగ్నెన్సీ, స్ట్రెస్ లేదా విటమిన్ లోపం వల్ల ఏర్పడుతాయి. ముఖ్యంగా ఇలాంటి బ్రౌన్ స్పాట్స్ ఎక్కువగా బయటకు బహిర్గతమయ్యే ప్రదేశాల్లో బ్యాక్, ఫేస్, షోల్డర్స్, నెక్ మరియు హ్యాండ్స్ మీద ఏర్పడుతాయి. బ్రౌన్ స్పాట్స్ వల్ల ఎలాంటి హాని ఉండదు . అయితే అవి చూడటానికి చాలా అసహ్యాంగా కనబడుతు ఇబ్బంది పెడుతుంటాయి . మరి ఇలాంటి బ్రౌన్ స్పాట్స్ ను చేతుల మీద నివారించుకోవడానికి వివిధ రకాల హోం రెమెడీస్ ఉన్నాయి. వీటిని మీరు కూడా ప్రయత్నించవచ్చు . ఈ హోం రెమెడీస్ చాలా సింపుల్ గా, ఈజీగా ఉంటాయి. మరి వీటిని ఎలా ఉపయోగించాలో చూద్దాం...

బట్టర్ మిల్క్:

బట్టర్ మిల్క్:

బట్టర్ మిల్క్ లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. ఈ మార్క్స్ మరియు బ్రౌన్ స్పాట్స్ తొలగించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. కాటన్ బాల్ ను బట్టర్ మిల్క్ లో డిప్ చేసి బ్రౌన్ స్పాట్స్ మీద అప్లై చేయాలి. ఈ రెమెడీని ఒక రోజులో రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

అలోవెర:

అలోవెర:

చేతుల మీద బ్రౌన్ కలర్ ప్యాచెస్ ను నివారించడానికి కలబంద రసం గ్రేట్ గా సహాయపడుతుంది . కలబందలో నయం చేసే గుణాలు మెండుగా ఉండటం వల్ల త్వరగా బ్రౌన్ స్పాట్స్ పోగొడుతుంది. తిరిగి రీజనరేట్ చేస్తుంది. కొద్దిగా అలోవెర జెల్ తీసుకొని చేతులకు అప్లై చేసి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

 నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసంలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు వల్ల నిమ్మరసం ఒక గ్రేట్ అండ్ ఎఫెక్టివ్ హోం రెమెడీ. బ్రౌన్ స్పాట్స్ ను నివారించుకోవడానికి నిమ్మరసంను నేరుగా చేతులకు అప్లై చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. సున్నిత చర్మ తత్త్వం ఉన్నవారు , నిమ్మరసంలో తేనె లేదా రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ హోం రెమెడీని రోజుకు రెండు సార్లు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

 ఉల్లిపాయ రసం:

ఉల్లిపాయ రసం:

ఉల్లిపాయ రసం నేచురల్ బ్లీచ్ మరియు ఇందులో ఉండే అసిడిక్ నేచరల్ వల్ల , బ్రౌన్ స్పాట్స్ ను లైట్ చేస్తుంది. కొన్ని ఉల్లిపాయ ముక్కలను బ్రౌన్ స్పాట్స్ మీద రబ్ చేసి మర్దన చేయాలి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు మర్దన చేస్తుంటే బ్రౌన్ స్పాట్స్ తొలగిపోతాయి

బొప్పాయి:

బొప్పాయి:

బొప్పాయిలో ఆల్ఫా హైడ్రాక్సిల్ యాసిడ్స్ మరియు కొన్ని ప్రత్యేక ఎంజైమ్స్ ఉండటం వల్ల చర్మం మీద ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తుంది. హ్యాడ్ మీద కాంతి వంతంగా మార్చుతుంది . బ్రౌన్ ప్యాచెస్ మరియు వివిధ రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. బొప్పాయి తీసుకొని పేస్ట్ లా చేసి ీ పేస్ట్ ను చేతుల మీద అప్లై చేయాలి . 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ హోం రెమెడీని రోజుకు రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఆముదం:

ఆముదం:

నయం చేసే గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఆముదు ఒక అత్యంత ఉపయోగకరమైన హోం రెమెడీ . చేతుల మీద బ్రౌన్ ప్యాచెస్ నివారించడానికి కాటన్ బాల్ తీసుకొని ఆముదం నూనెలో డిప్ చేసి బ్రౌన్ ప్యాచెస్ మీద అప్లై చేయాలి. ఈ రెమెడీని డే టైమ్ లో చేస్తే చాలు మచ్చలు మాయం అవుతాయి.

సాండిల్ వుడ్ :

సాండిల్ వుడ్ :

గంధంలో యాంటీ సెప్టిక్ మరియు యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, గందం లో కొద్దిగా నిమ్మరసం మరియు కొద్దిగా గ్లిజరిన్ మిక్స్ చేసి చేతులకు అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

Home Remedies For Brown Spots On Hands

Home Remedies For Brown Spots On Hands , Brown spots may get triggered due to sun exposure, genetics, ageing, pregnancy, stress or vitamin deficiency. These spots usually emerge on the exposed areas of your skin such as back, face, shoulders, neck and hands.
Please Wait while comments are loading...
Subscribe Newsletter