Latest Updates
-
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026
వింటర్లో వేధించే శ్వాస సమస్యలను నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!!
వింటర్లో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ...
వింటర్లో రెస్పిరేటరీ సమస్యలు అధికంగా ఉంటాయి. జలుబు, ముక్కు దిబ్బడ, ముక్క కారడం, గొంతు నొప్పి, గొంతు నొప్పితో పాటు తలనొప్పి ఈ లక్షణాలన్నీ అప్పర్ రెస్పరేటరీ ఇన్ఫెక్షన్స్ సంబంధించినవి.
ఇటువంటి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ను వెంటనే నివారించుకోకపోతే బ్యాక్టీరియల్ మరియు వైరల్ ఇన్ఫెక్షన్స్ కు దారి తీస్తుంది. అందుకోసం కొన్ని హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి.

శ్వాసనాళ ఇన్ఫెక్షన్స్ అలాగే కొనసాగితే పక్కవారి సోకే ప్రమాధం కూడా ఉంది. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు శ్వాసనాళంలో, ఊరిపితిత్తుల్లో ఉండే వైరస్ గాలి ద్వారా ఒకరి నుండి మరొకరికి చాలా త్వరగా స్ప్రెడ్ అవుతుంది. అంతే కాదు శ్వాసనాళ ఇన్ఫెక్షన్స్ ఉన్న వారు ఉపయోగించే చెయిర్స్, టుబుల్స్, డోర్స్, దుస్తుల ద్వార కూడా త్వరగా ఇతరులకు వ్యాప్తి చెందుంతుంది.
అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వింటర్ సీజన్ లో ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో బ్యాక్టీరియా మరియు వైరస్ మరింత వేగంగా స్ప్రెడ్ అవుతుంది. ముఖ్యంగా ఎవరికైతే ఇమ్యూనిటి లెవల్స్ తక్కువగా ఉంటాయో వారిలో పరిస్థితి మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది. శరీరంలో రెసిస్టెంట్ లెవల్స్ మరియు బాడీ కెపాజిటీ బ్యాక్టీరియాతో పోరాడలేనప్పుడు ఇమ్యూనిటి లెవల్స్ తక్కువగా ఉంటాయి. ఇమ్యూనిటి పవర్ తక్కువగా ఉండటం వల్ల వారికి త్వరగా ఇన్ఫెక్షన్ సోకుతుంది.
అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ...

జింజర్ టీ:
రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో అల్లం గ్రేట్ గా సహాయపడుతుంది. చిన్న అల్లం ముక్క తీసుకుని నీళ్ళలో వేసి బాగా మరిగించాలి. తర్వాత ఈ నీటిని వడగట్టి, రోజులో అప్పుడప్పుడు తాగడం వల్ల శ్వాస సమస్యల నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

వేడినీళ్ళతో గార్గిలింగ్ చేయడం:
ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తీసుకుని, అందులో ఉప్పు వేసి నోట్లో పోసుకుని, గార్గిలింగ్ చేయడం వల్ల గొంతు నొప్పి, గొంతులో ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

లికోరైస్ టీ:
హెర్బల్ రెమెడీ, లికోరైస్ ను చిన్న ముక్కలుగా చేసి నీటిలో వేసి బాయిల్ చేసి, వడగట్టి, టీ రూపంలో తీసుకోవాలి. ఇది అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

కర్పూరం ఆకులు(యూకలిప్టస్ లీవ్స్ ):
కొన్ని యూకలిప్టస్ ఆకులను నీటిలో వేసి మరిగించి, ఆ నీటితో ఆవారి పట్టాలి. ఇలా చేయడం వల్ల గొంతు నొప్పి, శ్వాసనాళ సమస్యల నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

టర్మరిక్ మిల్క్ :
ఒక గ్లాసు వేడి పాలలో ఒక స్పూన్ పసుపు మిక్స్ చేసి బాగా మిక్స్ చేసి రాత్రి నిద్రించడానికి ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది. శ్వాస సమస్యలను నివారించడంలో ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ.

ఇంగువ:
ఇక గ్లాసు వేడి పాలలో చిటికెడు ఇంగువ మిక్స్ చేసి తాగడం వల్ల రెస్పిరేటర్ ఇన్ఫెక్షన్ ను నేచురల్ గా తగ్గిస్తుంది.

ఉల్లిపాయ జ్యూస్ :
ఉల్లిపాయ జ్యూస్ లో కొద్దిగా తేనె మిక్స్ చేసి తాగడం వల్ల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ నుండి ఉపశమనం కలుగుతుంది.

వెల్లుల్లి:
ఉల్లిపాయ జ్యూస్ లో కొన్ని చుక్కల తేనె మిక్స్ చేసి ఒక గ్లాసు నీటిలో పోయాలి. మొత్తం బాగా మిక్స్ చేసి, తాగడం వల్ల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. ఇది ఒక పురాత హోం రెమెడీ.



Click it and Unblock the Notifications