For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోకాళ్ళ నొప్పులకు గుడ్ బై చెప్పే 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!!

మోకాళ్ళు నొప్పులతో పాటు, కాళ్ళను కదల్చలేకుండా, ఫ్లెక్సిబుల్ గా లేకుంటే వెంటనే డాక్టర్ ను కలవడం మంచిది. ఎక్సరే ద్వారా సమస్యను గుర్తిస్తారు, ఫిజికల్ ఎక్సామినేషన్ కూడా చేసి సమస్యను తెలుసుకుంటారు. నొప్పి

|

జీవితంలో ఏదో ఒక స్టేజ్ లో మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నది. మోకాళ్ళ నొప్పులను అనుభవించే వారికే తెలుసు ఆ బాధ ఏంటో.. మోకాళ్ళ నొప్పులకు వెంటనే చికిత్స తీసుకోకపోతే, అది రోజురోజుకు గండంగా మారుతుంది. రోజువారి పనులు చేసుకోవడానికి కూడా వీలు కాకుండా కష్టపడాల్సి వస్తుంది. మోకాళ్ళ నొప్పులను నివారించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

స్పోట్స్ ఆడటం లేదా కొన్ని యాక్టివిటీ సవల్ల మోకాళ్ళ నొప్పులకు కారణమవుతుంది. మోకాళ్ళ వద్ద మజిల్స్ స్ట్రెయిన్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో మోకాళ్ళ నొప్పులు భరించలేనంతగా ఉంటూ, రోజువారి పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది.

 Take Up These 10 Home Remedies & Say Goodbye To Knee Pain!

మోకాళ్ళ నొప్పులకు మరో కారణం కూడా ఉండి, మోకాళ్ళ లిగ్మెంట్ కు గాయమైనప్పుడు కూడా నొప్పులు అధికంగా ఉంటాయి. స్పోర్ట్స్ లో యాక్టివ్ గా ఉన్నప్పుడు ఇటువంటి గాయాలు సహజం. తొడ ఎముకకు మోకాలు వద్ద లిగ్మెంట్ కనెక్ట్ అయ్యుంటుంది. గాయలయినప్పుడు ఈ లిగ్మెంట్ వదలువ్వడం, స్పైన్డ్ అవ్వడం, లేదా కండారాల కణాలు డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది . ఫలితంగా నొప్పి తీవ్రంగా ఉంటుంది. అలాగే మోకాళ్ళ నొప్పులకు ఇతర కారణాలు కూడా ఉన్నాయి.

మోకాళ్ళు నొప్పులతో పాటు, కాళ్ళను కదల్చలేకుండా, ఫ్లెక్సిబుల్ గా లేకుంటే వెంటనే డాక్టర్ ను కలవడం మంచిది. ఎక్సరే ద్వారా సమస్యను గుర్తిస్తారు, ఫిజికల్ ఎక్సామినేషన్ కూడా చేసి సమస్యను తెలుసుకుంటారు. నొప్పి తక్కువగా ఉన్నా..లేదా ఓమాదిరిగా ఉన్నా.. ఇంట్లోనే కొన్ని నేచురల్ హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి చాలా పవర్ ఫుల్ గా నొప్పిని తగ్గిస్తాయి. నొప్పిలేకుండా ఇవి సహాయపడుతాయి...

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ :

మోకాళ్ళ నొప్పులను తగ్గించడంలో ఆలివ్ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది. నొప్పి ఉన్న ప్రదేశంలో ఆలివ్ ఆయిల్ ను అప్లై చేసి 5 నిముషాలు మర్ధన చేయాలి. అప్లై చేసి, ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను రోజుకొకసారి రిపీట్ చేస్తే మంచిది. ఇది నొప్పి తగ్గిస్తుంది. మోకాళ్ళ వాపును నివారిస్తుంది.

మస్టర్డ్ ఆయిల్ :

మస్టర్డ్ ఆయిల్ :

కొద్దిగా ఆవనూనె తీసుకుని అందులో రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి 15 నిముషాలు వేడి చేయాలి. వేడి చేసిన నూనెను మోకాళ్ళకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత హాట్ వాటర్ లో డిప్ చేసి టవల్ తో తుడవాలి. ఇది మోకాళ్ళ నొప్పులను, వాపులను తగ్గిస్తుంది.

అల్లం టీ:

అల్లం టీ:

ఒక కప్పు వేడిగా ఉండే జింజర్ టీలో కొద్దిగా నిమ్మరసం, తేనె మిక్స్ చేసి రోజూ తాగాలి. ఇలి యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. కాబట్టి, ఇది వాపును , నొప్పులను తగ్గిస్తుంది.

మెంతులు:

మెంతులు:

మెంతులను రోస్ట్ చేసి, పౌడర్ చేసి, అందులో కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను మోకాళ్ళకు అప్లై చేసి 30 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీన్ని రోజూ కొన్ని రోజుల పాటు అప్లై చేస్తుంటే నొప్పిని తగ్గించుకోవచ్చు.

ద్రాక్ష రసం:

ద్రాక్ష రసం:

అరటీస్పూన్ పెక్టిన్ ను ఒక కప్పులో తీసుకుని, అందులోనే గ్రేప్ జ్యూస్ మిక్స్ చేయాలి. దీన్ని వారంలో రెండు సార్లు , మూడు వారాల పాటు తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. గ్రేప్ జ్యూస్ మోకాళ్ళ నొప్పులను తగ్గించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.

యూకలిప్టస్ ఆయిల్ :

యూకలిప్టస్ ఆయిల్ :

5 చుక్కల యూకలిప్టస్ ఆయిల్ ను ఆలివ్ ఆయిల్ తో మిక్స్ చేయాలి. అందులోనే పిప్పర్మింట్ ఆయిల్ ను కూడా మిక్స్ చేయాలి. దీన్ని మోకాళ్ళ నొప్పులున్న ప్రదేశంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

నిమ్మరసం:

నిమ్మరసం:

మోకాళ్ళ నొప్పులను తగ్గించడంలో నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది ఆర్థైటీస్ పెయిన్ కూడా నివారిస్తుంది. ముక్కలుగా కట్ చేసి క్లాత్ లో వేసి మూటకట్టి, నువ్వుల నూనెలో డిప్ చేసి నొప్పి ఉన్న పద్రేశంలో కట్టాలి. 15నిముషాల తర్వాత తీసేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

అరకప్పు కొబ్బరి నూనెను 5నిముషాలు వేడి చేసి, నొప్పి ఉన్న ప్రదేశంలో చేతి వేళ్ళతో అప్లై చేయాలి. కొన్ని గంటల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

యాపిల్ సైడర్ వెనిగర్ :

యాపిల్ సైడర్ వెనిగర్ :

రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ లో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి, తాగాలి. యాపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే ఆల్కలైజింగ్ గుణాలు మోకాళ్ళ నొప్పులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

కేయాన్ పెప్పర్, ఆలివ్ ఆయిల్ :

కేయాన్ పెప్పర్, ఆలివ్ ఆయిల్ :

అరకప్పు ఆలివ్ ఆయిల్లో రెండు స్పూన్ కేయాన్ పెప్పర్ మిక్స్ చేసి, పేస్ట్ లా చేసి, నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పెప్పర్ లో ఉండే యాక్టివ్ కాంపోనెంట్స్ క్యాప్ససిన్ నొప్పులను, వాపులను తగ్గిస్తాయి.

English summary

Take Up These 10 Home Remedies & Say Goodbye To Knee Pain!

Knee pain affects most of the people during some point in their lives. It occurs due to certain activities that we do not perform on an everyday basis. Here we have listed home remedies for knee pain that you must surely make use of.
Story first published: Wednesday, November 30, 2016, 17:13 [IST]
Desktop Bottom Promotion