For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎసిడిటి, పొట్టసమస్యలకు తక్షణ ఉపశమనం : ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ..!

|

సహజంగా స్పైసీ ఫుడ్ ను ఇష్టపడని వారంటూ ఉండరూ, ప్రతి ఒక్కరికీ స్పైసీ ఫుడ్ అంటే ఎంతో ఇష్టం. అయితే, అది ఎప్పుడైతే అసిడిటికి గురిచేస్తుందో అప్పుడు, స్సైసీ ఫుడ్స్ ను ఇష్టపడం.అసిడిటి అంటే గ్యాస్టిక్' లేదా పొట్టలో ఇన్ఫ్లమేషనకు గురిచేస్తుంది. ఎసిడిటి నివారించుకోవడానికి ఉపయోగించే ఆయుర్వేదిక్ రెమెడీస్ గురించి తెలుసుకోవాలనుందా..?అయితే అసిడిటికి కారణం, పొట్టలో విడుదలయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ గురించి క్షుణంగా తెలుసుకోవాల్సిందే..హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల పొట్టలో ఇన్ఫ్లమేషన్ మరియు అసౌకర్యం ఎక్కువ అవుతుంది. అసిడిటి ఎక్కువ రోజులు బాధిస్తుంటే, దీర్ఘకాలిక అజీర్తి సమస్యలు, అల్సర్, మరియు ఇతర జీర్ణ సమస్యలకు కారణమవుతుంది.

అసిడిటి లేదా అసిడిక్ రిఫ్లెక్సన్ ఎందుకు వస్తుంది?
మన పొట్టలో కొన్ని ఆమ్లాలు ఉత్పత్తి అవ్వడం వల్ల మనం తిన్న ఆహారం, చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేసి జీర్ణింపచేస్తుంది. పొట్టలో యాసిడ్స్ ఉత్పత్తి చేసే కణాలు , జీర్నశక్తికి అవసరయ్యే దాని కంటే ఎక్కువ ఉత్పత్తి అవ్వడం , లేదా జీర్ణ వ్యవస్థకు సరిపడా ఆమ్ల రసాలు ఉత్పత్తి కాకపోవడం వల్ల అసిడిటికి దారితీస్తుంది.

ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల పొట్టలో గ్యాస్ట్ర్రిక్ గ్రంథుల్లో ఆమ్ల రసాలు ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతాయి. కొన్ని సందర్భాల్లో పుల్లగా ఉండే ఆమ్లరసాలు, గొంతు వరకూ రివర్స్ లో వెళ్ళడం వల్ల అసిడిక్ రిఫ్లెక్షన్ కు దారితీస్తుంది.

ఎసిడిటిని నివారించుకోవడానికి వివిధ రకాల మెడిసిన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటకంటే ఆయుర్వేదిక్ రెమెడీస్ ను ఫాలో అవ్వడం అన్ని రకాలుగా శ్రేయస్కరం.ఆయుర్వేదిక్ రెమెడీస్ అసిడిటిని నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

ఆయుర్వేదిక్ రెమెడీస్ వివిధరకాలుగా అందుబాటులో ఉన్నాయి . అయితే వీటిలో కూడా ఎఫెక్టివ్ గా, త్వరగా ఉపశమనం కలిగించే వాటిని ఎంపిక చేసి తీసుకోవడం ఉత్తమం . ఆయుర్వేదంతో పాటు, యోగ, హెల్తీ డైట్ మరియు హోమియోపతి కూడా సమస్యను నివారిస్తాయి.

స్టొమక్ అసిడిటిని నివారించుకోవడానికి 10 ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఈ క్రింది విధంగా...

నిమ్మరసం:

నిమ్మరసం:

ఎసిడిటి తగ్గించడంలో హెల్ఫ్ ఫుల్ పదార్థం నిమ్మరసం . ఇది వికారం, వాంతులను నివారిస్తుంది. కడుపుబ్బరం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

 పెప్పర్ పౌడర్ మరియు తేనె :

పెప్పర్ పౌడర్ మరియు తేనె :

పెప్పర్ పౌడర్ లో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి, రోజుకు రెండు సార్లు తీసుకుంటే గ్యాస్ట్రిక్ మరియు ఎసిడిటి సమస్యలుండవు.

త్రిఫల పౌడర్ :

త్రిఫల పౌడర్ :

ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ త్రిఫల పౌడర్ మిక్స్ చేసి, ప్రతి రోజూ ఫలితం చూపించే వరకూ తాగాలి. ఈ కాంబినేసన్ డ్రింక్ గ్యాస్ట్రిక్ నుండి వేగంగా ఉపశమనం కలిగస్తుంది .ఇందులో నెయ్యి చేర్చడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది.

బూడిదగుమ్మడి, బెల్లం:

బూడిదగుమ్మడి, బెల్లం:

గుమ్మడికాయ ముక్కలను ఉడికించి, అందులో బెల్లం మిక్స్ చేసి తినడం వల్ల కడుపులో ఎసిడిటికి కారణమయ్యే కడుపుబ్బరం మరియు ఇన్ఫ్లమేషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

సోంపు:

సోంపు:

భోజనం చేసిన తర్వాత ఒక టీస్పూన్ సోంపును నోట్లో వేసుకుని నమలడం ద్వారా జీర్ణ శక్తి పెరుగుతుంది . దాంతో ఎసిడిటి సమస్య ఉండదు.

 జీలకర్ర పౌడర్ :

జీలకర్ర పౌడర్ :

ఒక లీటర్ నీటిలో ఒక టీస్పూన్ జీలకర్ర పొడి మిక్స్ చేసి, బాగా మరిగించాలి. తర్వాత తాగాలి. రోజూ నార్మల్ వాటర్ కు బదులుగా ఈ జీరా వాటర్ తాగడం మంచిది . అయితే ప్రతి రోజూ ఫ్రెష్ గా జీరా వాటర్ తయారుచేసుకోవాలి. ఈ వాటర్ జీర్ణ శక్తిని పెంచుతుంది. అసిడిటిని తగ్గిస్తుంది.

అల్లం లేదా వెల్లుల్లి,పాలు-వాటర్ :

అల్లం లేదా వెల్లుల్లి,పాలు-వాటర్ :

ఈ మూడింటి మిశ్రమాన్ని బాగా మరిగించాలి. పాలు చిక్కగా మారే సమయంలో క్రిందికి దింపుకుని, వడగట్టి, గోరువెచ్చగా తాగాలి. గ్యాస్ట్రిక్ నివారించడంలో పాలు ఒక మంచి ఆయుర్వేదిక్ రెమెడీ.

బట్టర్ మిల్క్ :

బట్టర్ మిల్క్ :

చిటికెడు ఇంగువ, పసుపు మరియు అరటీస్పూన్ మెంతులను అరకప్పు మజ్జిగలో మిక్స్ చేసి తాగాలి. ఇది ఎఫెక్టివ్ గ్యాస్ట్రిక్ ను తగ్గిస్తుంది.

 పండ్లు :

పండ్లు :

తరచూ అసిడిటి గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడే వారిలో ద్రాక్ష, ఆపిల్స్, దానిమ్మ మరియు అరటి పండ్లు, గ్రేట్ గా సహాయపడుతాయి.

మరికొన్ని:

మరికొన్ని:

పైన సూచించిన ఆయుర్వేదిక్ రెమెడీస్ కాకుండా ఎసిడిటిని నివారించడానికి ఈక్రింది చిట్కాలకు కూడా సహాయపడుతాయి: • కొత్తిమీర రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే పొట్టకు కూలింగ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది. • అజ్వైన్ వంటి హెర్బ్స్ • కొబ్బరి బోండాం • ఆమ్లా • కాకరకాయ, ఆస్పరాగస్ వంటి బిట్టర్ వెజిటేబుల్స్ . • గోధుమలు, గ్రీన్ గ్రామ్ మరియు బార్లీ పైన సూచించినవన్నీ రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే ఎసిడిటి సమస్యలుండవు . ఫుడ్ హ్యాబిట్స్ మాత్రమే కాకుండా, ఎండలో ఎక్కువగా తిరగకూడదని, టైం టు టైం భోజనం చేయాలి ఆయుర్వేదం సూచిస్తున్నది. .

English summary

Thinking Twice Before Munching On That Chicken Stick? Don’t, There Is Ayurveda To Treat The Acidity

We all love spicy food, but when they cause acidity, we just hate it. By 'acidity', we mean gastritis or inflammation of the lining of stomach. Would you want to know of Ayurvedic remedies to treat acidity? Then, keep reading.Excessive secretion of hydrochloric acid in the stomach causes acidity, which in turn leads to inflammation and discomfort. Prolonged acidity can cause chronic indigestion, ulcers and other digestive diseases.
Story first published: Thursday, September 22, 2016, 7:22 [IST]
Desktop Bottom Promotion