For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిడ్ నైట్ కఫ్ తో జాగరణా..?ఐతే కారణాలేంటో తెలుసుకోండి...

|

పలు సందర్భాలలో దగ్గుతో భాద పడడం మన అందరికీ అనుభవమే. దీనికి కారణము గొంతులో గాని , వాయునాళములో గాని చేరిన సూక్ష్మక్రిములు , సూక్ష్మపదార్ధములు , కఫమును బయటకు పంపేందుకు శరీరం చేసే ప్రయత్నమే దగ్గు . దగ్గినపుడు ఊపిరితిత్తుల్లోని గాలి వేగంగా బయటకు వస్తుంది . దీని వల్ల ఏర్పడే ఒత్తిడి గొంతు , శ్వాసనాళాల్లోని పదార్ధములను బయటకు పంపుతుంది . కావున శ్వాసనాళాల్లోని , ఊపిరిత్తులల్లోని కఫాన్ని క్లియర్ చేసేందుకే దగ్గు వస్తుంది .

మన డయాప్రమ్‌ బలముగా సంకోచము (Diaphrgm ) చెందడము , ప్రక్కటెముకలు మధ్యఉన్న కండరాలు(inter costal muscles) ఒక్కసారిగా సంకోచము అవడం మూలాన ఈ పక్రియ జరుగుతూ ఉంటుంది .

చలికాలంలో దగ్గుకు తక్షన ఉపశమనం కలిగించే హోం రెమెడీస్

మరి కొంత మందిలో దగ్గు రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది కారణం మేమిటి? రాత్రి సమయంలో పడుకొన్నప్పుడు పడుకొనే వ్యక్తి యొక్క భంగిమ కూడా ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపుతుంది . ఇలా రాత్రుల్లో వచ్చే దగ్గును డీల్ చేయడం చాలా కష్టం. ఇది పేషంట్ యొక్క నిద్రపాడు చేయడమే కాకుండి, పక్కవారి నిద్రను కూడా చెడగొడుతుంది.

ఇలా రాత్రుల్లో దగ్గుకు వివిధ రకాల కారణాలుండవచ్చు. కానీ ముఖ్యంగా పొగత్రాగే వారిలో నైట్ కఫ్ అధికంగా ఉంటుంది . శరీరంలో మ్యూకస్(గల్ల)ను తొలగించుకోవడానికి శ్వాసనాళాలు మూసికుపోయినప్పుడు ఇలా దగ్గు రూపంలో బయటపడుతుంటుంది . దాంతో దగ్గు మరింత తీవ్రమవుతుంది.

దగ్గు, జలుబును చిటికెలో మాయం చేసే చిట్కాలు

కొంత మందిలో ఇలా రాత్రుల్లో దగ్గు విసిగిస్తుంటే అది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ కారణంగా కూడా అయ్యుండొచ్చు లేదా త్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇలా దగ్గు ఇబ్బంది కలిగిస్తుంది . మరి నైట్ కఫ్ (రాత్రుల్లో బాధించే దగ్గుకు)కు గల కారణాలేంటో తెలుసుకుందాం....

సైనసైటిస్:

సైనసైటిస్:

సైనసైటిస్ మరియు అలర్జీలు కూడా దగ్గుకు కారణం అవుతాయి. సైనసైటిస్ తో బాధపడే వారు, డాక్టర్ ను సంప్రదించడంలో మంచిది. వెంటనే కొన్ని మందులు వాడటం వల్ల మిడ్ నైట్ కఫ్ మాయం అవుతుంది.

పోషకాల లోపం:

పోషకాల లోపం:

మీరు రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల్లో పోషకాలు లోపించినప్పుడు దగ్గుకు కారణం అవుతుంది . ముఖ్యంగా ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఐరన్ లోపం వల్ల కూడా రాత్రుల్లో దగ్గు వస్తుందని నిర్ధారించారు.

ఆస్తమా:

ఆస్తమా:

మిడ్ నైట్ కఫ్ కు ఆస్తమా కూడా కారణం కావచ్చు. ఆస్తమాతో బాధపడే కొంత మంది పేషంట్స్ ను పరిశోధనల ద్వారా పరిశీలించినప్పుడు వారు మిడ్ నైట్ కఫ్ తో బాధపడుతున్నట్లు నిపుణులు

గుర్తించారు.

చాలా సింపుల్ రీజన్:

చాలా సింపుల్ రీజన్:

బెడ్ రూమ్ లో గాలి చాలా పొడిగా ఉన్నప్పుడు ముక్కు మరియు ఊపిరితిత్తులకు చీకాకు కలిగే అవకాశాలున్నాయి . అటువంటి పరిస్థితిలో హుమిడిఫైయ్యర్ ను ఉపయోగించడం వల్ల సమస్యను పరిష్కరించుకోవచ్చు.

యాసిడ్ రిఫ్లెక్షన్స్:

యాసిడ్ రిఫ్లెక్షన్స్:

ఈ విషయం గురించి చాలా మందికి తెలిసుండకపోవచ్చు . కానీ ఇది వాస్తవం. పొట్టలో అసిడిక్ రిఫ్లెక్షన్ వల్ల కూడా రాత్రుల్లో దగ్గు వస్తుంది . కాబట్టి రాత్రుల్లో లైట్ డిన్నర్ చేయడంవల్ల ఉపశమనం పొందవచ్చు.

మెడికేషన్స్:

మెడికేషన్స్:

కొన్ని రకాల మందులు కూడా రాత్రుల్లో దగ్గుకు కారణం అవుతాయి. ఏ మందుల వల్లైనా మీరు దగ్గుకు గురి అవుతుంటే ఆ విషయాన్ని డాక్టర్ కు తెలియజేయాలి . దాంతో డాక్టర్లు మందు వల్ల ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో డిటెక్ట్ చేస్తారు.

 హార్ట్ బర్న్:

హార్ట్ బర్న్:

హార్ట్ బర్న్(ఛాతీలో మంట)వల్ల కూడా నైట్ కఫ్ వస్తుంది. పొట్టలో ఆమ్లాల ప్రవాహం వల్ల ఈసోఫోగస్ వెనుదిరుగుతుంది , దాంతో గొంతులో చీకాకు కలిగి దగ్గుకు కారణం అవుతుంది . అంతే కాదు ఎక్కువగా భోజనం తీసుకోవడం లేదా లేట్ నైట్ భోజనం చేయడం వల్ల కూడా దగ్గుకు కారణం అవుతుంది.

చెస్ట్ ఇన్ఫెక్షన్:

చెస్ట్ ఇన్ఫెక్షన్:

చెస్ట్ ఇన్ఫెక్షన్, లేదా అక్యుట్ బ్రొంకైటిస్, లోయర్ ఎయిర్ వే మీద ప్రభావం చూపుతుంది. అలాగే దగ్గకు కారణం అయ్యే వైరస్ పాస్ ఎయిర్ వేలో పాస్ అవ్వడం వల్ల ఇన్ఫ్లమేషన్ లోయర్ వేలో లంగ్స్ కు స్ప్రెడ్ అవుతుంది అక్కడ బ్యాక్టీరియాతో చేరడం వల్ల దగ్గు మొదలవుతుంది.

స్మోకర్స్ కఫ్:

స్మోకర్స్ కఫ్:

ఎక్కువగా స్మోక్ చేయడం వల్ల శ్వాసనాళం చీకాకు కలుగుతుంది. బ్లాక్ అయి గాలి తీసుకోవడానికి ఇబ్బంది కలిగి దగ్గుకు దారితీస్తుంది . ఇది దీర్ఘకాలికి COPD(క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పలమనరీ డిసీజ్)కు దారితీస్తుంది . ఇంకా క్రోనిక్ బ్రాకైటిస్ కూడా వస్తుంది . దాంతో శ్వాసనాళం దెబ్బతింటుంది .

లంగ్ క్యాన్సర్:

లంగ్ క్యాన్సర్:

స్మోక్ చేసే వారిలో లంగ్ క్యాన్సర్ 90శాతం కేసులున్నాయని రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో వెల్లడైనది .

English summary

TOP 10 Causes Of Midnight Cough

What causes night cough? When you suffer severe cough that too when you lie down then it can be considered as cough that is a result of your posture.Night cough could be tough to deal with as it disturbs your sleep and may also disturb others around.Cough is nothing but your body's attempt to clear the airways. What causes dry night cough? Well, the reasons could be flu or cold or in some cases various conditions that affect your lungs.
Story first published: Wednesday, January 6, 2016, 18:29 [IST]
Desktop Bottom Promotion