For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రాణాంతకమైన క్షయ (టిబి) వ్యాధిని తరిమికొట్టే.. ఎఫెక్టివ్ హోం రెమిడీస్

|

క్షయ రోగాన్ని ఒకప్పుడు ప్రాణాంతకమైన వ్యాధిగా పరిగణించేవారు . కానీ క్రమేపీ దాన్ని నిరోధించటం, నివారించటం మొదలైంది . అసలు టి.బి అంటే ఏమిటి? అదెలా సోకుతుంది?ఇది మైక్రో బాక్టీరియా టుబరంక్యులోసిన్ అనే బాక్టీరియా వలన వచ్చే అంటువ్యాధి. ఈ క్షయ క్రిములు ముఖ్యంగా ఊపిరితిత్తులలో ప్రవేశించి శ్వాసకోశ క్షయవ్యాధిని కలుగచేస్తాయి. ఈ శ్వాసకోశ క్షయ చాలా తీవ్రమైన అంటువ్యాధి. శరీరంలోని ఇతర భాగాలకి కూడా క్షయ వ్యాధి రావచ్చు. అనగా శ్వాసకోశేతర భాగాలు ఎముకలు, కీళ్ళు, లింపు గ్రంధులు, మెదడు పొరలు, మూత్ర పిండాలు, గర్భ సంచి మొదలైనవి.

వ్యాధి లక్షణాలు :
మూడు వారాలకి పైగా దగ్గు, కఫం
సాయంత్రం, రాత్రి సమయాలలో జ్వరం
బరువు తగ్గుట, ఆకలి తగ్గుట
దగ్గు కఫంతోపాటు రక్తంపడుతుంది

వ్యాపించే విదానం
క్షయ వ్యాధి ఉన్న రోగి దగ్గినప్పుడు క్షయ క్రిములు గాలి ద్వారా వ్యాపించుతాయి
క్షయ వ్యాధి గ్రస్తుడు దగ్గినపుడు, అతని ఊపిరితిత్తుల నుండి వచ్చే కఫం ద్వారా ఈ బాక్టీరియా గాలిలో చేరి, దగ్గరలో ఉన్న ఆరోగ్యవంతమైన మనిషి పీల్చే గాలితోపాటు అతని ఊపిరితిత్తుల లోనికి ప్రవేశించి జబ్బుకి పునాది వేస్తుంది.

వ్యాధి నివారణ :
వ్యాధి లక్షణాలు కలిగిన వ్యక్తికి వెంటనే కఫంప పరీక్ష జరిపి చికిత్స ప్రారంభించి మానకుండా పూర్తి కాలం వైద్యులు నిర్ణయించిన ప్రకారం మందులు వాడాలి. శరీరంలో క్షయ వ్యాధి ఏ భాగంలో ఉన్నప్పటికీ చికిత్సా విధానం మాత్రం ఒకటే. రిఫాంపిసిన్‌, ఐసోనెక్స్‌, ఇతాంబ్యుటాల్‌ వంటి మందులతో వ్యాధిని పూర్తిగా నయం చేయ వచ్చు. ఈ వ్యాధికి కనీసం 6 నెలలు క్రమం తప్పకుండా వైద్య సలహాపై మందులు వాడాలి. మందులు వాడటం మొదలుపెట్టిన నెల రోజుల్లో రోగికి చాలా వరకూ ఉపశమనం వస్తుంది. కానీ ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు తప్పనిసరిగా మందులు వాడాలి. కొంత మంది ఉపశమనం లభించిందని మందులు వాడటం మానేస్తుంటారు. ఇటువంటి వారికి వ్యాధి తిరిగి ఆరంభమవుతుంది.

వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రతతోపాటు ఇళ్లలో గాలి, వెలుతురు మొదలైనవి బాగా ఉండేలా చూసుకోవాలి. దగ్గినప్పుడు, తుమ్మిన ప్పుడు చేతి రుమాలు అడ్డంగా పెట్టుకోవాలి. ఎక్కడపడితే అక్కడ కళ్లె ఉమ్మేయకూడదు.ఉమ్మి వేయడానికి మూత ఉన్న కప్పు ఉప యోగించాలి. మంచి పోషకాహారం తీసుకుని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింప జేసుకోవాలి.

వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి . డాక్టర్లు సూచించే మందులతో పాటు ఈ హోం రెమెడీస్ ను ఉపయోగించినట్లైతే వ్యాధి నేచురల్ గా తగ్గించుకోవడంతో పాటు ఇన్ఫెక్షన్స్ సోకకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. మరియు ఈ వ్యాధి విస్తరించకుండా నివారించుకోవచ్చు . ఈ క్రింది లిస్ట్ లో తెలిపిన కొన్ని హోం రెమెడీస్ టిబి లక్షణాలను నివారించడంతో పాటు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. మరి క్షయ(టిబి) నివారించే ఆ ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం...

ఆరెంజ్ జ్యూస్:

ఆరెంజ్ జ్యూస్:

ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి మరియు విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఆరెంజ్ జ్యూస్ లో వ్యాధినిరోధక శక్తిని పెంచే పవర్ ఫుల్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల ట్యుబర్ క్యులోసిస్ తో స్ట్రాంగ్ గా పోరాడుతాయి . రెండు ఆరెంజ్ లను జ్యూస్ చేసి అందులో కొద్దిగా ఉప్పు, తేనె మిక్స్ చేసి రోజు త్రాగడం వల్ల క్షయ లక్షణాలను దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

ఉసిరికాయ:

ఉసిరికాయ:

ఈ గ్రీన్ స్కిన్ బిట్టర్ ఫ్రూట్ టిబి నుండి ఉపశమనం కలిగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అలాగే ఎనర్జీ లెవల్స్ పెంచుతుంది. ఉసిరికాయలో ఉండే విటమిన్ సి, వ్యాధినిరోధక శక్తి పెంచడంలో గ్రేట్ గా పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. లంగ్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల్లోని బ్యాక్టీరియాను బయటకు ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఆమ్లాను మెత్తగా పేస్ట్ చేసి, జ్యూస్ తీసి, అందులో ఒక చెంచా తేనె మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం పరగడుపు తీసుకోవాలి.

వాల్ నట్స్:

వాల్ నట్స్:

వాల్ నట్స్ పవర్ ఫుల్ ఎనర్జీ ఫుడ్. ఈ నట్ లో పవర్ ఫుల్ విటమిన్స్ మరియు మినిరల్స్, విటమిన్ బి6, విటమిన్ ఇ, ఐరన్ ఫాస్పరస్ మరియు మెగ్నీషియంలు పుష్కలంగా ఉన్నాయి. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో గ్రేట్ గా సమాయపడుతుంది . వాల్ నట్స్ 2 తీసుకొని పొట్టు తీసిని పౌడర్ చేసి , అందులో ఒక టీస్పూన్ గార్లిక్ పేస్ట్ వేసి 1టీస్పూన్ క్లారిఫైడ్ బట్టర్ వేసి మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం తినడం వల్ల టీబి నుండి త్వరగా ఉపశమనం పొందుతారు.

బ్లాక్ పెప్పర్:

బ్లాక్ పెప్పర్:

ట్యుబర్ కులోసిస్ చెస్ట్ కంజెషన్, ఇన్ఫ్లమేషన్ మరియు నొప్పి కలిగి ఉంటుంది .ఈ సమస్యలను నివారించుకోవడానికి బ్లాక్ పెప్పర్స్ గ్రేట్ గా సహాయపడుతాయి . బ్లాక్ పెప్పర్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు అనాల్జిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ట్యూబర్ క్యులోసిస్ కు ఇది ఒక వండర్ ఫుల్ రెమెడీ . పాన్ లో బట్టర్ వేసి అందులో కొన్ని మిరియాలు వేసి, ఇంగువ వేసి వేగించుకోవాలి. చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసి , దీన్ని ప్రతి రోజూ మూడు డోసులు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

పాలు:

పాలు:

పాలు మంచి పోషకాహారం. పాలలో ఉండే క్యాల్షియం వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది మరియు బోన్స్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది . కాబట్టి, ప్రతి రోజూ మూడు గ్లాసుల పాలు తీసుకోవడం ద్వారా టీబి లక్షణాలను దూరం చేసుకోవడంతో పాటు, ఎముకల ఆరోగ్యాన్ని కాపాపడుకోవచ్చు . పాలలో కొద్దిగా పసుపు, తేనె మిక్స్ చేసి తాగవచ్చు . బోన్ టీబికి ఇది ఒక ఫర్ఫెక్ట్ హో రెమెడీ.

 అరటిపండ్లు:

అరటిపండ్లు:

న్యూట్రీషియన్స్ కు ఒక స్టోర్ హౌస్ వంటిది. ముఖ్యంగా ఇందులో క్యాల్షియం అధికం. ఈ ఎల్లో స్కిన్ ఫుడ్ లో ఫీవర్, మరియు దగ్గు ను నివారించే లక్షణాలు అధికంగా ఉన్నాయి . అరటిపండ్లు రెగ్యులర్ గా తినడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెంచడంతో పాటు టిబికి వ్యతిరేఖంగా పోరాడుతుంది . ఒక కప్పు కోకనట్ వాటర్ లో అరటిపండు మ్యాష్ చేసి వేసి బ్లెడ్ చేసి జ్యూస్ లా తయారుచేసి అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి రోజూ రెండు సార్లు తాగాలి.

 సీతాఫలం:

సీతాఫలం:

ట్యుబర్ కులోసిస్ కు మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ ఇది . ఇందులో నివారించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సీతాఫలంలో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి . ఆక్సిడేటివ్ డ్యామేజ్ కాకుండా ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది . సీతాఫలంలో ఉండే పొటాసియం లంగ్ మజిల్స్ ను బలోపేతం చేస్తుంది .

 వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మరియు అనాల్జిక్ లక్షణాలు అధికంగా ఉన్నాయి . టిబి నివారలో మరియు రికరెన్స్ కు గ్రేట్ గా సహాయపడుతుంది . పాలు మరియు గార్లిక్ డికాషన్ తాగడం వల్ల ట్యుబర్ క్యులోసిస్ ను గ్రేట్ గా నివారించుకోవచ్చు . 4 వెల్లుల్లి రెబ్బలను మెత్తగా దంచి, వాటిని మేకపాల్లో వేసి బాగా మరిగించాలి . అందులోనే కొబ్బరి పాలను కూడా వేసి పాలు సగం అయ్యే వరకూ మరిగించాలి . దీనికి కొద్దిగా తేనె మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం పరగడుపు తీసుకోవాలి. 6 వారాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 పుదీనా:

పుదీనా:

పుదీనాలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ అనాలంజిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ట్యుబర్ క్యులోసిస్ కు గ్రేట్ హోం రెమెడీ . ఇది ఎయిర్ ప్యాసేజ్ ను క్లియర్ చేస్తుంది . టిబితో బాధపడే వారిలో వాపులు మరియు నొప్పులను నివారిస్తుంది. . బాడీ రెసిస్టెంట్ పవర్ ను పెంచుతుంది. . ఇది టిబితో పోరాడే గుణాలు అధికంగా ఉండటం వల్ల స్ట్రాంగ్ గా పోరాడుతుంది. పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి కొద్దిగా తేనె మిక్స్ చేసి తీసుకోవాలి. క్యారెట్ మరియు పుదీనా రసం లంగ్ టానిక్.

మునగాకు:

మునగాకు:

మునగాకులో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ట్యుబర్ కులోసిస్ లక్షణాలు నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది . లంగ్స్ లోని బ్యాక్టీరియాను బయటకు ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ మరియు నొప్పిని తగ్గిస్తుంది. మునగాకును ఒక గ్లాసు నీటిలో మరిగించి అందులో కొద్దిగా బ్లాక్ పెప్పర్, నిమ్మరసం మిక్స్ చేసి రోజూ కొద్దిగా తాగాలి. లేదా వారంలో మూడు సార్లు తాగితే కూడా మంచి ఫలితం ఉంటుంది.

English summary

TOP 10 Effective Home Remedies For Tuberculosis

TOP 10 Effective Home Remedies For Tuberculosis,Home remedies have proven to be effective in curing a multitude of heath issues; however, when it comes to tuberculosis, there are no known home remedies that offer a 100% cure. When used in conjunction with prescribed drugs, these natural cures keep the infection u
Story first published: Wednesday, May 4, 2016, 14:17 [IST]
Desktop Bottom Promotion