బ్లడ్ ప్రెజర్ ను తగ్గించుకోవడానికి వెల్లుల్లిని ఎలా తింటే మంచిది?

Posted By: Staff
Subscribe to Boldsky

బ్లడ్ ప్రెజర్ ఆరోగ్యానికి ఎంత హానికరమో అందరికీ తెలిసిన విషయమే.. యాంటీహైపర్ టెన్సివ్ మెడిసిన్స్ తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడకుండా సురక్షితంగా బిపి ఎలా తగ్గించుకోవాలని చూస్తున్నారా?బ్లడ్ ప్రెజర్ ను తగ్గించుకోవడానికి కామన్ గా ఉపయోగించే హోం రెమెడీస్ చాలానే ఉన్నాయి. అయితే, వాటిలో ఒక్క దాని మీద ఏకాగ్రత పెడితే చాలు..చాలా ఎఫెక్టివ్ గా నేచురల్ గా బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. ఆ ఒక్క హోం రెమెడీ ఎంటంటే వెల్లుల్లి.

వెల్లుల్లిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం ఇది వరకే చాలా తెలుసుకున్నాము. వెల్లుల్లిలో ఉండే సల్పర్ లో అల్లీసిన్, డయాలిల్ డిస్ల్ఫైడ్, డయల్లైల్ ట్రిసల్సైడ్ మొదలగు ఔషధ గుణాల వల్ల ఆరోగ్యానికి గొప్ప వరంలా పనిచేస్తుంది. అంతే కాదు ఇందులో సెలీనియం, జర్మేనియం, విటమిన్స్, మరియు మినిరల్స్ వంటవి చాలానే ఉన్నాయి.

రక్తపోటును తగ్గించే వెల్లుల్లి

అల్లిసిన్, ఇది వెల్లుల్లి ఉండే అత్యంత చురకైన పదార్థం. దీని ప్రధాన కర్తవ్వం బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. వెల్లుల్లి గురించి మరింత వివరంగా తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాల్సిందే.

అల్లీసిన్ అనేది ఒక ఎంజైమ్. వెల్లుల్లిని మనం వలిచినప్పుడు, కట్ చేసినప్పుడు లేదా పేస్ట్ చేసినప్పుడు ఈ ఎంజైమ్స్ విడుదల అవుతాయి. పచ్చివాటిలో మాత్రమే కాదు, డ్రై అయిన వెల్లుల్లిలో కూడా అల్లిసిన్ అధికంగా ఉంటుంది.

హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గించుకోవడానికి 7 పవర్ ఫుల్ ఫుడ్స్ ...

హైబ్లడ్ ప్రెజర్ ను నివారించుకోవడం కోసం వివిధ రకాలుగా హోం రెమెడీస్, చిట్కాలను ఉపయోగించి ఉంటారు. అయితే వెల్లుల్లిని మీరెప్పుడైనా ప్రయత్నించారా? రోజూ 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ ను చాలా సింపుల్ గా తగ్గించుకోవచ్చు .

పచ్చిగానే కాదు, డైలీ డైట్ లో వివిధ రకాలుగా ఉపయోగించి తినవచ్చు. అదెలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

1. పచ్చి ఉల్లిపాయ

1. పచ్చి ఉల్లిపాయ

పచ్చిగా ఉండే వెల్లుల్లిని తినడం వల్ల హైబ్లడ్ ప్రెజర్ ను ఎఫెక్టివ్ గా నివారించుకోవచ్చు. వెల్లుల్లిని తినడం వల్ల అల్లిసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఒక వేల వంటల్లో ఉపయోగించానా, ఒకటి రెండు గంటలలోపు తినడం వల్ల ఫుల్ పొటెన్షియల్ బెనిఫిట్స్ ను పొందుతారు.

రోజుకు 1-1.5గ్రాముల ఫ్రెష్ గా ఉండే వెల్లుల్లి రెబ్బను తినాలి. ఇది ఈరోజుకు బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది .

2. వెల్లుల్లి పౌడర్

2. వెల్లుల్లి పౌడర్

రోజూ 600-900మిల్లీగ్రాములు గార్లిక్ పౌడర్ తినడం వల్ల దాదాపు 9-12% బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. ఒక రోజుకు 600 మిల్లీగ్రాముల గార్లిక్ పౌడర్ లో 3.6 మిల్లీగ్రాముల అల్లిసిన్ ఉంటుంది. మరియు 900 మిల్లీగ్రాముల్లో 5.4 మిల్లీగ్రాముల అల్లీసిన్ ఉంటుంది. కాబట్టి మీ బిపి రేంజ్ ను బట్టి ఎన్నిగ్రాములు తీసుకోవాలో నిర్ధారించుకోవాలి.

3. ఉడికించిన వెల్లుల్లి

3. ఉడికించిన వెల్లుల్లి

వెల్లుల్లిని ఉడికించడం వల్ల అల్లిసిన్ మరియు సల్ఫర్ కాంపౌండ్స్ ఇన్ యాక్టివేట్ అవ్వొచ్చు. . అల్లిసిన్ స్థిరంగా ఉండదు. వెల్లుల్లిని ఉడికంచిడం వల్ల అల్లిసిన్ సరిగా ఉత్పత్తి కాకపోవచ్చు. వంట చివర్లో వెల్లుల్లిని కచపచా దంచి వేయడం వల్ల కొన్ని గంటల వరకూ అల్లిసిన్ ఎఫెక్ట్ ఉండవచ్చు.తర్వాత ఓవర్ గా ఉడికించకపోవడం మంచిది.

బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్ ని శాశ్వతంగా దూరం చేసే ఔషధం..!

4. సలాడ్స్ లో గార్లిక్ తురుము

4. సలాడ్స్ లో గార్లిక్ తురుము

ఈ అల్లిసిన్ మీకు నచ్చిన సాలాడ్స్ లో చేర్చుకోవచ్చు. సలాడ్స్ ఆరోగ్యానికి మంచిది కాబట్టి, దీన్ని డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గించుకోవచ్చు .

5. గార్లిక్ ఫ్లేవర్ ఆలివ్ ఆయిల్

5. గార్లిక్ ఫ్లేవర్ ఆలివ్ ఆయిల్

దీన్ని ఇంట్లో చాలా సులభంగా తయారుచేసుకోచ్చు. వెల్లుల్లి రెబ్బలను ఆలివ్ ఆయిల్లో వేసి 5 నిముషాలు బాయిల్ చేయాలి. తర్వాత హీట్ తగ్గించి సిమ్ లో మరికొద్దిసేపు ఉల్లిపాయలను ఉడికించాలి. తర్వాత దీన్ని స్టోర్ చేసుకుని, బ్రెడ్ స్లైస్, సలాడ్స్ లో స్ప్రెడ్ చేసి తీసుకోవచ్చు.

హైబిపి ఉన్న వారు ఖచ్చితంగా తినకూడని కొన్ని ఆహారాలు

6. గార్లిక్ టీ

6. గార్లిక్ టీ

మొదట రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి, ఒక కప్పు నీటిలో వేసి టీలాగా మరిగించాలి. తర్వాత టీని వడగట్టి అందులో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి తాగాలి. ఈ ఔషధ టీని రోజూ తాగితే బ్లడ్ ప్రెజర్ ఎఫెక్టివ్ గా తగ్గుతుంది.

English summary

6 Ways To Consume Garlic And Reduce Blood Pressure

The health benefits of garlic are attributed to its sulphur-containing compounds like allicin. Allicin, the active constituent present in garlic, is mainly responsible for its blood pressure-lowering effect. Also if you want to know about the health benefits of garlic in detail then click here.
Subscribe Newsletter