స్టొమక్ ఎసిడిటిని వెంటనే తగ్గించే 8 సింపుల్, ఎఫెక్టివ్ హోం రెమెడీస్

Posted By:
Subscribe to Boldsky

ఎసిడిటి లేదా ఎసిడిక్ రిఫ్లెక్షన్ ఇది చాలా సాధారణ సమస్య. ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో ఎసిడిటి ఒకటి. పొట్టలో ఎక్సెసివ్ యాసిడ్స్ ఉత్పత్తి అయినప్పుడు ఈ సమస్య వస్తుంది. అన్ని సీజన్స్ లో కంటే సమ్మర్ సీజన్ లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఈ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. వేసవిలో వచ్చే స్టొమక్ అసిడిటికి కొన్ని సాధారణ లక్షణాలు కూడా ఉన్నాయి. స్టొమక్ బ్లోటింగ్, వాంతులు, ఎప్పుడూ త్రేన్పులు, మోషన్ లో రక్తం పండటం మొదలగునవి వేసవిలో వచ్చే స్టొమక్ ఎసిడిటికి ముఖ్యమైన లక్షణాలు

వేసవిలో వేధించి ఈ సాధరణ సమస్యను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలి. వేసవిలో వేధించే స్టొమక్ ఎసిడిటిని నివారించుకోవడానికి మెడిసిన్స్ కంటే నేచురల్ హోం రెమెడీస్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. స్టొమక్ ఎసిడిటిని తగ్గిస్తాయి

ఇంతకీ స్టొమక్ ఎసిడిటి ఎందుకొస్తుంది అంటారా? భోజనానికి మరో భోజనానికి మద్య ఎక్కువ గ్యాప్ తీసుకోవడి. టీలు, కాఫీలు, ఆల్కహాల్ మరియు సిగరెట్ స్మోకింగ్ వల్ల వచ్చే ఈ ఎసిడిటి మీ దినచర్యను నాశనం చేస్తుంది. రోజంతా అసౌకర్యానికి గురిచేసి ఏ పనిచేయడాని ఇంట్రస్ట్ లేకుండా చేస్తుంది.

ఎసిడిటి ఎప్పుడో ఒక సమయంలో వచ్చే వెళ్లిపోతే పర్వాలేదు కానీ, తరచూ అదే సమస్య బాధిస్తుంటే మాత్రం విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. వేసవి సీజన్ లో వేధించే స్టొమక్ ఎసిడిటికి కొన్ని సులభమైన హోం రెమెడీస్ ఉన్నాయి. ఈ నేచురల్ రెమెడీస్ కేవలం ఎసిడిటిని నివారించడం మాత్రమే కాదు, వేసవి సీజన్ ను మీకు మరింత ఆహ్లాదకరంగా మార్చుతుంది.

వేసవి సీజన్ లో స్టొమక్ ఎసిడిటిని నివారించే ఎపెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా..

వేసవిలో స్టొమక్ ఎసిడిటిని నివారించే సులభ చిట్కాలు:

1. మజ్జిగ:

1. మజ్జిగ:

మజ్జిగలో అనేక హెల్తీ న్యూట్రీషియన్స్ ఉన్నాయి. ఇది ఎసిడిటిని తగ్గించడం మాత్రమే కాదు శరీరాన్ని, పొట్టను కూల్ గా మార్చుతుంది. ఇది స్టొమక్ ఎసిడిటి నివారించడంతో పాటు హార్ట్ బర్న్ కూడా తగ్గిస్తుంది. పెరుగుతో మజ్జిగ తయారుచేయడానికి ముందు అందులో చిటికెడు ఉప్పు చిలకరిస్తే చాలు ఎసిడిక్ రిఫ్లెక్షన్ నుండి తక్షణ ఉపశమనం పొందుతారు.

2. తులసి ఆకులు :

2. తులసి ఆకులు :

తులసి ఆకులు బెస్ట్ హోం రెమెడీ. వేసవిలో సీజన్ లో వచ్చే స్టొమక్ ఎసిడిటిని నివారించడంలో తులసి ఆకులు గ్రేట్ గా సహాయపడుతాయి. తులసిలో ఉండే కార్మినేటివ్ , స్మూతింగ్ లక్షణాలు కలది. స్టొమక్ ఎసిడిటితో బాధపడే వారు తులసి ఆకులను నమలడం మంచిది. 3-5 తులసి ఆకులను నీటిలో వేసి బాయిల్ చేసి తాగడం వల్ల ఇన్ స్టాంట్ గా రిలీఫ్ ఇస్తుంది.

3. వెల్లుల్లి:

3. వెల్లుల్లి:

స్టొమక్ ఎసిడిటిని నివారించే హోం రెమెడీస్ లో వెల్లుల్లిది మొదటి స్థానం. ముఖ్యంగా వేసవి సీజన్ లో స్టొమక్ ఎసిడిటిని నివారించడంలో వెల్లుల్లి గొప్పగా సహాయపడుతుంది. ఒక పచ్చివెల్లుల్లి రెబ్బను నోట్లో వేసుకుని నమలడం వల్ల స్టొమక్ ఎసిడిటితో పాటు, హార్ట్ బర్న్ కూడా తగ్గుతుంది .

4. బాదం :

4. బాదం :

బాదంలో క్యాల్షియం మరియు ఆల్కలైన్ కాంపౌండ్స్ అధికంగా ఉన్నాయి. పొట్టలో ఆమ్లాలను బాదం క్రమబద్దం చేస్తుంది. ప్రతి మీల్ తర్వాత రెండు, మూడు బాదంలు తినడం వల్ల శరీరంలో పిహెచ్ బ్యాలెన్స్ అవుతుంది. అసిడిటి సమస్య తగ్గుతుంది.

5. కోకనట్ వాటర్ :

5. కోకనట్ వాటర్ :

వేసవిలో, కొబ్బరి బోండాలకు ఎక్కువ డిమాండ్. వేసవిలో శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుకోవాలంటే కొబ్బరి బోండాలు ఉత్తమ ఎంపిక. అంతే కాదు, స్టొమక్ యాసిడ్స్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. కోకనట్ వాటర్ తాగడం వల్ల శరీరంలో ఉండే అనవసరపు ఆమ్లాలను తొలగించి, బాడీ హీట్ ను తగ్గిస్తుంది.

6. బేకింగ్ సోడ:

6. బేకింగ్ సోడ:

హార్ట్ బర్న్ తో బాధపడుతున్నారా? వంటదిలో ఉండే బేకింగ్ సోడా ఒక స్పూన్ తీసుకుని, ఒక గ్లాసు నీటిలో వేసి మిక్స్ చేయాలి. తర్వాత ఈ నీటిని తాగాలి. స్టొమక్ యాసిడ్ ను నివారించడానికి ఇది ఒక ఉత్తమ పద్దతి. ఇందులో నేచురల్ యాంటాసిడ్ లక్షణాలుండటం వల్ల హార్ట్ బర్న్ , ఎసిడిటి లక్షణాలను నివారిస్తుంది.

7. అలోవెర జ్యూస్:

7. అలోవెర జ్యూస్:

అలోవెర జ్యూస్ లో వివిధ రకాల హెల్తీ న్యూట్రీషియన్స్ ఉన్నాయి. అలోవెర బ్యూటీ బెనిఫిట్స్ ను అందివ్వడం పాపులర్ రెమెడీ. అయితే స్టొమక్ ఎసిడిటిని నివారించడంలో అలోవెర ఎక్సలెంట్ రెమెడీ అని ఎంత మందికి తెలుసు? ప్యాక్ చేసిన వాటికంటే ఫ్రెష్ గా ఉన్న జ్యూస్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

8. అల్లం:

8. అల్లం:

అల్లం, వెల్లుల్లి కూడా ఎసిడిటిని నివారించడంలో ఎఫెక్టివ్ హోం రెమెడీ. కొద్దిగా ఫ్రెష్ గా ఉన్న అల్లం తీసుకుని, ముక్కలుగా కట్ చేసి నీళ్లలో వేసి మరిగించి టీలా తయారుచేయాలి. దీనికి కొద్దిగా నిమ్మరసం జోడించి తాగాలి. హార్ట్ బర్న్ నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. స్టొమక్ ఎసిడిటిని నివారించడానికి ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ హోం రెమెడీస్.

English summary

8 Home Remedies To Prevent Stomach Acidity During Summer

The factors that cause acidity can be empty stomach, long gap between meals and excessive intake of tea, coffee, alcohol, and cigarette smoking. Acidity can spoil your whole day, making you feel uncomfortable. Moreover, constant exposure to acidity will cause other health issues over a long period of time. Knowing some of the easy home remedies to prevent stomach acidity during summer will help you enjoy the season better.
Story first published: Tuesday, May 30, 2017, 16:08 [IST]
Subscribe Newsletter