పొట్ట ఉబ్బరం, పొట్ట నొప్పి తగ్గించే అమేజింగ్ ట్రిక్స్ అండ్ టిప్స్

Posted By:
Subscribe to Boldsky

పొట్ట ఉబ్బరాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నారా ? ఇంతకు ముందు ఉన్న ఫ్లాట్ బెల్లీని సొంతం చేసుకోవాలని ఆరాటపడుతున్నారా ? కొన్ని అలవాట్లు, లైఫ్ స్టైల్ లో మార్పులు, డైట్ ప్లాన్ తో.. పొట్ట ఉబ్బరం తగ్గించడం తేలికైన పనే.

పొట్ట ఉబ్బరానికి చాలా రకాల కారణాలుంటాయి. పేగులలో గ్యాస్, కాన్ట్సిపేషన్, తినేటప్పుడు గాలి లోపలికి వెళ్లడం, కొన్ని రకాల ఆహారాల, బోవెల్ సిండ్రోమ్ వల్ల కూడా.. పొట్ట ఉబ్బరం సమస్య వస్తుంది. బ్లోటింగ్, గ్యాస్, డయేరియా, కాన్ట్సిపేషన్, పొట్టలో సమస్యలు, పొట్ట నొప్పి వంటి అనారోగ్య సమస్యల వల్ల పొట్ట ఉబ్బరం ఎదురవుతుంది.

పొట్ట ఉబ్బరాన్ని తేలికగా, త్వరగా తగ్గించే సింపుల్ హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. అది కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి. కొన్ని అలవాట్ల ద్వారా కూడా.. పొట్ట ఉబ్బరాన్ని తగ్గించుకోవచ్చు. మరి అవేంటో చూద్దాం..

ఆహారాన్ని బాగా నమిలి తినాలి:

ఆహారాన్ని బాగా నమిలి తినాలి:

భోజనం చేసే సమయంలో టీవీ చూడటం, ఫోన్ లో మాట్లడటం వల్ల ఆహారాన్ని నమలడం మర్చిపోతుంటారు. ఆహారాన్ని సరిగా నమిలి తినకపోవడం వల్ల కడుపుబ్బరం సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి, ఆహారం తినేటప్పుడు శ్రద్ద పెట్టి బాగా నమలి తినాలి.

ఏకాగ్రతతో తినాలి:

ఏకాగ్రతతో తినాలి:

నెమ్మదిగా తినడం అలవాటు చేసుకోవడం మంచిది. ఫాస్ట్ తినే అలవాటు ఉంటే.. ఆహారంతోపాటు గాలి పొట్టలోపలికి వెళ్లి ఉబ్బరానికి కారణమవుతుంది. అలాగే ఆహారాన్ని పూర్తీగా నమిలి మింగాలి.

కొద్దికొద్దిగా తినాలి:

కొద్దికొద్దిగా తినాలి:

ఎక్కువ మోతాదులో మూడు సార్లు తినడం కంటే.. ఐదు లేదా ఆరుసార్లు కొద్ది కొద్దిగా తినడం వల్ల బ్లోటింగ్ ని అరికట్టవచ్చు.

కారంగా ఉండే ఆహారాలు అస్సలు తినకూడదు:

కారంగా ఉండే ఆహారాలు అస్సలు తినకూడదు:

అలాగే వేడి పదార్థలు , కారంగా ఉన్న ఆహారాలను సరిగా నమిలి తినకపోవడం వల్ల కూడా గ్యాస్ట్ ట్రిక్ కు కారణమవుతుంది.. కాబట్టి, మరీ వేడిగా ఉన్న ఆహారాలు తినకూడదు. అలాగే కారంగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి

చాలా చల్లగా ఫ్రీజ్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి:

చాలా చల్లగా ఫ్రీజ్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి:

మరీ చల్లగా ఉన్న ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. మరీ చల్లగా ఉన్న ఆహారాలు (ఫ్రీజ్ చేసినవి) నోట్లో ఎక్కువ సేపు పెట్టుకోలేకపోవడం వల్ల ఆహారాన్ని నమలకుండా మింగేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కూడా కడుపుబ్బరానికి కారణమవుతుంది.

రెగ్యులర్ డైట్ లో ఫ్రూట్స్ ను ఎక్కువగా చేర్చాలి:

రెగ్యులర్ డైట్ లో ఫ్రూట్స్ ను ఎక్కువగా చేర్చాలి:

ఫౌబర్ కంటెంట్ అధికంగా ఉండే ఫ్రూట్స్ ను ఎక్కువగా తినడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. ఆపిల్స్, ఆరెంజ్ వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఇవి కడుపుబ్బరాన్ని తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి

 ప్రొసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి:

ప్రొసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి:

తక్కువ ఉప్పు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ప్రాసెస్డ్, క్యాన్డ్ ఫుడ్స్ లో ఎక్కువ ఉప్పు ఉంటుంది. కాబట్టి.. అలాంటి వాటిని, హై సోడియం ఫుడ్స్ ని తినకూడదు.

త్రుణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి:

త్రుణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి:

కాన్ట్సిపేషన్ తగ్గించుకోవడానికి ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, ధాన్యాలు, నట్స్ ని డైలీ డైట్ లో చేర్చుకుంటే.. కాన్ట్సిపేషన్ తగ్గి.. పొట్ట ఉబ్బరం తగ్గుతుంది.

English summary

Amazing Tricks To Prevent Stomach Bloating

A bloated stomach, with a feeling of fullness and discomfort, is something that none of us would like to have. It not just leaves us with a bulging stomach but also is an unhealthy sign too. So how do we prevent stomach bloating?
Story first published: Tuesday, February 28, 2017, 17:03 [IST]