For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మైగ్రేన్ తలనొప్పిని ఎఫెక్టివ్ గా తగ్గించే ఫర్ఫెక్ట్ ఆయుర్వేదిక్ రెమెడీస్ ..!!

గ్రేన్ తలనొప్పితో పాటు వికారం, వాంతులు, సెన్సివిటి అధికంగా ఉంటుంది. ఈ లక్షణాలన్ని కూడా తలనొప్పికి సంబంధించి ఉంటాయి . నొప్పి ఎక్కువగా ఉంటే ఆయుర్వేదిక్ ఎక్స్ పర్ట్ ను కలిసి తగిన చికిత్స తీసుకోవాలి.

|

ఈ మద్య కాలంలో వింటున్న ఆరోగ్య సమస్యల్లో మైగ్రేన్ హెడ్ఏక్. ప్రతి 10 మందిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా వింటర్ సీజన్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనికి వెంటనే చికిత్స తీసుకోకపోతే సీరియస్ గా మారుతుంది. తలతిరగడం, విపరీతమైన తలనొప్పి, కళ్ళలో నీళ్ళు కారడం వంటి లక్షణాలు కనబడుతాయి.

Ayurvedic Treatments That Cure Migraine Headache

మైగ్రేన్ హెడ్ఎక్ తో బాధపడేవారి కోసం కొన్ని ఎఫెక్టివ్ ఆయుర్వేదిక్ రెమెడీస్ ను పరిచయం చేస్తున్నాము. ఈ పరిస్థితిని ''సూర్యవర్త'' అని కూడా పిలుస్తారు. సూర్యవర్త అంటే సన్(సూర్యుడు) మరియు 'ఆవర్త'(బ్లాకేజ్). సూర్యడు పొద్దు పొడిచినప్పుడు తలనొప్పి ప్రారంభవుతుంది. మద్యహ్నానంలో నొప్పి విపరీతంగా బాధిస్తుంది. సాయంత్రం(సూర్యాస్తమయాని)కి క్రమంగా తగ్గుతుంది. దీన్ని సూర్యవర్త''అంటారు.

ఇటువంటి తలనొప్పిని తగ్గించుకోవడానికి కొన్ని ఆయుర్వేదిక్ రెమెడీస్ లిస్ట్ చేసి, ఈ క్రింది విధంగా సూచించడం జరిగింది. నొప్పిని తగ్గించుకోవడానికి ఇవి చాలా ఎఫెక్టివ్ గా నేచురల్ గా తగ్గిస్తాయి. ఇవి సురక్షితమైనవి , వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మైగ్రేన్ తలనొప్పిని, పర్మనెంట్ గా..నేచురల్ గానే తగ్గించేస్తాయి.

మైగ్రేన్ తలనొప్పి రావడానికి ఒక్కొక్కరిలో ఒక్కో విధమైన కారణాలుంటాయి. ముఖ్యంగా బ్రెయిన్ లో ఎక్సెస్ రక్తనాలలు, బ్రెయిన్ ఉత్పత్తి అవ్వడం వల్ల కూడా ఈ నొప్పి బాధిస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. తలనొప్పి ఎక్కువగా ఒకే వైపు వస్తుంటే దీన్ని మైగ్రేన్ తలనొప్పిగా భావించాలి. మైగ్రేన్ తలనొప్పితో పాటు వికారం, వాంతులు, సెన్సివిటి అధికంగా ఉంటుంది. ఈ లక్షణాలన్ని కూడా తలనొప్పికి సంబంధించి ఉంటాయి . నొప్పి ఎక్కువగా ఉంటే ఆయుర్వేదిక్ ఎక్స్ పర్ట్ ను కలిసి తగిన చికిత్స తీసుకోవాలి. మైనర్ గా ఉంటే, ఈ క్రింది హోం రెమెడీస్ ను ఉపయోగించాలి...

ధనియాలపొడి:

ధనియాలపొడి:

ఒక స్పూన్ ధనియాల పొడిని ఒక కప్పు వాటర్లో మిక్స్ చేయాలి. రాత్రంతా అలాగే వదిలేయాలి. ఉదయం నిద్రలేచిన వెంటనే పడగడుపున తాగాలి. ధనియాల్లో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలుఅ ధికంగా ఉన్నాయి. ఇవి మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తుంది. మైగ్రేన్ తలనొప్పి తగ్గించడంలో బెస్ట్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ లో ఇది ఒకటి.

దానిమ్మ, మల్లెజాజి ఆకులు:

దానిమ్మ, మల్లెజాజి ఆకులు:

మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంలో దానిమ్మ, మల్లెజాజి ఆకులు సహాయపడుతాయి. ఈ రెండు ఆకులను తీసుకుని, కొద్దిగా ఉప్పు కలిపి పేస్ట్ చేయాలి. తర్వాత ఈ పేస్ట్ నుండి రసాన్ని తియ్యాలి. డ్రాపర్ బాటిల్లో వేసి, ముక్కు రంద్రాల్లో ఒక్కో డ్రాప్ విడవాలి. ఉదయం, సాయంత్రం ఇలా చేయడం వల్ల మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం పొందుతారు.

ద్రువ గ్రాస్ :

ద్రువ గ్రాస్ :

గుప్పెడు గరిక తీసుకుని, పేస్ట్ చేసి, అందు నుండి రసం తియ్యాలి. అందులో చిటికెడు లికోరైస్ పౌడర్ వేసి, బాగా మిక్స్ చేయాలి. దీన్ని మద్యహ్నానంలో తాగాలి. ఇలా 20 నుండి 30 రోజులు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది మైగ్రేన్ తలనొప్పిని ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

 ఆయుర్వేదిక్ ఆయిల్ మసాజ్:

ఆయుర్వేదిక్ ఆయిల్ మసాజ్:

గోరువెచ్చని నూనెను తలకు అప్లై చేసి, మసాజ్ చేయాలి. అభ్యంగన స్నానం చేయాలి. ఆయుర్వేదం ప్రకారం ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని నమ్ముతారు. తలలో రక్తప్రసరణ మెరుగుపరచడంతో పాటు, తలనొప్పి తగ్గిస్తుందని సూచిస్తున్నారు.

మెడిటేషన్:

మెడిటేషన్:

మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంలో ఆయుర్వేదిక్ రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. ఇది స్ట్రెస్ తగ్గిస్తుంది. టెన్షన్ తగ్గిస్తుంది. దాంతో క్రమంగా తలనొప్పి తగ్గుతుంది.

ఎండు ద్రాక్ష మరియు బాదం:

ఎండు ద్రాక్ష మరియు బాదం:

ఎండుద్రాక్ష 5 మరియు బాదంలు 5 నీళ్ళలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నిద్రలేచిన వెంటనే పరగడుపున తినాలి. అలాగే డ్రైనట్స్ నానబెట్టిన వాటర్ ను తాగాలి. మైగ్రేయిన్ తలనొప్పిని తగ్గించడంలో ఖచ్చితంగా సహాయపడుతుంది.

 త్వరగా నిద్రపోవడం:

త్వరగా నిద్రపోవడం:

ఆయుర్వేదం ప్రకారం, బాడీ నేచురల్ క్లెన్సింగ్ సైకిల్ సమయం రాత్రి 10 నుండి 2am. కాబట్టి, రెగ్యులర్ గా ఒకే సమయానికి పడుకోవడం, తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం.

కుంకుమపువ్వు:

కుంకుమపువ్వు:

మైగ్రేన్ తలనొప్పికి మరో ఆయుర్వేదిక్ రెమెడీ కుంకుమపువ్వు. ఒక చిటికెడు కుంకుమపువ్వును ఒక టీస్పూన్ నెయ్యిలో మిక్స్ చేయాలి. ఉదయం కాలీపొట్టతో తినాలి. దీన్ని తీసుకున్న అరగంట వరకూ ఏం తినకూడదు, స్నానం చేయకూడదుజ అరగంట తర్వాత చేయొచ్చు. ఇలా రెండు వారాలు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి నుండి ఎఫెక్టివ్ గా రిలాక్స్ చెందుతారు.

నివారించాల్సినవి :

నివారించాల్సినవి :

రాత్రింబవళ్ళు ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందు, టీవీల ముందు కూర్చోవడం నివారించాలి. మైగ్రేన్ తో బాధపడే వారు, వీటితో పాటు ఎక్కువ సౌండ్స్ కు దూరంగా ఉండాలి. ఫెర్ఫ్యూమ్స్, కెమికల్ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలి.

English summary

Ayurvedic Treatments That Cure Migraine Headache

Find out about some of the best Ayurvedic remedies and measures for migraine-related headache and get rid of its pain with the help of this article.
Story first published: Monday, January 9, 2017, 17:01 [IST]
Desktop Bottom Promotion