వ్యాధుల నివారణకు చన్నీటి కంటే మించిన శుద్ధ ఔషదం మరొకటి లేదు

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

అనేకరకములైన వ్యాధులను నయం చేయడానికి నీరు అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఔషధాల పనితీరుకంటే మెరుగుగా త్రాగు నీరు పనిచేస్తుంది.

మన శరీరంలో ఎక్కువ శాతం నీరుంటుంది. అందువల్ల, మన శరీరం యొక్క సరైన పనితీరుకు నీరనేది ఎంతో అవసరమైనది.

శరీరంలోని సెల్స్ ని ఆరోగ్యకరంగా ఉంచేందుకు నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో నీటిద్వారానే శరీరంనుంచి టాక్సిన్లు బయటకు పోతాయి.

నీరనేది మీ చర్మం ఆరోగ్యకరంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అంతే కాదు, మీకు శక్తినివ్వడానికి, జీవక్రియను సరి చేసేందుకు, కీళ్ల వద్ద అవసరమైన ద్రవం ఉంచడానికి, జీర్ణశక్తిని మద్దతునివ్వడానికి అలాగే మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి నీరు ఉపయోగపడుతుంది.

త్రాగునీటి వల్ల ఆరోగ్యప్రయోజనాల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం సాధారణంగా మరిగించిన నీటి గురించి మాట్లాడుకుంటాం. అంటురోగాలు కలిగించే సూక్ష్మక్రిములను నీళ్ల నుంచి తొలగించడానికి నీళ్లను మరిగిస్తాము. అయితే, చల్లటి నీటిలో కూడా కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న విషయం మీకు తెలుసా?

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చల్లటి నీటి నుంచి కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి మీరు చల్లటి నీటిని త్రాగనవసరం లేదు. చల్లటి నీటిని నేరుగా అప్లై చేసుకోవడం ద్వారా అలాగే చల్లటి నీటితో స్నానాన్ని చేయడం ద్వారా ఈ ఆరోగ్య ప్రయోజనాలను మీరు పొందవచ్చు.

చల్లటి నీటితో ఉదయాన్నే మీరు స్నానం చేసినట్టయితే ఆ రోజంతా మీరు తాజా అనుభూతిని పొందుతారు. చల్లటి నీరు అనగానే గడ్డకట్టించేంత చల్లటి నీరు కాదు.

వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగించడానికి చల్లటి నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే, రక్త ప్రసరణని తగ్గించడం ద్వారా, డిటాక్సికేషన్ ప్రక్రియకు మద్దతు తెలపడం ద్వారా అలాగే జీర్ణ వ్యవస్థకు మద్దతునివ్వడం ద్వారా అనేక రకాల వ్యాధులను చల్లటి నీరు నయం చేస్తుంది.

ఇక్కడ, చల్లటి నీటి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.....

1. కీళ్లవాతం:

1. కీళ్లవాతం:

యూరిక్ యాసిడ్ ఎక్కవగా పేరుకుపోతే కీళ్లవాతం సమస్య వేధిస్తుంది. ఈ సమస్యకి గురయితే రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టతరంగా మారుతుంది. అందువలన, ఎక్కవగా చల్లటి నీటిని సేవించడం వలన శరీరం నుంచి యూరిక్ యాసిడ్ ని సమర్థవంతంగా తొలగించుకోవచ్చు. తద్వారా, కీళ్లవాతం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

2. నొప్పిని తగ్గిస్తుంది:

2. నొప్పిని తగ్గిస్తుంది:

చల్లటి నీటి ద్వారా నొప్పిని తగ్గించుకోవచ్చు. నొప్పిగా ఉన్న ప్రదేశంలో ఏదైనా మెత్తటి వస్త్రం ద్వారా చల్లటి నీటిని అప్లై చేయాలి. లేదంటే, నేరుగానైనా సరే చల్లటి నీటిని నొప్పిగానున్న ప్రదేశంలో జల్లితే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. కండరాలకు రక్త ప్రసరణను తగ్గించడం ద్వారా నొప్పిని తగ్గించడంలో చల్లటి నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది.

3. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది

3. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది

పురుషులలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచే గుణం చల్లటి వాతావరణానికి గలదు. అయితే, వృత్తిపరమైన అవసరాల వలన ఎక్కువ సేపు కూర్చోవడం, ఎక్కువ దూరం డ్రైవ్ చేయడం వంటి వాటివల్ల శరీరం వేడెక్కిపోతుంది. అందువలన, చల్లటి నీరు కలిగిన కంటైనర్ లో కూర్చోవడం వలన తిరిగి ఉత్సాహాన్ని పెంపొందించుకోవచ్చు.

4. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్

4. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్

చిన్నపాటి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ని కాస్త నీటిని తాగడం ద్వారా తగ్గించుకోవచ్చు. నీటిని సమృద్ధిగా త్రాగడం వలన బాక్టీరియా బయటకు పోతుంది. ఎంత తరచుగా మీరు మీ బ్లాడర్ ను నింపి మూత్ర విసర్జనకు వెళతారో అంత త్వరగా మీకు నయమవుతుంది.

5. కిడ్నీ స్టోన్స్

5. కిడ్నీ స్టోన్స్

అనేక కారణాల వలన కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి. అయితే, నీరుని తీసుకోవడమనేది వీటిని నయం చేయడానికి అలాగే వీటిని రాకుండా కాపాడుకోవడానికి ఉపయోగపడే శక్తివంతమైన చికిత్స. తరచూ చల్లటి నీటిని త్రాగుతూ ఉండండి.

6. కంటి సంరక్షణ:

6. కంటి సంరక్షణ:

చల్లటి నీటితో కళ్ళను శుభ్రంచేసుకోమని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే మీ కళ్ళు రిలాక్స్ అవడంతో పాటు కళ్ళకు మంటను కలిగించే దుమ్మూ ధూళీ తొలగిపోతాయి. చిన్నపాటి కళ్ళ మంటలకు చల్లటి నీరే సరైన మందు.

7. అసిడిటీ:

7. అసిడిటీ:

జీర్ణవ్యవస్థను శాంతింపచేయడానికి చల్లటి నీరు తోడ్పడుతుంది. హార్ట్ బర్న్ తో పాటు అనేక రకములైన అసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి చల్లటి నీరు ఉపయోగపడుతుంది. నిద్రలేవగానే ఒక గ్లాసుడు చల్లటి నీటిని త్రాగితే మీకు అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది.

8. పొడిచర్మాన్ని నివారిస్తుంది

8. పొడిచర్మాన్ని నివారిస్తుంది

వేడి నీటి వల్లే పొడిచర్మం సమస్య వేధిస్తుంది. సరైన సమయంలో ఈ సమస్యను పరిష్కరించకపోతే, ఈ బ్యూటీ ఇష్యూ కాస్తా ఆరోగ్య సమస్యగా మారుతుంది. చల్లటి నీటితో స్నానం చేస్తే ఈ సమస్య నుంచి అలాగే దానితో అనుసంధానమైన మరికొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

English summary

Cold water benefits | Benefits of drinking cold water | Is cold water bad for health

Drinking water is important to not just keep you hydrated, but it helps in keeping off many ailments. Water helps to remove the toxins from the body and helps lubricate the joints as well. Preventing urinary tract infection, kidney stones and acidity are a few of the other benefits of drinking cold water.
Subscribe Newsletter