Latest Updates
-
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ
కంటి చూపు తగ్గుతోంది? అయితే ఇవి ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి..!
కంటి చూపును ఎలా మెరుగుపరచుకోవాలి. ముఖ్యంగా వయస్సయ్యే కొద్ది కంటి సమస్యలు అధికం అవుతాయి. కంటి చూపును మెరుగుపరుచుకోవడం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. కంటి చూపు కోల్పోకుండా,
కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం కూర్చోవడం, ఎక్కువ సేపు టెలివిజన్స్ కు అతుక్కుపోవడం వంటి అలవాట్ల వల్ల కళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. కళ్ళ సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల మొదటికే మోసం వస్తుంది. కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉండి. ఇలాంటి పరిస్థితితో కంటి చూపును మెరుగుపరుచుకోవడం ఎలా..?
కంటి చూపును ఎలా మెరుగుపరచుకోవాలి. ముఖ్యంగా వయస్సయ్యే కొద్ది కంటి సమస్యలు అధికం అవుతాయి. కంటి చూపును మెరుగుపరుచుకోవడం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. కంటి చూపు కోల్పోకుండా, మెరుగైన కంటి చూపును అందించే కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి .

మన శరీర అవయవాల్లో కళ్ళు కూడా అత్యంత ముఖ్యమైనవి. బాడీకి ఎలా వ్యాయామం అవసరం అవుతుందో, అదే విధంగా కళ్ళకు కూడా రెగ్యులర్ వ్యాయామం అవసరం. కంప్యూటర్ల ముందు మరియు టెలివజన్ చేసేటప్పుడు కంటి చూపు ఒకే వైపు రిస్ట్రిక్ చేయబడి ఉంటుంది. ఇలా చేయడం వల్ల కళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుంది. కళ్ళ నరాల మీద స్ట్రెస్ పెరుగుతుంది. కళ్ళలో నేచురల్ మాయిశ్చరైజర్ ను కోల్పోతారు. కళ్ళు డ్రైగా మారుతాయి. క్రమంగా కళ్ళు దురదగా అనిపిస్తాయి. కంటి చూపు మందగించడానికి ఒది ఒక మొదట లక్షణం,
కాబట్టి, తాత్కాలికంగా కానీ, దీర్ఘకాలంలో కానీ కంటి చూపు కోల్పోకుండా బెటర్ ఐసైట్ ఉండాలంటే , కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఇవి మెరుగైన కంటి చూపును అందివ్వడానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

ఆమ్లా జ్యూస్ :
ఉసిరికాయ జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి లు అధికంగా ఉన్నాయి. ఆమ్లా జ్యూస్ ను రోజుకు రెండు సార్లు తాగడం వల్ల కంటి చూపు మెరుగ్గా ఉంటుంది.

రోజ్ పెటల్ జ్యూస్ :
ఫ్రెష్ గా ఉన్న కొన్ని గులాబీ రేకులను తీసుకుని, జ్యూస్ తియ్యాలి. గులాబీ రేకులను మెత్తగా పేస్ట్ చేసి ఎక్స్ టర్నల్ గా మరియు ఇంటర్నల్ గా అప్లై చేయాలి. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.

పెప్పర్ పౌడర్ మరియు తేనె:
కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ లో కొద్దిగా తేనె మిక్స్ చేయాలి. దీన్ని రోజుకొకసారి తింటే చాలు మంచి ఫలితం ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో మెరుగ్గా ఉంటుంది.

మస్టర్డ్ ఆయిల్ మసాజ్ :
కొన్ని చుక్కఆవనూనె పాదాలకు అప్లై చేసి మసాజ్ చేసి పడుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా కంటి చూపు మెరుగుపరుడుతుంది.అలాగే రాత్రి నిద్రించే ముందు ఆవనూనెను కళ్ళ క్రింద కూడా అప్లై చేసి మసాజ్ చేసుకోవచ్చు,.ఇది మంచి కంటి చూపును మెరుగుపరుస్తుంది.

సోంపు ఆకులు:
సోంపు ఆకుల్లో కొన్ని వాటర్ మిక్స్ చేసి, ఆ నీళ్ళు సంగం అయ్యే వరకూ మరిగించాలి, తర్వాత క్రిందికి దింపుకొని, చల్లారిన తర్వాత ఆ నీటితో అప్పుడప్పుడు కళ్ళను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది.

యాలకలు:
రెండు మూడు యాలకలను తీసుకుని, మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పౌడర్ కు కొద్దిగా తేనె మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గోరువెచ్చని పాలతో మిక్స్ చేసి, నిద్రించడానికి ముందు తాగితే కంటి చూపు మెరుగ్గా ఉంటుంది.

ట్రిఫలం:
ఒక టీస్పూన్ ట్రిఫల పౌడర్ తీసుకోవాలి. ఒక టీస్పూన్ తేనెతో మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రించడానికి ముందు తాగాలి. ఇలా చేయడం వల్ల కళ్ళ మీద ఒత్తిడి తగ్గిస్తుంది. మంచి కంటి చూపును మెరుగుపరుస్తుంది.



Click it and Unblock the Notifications