Latest Updates
-
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట!
మలబద్దక సమస్యకు కామన్ రీజన్స్ మరియు నివారణ మార్గాలు!
మలబద్దక సమస్య. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో ఈ సమస్యను ఎదుర్కోని వారుండరు. అసలు ఈ మలబద్దక సమస్య ఎందుకు వస్తుంది? వారంలో కనీసం మూడు సార్లయినా పేగుల్లో కదలికలు లేకపోతే దాన్ని మలబద్ధకం అని అనవచ్చు. మలబద్ధకం ఏర్పడినపుడు మలం చాలా గట్టిగా తయారవుతుంది. విసర్జనకు చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని సార్లు మలవిసర్జన సమయంలో నొప్పిగా కూడా ఉంటుంది. మలబద్ధకంగా ఉన్న వారికి కడుపు ఉబ్బరంగా ఉన్న భావన కలుగుతుంది. పెద్దపేగు ఎక్కువ నీటిని పీల్చుకోవడం లేదా పెద్దపేగు కండరాలలో కదలికలు తగ్గిపోవడం వల్ల పేగులో మలం కదలికలు చాలా నెమ్మదిగా కదులుతుంది అందువల్ల మలబద్దకం ఏర్పడుతుంది. ఫలితంగా మలం గట్టిగా తయారవుతుంది.
బౌల్ మూమెంట్ వ్యక్తికి వ్యక్తి తేడా ఉంటుంది. కొంత మంది రోజుకు రెండు మూడు సార్లు టాయిలెంట్ కు వెళితే, మరికొంత మంది మాత్రం రెండు, మూడు రోజులకొకసారి వెళ్లే వారు కూడా ఉంటారు.
మూడు రోజుల కంటే ఎక్కువ మలవిసర్జన చేయకపోతే, అది మలబద్దక సమస్యకు దారితీస్తుంది. స్టూల్ మరింత గట్టి పడి, విసర్జనకు కష్టం అవుతుంది. మలబద్దక సమస్య అంతర్గతంగా ప్రేగుకు సంబంధించిన సమస్య. ఈ సమస్యను ఎప్పటికప్పుడు నివారించుకోకపోతే ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఈ ఆర్టికల్ ద్వారా మలబద్దకానికి కారణాలేంటి, ఎలా నివారించుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం...

1 నీళ్ళు తాగకపోవడం వల్ల :
శరీరానికి సరిపడా నీళ్ళు అందకపోతే డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. దాంతో మలబద్దక సమస్య వస్తుంది, మరి అయితే దీనికి ఏం చేయాలి. అయితే ఇది చదవాల్సిందే! మనం తిన్న ఆహారం చిన్న ప్రేగుల నుండి పెద్ద ప్రేగుల్లోకి పోతుంది. ఆ సమయంలో శరీరంలో సరిపడా నీళ్ళు లేకపోవడం వల్ల స్టూల్ నుండి నీటిని గ్రహించడం వల్ల స్టూల్ హార్డ్ గా మారుతుంది. దాంతో స్టూల్ పాస్ చేయడానికి కష్టం అవుతుంది.

2. ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఆహారాలను తినడం వల్ల
ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల కూడా మలబద్దకం వస్తుంది. అదెలా అంటే ! ఫ్యాట్ ఫుడ్స్ జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేట్స్ గ్యాస్ట్రోఇన్ ట్రెన్సినల్ ట్రాక్ లో చివరగా జీర్ణం అవుతాయి. ఫలితంగా ఆహారం ఆలస్యంగా ప్రేగులకు చేరడం వల్ల మలబద్ధక సమస్యకు కారణమవుతుంది.

3. ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల :
ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వారిలో కూడా మలబద్దక సమస్య ఉంటుంది. ఆల్కహాల్ డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది. గ్లూకోజ్ మెటబాలిజం మీద ప్రభావం చూపుతుంది. ఫలితంగా ఇది సెంట్రల్ మరియు ఫెరిఫెరల్ నాడీవ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. ఇది క్రోనిక్ కాన్స్టిపేషన్ కు దారితీస్తుంది. మరియు ఇది పొటాషియం మరియు సోడియం లెవల్స్ ను తగ్గిస్తుంది. దాంతో మలబద్దక సమస్య ఏర్పడుతుంది

4. ఎక్సెస్ కెఫిన్ తీసుకోవడం:
కెఫిన్ ఎక్కువ తీసుకునే వారింలో కూడా మలబద్దక సమస్య ఉంటుంది. ఇది డ్యూరియాటిక్ లక్షణాలు ఉండటం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. యూరిన్ ఎక్కువ పోవాల్సి వస్తుంది. ఇంకా పెద్ద ప్రేగులు నీరు ఎక్కువగా గ్రహించడం వల్ల స్టూల్లో తేమ తగ్గి, గట్టిగా మారుతుంది. దాంతో స్టూల్ పాస్ చేయడానికి చాలా కష్టం అవుతుంది.

5. మందులు:
కొన్ని మందులు కూడా మలబద్దకానికి కారణం అవుతాయి. యాంటాసిడ్స్, పెయిన్ రిలీఫ్, యాంటీడిప్రసెంట్ మరియు హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గించే మందులు, హైకొలెస్ట్రాల్ తగ్గించే మందులు, కార్డియో వాస్క్యులర్ మందులు మలబద్దకానికి కారణం అవుతాయి. ఈ మందులు ఎక్కువగా డ్యూరియాటిక్ గుణాలు కలిగి ఉంటాయి. ఇవి తీవ్రమైన డీహైడ్రేషన్ కు దారితీస్తుంది. బౌల్ మూమెంట్ హార్డ్ గా మారుతుంది.
మరి ఇప్పుడు మలబద్దక సమస్య నుండి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.

6. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి:
పీచుపదార్థాలుఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు, అరటిపండ్లు, జామకా మంచివి. పీచు పదార్థాలు అధికంగా ఉన్న అరటి పండ్లు, పైనాపిల్, బత్తాయి, సపోట పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న కూరగాయలు, ఆకుకూరలు నిత్యం తీసుకోవడం వలన మలవిసర్జన త్వరలోగా సాఫీగా జరుగుతుంది. ముఖ్యం మెంతి కూర రోజూ తినాలి.

7. ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి:
రోజూ నిద్రలేచినప్పటి నుండి పడుకునే వారకు కొంత సమయం గ్యాప్ లో నీళ్ళు, ఇతర పానియాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్దక సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. మలబద్దకం మరియు డీహైడ్రేషన్ రెండూ ఇంటర్ లిక్ కలిగి ఉంటాయి. కాబట్టి, ఎక్కువగా నీళ్ళు తీసుకోవాలి. కోలన్ స్టూల్ నుండి తక్కువ నీటిని గ్రహిస్తుంది, ఫలితంగా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు

8. వ్యాయామం:
వ్యాయామం వల్ల కూడా మలబద్దక సమస్యను నివారించుకోవచ్చు. 10 నుండి 15 నిముషాలు బ్రిక్స్ వాక్ చేయడం వల్ల రోజులో అప్పుడప్పుడు చిన్న పాటి నడక వల్ల జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. బౌల్ మూమెంట్ సులభం అవుతుంది. మలబద్దక సమస్యలను నివారిస్తుంది.

9. ఎక్కువ కూరగాయలు తినాలి
రెగ్యులర్ డైట్ లో ఎక్కువ వెజిటేబుల్స్ చేర్చుకోవడం వల్ల మలబద్దక సమస్యను నివారించుకోవచ్చు. ఎలా అంటే ? వెజిటేబుల్స్ లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బౌల్ మూమెంట్ ను సులభం చేస్తుంది. ముఖ్యంగా బీన్స్, పచ్చిబఠానీలు, లెంటిల్స్, మొదలగునవి ఎక్కువగా తీసుకోవడం వల్ల గౌట్ హెల్త్ ను కూడా మెరుగుపరుస్తుంది.



Click it and Unblock the Notifications