ఉల్లిపొట్టు హైపర్ టెన్షన్, అధికబరువు తగ్గిస్తుందన్న విషయం మీకు తెలుసా?

By: Mallikarjuna
Subscribe to Boldsky

సాధారణంగా మనం రోజూ ఏవో ఒక పండ్లను తింటుంటాము. పండ్లల్లో, కూరగాయల్లో ఆరోగ్యానికి సంబంధించిన అనేక లాభాల వల్లే మనం వాటిని రోజూ తినడం జరుగుతుంది . కొన్ని సార్లు పండ్లను వాటి తొక్క తీసి పారేసి, లోపలి పదార్థాన్ని మాత్రం తినాల్సి వస్తుంది. కానీ ఆ తొక్కల్లో కూడా కొన్ని రకాల ఉపయోగాలుంటాయన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

ఉదాహరణకు అరటి తొక్క చర్మంను కాంతివంతంగా మార్చితే, ఆపిల్ తొక్క పొట్టలోని క్రిములను నాశనం చేసి, పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఉల్లిపాయలోని ఆరోగ్య ప్రయోజనాలు మనందరికి తెలుసు కదా?

శరీర ఆరోగ్య శుద్ధీకరణలో ఉల్లిపాయ చేసే మేలు..!

ఉల్లిపాయలో మెగ్నీషియం, పొటాషియం విటమిన్ బి1, బి6, సి, ఫైబర్ మొదలైనవి ఉంటాయి. వీటితో పాటు కొన్ని పవర్ ఫుల్ న్యూట్రీషియన్స్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వ్యాధినిరోధకత పెంచుతుంది, బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది, వాపు తగ్గిస్తుంది, సెక్స్ డ్రైవ్ పెంచుతుంది, కామన్ కోల్డ్ కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది.

health benefits of onion

ఇంకా అనేక ఆయుర్వేద చికిత్సల్లో కూడా ఉల్లిపాయను ఉపయోగిస్తుంటారు. రీసెంట్ గా కొన్ని పరిశోదనల ప్రకారం ఉల్లిపాయ పొట్టులో కూడా ఔషధగుణాలు ఉన్నట్లు కనుగొన్నారు.

హైబ్లడ్ ప్రెజర్ లేదా హైపర్ టెన్షన్ ఎంత ప్రమాదకరమో మనందరికి తెలుసు. హైబ్లడ్ ప్రెజర్ చాలా వరకూ గుండెకు సంబంధించినది.

health benefits of onion

అదే విధంగా ఓబేసిటి శరీరంలో ఎక్సెస్ ఫ్యాట్ వల్ల అనేక అనారోగ్యాలను ఎదుర్కొవల్సి వస్తుంది. హైకొలెస్ట్రాల్, జాయింట్ పెయిన్, అజీర్తి, హార్ట్ ఎలిమెంట్స్ వంటి ప్రమాదకర సమస్యలకు దారితీస్తుంది.

ఉల్లిపాయ పొట్టుతో, హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు మరియు ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు.

ఉల్లి, కాకరకాయ రసంలో దాగున్న అద్భుత ప్రయోజనాలు..!

కావల్సిన పదార్థాలు

ఉల్లిపాయ పొట్టు: 1 ఉల్లిపాయ

నీళ్లు: 2 కప్పులు

health benefits of onion

ఉల్లిపాయ పొట్టు హైపర్ టెన్షన్ మరియు ఓబేసిటిని ఎఫెక్టివ్ గా నివారిస్తుంది, దీన్ని రోజూ ఉపయోగిస్తే మంచిది.

ఈ రెమెడీతో పాటు, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే హైపర్ టెన్షన్, ఓబేసిటి తగ్గించుకోవచ్చు.రోజూ ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటూ , రోజూ వ్యాయామం చేస్తుంటే, ఈ హోం రెమెడీ మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఉల్లిపొట్టులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు క్యుర్సిటిన్ అనే ఎంజైమ్ ధమనులను రక్తాన్ని వడపోయడంలో , రక్తప్రసరణ మెరుగ్గా ఉంచడంతో హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గించుకోవచ్చు. ఈ రెండు న్యూట్రీషియన్స్ జీవక్రియల రేటును పెంచుతాయి.దాంతో శరీరంలో కొవ్వు తగ్గి, ఊబకాయన్ని తగ్గిస్తుంది.

health benefits of onion

తయారుచేయు విధానం:

రెండు కప్పుల నీళ్ళలో ఉల్లిపాయ పొట్టు వేసి నానబెట్టాలి.

ఈ మిశ్రమాన్ని 10-15 నిముషాలు ఉడికించాలి.

తర్వాత నీళ్లను వడగట్టుకుని తాగాలి. రోజూ రాత్రి భోజనం చేసిన తర్వాత తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

హెచ్చరిక: గర్భిణిలు, పాలిచ్చే తల్లులు ఈ రెమెడీకి దూరంగా ఉండాలి.

English summary

Did You Know That Onion Peel Can Treat Hypertension & Obesity?

Onion peels can treat hypertension and obesity very well, when this remedy is consumed!
Subscribe Newsletter