For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దంతాల మీద తెల్లని మచ్చలను నివారించే నేచురల్ రెమెడీస్..!

మీ దంతాల మీద తెల్లని మచ్చలు ఉంటే అసహ్యంగా కనపడటమే కాకుండా మీ ప్రదర్శన మీద కూడా ప్రభావం చూపుతుంది. ఇది మీ దంతాలు ఆరోగ్యంగా లేవని చెప్పటానికి ఒక సంకేతం.

By Lekhaka
|

మీ దంతాల మీద తెల్లని మచ్చలు ఉంటే అసహ్యంగా కనపడటమే కాకుండా మీ ప్రదర్శన మీద కూడా ప్రభావం చూపుతుంది. ఇది మీ దంతాలు ఆరోగ్యంగా లేవని చెప్పటానికి ఒక సంకేతం.

మీ పళ్ళను జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ మీ పళ్ళ మీద తెల్లని మచ్చలు ఉంటే కనుక ఈ సహజమైన పద్దతుల ద్వారా ఈ సమస్య నుండి బయట పడవచ్చు.

దంతాల మీద తెల్లని మచ్చలు లేకుండా ఉండాలంటే నోటి పరిశుభ్రత అత్యంత ఆవశ్యకం.ఈ పరిస్థితి నుండి బయట పడాలంటే మొదట దానికి గల కారణాన్ని తెలుసుకోవాలి.

Do You Have White Spots On Your Teeth? These Natural Remedies Help Get Rid Of It

కాబట్టి నోటి పరిశుభ్రత అనేది పళ్ళ మీద తెల్లని మచ్చలకు కారణమవుతుంది? ఫ్లోరైడ్లు ఎక్కువ మొత్తంలో ఉండటం కాల్షియం లేకపోవడం అనేవి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అందువలన కాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోవటం ద్వారా పళ్ళ మీద మచ్చలను తొలగించుకోవచ్చు.

పళ్ళ మీద తెల్లని మచ్చలను వదిలించుకోవడానికి అనేక రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే సహజమైన ఇంటి నివారణలను ఉపయోగిస్తే ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇక్కడ పళ్ళ మీద తెల్లని మచ్చలను వదిలించుకోవడానికి సహజమైన మార్గాలు ఉన్నాయి. వాటి మీద ఒక లుక్ వేద్దాం.

1. ధూమపానం మానేయాలి

1. ధూమపానం మానేయాలి

పళ్ళ మీద తెల్లని మచ్చలు రావటానికి ధూమపానం ప్రధాన కారణం అని చెప్పవచ్చు. సిగరెట్ లో ఉండే నికోటిన్ కారణంగా ఈ సమస్య వస్తుంది. తెల్లని మచ్చలను వదిలించుకోవాలంటే ధూమపానంను నివారించాలి.

2. తులసి

2. తులసి

పళ్ళ మీద తెల్లని మచ్చలను వదిలించుకోవడానికి తులసి అనేది ఒక పురాతనమైన పద్దతి. కొన్ని తులసి ఆకులను తీసుకోని ప్రభావిత ప్రాంతంలో రుద్దితే సమస్య నుండి బయట పడటానికి సహాయపడుతుంది.

3. బేకింగ్ సోడా

3. బేకింగ్ సోడా

పళ్ళ మీద తెల్లని మచ్చలను వదిలించటానికి బేకింగ్ సోడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.కొంచెం బేకింగ్ సోడాను తీసుకోని పళ్ళ మీద రుద్దాలి. ఈ విధంగా రోజుకి ఒకసారి చేయాలి.

4. ఆపిల్

4. ఆపిల్

ప్రతి రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్ళవలసిన అవసరం లేదనే సామెత ఉన్నది. అలాగే తెల్లని మచ్చలను కూడా తగ్గిస్తుంది. ఆపిల్ లో ఇనుము సమృద్ధిగా ఉండుట వలన ప్రతి రోజు ఒక ఆపిల్ తినాలి.

5. డ్రై ఫ్రూట్స్

5. డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్ లో కాల్షియం, ఇనుము మరియు ఇతర అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. బాదాం వంటి వాటిని రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి ఉదయమే తినాలి. ఇది త్వరగా తెల్లని మచ్చలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

6. సోడా మానేయాలి

6. సోడా మానేయాలి

సోడాలో ఫ్రూక్టోజ్ మరియు ఫ్లోరైడ్లు అధిక మొత్తంలో ఉంటాయి. సోడా త్రాగటం వలన ఖనిజ లవణాలు మరియు కాల్షియం కోల్పోవటానికి దారి తీస్తుంది. అందువలన ఖచ్చితంగా సోడా త్రాగటాన్ని నివారించాలి.

English summary

Do You Have White Spots On Your Teeth? These Natural Remedies Help Get Rid Of It

White spots on your teeth not just affects your appearance and makes you look ugly but, at the same time, is a sign that your teeth are unhealthy.
Story first published: Wednesday, January 4, 2017, 8:03 [IST]
Desktop Bottom Promotion