Latest Updates
-
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే..
సంతాన లోపం కలిగించే యూటిరైన్ ఫైబ్రాయిడ్స్ నివారించే 10 పవర్ ఫుల్ ఫుడ్స్ ..!!
యుటిరైన్ ఫైబ్రాయిడ్స్ పరిమాణం ఎప్పుడైతే పెరుగుతుందో లేదా ఎక్కువ కణితులు ఏర్పడటం వల్ల సంతాన లేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.కాబట్టి, పవర్ ఫుల్ పుడ్స్ తో ఫైబ్రాయిడ్స్ నివారించుకోవచ్చు..
గర్భాశయంలో ఏర్పడే కణితులను యుటిరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి సాధారణంగా స్త్రీలలో 30 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు వారిలో గమనించవచ్చు. 20-25 శాతం పిల్లలు కనే వయసులో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
యూటిరైన్ ఫైబ్రాయిడ్స్ సాధారణంగా ఒకటి గాని లేదా చిన్నచిన్న కణితులు గుంపులుగానను ఏర్పడవచ్చు. వీటి పరిమాణం మిల్లీమీటరు నుంచి మొదలుకొని కొన్ని సెంటీమీటర్ల పరిమాణం వరకు పెరుగుతాయి. ఉదాహరణకి ఒక పెద్ద ఫైబ్రాయిడ్, 6 -7 నెలల గర్భం మాదిరిగా ఉంటుంది.

యూటిరైన్ ఫైబ్రాయిడ్ కు కారణాలు :చిన్న వయసులోనే నెలసరులు ప్రారంభం కావడం హార్మోన్ల అసమతుల్యత ముఖ్యంగా ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాన్ హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకే మెనోపాజ్ మొదలైన మహిళల్లో హార్మోన్లు తగ్గడం వల్ల ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం తక్కువ. స్థూలకాయం, సంతానలేమి, కుటుంబ చరిత్ర వంటి కారణాల వల్ల గర్భాశయంలో కణితులు ఏర్పడే అవకాశం ఉంది.
యూటిరైన్ ఫైబ్రాయిడ్ లక్షణాలు: యుటిరైన్ ఫైబ్రాయిడ్స్ సాధారణంగా స్త్రీలలో ఎటువంటి సమస్య కలుగజేయదు. ఎప్పుడైతే కణితులు పరిమాణం పెరిగినపుడు లేదా కణితులు ఏర్పడిన భాగాన్ని బట్టి పెడంకలేటెడ్ ఫైబ్రాయిడ్స్ ఉండే వారిలో కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. అధిక రక్తస్రావం, ఎక్కువ రోజుల పాటు కొనసాగడం. తీవ్రమైన కడుపునొప్పి, నడుము నొప్పి, కాళ్లలో నొప్పి వంటి లక్షణాలు గమనించవచ్చు. ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయం మీద ఒత్తిడి పెరిగి తరచూ మూత్ర విసర్జన చెయ్యాల్సి రావచ్చు. ఫైబ్రాయిడ్స్ మీద ఒత్తిడి పెరగడం వల్ల మలబద్ధకం కడుపుబ్బరం వంటి లక్షణాలు చూడవచ్చు. అధిక రక్తం స్రావం జరగడం వల్ల రక్తహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
సమస్యలు: యుటిరైన్ ఫైబ్రాయిడ్స్ పరిమాణం ఎప్పుడైతే పెరుగుతుందో లేదా ఎక్కువ కణితులు ఏర్పడటం వల్ల సంతాన లేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
కణితులు గర్భాశయం అంచులో ఉంటే ఫెలోపియల్ ట్యూబ్స్ పైన ఒత్తిడి పెరగడం వల్ల కానీ అండం ప్రయాణించే దిశలో అడ్డంకులు ఏర్పడడం వల్ల కానీ సంతాన లేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
గర్భిణి స్త్రీలలో పిండంతో సమానంగా ఫైబ్రాయిడ్ పెరగడం వల్ల పిండానికి సరైన పోషణ అందక గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అనీమియాకు దారితీస్తుంది. కాబట్టి, ఫైబ్రాయిడ్స్ చిన్నగా ఉన్నట్లు గుర్తించిన వెంటనే తగిన చికిత్స తీసుకోవడం మంచిది. అలాగే ప్రారంభ దశలో కొన్ని ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఫైబ్రాయిడ్స్ ను ఎఫెక్టివ్ గా నివారించుకోవచ్చు..

ఆమ్లా:
ఉసిరికాయలో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వల్ల యూటిరైన్ ఫైబ్రాయిడ్ నివారించడంలో బెస్ట్ నేచురల్ రెమెడీ. ఒక టీస్పూన్ ఆమ్లా పౌడర్ తీసుకుని, అందులో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి, ప్రతి రోజూ ఉదయం పరగడుపున తినాలి. కొన్ని రోజులు క్రమం తప్పకుండా తింటుంటే మంచి ఫలితం ఉంటుంది.

లోఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ :
లోఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ లో పాలు, పెరుగు వంటి క్యాల్షియం రిచ్ ఫుడ్స్ ను చేర్చుకోవాలి. క్యాల్షియం యూటిరైన్ ఫైబ్రాయిడ్ ట్యూమర్ సెల్స్ గ్రోత్ ను నివారిస్తుంది.

ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ :
ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. న్యూట్రీషియన్స్ , నేచురల్ యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి . ఇంకా ఆహారాలు తినాలన్న కోరికను తగ్గించడం వల్ల ఓవర్ వెయిట్ పెరగకుండా నివారించుకోవచ్చు . ఓవర్ వెయిట్ వల్ల ఫైబ్రాయిడ్ కు సంబందం కలిగి ఉంటుంది.

వెల్లుల్లి:
పురాతన కాలం నుండి ఒక ఔషధంగా వెల్లుల్లిని ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే వీటిలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి, రెండు, మూడు వెల్లుల్లి రెబ్బలను రెగ్యులర్ గా తినడం వల్ల గర్భాశయంలో యూటిరైన్ ఫైబ్రాయిడ్స్ , ఇతర ట్యూమర్స్ పెరగడకుండా నివారిస్తాయి.

తృణధాన్యాలు:
తృణధాన్యాలు యూట్రస్ ను హెల్తీగా ఉంచుతుంది. యుటేరియన్ ఫైబ్రాయిడ్ ను నివారిస్తాయి.

బీన్స్ :
బీన్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. గ్లిజమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇవి ఫైబ్రాయిడ్స్ ను ష్రింక్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. కాబట్టి, వీటిని డైలీ డైట్ లో చేర్చుకోవడం మంచిది.

సోయా:
సోయా ప్రొడక్ట్స్ లో ఫైటో ఈస్ట్రోజెన్స్ అధికంగా ఉంటాయి. ఈ నేచురల్ ఈస్ట్రోజెన్ ఫైబ్రాయిడ్స్ ను ఏర్పడకుండా నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

గ్రీన్ టీ:
గ్రీన్ టీలో ఎపిగాక్టిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది ఫైబ్రాయిడ్ సెల్స్ పెరగకుండా నివారిస్తుంది.

ఫ్లాక్స్ సీడ్స్ :
ఫ్లాక్స్ సీడ్స్ లో ఫైబర్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి యూటిరిన్ ఫైబ్రాయిడ్స్ ను ష్రింక్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్ :
యాపిల్ సైడర్ వెనిగర్ ను ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి ఉదయం పరగడపున తీసుకోవడం వల్ల ఫైబ్రాయిడ్స్ ష్రింక్ అవుతాయి. ఇలా రోజుకు ఒకసారి తాగితే చాలు ఫైబ్రాయిడ్స్ పూర్తిగా నివారించబడుతాయి.



Click it and Unblock the Notifications











