ప్రేగు క్యాన్సర్ (కొలెరెక్టల్ క్యాన్సర్)నివారించే హెల్తీ లైఫ్ స్టైల్

By: Mallikarjuna
Subscribe to Boldsky

ఈ మద్యజరిపిన ఒక పరిశోధనలో రోజువారి ఆహారాల్లో పండ్లు, చేపలు చేర్చుకోవడం, శీతల పానీయాలు వాడకంను తగ్గించడం వల్ల కొలెరెక్టల్ క్యాన్సర్ ను ప్రమాదాన్ని 86శాతం తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఎర్రని మాంసాహారం, ఆల్కహాల్ మరియు ఎక్కువ క్యాలరీలున్న ఆహారాలను తినడం వల్ల కొలెరెక్టల్ క్యాన్సర్ ప్రేగు పాలిప్స్ లో అభివృద్ధి చెందుతుందని అంటున్నారు.

పొట్టలో క్యాన్సర్(కొలరెక్టల్ క్యాన్సర్) లక్షణాలు గుర్తించడం ఎలా...?

పండ్లు, చేపలు వంటి మెడిటేరియన్ డైట్ తింటూ, రెడ్ మీట్,ఆల్కహాల్, క్యాలరీ ఆహారాలు తీసుకోని వారితో పోల్చినప్పుడు, తీసుకునే వారిలో కొలెరెక్టల్స్ క్యాన్సర్ 30శాతం పెరిగినట్లు గుర్తించినట్లు ఇజ్రాయెల్ లో టెల్-అవివ్ మెడికల్ సెంటర్ నుండి నవోమి ఫ్లిస్ ఇసాకోవ్ చెప్పారు.

Diet Cuts The Risk Of Colorectal Cancer

ఎర్రని మాంసాహారం, ఆల్కహాల్, అధిక క్యాలరీ ఆహారాలకు దూరంగా ఉంటూ, మెడిటేరియన్ డైట్ పండ్లు, చేపలు వంటి ప్రత్యామ్నాయ ఆహారాలు తీసుకోవడం వల్ల 86 శాతం కొలెక్టరెల్ క్యాన్సర్ ప్రమాదం తగ్గినట్లు ఇసాకోవ్ చెప్పారు.

పురుషుల్లో క్యాన్సర్ ఉందని తెలిపే 16 సంకేతాలు

గ్యాస్ట్రోఇంటెస్టినల్ క్యాన్సర్ (ప్రేగు క్యాన్సర్) గురించి, ఇఎస్ఎమ్ఓ 19వ ప్రపంచ కాంగ్రెస్ అధ్యయనం ప్రకారం 40 నుండి 70ఏళ్ళ మద్య ఉన్న808 మందికి స్ర్కీనింగ్ లేదా కొలనోస్కోపి పరీక్షలు చేసినప్పుడు వారు మెడిటేరియన్ డైట్ ను తీసుకుంటున్నట్లు గుర్తించారు.

Diet Cuts The Risk Of Colorectal Cancer

వీరంతా మెడిటేరియన్ డైట్ లో ఎక్కువగా పండ్లు,కూరగాయలు, చిక్కుళ్లు, ఎండుఫలాలు, తృణధాన్యాలు, చేపలు మరియు పౌల్ట్రీల ఎక్కువగా తీసుకున్నట్లు గుర్తించారు.

కోలన్ (పెద్ద ప్రేగు) క్యాన్సర్ లక్షణాలు- కారణాలు

వీటిలో రెండు, మూడు ఆహారాలు ఖచ్చితంగా రోజువారి ఆహారాల్లో చేర్చుకునే వారితో పోల్చితే ఈ ఆహారాలను తినని వారిలో అసమానతలున్నట్లు పరిశోధనల్లో గుర్తించారు.

With Inputs From IANS

English summary

Healthy lifestyle can help you cut colorectal cancer risk

People who smoke cigarettes, exercise less, and follow an unhealthy diet may be at increased risk of colorectal cancer, says a study.
Story first published: Friday, July 7, 2017, 19:00 [IST]
Subscribe Newsletter