వయస్సు ఏమాత్రం కనబడనివ్వని ఒక సింపుల్ హోం రెమెడీ

By: Mallikarjuna
Subscribe to Boldsky

మీ వయస్సు ఎంత అని ఎవరినైనా అడిగితే కరెక్ట్ గా ఎంత మంది చెబుతారు? నూటికి 99శాతం అబద్దమే చెబుతారు. అయితే ఏజ్ ఫ్యాక్ట్స్ గురించి చిన్న పిల్లల దగ్గరు నుండి తెలుసు. చిన్నపిల్లలు అడిగితే మేము పెద్దయాక ఇది చేస్తాము, అది చేస్తాం అని చెబుతుంటారు. అది కూడా ఒకరకంగా పిల్లలకు వయస్సు మీద ఉండే అవగాహననే చెప్పవచ్చు.

వయస్సు అయ్యే కొద్ది శరీరంలో కొన్ని అవయవాలు పనిచేయడం మానేస్తాయి. అలాంటి వాటిలో చర్మం కూడా ఒకటి, చర్మం వయస్సును గుర్తు చేస్తుంది. దీన్ని బట్టి వారికి వయస్సైపోయిందని చెబుతుంటారు. అయితే ఇలాంటి పరిస్థితి ఏ ఒక్కరూ ఇష్టపడరు. అయితే ఇది న్యాచురల్ గా జరిగిపోయే ఒక ప్రక్రియ.

చర్మంలో సన్నని చారలు, చర్మం నిర్జీవంగా మారడం, ముడుతలు, వలయాలను ఏ ఒక్కరూ ఇష్టపడరు. అలాంటి చర్మాన్ని చూడటానికి కూడా ఇష్టపడరు. ఇటువంటి లక్షణాలు చిన్నవయస్సు వారిలో కూడా కనబడుతాయి.

natural anti-ageing drink

చిన్నగా ఉన్పప్పుడు ప్రతి ఒక్కరూ శక్తివంతులు, యవ్వనంలో చాలా అదంగా, ఆకర్షనీయంగా ఉంటారు. అయితే ఏజింగ్ ప్రొసెస్ ను ఏ ఒక్కరూ ఇష్టపడరు. అలాంటి వారు ఏజెంగ్ ప్రొసెస్ ను తగ్గించుకోవడానికి ప్రతి ఒక్క చిట్కాను అనుసరిస్తుంటారు .

చిన్న వయస్సులోనే వృద్ధాప్య లక్షణాలను నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్.!!

మెడికల్ సైన్స్ మరియు టెక్నాలజీ పరంగా బోటాక్స్, ఫేస్ లిప్ట్స్, బ్రెస్ట్ లిప్ట్స్ మొదలగు వాటిని ఈ రోజుల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ పద్ధతులను అనుసరించడం వల్ల అందంగా, ఫ్రెష్ గా ఉన్నట్లు ఫీలవుతుంటారు.

వృద్యాప్య లక్షణాలను దూరం చేయడానికి కొన్ని పద్దతులు చాలా బాధకరమైనవి, ఖరీదైనవి మరియ కొన్ని ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తాయి. దాంతో మీ అందం పర్మెనెంట్ గా దెబ్బతింటుంది. అందువల్ల మీరు ఎక్కువ రోజులు యవ్వనంగా కనబడాలన్నా, ఏజింగ్ ప్రొసస్ ను ఆలస్యం చేయాలన్నా లేద వయస్సును కనబడనివ్వకుండా చేసే కొన్ని న్యాచురల్ రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

natural anti-ageing drink

కావల్సినవి:

ఆకుకూరల జ్యూస్: 1/2గ్లాసు

ఫ్రెష్ బ్లూబెర్రీ జ్యూస్: 1/2 గ్లాసు

నిత్యయవ్వనాన్ని ప్రోత్సహించే 14 యాంటీఏజింగ్ ఫుడ్స్

వృద్దాప్య లక్షణాలను కనబడనివ్వకుండా చేయడంలో ఈ రెమెడీ గ్రేట్ గా పనిచేస్తుంది. పరిశోధనప్రకారం రోజూ వాడటం వల్ల ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

natural anti-ageing drink

ఈ రెమెడీని ఉపయోగించడంతో పాటు రెగ్యులర్ వ్యాయమం, సరైన ఆహార నియమాలు పాటించాలి. ఇవి చర్మ కణాల వయస్సును తగ్గిస్తాయి. దాంతో వృద్దాప్య లక్షణాలు దూరమవుతాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడు యవ్వనంగా ఉండటాన్ని మెయింటైన్ చేయవచ్చు.

ఆకు కూరల్లో ఐరన్, విటమిన్ ఇలు ఉండటం వల్ల ఈ రెండూ శరీరంలో కణాలను హెల్తీగా మార్చుతుది. సెల్ ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది.

వయసు ఛాయలు కనుమరుగయ్యేలా చేసే ఫ్రూట్స్

బ్లూ బెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి కొత్త కణాలను ఏర్పాటుకు సహాయపడుతాయి. శరీరంలో హెల్తీ బ్లడ్ సెల్స్ పెరుగుతాయి. దాంతో వృద్దాప్య లక్షణాలు ఆలస్యం అవుతాయి.

బ్లూబెర్రీ, ఆకుకూరల జ్యూస్ ను పైన సూచించిన విధంగా గ్లాసులో తీసుకుని, రెండూ బాగా కలిసే వరకూ మిక్స్ చేసి తాగిలి. ఈ ఆరోగ్యకరమైన డ్రింక్ ను ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు తీసుకోవాలి. ఎన్ని రోజులైనా తాగొచ్చు.

English summary

Home Remedy To Slow Down Ageing

Here is one of the best natural remedies that can help you slow down the ageing process naturally.
Subscribe Newsletter