కలబందతో కాలిన గాయాలను ఎలా నయం చేయవచ్చు?

By: Deepti
Subscribe to Boldsky

నిత్యజీవితంలో చిన్న చిన్న ప్రమాదాలు సహజమే. అనుకోకుండా కాలిన చర్మానికి సాధారణంగా మీరు వెంటనే ఏం చేస్తారు? వైద్యుడు సూచించిన మందులు వాడతారా? అవి కొద్దిసేపు ఉపశమనం కలిగించినా, మంటను ఎక్కువసేపు పూర్తిగా తగ్గించలేవు .

కాలినగాయం మంట నుంచి వెంటనే విముక్తి కావాలంటే, కలబంద రసం వాడవచ్చు.

కలబంద ఒక మాయావృక్షం లాంటిది. ఎన్నో వేల ఏళ్ళ క్రితం నుంచి చర్మసమస్యలకు, కాలినగాయాలకు దీన్ని వాడుతూ వచ్చారు. తేమను పెంచి, నయం చేసే దీని శక్తి వలన గాయమైన చర్మప్రాంతంలో కొత్త చర్మం త్వరగా వస్తుంది.

how to treat burns with aloe vera

ఈ చెట్టులో ముఖ్యభాగం కలబంద జెల్ దేశీయంగా అనేక లోషన్లు, క్రీముల్లో భాగంగా లభ్యమవుతోంది. ఎందుకంటే, ఇందులో ఉండే మూలకాలు నొప్పి, వాపును తగ్గించి, చర్మం, జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తాయి.

చర్మంపై అసహ్యంగా కనిపించే కాలిన మచ్చలు నివారించే రెమిడీస్..!

కలబందలో గ్లైకోప్రొటీన్లు, పాలీసాకరైడ్లు అనే పదార్థాలు కూడా ఉంటాయి. గ్లైకో ప్రోటీన్లు నొప్పి,వాపు తగ్గించి గాయం త్వరగా మానేట్లు చేస్తే, పాలీసాకరైడ్లు చర్మం పెరుగుదల, మరమ్మత్తును చూస్తాయి. కానీ, కలబందను నేరుగా గాయంపై ఎప్పుడూ ఉపయోగించకూడదు.

ఈ వ్యాసంలో కలబందను సురక్షితంగా ఎన్ని పద్ధతులలో వాడచ్చో తెలుసుకుని దాని అత్యుత్తమ లాభాలన్నింటినీ పొందండి.

how to treat burns with aloe vera

1) కలబంద గుజ్జు వాడకం

కలబందను చిన్న చిన్న గాయాలకు తేమని ఇచ్చి, నొప్పి తగ్గించేదానిలా వాడవచ్చు.

కావాల్సిన వస్తువులు:

 • తాజా కలబంద ఆకు ఒకటి

పద్ధతి:

 1. కలబంద ఆకును శుభ్రమైన చాకుతో అడ్డంగా కోసి, అందులో గుజ్జును తీయండి.
 2. ఈ గుజ్జుని నేరుగా గాయమైన చోట పూయండి. వెంటనే ఉపశమనం కలుగుతుంది.
 3. ఒక 5-6 నిమిషాలపాటు ఆ గుజ్జు పూర్తిగా పట్టేట్లా మర్దన చేయండి.
 4. తడిగుడ్డతో దాన్ని అంతా తుడిచేయండి.

వేగంగా క్యాలరీలు కరిగించేసి, వేగంగా బరువు తగ్గించేస్తాయి...

how to treat burns with aloe vera

2) కలబంద లోషన్:

ఈ ఆలోవెరా లోషన్ లో అవకాడో కూడా ఉంటుంది. ఇది కాలిన గాయాలపై చాలా మంచి ప్రభావం చూపిస్తుంది

కావాల్సిన వస్తువులు:

 • ఒక కలబంద ఆకు
 • ఒక అవకాడో
 • ఒక చెంచాడు ఆలివ్ నూనె

పద్ధతి:

 1. అవకాడోను కోసి అందులో గుజ్జును బయటకి తీయండి.
 2. కలబంద ఆకులో కూడా గుజ్జు బయటకి తీయండి.
 3. రెండింటిని ఒక గిన్నెలో కలిపి, ఆలివ్ నూనెను జతచేయండి.
 4. కావాల్సినంత గాయానికి రాస్తూ మిగిలినది ఒక పొడి డబ్బాలో పోసి, ఫ్రిజ్ లో పెట్టుకుని తర్వాత వాడుకోండి.
how to treat burns with aloe vera

3) ఇంట్లో తయారు చేసుకునే కలబంద జెల్:

ఈ ఆలోవెరా జెల్ పద్ధతి చాలా ప్రసిద్ధమైనది మరియు అందం కోసం కూడా దీన్ని వాడతారు. దీని డబ్బాను ఒకటి ఇంట్లో ఉంచుకోండి, ఇక మీ చర్మ సమస్యలన్నీ పోయినట్టే.

కావాల్సిన వస్తువులు:

 • ఒక కలబంద ఆకు
 • ఒక చెంచాడు నిమ్మరసం
 • ఒక చెంచాడు వీట్ జెర్మ్ ఆయిల్

పద్ధతి:

 1. కలబంద ఆకును కోసి గుజ్జును తీయండి.
 2. ఈ గుజ్జును ఒక గిన్నెలో వేసి, నిమ్మరసం, వీట్ జెర్మ్ ఆయిల్ ను కలపండి.
 3. మిక్సర్ లో ఈ మిశ్రమాన్ని జెల్ గా మారే వరకూ తిప్పండి.
 4. గాయమైన చోట ఇది రాయండి.
 5. మిగతా జెల్ ను ఒక పొడి డబ్బాలో పోసి, ఫ్రిజ్ లో దాచుకోండి.
how to treat burns with aloe vera

4) కలబంద ఐస్ క్యూబ్స్

కలబంద, మంచుల కలయిక కాలిన గాయాలనుంచి వెంటనే ఉపశమనం ఇస్తుంది.

కావాల్సిన వస్తువులు:

 • కలబంద ఆకు ఒకటి
 • కొంచెం నీరు
 • ఐస్ ట్రే

పద్ధతి:

 1. కలబంద ఆకుని కోసి గుజ్జును తీయండి.
 2. గుజ్జు, నీరును మిక్సర్ లో వేసి బాగా కలపండి.
 3. ఈ మిశ్రమాన్ని ఐస్ క్యూబ్ ట్రేలో పోసి, ఫ్రిజ్ లో గడ్డకట్టేట్లు చేసి గాయంపై వాడుకోండి.
 4. ఈ ఐస్ క్యూబ్ లను గుడ్డలో చుట్టి గాయంపై రాయాలని మర్చిపోకండి. ఇలా అయితే నేరుగా తగలకుండా ఉంటుంది.
 5. ఈ చిట్కాల వల్ల కాలిన గాయాలకు వెంటనే ఉపశమనం లభిస్తుంది. అంతేకాక, కలబంద కాలిన మచ్చలు కూడా తగ్గిస్తుంది. కానీ ప్రథమచికిత్సగా, చిన్న చిన్న గాయాలకు వాడటమే మంచిది. పెద్ద గాయాలకు వైద్యుని సంప్రదించటం మంచిది.
English summary

How To Treat Burns Using Aloe Vera

Burns can be painful. Know how to use aloe vera to treat burns..
Story first published: Thursday, July 6, 2017, 8:00 [IST]
Subscribe Newsletter