మెలనోమా (చర్మంమీది పుట్టకురుపు లేదా చర్మ క్యాన్సర్) లక్షణాలు, కారణాలు మరియు నివారణ!

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky
The Complete Guide to Melanoma: Symptoms

మెలనోమా (చర్మంమీది పుట్టకురుపు ) లేదా ప్రాణాంతక మెలనోమా అనేది చర్మ క్యాన్సర్ లలో అతి ప్రమాదకరమైనది.

అసాధారణ రూపంలో మెలనోసైట్లు రూపాంతరం చెందినప్పుడు ఈ వ్యాధి భారిన పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కణాలు చర్మశుద్ధి వర్ణద్రవ్యమైన మెలనిన్ ని మన శరీరంలో ఉత్పత్తి చేస్తాయి.

స్కిన్ క్యాన్సర్ గురించి మీకు తెలియని ఆశ్చర్యపరిచే వాస్తవాలు

కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రతి సంవత్సరం 31 లక్షల మంది పై ఇది ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఇంకొక విస్తుగొలిపే అంశం ఏమిటంటే గ్లోబల్ వార్మింగ్ మరియు కాలుష్యం రోజురోజుకి పెరిగిపోయి ఈ భూమిని ఎంతో విషతుల్యం చేసి అసాధారణ స్థితిలో నష్టం చేకూరుస్తున్నాయి, అందువల్ల అతిలోహ కిరణాలు సూర్యుడి నుండి భూమి పై పడకుండా ఆపే పొర పూర్తిగా దెబ్బతింటోంది. వాతావరణం మొత్తం తన సాధారణ స్థితిని కోల్పోతోంది. ఇందువల్ల మరింత ఎక్కువమంది ఈ వ్యాధి భారినపడే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈ ప్రపంచంలో ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ లలో మెలనోమా బాధితులు ఎక్కువగా ఉన్నారు. అందుకు ప్రధాన కారణం ఏమిటంటే ఆయా ప్రాంతాల్లో ఓజోన్ పొర విపరీతంగా దెబ్బతింది.

ఇలాంటి భయం మరియు విస్తుగొలిపే నిజాలు ఎన్నో ఉన్నాయి. కావున మనం అందరం మెలనోమా ఎందుకు వస్తుంది అనే కారణాలను మరియు లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ముఖ్యంగా ఏ వ్యక్తులకు అయితే వాళ్ళు పుట్టినప్పటి నుండి శరీరం పై ఎక్కువ పుట్టుమచ్చలు ఉన్నాయో అటువంటి వారు దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

The Complete Guide to Melanoma: Symptoms

మెలనోమా భారిన పడటానికి కారణాలు :

ఈ క్యాన్సర్ వ్యాధి సోకడానికి ఖచ్చితంగా ఇవే కారణాలు అని చెప్పడం కష్టమైనప్పటికీ, ఈ క్రింద చెప్పబడిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ మెలనోమా వ్యాధి భారిన పడటానికి అతిపెద్ద ప్రమాదకర విషయాలుగా చెబుతున్నారు.

స్కిన్ క్యాన్సర్ ను నివారించే నేచురల్ రెమెడీస్

1 . సూర్యుడి నుండి వెలువడే అతిలోహ కిరణాలకు ఎక్కువగా బహిర్గతం అవడం :

1 . సూర్యుడి నుండి వెలువడే అతిలోహ కిరణాలకు ఎక్కువగా బహిర్గతం అవడం :

సూర్యుడి నుండి వెలువడే అతిలోహ కిరణాలు రెండు రకాలుగా విభజించబడ్డాయి, uvA మరియు uvB. ఈ రెండింటిలో uvB చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే, ఎప్పుడైతే మన చర్మం ఈ అతిలోహ కిరణాలను గ్రహిస్తుందో అప్పుడు మన చర్మం యొక్క కణాలలో ఉండే DNA ను అవి విచ్ఛిన్నం చేస్తాయి.

బాగా తెల్లటి చర్మం కలిగిన వ్యక్తులు మెలనోమా భారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ చర్మంలో మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఉండకపోవచ్చు లేదా తక్కువాగా ఉండవచ్చు. మాములుగా అయితే ఈ వర్ణద్రవ్యం శరీరాన్ని అతిలోహ కిరణాల భారి నుండి కాపాడుతుంది.

బాగా కొద్దిగా వేడి కలిగిన దేశాలు మరియు ఖండాలలో నలుపు రంగు కలిగిన మనుష్యులు ఎక్కువగా ఉంటారు. ఉదాహరణకు భారత దేశం మరియు ఆఫ్రికా.

సంవత్సర మొత్తంలో ఈ ప్రాంతాలలో సూర్యరశ్మి బాగా ఉండటంతో, జన్యుపరంగా ఈ ప్రాంతంలో నివసించే ప్రజల శరీరాలు ఎక్కువగా మెలనిన్ ఉత్పత్తి చేస్తాయి.

2. చర్మశుద్ధి చేసే గృహాలను వాడటం వల్ల :

2. చర్మశుద్ధి చేసే గృహాలను వాడటం వల్ల :

ఎక్కువగా మెలనిన్ ని ఉత్పత్తి చేయడానికి చర్మశుద్ధి చేసే గృహాల్లో, మీ యొక్క చర్మాన్ని కృత్రిమ అతిలోహ కిరణాలతో తడిస్తారు.

దురదృష్టవశాత్తు ముప్పై ఏళ్ళ వయస్సులోపే, ఈ యొక్క అతిలోహ కిరణాలకు మీ చర్మం అతిగా బహిర్గతం అయితే మెలనోమా క్యాన్సర్ భారిన పడే అవకాశం 75% ఎక్కువగా ఉంటుందని గుర్తించారు.

3. వంశపారంపర్యంగా మెలనోమా :

3. వంశపారంపర్యంగా మెలనోమా :

కొన్ని జన్యువుల వల్ల మెలనోమా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని గుర్తించారు. ఉదాహరణకు మాంద్యత జన్యువు అయిన ఎం సి 1 ఆర్, ఇది ఎర్రటి వెంట్రుకలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది.

అందుచేతనే ఉత్తర యూరోప్ మరియు అమెరికా లలో ప్రజలు ఎక్కువ మెలనోమా భారినపడుతున్నట్లు భావిస్తున్నారు.

4. శరీరం పై ఎక్కువగా పుట్టుమచ్చలు ఉండటం :

4. శరీరం పై ఎక్కువగా పుట్టుమచ్చలు ఉండటం :

చర్మం పై సాధారణంగా ఉండే పుట్టుమచ్చల వల్ల మెలనోమా వచ్చే అవకాశం ఉందని మెలనోమా కేసుల్లో ఇవే 25 శాతం ఉన్నాయని చెబుతున్నారు. ఏ వ్యక్తులకు అయితే అసాధారణమైన మరియు ఎక్కువగా, అసహజంగా లేదా మెలనిన్ వల్ల చర్మం పై చాలా పెద్దవిగా పుట్టుమచ్చలు ఏర్పడతాయో ఇలాంటి వ్యక్తుల్లో మెలనోమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

5. జన్యుపరమైన లోపాలు : గ్జిరోడెర్మా పిగ్మెంటోసుమ్

5. జన్యుపరమైన లోపాలు : గ్జిరోడెర్మా పిగ్మెంటోసుమ్

గ్జిరోడెర్మా పిగ్మెంటోసుమ్ అనేది ఒక అరుదైన జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధితో పుట్టిన వ్యక్తులు అతిలోహకిరణాలకు బహిర్గతం అయితే అస్సలు తట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ల శరీరం అందుకు సహకరించదు. జన్యుపరమైన లోపం వల్ల వాళ్ళ శరీరం చాలా సున్నితంగా నిర్మితమై ఉంటుంది. ఒకవేళ వాళ్ల శరీరం గనుక అతిలోహ కిరణాలకు బహిర్గతమైతే అందువల్ల జరిగే నష్టాలను వారి శరీరం తట్టుకోలేదు.

ఏ వ్యక్తులైతే ఈ లోపంతో జన్మిస్తారో అటువంటి వారిలో ఈ ప్రాణాంతక మెలనోమా వృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంది అనే విషయాన్ని గుర్తించారు.

మెలనోమా లక్షణాలు మరియు మెటాస్టాసిస్ గుర్తులు :

ఈ మెలనోమా ని ప్రారంభదశలోనే గుర్తించినప్పటికీ 20 శాతం మందిలో మాత్రం అది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.

అందుచేతనే మెలనోమా లక్షణాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలా తెలుసుకోవడం వల్ల మీరు చాలా ముందుగానే వైద్యుల దగ్గరకు వెళ్లి వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుంది. ఆ వ్యాధి ఎక్కువగా వృద్ధి చెందకుండా నియంత్రించవచ్చు.

The Complete Guide to Melanoma: Symptoms

ప్రాణాంతక మెలనోమా భారినపడి మళ్ళీ సాధారణ స్థితికి చేరుకొని ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్న వారు ఎక్కువ మందే ఉన్నారు.

మెలనోమా గుర్తులను గుర్తుపెట్టుకోవడం అంత కష్టతరమైన విషయం ఏమి కాదు.

వివిధ పరిమాణము గల కనితులతో కూడిన ఈ క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైనది అయినప్పటికీ, దీని గురించి తెలుసుకొని మనల్ని మనం కాపాడుకోవడానికి మనకున్న జ్ఞాపక శక్తి సరిపోతుంది.

The Complete Guide to Melanoma: Symptoms

ఈ - చర్మం ఉపరితం నుండి పైకి ఎత్తడం

ఎఫ్- ఖచ్చితత్వంతో ముట్టుకోవడం

జి - సమయం గడిచేకొద్దీ పెరుగుతుంది

మెలనోమా యొక్క దశలు :

మెలనోమా అనేది ఒక అతిభయంకరమైన చర్మ క్యాన్సర్.

ఇది బయటప్రపంచానికి ఎక్కువగా కనపడదు. చాలా చిన్నదిగా అనిపిస్తుంది చూసేవారికి మరియు అంత ప్రమాదకారిగా కూడా అనిపించదు. కానీ లోలోపల వ్యాధి విపరీతంగా పెరిగిపోతుంటుంది ప్రాణాంతకంగా మారుతుంది. ఒకానొక రోజు మీ రక్త నాళాల్లోకి చొచ్చుకుపోతుంది. ఇక అప్పటి నుండి మీ శరీరం అంత పాకిపోయి వ్యాధి విపరీతంగా వృద్ధి చెందుతుంది.

ఈ వ్యాధి విపరీతంగా పెరిగే క్రమంలో కొన్ని దశలు ఉన్నాయి. ఈ దశలన్నిటిని దాటుకున్న తర్వాత ఈ వ్యాధి తన సంపూర్ణ స్థితిని చేరుకొని మన శరీరం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

The Complete Guide to Melanoma: Symptoms

శూన్య దశ :

ఈ దశను కాన్సర్ ఇన్ సితు అని కూడా అంటారు.

ఈ దశలో మెలనోసైట్లు మన చర్మం లో బాహ్య చర్మం పై అసాధారణ స్థితిలో ఉంటాయి.

The Complete Guide to Melanoma: Symptoms

మొదటి దశ :

ఈ దశను రెండు భాగాలుగా విభజించారు.

1A - ఈదశలో 1 mm చర్మం మందంలో మాత్రమే ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెంది, ఆ ప్రాంతంలో మాత్రమే దాని యొక్క ప్రభావం ఉంటుంది. అంటే దానర్ధం ఉపరితల చర్మం పై ఎక్కువగా ఉంటుందన్నమాట. పుండు అనేది ఈ దశలో ఏర్పడదు.

1B - ఈ దశలో పుండు అనేది కొద్దిగా ఏర్పడుతుంది లేదా పుండు ఏర్పడకుండానే ఈ వ్యాధి 1 నుండి 2 mm చర్మం లోపలికి ఈ వ్యాధి చొచ్చుకెళ్లే అవకాశం ఉంది.

The Complete Guide to Melanoma: Symptoms

రెండవదశ :

ఈ దశను మరిన్ని ఉప విభాగాలుగా విభజించారు.

2A - ఈ దశలో 1 నుండి 2 mm మందం లో క్యాన్సర్ వ్యాధి వ్యాప్తి చెంది పుండు అనేది ఏర్పడవచ్చు లేదా పుండు అనేది ఏర్పడకుండానే 2 నుండి 4 mm లోటు వరకు క్యాన్సర్ అనేది వ్యాప్తి చెందవచ్చు.

2B - 2 నుండి 4 mm లోతు వరకు క్యాన్సర్ అనేది వ్యాప్తి చెంది పుండు ఏర్పడవచ్చు లేదా పుండు ఏర్పడకుండా 4 mm కంటే ఎక్కువ లోతు వరకు చొచ్చుకెళ్లి కాన్సర్ వ్యాప్తి చెందవచ్చు.

2C - ఈ దశలో క్యాన్సర్ అనేది 4 mm కంటే ఇంకా లోతుకు వ్యాప్తి చెంది పుండు అనేది చాలా పెద్దదిగా ఏర్పడవచ్చు.

The Complete Guide to Melanoma: Symptoms

మూడవ దశ :

ఈ దశలో క్యాన్సర్ పరిమాణం అనేది అంత ముఖ్యమైన విషయం అయితే కాదు ఎందుకంటే, క్యాన్సర్ కణాలు మీ శరీరం లో ఉన్న ఒకటి లేదా అంతకు మించి ఎక్కువ శోషరస గ్రంధులకు వ్యాప్తి అయిపోయి ఉండొచ్చు లేదా కొన్ని ఉపగ్రహ కణితులు సృష్టించబడి ఉండొచ్చు. ఇవి కేవలం మాములుగా ఉండే గ్రంధులకు రెండు సెంటీమీటర్ల దూరంలో ఏర్పడి ఉండవచ్చు.

The Complete Guide to Melanoma: Symptoms

నాల్గవ దశ :

ఎప్పుడైతే మెలనోమా ఈ దశకు చేరుకుంటుందో ఈ స్థితిని ప్రాణాంతక మెలనోమా గా గుర్తించవలసి ఉంటుంది. ఎందుచేతనంటే ఈ దశలో క్యాన్సర్ కణాలు మీ శరీరం మొత్తం వ్యాపించి ఉంటాయి.

ఊపిరితిత్తులు, కాలేయం మరియు మెదడులో మెటాస్టాసిస్ సాధారణంగా ఎక్కువగా కనపడుతుంటుంది.

మిమ్మల్ని మీరు మెలనోమా నుండి రక్షించుకోవడం ఎలా ?

The Complete Guide to Melanoma: Symptoms

మిమ్మల్ని మీరు ఈ ప్రాణాంతక వ్యాధి నుండి కాపాడుకోవాలంటే, ఈ వ్యాధిని ముందే గుర్తించి సరైన వైద్యం అయినా తీసుకోవాలి లేదా ఈ వ్యాధిని కలిగించే ప్రమాదకరమైన పరిస్థితులకు దూరంగా అయినా ఉండాలి.

ఒక భయం గొలిపే విషయం ఏమిటంటే వంశపారంపర్యంగా ఈ వ్యాధి గనుక వచ్చినట్లైతే, అది మిమ్మల్ని అత్యంత ప్రమాదకర స్థితిలోకి నెట్టి వేస్తుంది. అయినప్పటికీ ఈ క్రింద చెప్పబడిన చిట్కాలను ఉపయోగించి చర్మ క్యాన్సర్ ని దూరం చేసుకోవచ్చు.

మెలనోమాను 5 రకాలుగా చికిత్స చేయవచ్చు :

ప్రతి ఒక్కరి జీవితంలో క్యాన్సర్ ఉంది అనే విషయం నిర్దారణ కావడం అనేది చెత్త పీడకల లాంటిది.

మీకు గనుక మెలనోమా గనుక ఉంటే, ఈ క్రింద చెప్పబడిన విధానాల ద్వారా వైద్యుల సహాయంతో మెలనోమా పై పోరాడి గెలిచే అవకాశాలు ఉన్నాయి.

The Complete Guide to Melanoma: Symptoms

1. శస్త్రచికిత్స :

ఎప్పుడైతే మెలనోమా ప్రారంభ దశలో ఉంటుందో అటువంటి దశలో శస్త్రచికిత్స ద్వారా ఆ వ్యాధి నయమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పద్దతి ద్వారా కణితి మొతాన్ని మరియు 1 నుండి 2 సెంటీమీటర్ల ఆరోగ్యవంతమైన కణజాలాన్ని తొలగించడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఈ వ్యాధి ప్రాణాంతక పెరుగుదలను నియంత్రించవచ్చు మరియు పునరావృత్తం కాకుండా అరికట్టవచ్చు.

ఈ పద్దతిని చర్మం అంటుకట్టుట అని అంటారు. కంటికి కనపడని ఒక చిన్న వికారమైన రంధ్రాన్ని ఈ పద్దతి ద్వారా కప్పివేస్తారు.

The Complete Guide to Melanoma: Symptoms

2. కీమో థెరపీ :

ఈ చికిత్స లో భాగంగా కొన్ని శక్తివంతమైన మందులను రక్తం ద్వారా లేదా కండరాల ద్వారా లేదా వెన్నుముక లో ఉండే ద్రవాల ద్వారా శరీరంలోకి పంపిస్తారు.

సాధారణంగా ప్రారంభ దశలో మెలనోమా ఉన్నప్పుడు శస్త్రచికిత్సలు చేస్తుంటారు. ఆ చికిత్సలతో పాటు ఈ కీమో థెరపీ కూడా చేస్తారు.

The Complete Guide to Melanoma: Symptoms

3. రేడియేషన్ థెరెపీ :

మెలనోమాను వికిరణం ద్వారా చికిత్స చేయవచ్చు. ఏ ప్రాంతం అయితే మెలనోమా భారిన పడిందో ఆ భాగాన్ని బాహ్య వికిరణాన్ని ఉపయోగించి వ్యాధిని నయం చేస్తుంటారు.

The Complete Guide to Melanoma: Symptoms

4. రోగనిరోధక చికిత్స ( ఇమ్మ్యూనో థెరెపీ ) :

ఈ చికిత్సలో భాగంగా మీ యొక్క రోగనిరోధక శక్తి అనేది పెంపొందించడం జరుగుతుంది. అలా చేయడం వల్ల మీ శరీరంలో ఉండే కణాలు రోగనిరోధక శక్తిని పెంపొందించుకొని క్యాన్సర్ కణాల పై శక్తివంతంగా పోరాడతాయి.

The Complete Guide to Melanoma: Symptoms

5. టార్గెటెడ్ థెరెపీ ( లక్షిత చికిత్స ) :

ఈ చికిత్స లో భాగంగా కొన్ని శక్తివంతమైన మందులను శరీరంలోకి ఎక్కిస్తారు. ఇవి ముఖ్యంగా ఇవి క్యాన్సర్శ కణాలలో ఉండే ప్రోటీన్లు మరియు కంపౌండ్లను దృష్టిలో ఉంచుకొని పంపబడినవి. సాధారణంగా మన శరీరంలో ఉండే కణాలకు ఇటువంటి లక్షణాలు ఉండవు. ఇలా చేయడం వల్ల క్యాన్సర్ కణాలు మృతి చెందుతాయి. అయితే ఈ చికిత్సలో ఆరోగ్యవంతమైన కణజాలానికి ఎటువంటి ప్రమాదం జరగదు.

ఆన్ కొలైటిక్ చికిత్స అనేది టార్గెటెడ్ థెరెపీ లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన చికిత్స. ఈ పద్దతి ద్వారా మెలనోమా ను చికిత్స చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తున్నాయని చాలా మంది చెబుతున్నారు.

పైన చెప్పిన విషయాలన్నీ బాగా ఉపయోగపడే విధంగా ఉన్నాయా ?

అలా అయితే ఈ విషయాలన్నింటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి మీ వంతుగా మరింత మందికి అవగాన కలిపించండి.

English summary

The Complete Guide to Melanoma: Symptoms, Causes, and Cure

melanoma symptoms causes treatment stages, The Complete Guide to Melanoma: Symptoms, Causes, and Cure, Learn more about the most dangerous skin cancer of them all, and how you can protect yourself from it.
Subscribe Newsletter