For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాళ్ల వేళ్లలో ఫంగస్ ను నివారించే నేచురల్ రెమెడీస్

కాళ్ళ వేళ్ల ఫంగస్ ను నివారించే నేచురల్ రెమెడీస్

By Staff
|

మన శరీరంలో ఎక్కువ నిర్లక్ష్యం చేసే ప్రదేశం కాళ్లు. కాళ్లు మనం నిలబడటానికి, తిరగడానికి, నడవడానికి సపోర్టివ్ గా ఉంటుంది. కాళ్లు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేము. అలాంటి కాళ్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, సరైన జాగ్రత్తలు తీసుకోము.

కాళ్లతో నేల మీద నడవడం వల్ల అక్కడ ఉండే క్రిములు , దుమ్మూ, దూళి వల్ల ఇన్ఫెక్షన్స్ ను త్వరగా వస్తాయి. పాదాలకు కామన్ గా వచ్చే టాయ్ నెయిల్ ఫంగస్. దీన్నే వైద్య భాషలో ఓనీకామీకోసిస్ అని పిలుస్తారు. ఈ ఫంగస్ కామన్ గా కాలి వేళ్లకు వస్తుంటుంది. ఇది ప్రమాధకరం కాకపోయినా, అలాగే వదిలేయడం వల్ల చూడటానికి చాలా అసహ్యంగా కనబడుతుంది. కాళ్ల గోళ్లు పసుపుపచ్చగా మారతాయి. కలర్ లేకుండా ఉంటుంది.

కాళ్ళ గోళ్ళు మీద నల్ల మచ్చలు ఏర్పడుటకు డేంజరస్ రీజన్స్కాళ్ళ గోళ్ళు మీద నల్ల మచ్చలు ఏర్పడుటకు డేంజరస్ రీజన్స్

అయినా కూడా అలాగే వదిలేస్తే మరింత నిర్లక్ష్యం చేస్తే కాళ్ల పగుళ్లు, కాళ్లు చీలిపోవడం జరుగుతుంది. కాళ్ల మీద ఎర్రగా, వాపుగా కనబడుతుంది. కాలి గోళ్లు మందంగా, నార్మల్ గా కనబడుతుంది. వాటిని మరింత అసహ్యంగా మారుతాయి.

cure for toenail fungus

కాళ్ల వేళ్ల ఫంగస్ ముఖ్యంగా సరైన పాదరక్షలు ఉపయోగించకపోవడం వల్ల జరుగుతుంది. రోజంతా షూలు వేసుకోవడం వల్ల కాళ్ళలో చెమటలు వల్ల ఫంగస్ పెరుగుతుంది.

కాళ్లకు చెమట పడుతుంది కాబట్టి, కాళ్లకు కూడా అప్పుడప్పుడు ఫ్రెష్ గా గాలి సోకాలి. పబ్లిక్ ప్లేసుల్లో స్విమ్మింగ్ పూల్, జిమ్ ప్రదేశాల్లో ఒట్టికాళ్లతో నడవడం వల్ల ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి.

ఇలాంటి ఇన్ఫెక్షన్స్ చాలా సహజం. వీటికి మార్కెట్లో మందులు అందుబాటులో ఉన్నా, అవి కొంత వరకే ఉపశమనం కలిగిస్తాయి. అయితే కాళ్ల వేళ్లకు వచ్చే ఫంగస్, ఇన్ఫెక్షన్ మొండిగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గదు. ఇవి శాస్వత పరిష్కారం కావు. అయితే ప్రక్రుతి ప్రతీ వ్యాధిని నయం చేయడానికి తప్పనిసరిగా కొన్ని పవర్ ఫుల్ రెమెడీస్ ను వరంగా ఇచ్చాయి. మూడు రోజుల్లో కాళ్ల గోళ్ల ఇన్ఫెక్షన్ తగ్గించే కొన్ని పవర్ ఫుల్ హోం రెమెడీ ఉన్నాయి. అవేంటంటే..

cure for toenail fungus

1. టీ ట్రీ ఆయిల్ :

ఫంగల్ ఇన్ఫెక్షన్ ను ట్రీట్ చేయడానికి , అత్యంత పవర్ ఫుల్ రెమెడీ టీ ట్రీ ఆయిల్ . ఇది అత్యంత శక్తివంతమైన యాంటీ ఫంగల్ నేచురల్ రెమెడీ. ఇన్ఫెక్షన్ సోకిన ప్రదేశంలో టీ ట్రీ ఆయిల్ అప్లై చేయడం వల్ల అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది.

కావల్సినవి:

టీట్రీ ఆయిల్ కొద్దిగా

పద్దతి:

టీ ట్రీ ఆయిల్ ను కొన్ని చుక్కలు చేతిలో వేసుకుని ఇన్ఫెక్షన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. రోజుకు 3,4 సార్లు అప్లై చేస్తుంటే ఇన్ఫెక్షన్ త్వరగా క్లియర్ అవుతుంది.

కాలి రెండోవేలు పొడవుగా ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదా ?కాలి రెండోవేలు పొడవుగా ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదా ?

cure for toenail fungus

2. నిమ్మరసం:

కాళ్ళ వేళ్ల ఫంగస్ నివారించడానికి నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ గొప్పగా సహాయపడుతుంది. ఇది నిమ్మరసంలో ఎక్కువగా ఉంటుంది. ఇది ఎఫెక్టివ్ యాంటీ ఫంగల్ గా పనిచేస్తుంది.

కావల్సినవి:

1 ఫ్రెష్ లెమన్

కాట్ బాల్

పద్దతి:

నిమ్మకాయ నుండి రసాన్ని పిండాలి. ఈ నిమ్మరసంను కాళ్ల గోళ్లకు కాటన్ తో అప్లై చేయాలి. ప్రతి 4-5 సార్లుకొకసారి అప్లై చేయాలి. ఇలా చేస్తుంటే 3 రోజుల్లో టాయ్ నెయిల్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

cure for toenail fungus


3. మౌత్ వాష్ :

వినడానికి వింతగా అనిపించినా , ఇది వాస్తవం, మౌత్ వాష్ స్ట్రాంగ్ యాంటీ సెప్టిక్ , ఇది టాయ్ నెయిల్ ఫంగస్ ను క్లియర్ చేయడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

కావల్సినవి:

2 క్యాపుల మౌత్ వాష్

సగం చిన్న టబ్ కు గోరువెచ్చని నీళ్లు

పద్దతి:

టబ్ లో గోరువెచ్చని నీళ్లు సగానికి నింపాలి. తర్వాత అందులో మౌత్ వాష్ ను వేయాలి. అరగంట పాటు పాదాలను అందులో నానబెట్టాలి. ఇలా సంవత్సరానికొకసారి చేస్తుంటే టాయ్ నెయిల్ ఫంగస్ క్లియర్ అవుతుంది.

English summary

Natural Remedies To Cure Toenail Fungus

There are few natural remedies that helps in treating toenail fungus. Know about few of these remedies here on Boldsky.
Desktop Bottom Promotion