మైగ్రేన్ తలనొప్పిని చిటికెలో తగ్గించే సింపుల్ అండ్ సిల్లీ హోం రెమెడీ...

Posted By:
Subscribe to Boldsky

ప్రస్తుత రోజుల్లో మైగ్రేన్ తలనొప్పితో బాధ పడే వారి సంఖ్య తీవ్రంగా పెరిగిపోతున్నది. తలనొప్పి మాదిరిగా కాకుండా తల భాగంలో ఒకే వైపు సివియర్ గా నొప్పి బాధిస్తుంది. రోజూ ఒకే సమయానికి (ఉదయం, సాయంత్రంలో )నొప్పి ప్రారంభమైన నొప్పి తీవ్రత పెరుగుతుంది. నొప్పితో పాటు, వికారం మరియు మెడనొప్పి బాధిస్తుంది. ఈ నొప్పిని భరించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది.

మెైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకోవడానికి ఆస్పిరిన్ లేదా ఇతర మెడికేషన్స్ వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. మరియు వీటిని ఎక్కువగా వాడటం వల్ల ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతాయి. అయితే అలాగని తలనొప్పితో బాధపడాల్సిన అవసరం లేదు.

Quick Cure For Migraine Headache!

మైగ్రేన్ తలనొప్పి నివారణకు సింపుల్ రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెమెడీ గురించి తెలుసుకుంటే మీకు సిల్లీగా అనిపించవచ్చు. కానీ ఈ సింపుల్ రెమెడీ వల్ల ఎఫెక్టివ్ గా మైగ్రేన్ తలనొప్పి తగ్గించుకోవచ్చు. ఆ సింపుల్ అండ్ సిల్లీ హోం రెమెడీ ఏంటంటే బనానా తొక్క. బనానా తొక్కను నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. కొద్దిసేపటికల్లా మీరు బెటర్ గా ఫీలవ్వడం గ్రహిస్తారు. దీంతో పాటు మరికొన్ని సింపుల్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా...

అల్లం:

అల్లం:

కొద్దిగా నీళ్లలో అల్లం పౌడర్ వేసి 10 నిముషాలు ఉడికించాలి. దీన్ని టీ రూపంలో తీసుకోవాలి. ఇందులో ఉండే ఔషధ గుణాలు పిల్స్ కంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఐస్ కంప్రెసర్ :

ఐస్ కంప్రెసర్ :

తలనొప్పి సివియర్ గా ఉన్నప్పుడు, ఫోర్ హెడ్ (నుదురు) మరియు మెడ మీద ఐస్ కంప్రెసర్ ను ప్రయత్నించండి. సింపుల్ గా కొన్ని ఐక్యూబ్స్ తీసుకుని, క్లాత్ లో చుట్టాలి. తలనొప్పి ఉన్న ప్రదేశంలో సున్నితంగా మసాజ్ చేసినట్లు అప్లై చేయాలి. కొద్దిసేటపికల్లా రిలీఫ్ పొందుతారు,

ల్యావెండర్ ఆయిల్ :

ల్యావెండర్ ఆయిల్ :

5-6 కప్పుల ల్యావెండర్ ఆియల్ ను పాత్రలో పోసి బాయిల్ చేయాలి. తర్వాతర 5-6డ్రాప్స్ ల్యావెండర్ ఆయిల్ వేసి వేడి చేయాలి. తర్వాత ఈ వాటర్ ను ఆవిరి పట్టాలి. ఇలా ఆవిరి పట్టడం వల్ల కొంచెం ఉపశమనం కలుగుతుంది. అలాగే కొద్దిగా నూనె తీసుకుని తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి.

తులసి ఆయిల్ :

తులసి ఆయిల్ :

తులసి ఆకుల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల , ఆరోమా వాసన వల్ల హెడ్ అండ్ నెక్ మజిల్స్ త్వరగా రిలాక్స్ అవుతాయి. దాంతో మైగ్రేన్ తలనొప్పి తగ్గించుకోవచ్చు.

కెఫిన్ :

కెఫిన్ :

మైగ్రేన్ తలనొప్పికి , వాపును నివారించడంలో కెఫిన్ గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి, తలనొప్పిగా ఉన్నప్పుడు ఒక కప్పు కాఫీ తాగి చూడండి. అయితే ఎక్కువ అడిక్ట్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

బక్ వీట్ :

బక్ వీట్ :

బక్ వీట్ లో రూటిన్ , ఫ్లెవనాయిడ్స్ ఉంటాయి . కాబట్టి, ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అందువల్ల దీన్ని రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. స్ట్రెస్ లెవల్స్ ను తగ్గించుకోవాలి.

ఫ్లాక్ సీడ్స్ :

ఫ్లాక్ సీడ్స్ :

తరచూ తలనొప్పి బాధిస్తుంటే, ఇన్ఫ్లమేషన్ కారణమవుతుంది. కాబట్టి, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఫ్లాక్ సీడ్స్ ను సూప్స్ వంటల్లో చేర్చుకోవాలి.

English summary

Quick Cure For Migraine Headache!

Quick Cure For Migraine Headache!When you suffer intense headache, try rubbing a banana peel on your forehead. The sodium in the peel could provide relief!
Story first published: Wednesday, May 3, 2017, 19:30 [IST]
Subscribe Newsletter