డిప్రెషన్ ను సహజంగా అధిగమిచడానికి సైన్స్ ప్రూవ్ చేసిన 9 మార్గాలు

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

తరచూ, మనం డిప్రెషన్ అనే పదాన్ని ఎవరో ఒకరి నుంచి వింటూనే ఉంటాం. తలనొప్పిలాగా డిప్రెషన్ అని అనడం చాలా కామన్ గా మారింది.

అయితే, దీని ప్రకారం డిప్రెషన్ బారిన పడేవారి సంఖ్య అతి వేగంగా పెరుగుతుందన్న విషయాన్ని మాత్రం మనం గ్రహించి తీరాలి. వయసుతో అలాగే జెండర్ తో తేడా లేకుండా ఈ డిప్రెషన్ ఎవరినైనా వేధిస్తుంది. నిజానికి, ఈ మధ్య జరుపబడిన అధ్యయనాలలో తేలిన ప్రకారం మూడేళ్ళ వయసు కూడా లేని పిల్లలు కూడా డిప్రెషన్ బారిన పడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు.

డిప్రెషన్ అనే పదానికి అర్థం కూడా తెలియనటువంటి పసిపిల్లలు సైతం ఇటువంటి తీవ్రమైన మానసిక వ్యాధికి గురవుతున్నారని ఊహించుకోవడం కూడా గగుర్పాటు కలిగించే విషయం.

డిప్రెషన్ ని తేలికగా తీసుకోకూడదు. ఇది చాలా ప్రమాదకరమైన మానసిక వ్యాధి. వివిధ రకాల డిప్రెషన్లతో సతమతమయ్యే వారిలో ఎక్కువ మందిలో ఆత్మహత్య ధోరణులు కనిపిస్తాయి.

tips to treat depression

సాధారణంగా, డిప్రెషన్ ని మూడ్ స్వింగ్స్ గా భావించి తేలికగా తీసుకుంటారు. అందుకే, వైద్యుల నుంచి సరైన సలహా తీసుకోరు. అయితే, సరైన సమయంలో ఈ ప్రాణాంతక మానసిక సమస్యను గుర్తించకపోతే ఈ సమస్య జఠిలమై ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తుంది.

డోపామైన్ అలాగే సెరోటోనిన్ వంటి కొన్ని రకాల బ్రెయిన్ కెమికల్స్ యొక్క ఉత్పత్తి క్షీణించడంవల్ల డిప్రెషన్ సమస్య వేధిస్తుంది.

వివిధ రకాల బాహ్య కారకాల వల్ల ఈ బ్రెయిన్ కెమికల్స్ యొక్క క్షీణత ఏర్పడుతుంది. అందువల్ల, డిప్రెషన్ కి గురైన వ్యక్తి ఎప్పుడూ మానసికంగా బాధపడుతూ ఉంటాడు.

డిప్రెషన్ కు కారణాలు...నివారణోపాయాలు....!

పని ఒత్తిడి, ఒత్తిడిపూరితమైన జీవితం, ఆర్ధిక ఇబ్బందులు, రిలేషన్ షిప్స్ లో ఇబ్బందులు, గతంలో జరిగిన మానసిక గాయాలు, కుటుంబంలో సరైన సహకారం లేకపోవడం వంటివి డిప్రెషన్ ను కలుగ చేసే కొన్ని కారణాలు.

డిప్రెషన్ కు గురైన వారిలో అపరిమితమైన బాధ, చెప్పలేని అలసట, ఉపసంహరించుకునే స్వభావం, ఆందోళన, ఆత్రుత, నిరాశ, దేనిపైనా ఆసక్తి లేకపోవడం, తీవ్ర భయాందోళన వంటివి కొన్ని లక్షణాలు. ఈ వ్యాధి తీవ్రంగా ముదిరిన కొద్దీ రోగిలో సూసైడల్ టెండెన్సీలను కూడా గుర్తించవచ్చు.

ఒకవేళ, మీరుగాని డిప్రెషన్ కి గురైతే లేదా మీకు తెలిసిన వాళ్ళెవరైనా డిప్రెషన్ లో ఉంటె వెంటనే సరైన వైద్య సహాయం తీసుకోండి. ఆలస్యం చేసిన కొద్దీ, పరిస్థితి చేయి జారిపోతుంది.

డిప్రెషన్, స్ట్రెస్ తగ్గించే అమేజింగ్ ఫుడ్స్...!

అయితే, డిప్రెషన్ ని తగ్గించడానికి ఇచ్చే మెడికేషన్స్ కొన్ని సమయాలలో సైడ్ ఎఫెక్ట్స్ ను కూడా కలుగచేస్తాయి. అందువల్ల, ఇక్కడ డిప్రెషన్ ని సహజంగా సురక్షిత మార్గాల ద్వారా ఎలా ట్రీట్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

1. ప్రియమైన వారితో తరచూ మాట్లాడండి:

1. ప్రియమైన వారితో తరచూ మాట్లాడండి:

మీరు మీకు ప్రియమైన వ్యక్తులతో తరచూ సంభాషించండి. వారితో సంభాషించడం ద్వారా మీకు ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. అధ్యయనాల ప్రకారం, నచ్చిన వారితో సమయాన్ని గడపడం వలన బ్రెయిన్ లో సెరోటోనిన్ అనేది సరైన మోతాదులో ఉత్పత్తి అవుతుంది. ఆహ్లాదకరమైన సంఘటనలను ప్రియమైన వారితో పంచుకుంటూ నవ్వుతూ, ఉత్సాహంగా, ఉల్లాసంగా గడపడం ద్వారా ఒత్తిడి దూరమవుతుంది.

2. పెంపుడు జంతువును కలిగి ఉండండి:

2. పెంపుడు జంతువును కలిగి ఉండండి:

మిసోరీ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం పెంపుడు జంతువుతో లేదా స్నేహితుల యొక్క పెంపుడు జంతువులతో గడిపే కాస్త సమయం కూడా బ్రెయిన్ లోని సెరోటిన్ స్థాయిలను అభివృద్ధి పరుస్తుంది. తద్వారా ఫీల్ గుడ్ ఫాక్టర్ అభివృద్ధి అవుతుంది. దాంతో, డిప్రెషన్ లక్షణాలు సహజంగా తగ్గిపోతాయి.

3. మంచి మసాజ్ తెరపీని ఆస్వాదించండి:

3. మంచి మసాజ్ తెరపీని ఆస్వాదించండి:

మసాజులంటే ఇష్టపడేవారికొక గుడ్ న్యూస్. డిప్రెషన్ ను సహజసిద్ధంగా తగ్గించేందుకు మసాజ్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. బ్రెయిన్ లోన్ కోర్టిసాల్ స్థాయిలను తగ్గించి సెరోటోనిన్ స్థాయిలను పెంచేందుకు మసాజ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అందువల్ల, డిప్రెషన్ ను దూరం చేసుకోవాలనుకునేవారు మసాజ్ లను ప్రిఫర్ చేయాలి.

4. ఒక కప్ కాఫీ లేదా టీ తీసుకోండి:

4. ఒక కప్ కాఫీ లేదా టీ తీసుకోండి:

ఉదయాన్ని కాఫీ లేదా టీ తాగే అలవాటు లేని వాళ్ళు ఈ అలవాటును తక్షణమే పెంపొందించుకోవాలి. ఇటీవలి అధ్యయనం ప్రకారం, ప్రతి రోజూ కాఫీ లేదా టీ తీసుకునే వాళ్లలో సెరోటోనిన్ స్థాయి ఉత్పత్తి ఆశాజనకంగా ఉండడంతో వారిలో డిప్రెషన్ లక్షణాలు దూరం అవుతాయని తెలుస్తోంది.

5. మనస్సుని ఆహ్లాదపరిచే ఆహారాలనే ఎంచుకోండి:

5. మనస్సుని ఆహ్లాదపరిచే ఆహారాలనే ఎంచుకోండి:

ఆరోగ్యకరమైన, మూడ్-బూస్టింగ్ ఫుడ్స్ ని ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా డిప్రెషన్ యొక్క లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చు. నట్స్, అరటిపండ్లు, కివీలు, బెర్రీస్, పాలకూర, టమోటాలు, చేప వంటివి డిప్రెషన్ ని సహజంగా అధిగమించడానికి తోడ్పడతాయి. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల బ్రెయిన్ లోని సెరోటోనిన్ స్థాయిలు అభివృద్ధవుతాయి.

6. ఒమేగా 3 యొక్క మోతాదును పెంచండి:

6. ఒమేగా 3 యొక్క మోతాదును పెంచండి:

అవొకాడో, నెయ్యి, కొబ్బరి నూనె వంటివి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్ చేరతాయి. తద్వారా, డిప్రెషన్ ని సహజసిద్ధంగా అధిగమించవచ్చు.

7. తల బెడ్ కి అంచున వచ్చేలా ఉండండి:

7. తల బెడ్ కి అంచున వచ్చేలా ఉండండి:

ప్రతి ఉదయం, మీరు నిద్రలేవగానే, మీ తలను మంచానికి ఎడ్జ్ లో ఉంచేలా కాసేపు ఉండండి. అలా చేయడం వలన, బ్రెయిన్ కు ఆక్సీజనేటెడ్ బ్లడ్ సరఫరా అవుతుంది. తద్వారా సెరోటోనిన్ స్థాయిలు పెరుగుతాయి.

8. వీకెండ్ ట్రిప్స్ కు వెళ్ళండి:

8. వీకెండ్ ట్రిప్స్ కు వెళ్ళండి:

ఒత్తిడితో కూడుకున్న డైలీ రొటీన్ నుంచి కాస్త విరామం తీసుకోండి. వీకెండ్ టిప్స్ ను ప్లాన్ చేసుకోండి. మీకిష్టమైన హాబీస్ కోసం సమయాన్ని కేటాయించుకోండి. ఇలా చేయడం వలన ఒత్తిడిని తగ్గించుకున్న వారవుతారు.

9. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలపాటు వ్యాయామానికి కేటాయించాలి:

9. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలపాటు వ్యాయామానికి కేటాయించాలి:

వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. డిప్రెషన్ ని అధిగమించడానికి వ్యాయామం తనదైన సహాయం చేస్తుంది. ప్రతిరోజూ, కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామానికి కేటాయించాలి. యోగా, జిమ్, జుంబా వంటివేదైనా సరే శరీరానికి అలసట అవసరం. తద్వారా సెరోటోనిన్ స్థాయిలు పెరిగి డిప్రెషన్ సమస్య తొలగిపోతుంది.

Read more about: depression, natural remedies
English summary

Tips To Treat Depression Naturally

Depression is a serious mental ailment which can have fatal consequences if not treated in time. The treatment for depression involves boosting the serotonin hormone levels in the brain. Following a healthy diet pattern, exercising regularly, deviating the mind into something more productive, etc., are some of the effective ways to treat depression naturally..
Subscribe Newsletter