పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) కు 7 ఎర్లీ వార్నింగ్ సంకేతాలు?

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

పాలిసిస్టిక్ అండాశయ సిండ్రోమ్ (అనగా PCOS) అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది మహిళల మీద ప్రభావితం చేస్తున్న మెడికల్ కండిషన్.

ఈ వ్యాధి, చిన్న తిత్తులు మీ అండాశయాల (గుడ్లు ఉత్పత్తి చేసే పునరుత్పత్తి అవయవాలు) మీద అభివృద్ధి చెందుతాయి, ఇది హార్మోన్ల అసమతుల్యతను అసాధారణంగా మరియు ఆండ్రోజెన్ (a.k.a మగ సెక్స్ హార్మోన్లు) ఉత్పత్తి చేస్తుంది.

మహిళల్లో సంతానలేమికి కారణం అయ్యే పిసిఒఎస్

మీకు వాటిలో కొన్ని లేదా అన్నింటిని చుపిస్తామంటే మీరు ఏమి చేస్తారు? చాలా ఆత్రంగా వాటి గురించి

తెలుసుకోవాలనుకుంటున్నారు కదూ? మరెందుకు ఆలస్యం PCOS యొక్క లక్షణాల గురించి మరింత తెలుసుకోవడానికి చదవడం కంటిన్యూ చూసేద్దామా..

# 1 ఇర్రేగులర్ పీరియడ్ సైకిల్

# 1 ఇర్రేగులర్ పీరియడ్ సైకిల్

మహిళలు సాధారణంగా కొన్ని ఆండ్రోజెన్లను ఉత్పత్తి చేస్తారు. కానీ PCOS లో, ఈ హార్మోన్ల సమతుల్యం కోల్పోతుంది, మరియు అకస్మాత్తుగా మీ శరీరం మగ సెక్స్ హార్మోన్లతో నిండిపోతుంది, ఇది మీ శరీరాన్ని ఎప్పటికప్పుడు ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మరియు కొన్నిసార్లు పూర్తిగా ఆపేస్తుంది.

కాబట్టి మీరు ఒక సంవత్సరానికి 9 కన్నా తక్కువ పీరియడ్స్ ని కలిగి ఉన్నారా లేదా చాలా నెలల నుండి

మీకు పీరియడ్స్ రావడం లేదా? అలాంటప్పుడు మిమల్ని మీరే ఈ రెండు ప్రశ్నల తో ప్రశ్నించుకోండి.

ఒకటి: నేను గర్భవతి నా?

మీరు లైంగికంగా చురుకుగా ఉంటే, ఇది మంత్లీ మీ పీరియడ్స్ రాకపోవడానికి కారణంగా కావచ్చు.

#2 మీ శరీరం మీద అధిక జుట్టు పెరుగుదల

#2 మీ శరీరం మీద అధిక జుట్టు పెరుగుదల

పురుషులు తమ శరీరం పైన ఎక్కువగా జుట్టును చాలా కలిగి ఉంటారు, ఎందుకంటే వారు ఉత్పత్తి చేసే పురుష హార్మోన్లు, ముఖ్యంగా టెస్టోస్టెరోన్ వలన .అందువల్ల ఒకవేళ మీరు PCOS తో బాధపడుతున్నట్లయితే, మీ ఛాతీ, బొడ్డు, వెనుక, మరియు ముఖం వంటి అసహజ ప్రదేశాలలో మందపాటి జుట్టు పెరుగుదల గమనించవచ్చు. ఈ పరిస్థితిని హిర్సూటిజం అని పిలుస్తారు. మరియు తీవ్రమైన పిసిఒఎస్ బాధపడుతున్న మహిళలలో గడ్డాలు మరియు మీసాలు కూడా పెరుగుతుండం విశేషం.

# 3 బరువు పెరుగుట

# 3 బరువు పెరుగుట

మీరు అతి తక్కువ సమయంలోనే అధికంగా బరువు పెరుగుతున్నారా,ఇది సాధారణంగా జంక్ ఫుడ్ మరియు అనారోగ్యకరమైన ఆహారం తినడం చాలా ఎక్కువగా ఉంటుంది.

అయితే మీరు ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తున్నప్పటికీ మీరు బరువు పెరుగుతున్నట్లైతే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.అసాధారణ బరువు పెరగడం అనేది హైపో థైరాయిడిజం, డయాబెటిస్, మరియు కుషింగ్స్ సిండ్రోమ్ వంటి అనేక వ్యాధుల సంకేతం గా వుంది. కానీ మీరు బరువు పెరగడానికి ముఖ్య కారణం పీరియడ్స్ కానీ అయితే, మీ సమస్య యొక్క మూల కారణం PCOS కావచ్చు.

# 4 మొటిమలు

# 4 మొటిమలు

మొటిమలు సాధారణంగా పిసిఒఎస్ హార్మోన్ల అసమతుల్యం వలన ఏర్పడుతాయి, ఇది మన యవ్వనం పెరుగుతున్న కొద్దీ మన ప్రత్యుత్పత్తి వ్యవస్థ లైంగిక సామర్థ్య అవయవాల లో పరిపక్వత మొదలైనప్పుడు పోలికలు మారుతాయి. అందువల్ల మనకు యుక్తవయసులో తీవ్రమైన మోటిమలు వస్తాయి ఇంకా పాలిసిస్టిక్ అండాశయాలు ఉన్నప్పుడు అదే విధంగా ఉంటాయి.

# 5 అధికంగా జుట్టు రాలిపోవడం

# 5 అధికంగా జుట్టు రాలిపోవడం

హార్మోన్ టెస్టోస్టెరోన్ వలన పురుషులలో అధికంగా జుట్టు రాలడం జరుగుతుంది మరియు పిసిఒఎస్ మహిళల శరీరంలో అధిక ఆండ్రోజెన్లను తిరుగుతున్న కారణంగా, ఇది కూడా ఈ లక్షణానికి కారణం కావచ్చు.

పిసిఓఎస్ ఉన్నమహిళలు బరువు తగ్గించే చిట్కాలు

# 6 లోతైన వాయిస్

# 6 లోతైన వాయిస్

పైన తెలిపిన లక్షణం లాగానే, పిసిఒఎస్ తో బాధపడుతున్న మహిళలు డీపెర్ వాయిస్ ని పొందడానికి ఆండ్రూన్స్ కారణం కావచ్చు. ఎందుకంటే ఇవి యుక్తవయసులో పెరుగుతున్న బాలుడు యొక్క వాయిస్ మారడానికి చాలా హార్మోన్లు కారణం అవుతాయి.

# 7 ఫెర్టిలిటీ ఇష్యూ

# 7 ఫెర్టిలిటీ ఇష్యూ

పిసిఒఎస్ కలిగి ఉందని చెప్పడానికి అతి పెద్ద సంకేతం బిడ్డను కలగడానికి కష్టంగా ఉండటం (ఈ లక్షణం అప్పుడప్పుడు ఇర్రేగులర్ పీరియడ్స్ మరియు పైన పేర్కొన్న లక్షణాలలో కొన్ని మరికొన్నిమందికి కారణం కావచ్చు).

నిజానికి, PCOS గర్భధారణ మధుమేహం (అనగా, గర్భధారణ సమయంలో మధుమేహం) అభివృద్ధి చెందుతున్న ప్రమాదాన్ని పెంచుతుంది మరియు డెలివరీ సమయంలో సమస్యలను కలిగిస్తుంది.

ఈ వ్యాసం మీకు ఉపయోగపడిందా?

మీరు ఈ లక్షణాలలో కొన్నింటిని లేదా అన్నింటిని కలిగివున్నట్లయితే, మీకు పిసిఒఎస్ ని కలిగి ఉన్నారో లేదో తెలుసుకోవడానికి దయచేసి ఒక గైనకాలజీని సంప్రదించండి.మరియు మీరు ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందని అనుకుంటే, మీ జీవితంలోని మరికొందరి మహిళలతో దీన్ని షేర్ చేసుకోండి, అందువల్ల వారు కూడా దీనిని చదివి అప్రమత్తంగా ఉండవచ్చు.

నెక్స్ట్ చదవండి- పీరియడ్స్ సమయంలో తెసుకోవాల్సిన 21 బెస్ట్ ఫుడ్స్.

English summary

Symptoms of PCOS You Need to Know

If you are a woman, you need to read this.
Subscribe Newsletter