నేను చెప్పే ఈ చిట్కాలు అనుసరిస్తే మీ షుగర్ ను కంట్రోల్లో పెట్టుకోవచ్చు..!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

కొన్నేళ్లుగా.. షుగర్ వ్యాధితో బాధపడే పేషంట్స్ సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. డయాబెటిస్ అనేది ప్రస్తుత రోజుల్లో కామన్ డిసీజ్ గా మారిపోయింది. కాస్త వయసు పెరుగుతోంది అంటే చాలు.. షుగర్ వ్యాధి బారినపడుతున్నారు. ఇది ఒక్కసారి వచ్చిందంటే.. లైఫ్ లాంగ్ ఉండే వ్యాధి. బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరగడం వల్ల డయాబెటిస్ సమస్య మొదలవుతుంది.

ప్రస్తుత రోజుల్లో అనుసరిస్తున్న ఆహారపు అలవాట్లు, వారసత్వం, వయసు, ఒబేసిటీ, స్మోకింగ్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కూడా డయాబెటిస్ రావడానికి కారణమవుతున్నాయి. డయాబెటిస్ కారణంగా మెటబాలిజంపై దుష్ర్పభావం చూపుతుంది. చాలా అరుదైన సందర్భల్లో ఇది కిడ్నీ ఫెయిల్యూర్ కి కారణమవుతుంది.

These Herbs Help Sugar Patients!

చాలా ఎక్కువగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతే.. ప్రాణానికే ముప్పు. కాబట్టి డయాబెటిక్ పేషంట్స్ డైట్ చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. డయాబెటిస్ ఉందంటే.. తీసుకునే ప్రతి ఆహారం చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే డయాబెటిస్ పేషంట్స్ లో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసే న్యాచురల్ హెర్బల్ హోం రెమిడీస్ ఏంటో తెలుసుకుందాం..

పసుపు

పసుపు

డయాబెటిస్ తో పోరాడే దినుసుల్లో పసుపు ఒకటి. ఇందులో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తాయి. పసుపులో ఉండే కుర్కుమిన్ అనే కంటెంట్ లో మెడిసినల్ వాల్యూస్ అధికంగా ఉంటాయి. ఇది యాంటీ డయాబెటిక్ గా పనిచేస్తుంది. బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

మెంతులు

మెంతులు

మెంతులు బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడంలో మెంతులు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. పురాతన కాలం నుంచి మెంతులను డైట్ లో చేర్చుకుంటున్నారు. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. కాబట్టి డయాబెటిక్ పేషంట్స్ రెగ్యులర్ డైట్ లో మెంతులు చేర్చుకోవాలి.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క

దాల్చిన చెక్కలో ఫైటో న్యూట్రియంట్స్ ఉండటం వల్ల డయాబెటిక్ పేషంట్స్ కి అద్భుతమైన ఔషధం. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించడంలో చెక్క ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని స్టడీస్ చెబుతున్నాయి.దాల్చిన చెక్కలో అద్భుతమైన సువాసన కలిగి ఉంటుంది. వాసనతో పూర్తికాదు, షుగర్ పేషంట్స్ కోసం ఇది ఒక అద్భుతమైన హోం రెమెడీ. ఇది శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది .షుగర్ పేషంట్స్ కోసం ఇది ఒక ఉత్తమ హోం హేర్బల్ రెమెడీ.

కలబంద

కలబంద

కొన్ని పరిశోధనల ప్రకారంన కలబంద రసాన్ని తీసుకోవడం వల్ల ఇది బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను మెరుగుపరుస్తుంది. ఇది బ్లడ్ లిపిడ్ లెవల్స్ వాపులు మరియు గాయాలను తగ్గిస్తుంది.

కలబంద రసాన్ని కొన్ని నెలల పాటు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల తప్పకుండా 50శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.

అల్లం

అల్లం

చిన్న అల్లం ముక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందట. ఇందులో ఉండే ఎంజైమ్.. డయాబెటిస్ తో పోరాడే సత్తా కలిగి ఉంటుంది.అల్లం మరో ఉపయోగకరమైన డయాబెటిస్ హేర్బల్ రెమెడీ. ఇది ఇన్సులిన్ సెన్షివిటిని పెంచుతుంది మరియు శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను మెయింటైన్ చేస్తుంది.

ఉల్లిపాయలు:

ఉల్లిపాయలు:

ఉల్లిపాయలు బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. పచ్చి ఉల్లిపాయలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. అందుకు ఉల్లిపాయల్లోని అల్లియం సీపా సహాయపడుతుంది.

కొత్తిమీర:

కొత్తిమీర:

కొత్తిమీర మరియు వెల్లుల్లిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. డయాబెటిస్ తో బాధపడే వారికి ఈ రెండు బాగా సహాయపడుతాయి.కొత్తిమీర డయాబెటిక్ పేషంట్స్ కు ఇన్సులిన్ లా పనిచేస్తుంది. బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను పెంచుతుంది.

బ్లూ బెర్రీ :

బ్లూ బెర్రీ :

బ్లూ ల్ బెర్రీ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటానికి ప్రసిద్ది చెందింది. అలాగే ఒక నెల ప్రతి రోజు ఆహారంలో ఒక గ్రాము దాల్చిన పొడిని తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలు తగ్గుతాయి. బ్లాక్బెర్రీ భారత బ్లాక్బెర్రీ యొక్క విత్తనాలలో గ్లైకోసైడ్ ఉండుట వలన రక్తంలో చక్కెర స్టార్చ్ మార్పిడిని నిరోధిస్తుంది. ఇది రక్తంలో చక్కర స్థాయిలను తగ్గించుట మరియు ఇన్సులిన్ నుండి వచ్చే చిక్కులను వెంటనే తనిఖీ చేస్తుంది. ఈ పండుకు గుండెను రక్షించే లక్షణాలు కూడా ఉన్నాయి.

English summary

These Herbs Help Sugar Patients!

The best way to stay unaffected by diabetes is to keep your blood glucose levels under control. These herbs do exactly that!
Subscribe Newsletter