For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నీరసం, అలసట రాకుండా ఉండాలా? ఈ యోగాసనాలు ట్రై చేయండి...

మీరు కొద్దిపాటి దూరం నడిస్తేనే ఆయాసపడుతున్నారా? లేదా ఆఫిసులో ఒక గంట రెండు గంటల పని చేసిన తర్వాత బాగా అలసిపోయినట్టు అనిపిస్తొందా? అందుకు కారణం మీ శరీరంలొ సత్తువ లేకపోవడం కావచ్చు.

|

మీరు కొద్దిపాటి దూరం నడిస్తేనే ఆయాసపడుతున్నారా? లేదా ఆఫిసులో ఒక గంట రెండు గంటల పని చేసిన తర్వాత బాగా అలసిపోయినట్టు అనిపిస్తొందా? అందుకు కారణం మీ శరీరంలొ సత్తువ లేకపోవడం కావచ్చు. మీకు ముందు చెప్పినట్టు ఏమైనా అనిపిస్తుంటే అందుకు చక్కగా పనిచేసే పరిష్కారం గురించి చదవండి.

శ్వాస మరియు మైగ్రైన్ వంటి సమస్యలకు చికిత్సగా యోగాసనాలు బాగా పని చెస్తాయని మీరు విని మరియు చదివే ఉంటారు. అంతే కాకుండ మన శరీరంలొ సత్తువ పెరిగి తద్వారా త్వరగా అలసిపోకుండ ఉండడానికి కొన్ని ప్రత్యెకమైన యోగాసనాలు ఉన్నాయి.

ఈ రోజు మనం బడలిక మరియు అలసట రాకుండా ఎలాంటి యోగాసనాలు చేయాలొ చూద్దాం.

అసలు ఎవరైనా ఎందుకు అలసిపోతారు? మన శరీరంలో అక్సిజన్ తగ్గిపోయినప్పుడు, మన అవయవాలు మరియు శరీర భాగాలు సరిగా పని చేయలేవు. ఇలా సరిగా పని చెయనప్పుడే మనకు అలసటగా, బడలికగా అనిపిస్తుంది.

ప్రాచీన కాలం నుండి ఇలాంటి శరీర పరిస్థితులను నయం చేయడానికి యోగాసనాలను చికిత్సగా వాడుతున్నారు. అలాంటి అలసట, బడలిక ని నయం చేసే కొన్ని యోగాసనాల జాబితా మీకోసం చదవండి.

These Yoga Asanas Help Fight Fatigue & Tiredness Efficiently

1. శేతుభంధాసనం ( బ్రిడ్జ్ పోజ్ )

క్రమ పద్ధతిలో శేతుభంధాసనం చేసే విధానం:

a.వెళ్ళకిలా పడుకుని మోకాళ్ళను ముడవండి.

b.అరచేతులు నేల వైపు ఉంచి రెండు చేతులను ముందుకు పెట్టండి.

c.నెమ్మదిగా ఛాతి గడ్డమును తాకే వరకు నడుమును పైకి లేపండి.

d.తొడలు రెండు ఒకదానికి ఒకటి సమాంతరంగా ఉండేల చుసుకొండి.

e.శరీరాన్నీ అదే భంగిమలొ నిలకడగా కొద్ది సేపు ఉంచండి.

These Yoga Asanas Help Fight Fatigue & Tiredness Efficiently

2. ఉష్ట్రాసనం ( కేమల్ పోజ్ )

క్రమ పద్ధతిలో ఉష్ట్రాసన చేసే విధానం:

a.మోకాళ్ళపై నిలబడి చేతులను పొత్తికడుపు వెనక ఉంచి అరచేతులను పిరుదులపై ఉంచండి.

b.బొడ్డు దగ్గర లాగినట్టు అనిపించే వరకు నెమ్మదిగా మీ వెన్నుపూసను మీ జఘన సంధానమునకు దగ్గరగా తీసుకు రండి.

c.చేతులు తిన్నగా ఉంచుతూ పాదాలను పట్టుకుని నెమ్మదిగా వెనుకకు వంగండి.

d.మీ మెడను ఎక్కువగా వంచి శ్రమపెట్టకుండా జాగ్రత్త పడండి.

e.ఈ భంగిమలొ 30-40 సెకండ్లు ఉండి తర్వాత సాధారణ స్థితికి రండి.

These Yoga Asanas Help Fight Fatigue & Tiredness Efficiently

3. సుప్తవిరాసనం ( రిక్లైనింగ్ హీరో పోజ్ )

క్రమ పద్ధతిలో సుప్తవిరాసన చేసే విధానం:

a.తొడలకు ఇరువైపుల చేతులు ఉంచి ఒక మ్యాట్ మీద మోకాళ్ళ పై కూర్చొండి.

b.నెమ్మదిగా బలంగా ఊపిరి తీసుకుంటూ వెనకకు నేలపై వాలండి.

c.ముందుగా బరువు చేతులపై ఉంచి తర్వాత నెమ్మదిగా బరువును మోచేతుల మరియు భుజాలపైకి మార్చండి.

d.మీ పిరుదులను కిందకు వంచుతూ చేతులను వెనుకకు తీసుకురండి.

e.ఈ భంగిమలొ కొద్ది సేపు ఉండి తర్వాత సాధారణ స్థితికి రండి.

These Yoga Asanas Help Fight Fatigue & Tiredness Efficiently

4. శలభాసనం ( లొకస్ట్ పోజ్ )

క్రమ పద్ధతిలో శలభాసనం చేసే విధానం:

a.నేల మిద పొట్టపై పడుకొవాలి, అలాగె కాలి వేళ్ళు సమంగా మరియు గడ్డము నేలకు తగిలేట్టుగా చూసుకోవాలి.

b.మోకాళ్ళు మరియు మోచేతులు తిన్నగా ఉండేలా చూసుకోవాలి.

c.బలంగా ఊపిరి తీసుకుంటూ, నెమ్మదిగా ఛాతి , భుజాలు, కాళ్ళు, తొడలు గాలిలోకి లేపండి.

d.నెమ్మదిగా చేతులు మరియు కాళ్ళు వీలైనంతగా చాచండి.

e.ఈ భంగిమలొ కొద్ది సేపు ఉండండి. తర్వాత ఊపిరి వదిలి సాధారణ స్థితికి రండి.

f.ఇలా 3-4 సార్లు చేయండి.

English summary

These Yoga Asanas Help Fight Fatigue & Tiredness Efficiently

What exactly leads one to get fatigued? When the body lacks in adequate oxygen, the organs and body parts cannot function normally. This leads to fatigue and tiredness. Since ancient times yoga is being practised for treating conditions like this. So, here is a list of these few yoga asanas that help to fight fatigue and tiredness efficiently. Check it out.
Desktop Bottom Promotion