For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోల్డ్ నుండి తక్షణ ఉపశనమనానికి టాప్ 10 ఫుడ్స్

By Lekhaka
|

సాధారణంగా ఫ్లూ వాతావరణంలోని తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు తొందరగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఫ్లూజ్వరం వాతావరణంలో మార్పు, రోగనిరోధక శక్తి తక్కువ ఉండటం, వర్షంలో తడవటం మరియు వైరస్‌వలన వ్యాప్తి చెందుతుంది. ఇది ఒక వైరస్ వల్ల కలిగే జబ్బు . దీనివల్ల ప్రాణ హాని కలుగదు కాని రకరకాల వ్యాధులకు ఇది దారి తీయవచ్చు. ఇది పూర్తిగా అంటువ్యాధి. ఇన్‌ఫ్లుయోంజా క్రిములు శరీరంలోకి ప్రవేశించి రెండు మూడు రోజులలోనే అపరిమితంగా వృద్ధిపొందుతాయి. ఆ క్రిములు వెలిగ్రక్కే విషం శరీరంలో హెచ్చు తుంది. అందువల్ల శరీరావయవాలన్నీ క్రుంగిపోతాయి.

ఫ్లూ కోల్డ్ చిన్న పిల్లల నుండి , పెద్దల వరకూ అందరిలో వేధించే సమస్య. కోల్డ్ ఫ్లూ లక్షణాలు గొంతునొప్పి, గొంతు వాపు, సైనస్, ముక్కుదిబ్బడ, దగ్గు, తరచూ దగ్గు, జ్వరం ఉంటుంది. ఈ లక్షణాల వల్ల శరీరం బలహీనంగా మారుతుంది.

మనందరికి తెలుసు జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ జబ్బుల నుండి బయటపడాటానికి వ్యాధినిరోధక శక్తి పెంచుకోవడానికి, సరైన ఆహార, పానియాలు తీసుకోవాలని. ఐతే అందులో కూడా ఫ్లూ నివారణకు సరైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అయితే ఫ్లూ మరియు ఇతర ఇన్ఫెక్షన్ కు గురియైనప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలో చాలా మందికి తెలియదు. ఇన్‌ఫ్లూయంజా వైరస్ వలన జలుబు వస్తుంది. ఇది సాధారణ ఫ్లూ. ఈ మధ్య 'ఫ్లూ'కి సంబంధించిన ఓ కొత్త విషయం కనిపెట్టారు శాస్తజ్ఞ్రులు. ఆహారంలో మార్పులు చేస్తే 'ఫ్లూ'ని అరికట్టవచ్చని. భారతీయ ఆహార విధానం 'ఫ్లూ'ని సమర్ధవంతంగా అరికడుతుంది. జలుబు, దగ్గు, ఫ్లూ ఉన్నప్పుడు మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కొన్ని ఆహారాలు మీకోసం....

1. వెల్లుల్లి:

1. వెల్లుల్లి:

వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీవైరల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇందులో అల్లీసిన్ లక్షణాలు కూడా అధికంగా ఉన్నాయి. దీన్నే యాంటీఆక్సిడెంట్ గా పిలుస్తారు. కాబట్టి,పిల్లల్లో, పెద్దల్లో జలుబు దగ్గు నివారించడంలో ఇది బెస్ట్ ఫుడ్ గా భావిస్తారు

2. గ్రీన్ టీ :

2. గ్రీన్ టీ :

గ్రీన్ టీ లో వ్యాధులతో పోరాడే యాంటీఆక్సిడెంట్స్ , యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉన్నాయి.ఇవి కామన్ కోల్డ్ తో పోరాడుతాయి. జలుబు, దగ్గు నివారించడంలో బెస్ట్ నేచురల్ రెమెడీ..

3. బ్లూ బెర్రీస్ :

3. బ్లూ బెర్రీస్ :

జలుబుతో బాధపడే వారిలోబ్లూబెర్రీస్ నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. ఇందులో ఇంకా యాంటీఆక్సిడెంట్స్, న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. వ్యాధినిరోధకత పెంచడంలో టాప్ ఫుడ్స్ లో బ్లూ బెర్రీస్ ఒకటి.కాబట్టి, కోల్డ్ తగ్గించడంలో బ్లూ బెర్రీస్ కు ప్రత్యేక స్థానం ఉండి.

4. ఆరెంజెస్ :

4. ఆరెంజెస్ :

పండ్లు విటమిన్స్ మరియు మినిరల్స్ కు నేచురల్స్ కు ఒక సహజ వనరు. ప్లూ నివారించే ఆహారాల్లో ముఖ్యంగా పండ్లు ఇవి చాలా సులభంగా మరియు తేలికగా జీర్ణం అవుతాయి. ఆరెంజ్ ద్రాక్ష, ఆపిల్స్ మరియు ఇతర కొన్ని రకాలా పండ్లు ఫ్లూ నివారించడంలో సహాయపడుతాయి. పండ్లు ఇంకా శరీరాన్ని రీహైడ్రేషన్ చేస్తాయి. దాంతో ఫ్లూను నివారించుకోవచ్చు. పండ్ల ద్వారానే ఫ్లూ ట్రీట్మెంట్ ను చేయవచ్చు. నేచరల్ గా ఎప్పుడూ అందుబాటులో ఉండే పండ్లను తినడం ద్వారా ఫ్లూ ను నివారించవచ్చు.

5. పెరుగు:

5. పెరుగు:

వ్యాధినిరోధకత పెంచడంలో పెరుగు ఉత్తమమైనది మరియు కామన్ గా వచ్చే కోల్డ్ ను నేచురల్ గా తగ్గిస్తుంది. కోల్డ్ మరియు ఫ్లూ తగ్గించడానికి వ్యాధనిరోధకతను పెంచడానికి పెరుగు సహాయపడుతుంది. పిల్లల్లో కూడా ఫ్లూ, కోల్డ్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

6. మష్రుమ్స్:

6. మష్రుమ్స్:

వైరల్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో పుట్టగొడుగులు గొప్పగా సహాయపడుతాయి. సైటోకిన్స్ ను అందివ్వడం వల్ల శరీరంలోని ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది.

7. బ్రాజిల్ నట్స్ :

7. బ్రాజిల్ నట్స్ :

బ్రాజిల్ నట్స్ లో సెలీనియం అధికంగా ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ పెంచడంలో ,సూక్ష్మ క్రిములతో పోరాడటంలో బ్రాజిల్ నట్స్ గొప్పగా సహాయపడుతాయి. జలుబు తగ్గించడంలో ఇది ఒక బెస్ట్ ఫుడ్.

8. రెడ్ బెల్ పెప్పర్:

8. రెడ్ బెల్ పెప్పర్:

రెడ్ బెల్ పెప్పర్ లో యాంటీఇన్ఫ్లమేటరీ , యాంటీఆక్సిడెంట్స్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. న్యూట్రీషియన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. హెల్తీ బాడీ మెయింటైన్ చేయడానికి గొప్పగా సహాయపడుతుంది. పిల్లలు మరియు పెద్దల్లో వ్యాధినిరోధకతను పెంచుతుంది

9. గుమ్మడి విత్తనాలు:

9. గుమ్మడి విత్తనాలు:

గుమ్మడి విత్తనాల్లో జింక్ అధికంగా ఉంటుంది.ఇది కామన్ కోల్డ్ తో పోరాడుతుంది. ఇందులో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. వ్యాధినిరోధకతను పెంచుతుంది. ఫ్లూ నివారించే టాప్ ఫుడ్స్ లో ఇది ఒకటి.

10. స్వీట్ పొటాటో:

10. స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటోలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. దాంతో శరీరంలో జీవక్రియలు చురుగ్గా ఉంటాయి.

English summary

Top 10 Foods That Will Help Prevent Cold In Children And Adults

Nobody can escape from the clutches of common cold. Nobody is immune to it. There are about 200 viruses that can cause common cold. Out of this, rhinovirus is the one that is often known to cause common cold.
Desktop Bottom Promotion