పీరియడ్స్ సమయంలో మొటిమలను పోగొట్టుకోవడానికి చిట్కాలు

By: Mallikarjuna
Subscribe to Boldsky

మహిళలందరూ ఎదుర్కొనే సమస్య రుతుక్రమం. నెలకొకసారి నేనుండానని పలకరిస్తుంటుంది. ఈ సమయంలో మహిళల మనసు మారడం, పొట్టలో తిమ్మెర్లు, పొట్ట నొప్పి సమస్యలుంటాయి.

చాలా మంది మహిళలకు ఈ పిఎంఎస్ సమయంలో మొటిమలు చీకాకు కలిగిస్తుంటాయి. సహజంగా మొటిమలను పీరియడ్స్ కు కొద్ది రోజుల ముందు నుండే ముఖంలో గమనిస్తుంటాము. అలాగే పీరియడ్స్ సమయం ముగియగానే మొటిమలు కనబడకుండాపోతాయి.

మొటిమలను పర్మనెంట్ గా నివారించే బేసిక్ అండ్ ఎఫెక్టివ్ ఆయుర్వేద చిట్కాలు..!!

మహిళల పీరియడ్స్ సమయంలో టెస్టోస్టెరాన్, ఈస్టోజెన్ అనే రెండు ముఖ్యమైన హార్మోనులు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. వీటిలో మార్పుల వల్లే హార్మోనుల్లో మార్పులు వచ్చి, చర్మంలో మొటిమలకు కారణమవుతుంది.

సాధారణంగా మహిళల్లో 21-24 రోజుల మద్య పీరియడ్స్ ప్రారంభమవుతుంది. పీరియడ్స్ అయిపోయిన 14 రోజుల తర్వాత తిరిగి ఈస్ట్రోజెన్ లెవల్స్ క్రమంగా పెరగడం ప్రారంభం అవుతుంది. ఈస్ట్రోజెన్ లెవల్స్ తగ్గడం మొదలవ్వగానే, టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవల్స్ పెరుగుతాయి. ఈ కారణం వల్ల చర్మంలో సెబాస్టియన్ గ్రంథులు ఎక్కువగా సెబమ్ ను ఉత్పత్తి చేయడం వల్ల మొటిమలు వస్తాయి .

15 నిమిషాలు కేటాయిస్తే చాలు.. మొటిమలు, మచ్చలు బై బై

కాబట్టి, పీరియడ్స్ సమయంలో హార్మోన్ లెవల్స్ పెరగడం వల్ల చర్మంలో మొటిమలు, మచ్చలకు దారితీస్తుంది. పీరియడ్స్ ముగిసిన వెంటనే మొటిమలు మాయం అవుతాయి. ఇలా పీరియడ్స్ ముందు మొటిమలు 63 శాతం మందిలో వస్తుంటాయి. 30ఏళ్ళు, 40 ఏళ్ళ మద్యలో వారికి అంతగా ఇబ్బంది కలిగించవు.

శరీరంలో లోపల జరిగే హార్మోనుల మార్పులు వల్ల ఇలా అకస్మికంగా కనిపించే మొటిమలను మనం నిర్మూలించలేము. కానీ, బయటకు కనిపించే మొటిమలను ఎఫెక్టివ్ గా కొన్ని న్యాచురల్ రెమెడీస్ తో నివారించుకోవచ్చు.

1. బర్త్ కంట్రోల్ పిల్స్ :

1. బర్త్ కంట్రోల్ పిల్స్ :

పీరియడ్స్ లో వచ్చే మొటిమలను నివారించుకోవడం కోసం డెర్మటాలజిస్ట్ ను కలుస్తుంటారు. అయితే, పిఎమ్ఎస్ లో వచ్చే మొటిమలను నివారించుకోవడానికి వారు సూచించే బర్త్ కంట్రోల్ పిల్స్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఈ పిల్స్ స్ట్రోజెన్ లెవల్స్ ను పెంచి, టెస్టోస్టెరాన్ తగ్గించడం వల్ల మొటిమలను తగ్గుతాయి. కొన్ని బర్త్ కంట్రోల్ పిల్స్ చర్మంలో నూనె ఉత్పత్తి కాకుండా నివారిస్తుంది. అయితే బర్త్ కంట్రోల్ పిల్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి అవగాహన కలిగి ఉండాలి. డాక్టర్స్ సూచన ప్రకారం తీసుకుంటే పీరియడ్స్ లో వచ్చే మొటిమలను నివారించుకోవచ్చు.

2. పొటాషియం స్పారింగ్ డ్యూరియాటిక్స్ :

2. పొటాషియం స్పారింగ్ డ్యూరియాటిక్స్ :

పిఎంఎస్ మొటిమలను తగ్గించుకోవడంలో బర్త్ కంట్రోల్ పిల్స్ ఎఫెక్టివ్ గా పనిచేయనప్పుడు, పొటాషియం స్పారింగ్ డ్యూరియటిక్స్ శరీరంలో టెస్ట్రోస్టెరాన్ లెవల్స్ ను తగ్గిస్తుంది. అయితే ఇవి అందరు మహిళలకు పట్టకపోవచ్చు. వీటి వల్ల చాతీలో మంట, సలుపు, వికారం, అలసట వంటి లక్షణాలు కనబడుతాయి.

పీరియడ్స్ లో నొప్పులు, తిమ్మెర్లు తగ్గించే కామన్ ఫుడ్స్!

3. సప్లిమెంట్స్ :

3. సప్లిమెంట్స్ :

మొటిమలకు మరో ముఖ్యమైన కారణం పోషకాల లోపం , ఇలాంటి వారు డైటరీ సప్లిమెంట్ విటమిన్స్ మరియు మినిరల్స్ తీసుకోవడం వల్ల మొటిమలను నివారించుకోవచ్చు. అమినో యాసిడ్, జింక్, ఎల్ కెరొటినిన్ ఇవి హార్మోనులను మెరుగుపరిచి మొటిమలు ఏర్పడకుండా చేస్తుంది.

4. న్యాచురల్ రెమెడీస్ :

4. న్యాచురల్ రెమెడీస్ :

మన శరీరంలో చర్మం అతి పెద్ద అవయవం. చర్మంను ఎప్పటికప్పుడు డిటాక్సిఫికేషన్ చేసుకోవాలి. న్యాచురల్ రెమెడీస్ లో నీళ్ళను ఎక్కువగా తాగడం వల్ల మొటిమలు ఏర్పడకుండా ఉంటాయి. ఇర్రెగ్యులారిటీస్ వల్ల డిటాక్సిఫికేషన్ ప్రొసెస్ కంప్లీట్ చేస్తుంది. ఎక్కువగా నీళ్ళు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు ఫ్లస్ అవుట్ అవుతుంది. దాంతో మొటిమల సమస్య తగ్గుతుంది.

ఆయిల్ ఫుడ్స్ ను తినడం నివారించడం వల్ల కూడా , సెబమ్ ఉత్పత్తి తగ్గుతుంది. దాంతో బ్రేక్ అవుట్స్ తగ్గుతాయి.

ఆయిల్ స్కిన్ కలవారు, రోజుకు రెండు సార్లు ముఖం శుభ్రం చేసుకోవాలి. మేకప్ ప్రొడక్ట్స్ ను ఎక్కువగా ఉపయోగించకూడదు. ఆయిల్ బేస్డ్ కాస్మోటిక్స్ ను పూర్తిగా నివారించాలి.

ఫేస్ వాష్ లో సాలిసిలిక్ యాసిడ్, బెంజాల్ పెరాక్సైడ్ మొటిమలను నివారిస్తుంది.

చివరగా, రోజువారి ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలి.

English summary

Ways To Prevent Breakouts During Periods

There are certain ways to prevent period breakouts. Know about these ways here on Boldsky.
Subscribe Newsletter