ఎముకల సమస్యలకు ఇంటి చిట్కాలు

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ఇటీవల పరిశోధకులు, ఒక ఆరు అంగుళాల అస్థిపంజరం కనుగొన్నారు, ఇది ఒక గ్రహాంతరవాసిగా ఊహాగానానికి కూడా దారితీసింది. కానీ తరువాత ఈ అస్థిపంజరం ఒక మానవునిదని తెలిసి అవాక్కయ్యారంతా. ఆశ్చర్యంగా ఉంది కదా ?

మరింత పరిశోధన చేసిన తర్వాత , ఈ అస్థిపంజరం జన్యు సంబంధిత సమస్యలు కలిగి నెలలు నిండకుండా పుట్టిన ఒక ఆడ శిశువుది గా గుర్తించారు.

ప్రధానంగా ఈ సమస్య ఎముకల పటుత్వ లోపం కారణంగా సంభవించినది. అనేకమంది ప్రజలు ఎముకల నొప్పులకు , జాయింట్ పెయిన్స్ కై అనేక మందులను వాడుతూ కనిపిస్తుంటారు. అంతగా సర్వసాధారణమైన సమస్యగా మారిపోయింది.

కొన్ని పరిశోధనల ప్రకారం పెద్దలలో మూడింత ఒక వంతు ఈ జాయింట్ పెయిన్స్ సమస్యలతో భాధపడుతున్నారని అంచనా. తరచుగా కీళ్ళ నొప్పి సంభవించే ప్రాంతాలైన వెన్ను కింది భాగం, మెడ, మోకాలు, నడుము, తొంటి భాగం మరియు భుజాలు ప్రధానంగా ఉంటాయి.

ఆర్థరైటిస్ ఫౌండేషన్ ప్రకారం దవడ, మోకాలు, నడుము, మెడ మరియు వెన్ను పైభాగాన ఉమ్మడి నొప్పి ఎక్కువగా ఉంటుంది.

ఎముకల సమస్యలను నివారించడానికి, అనేక ఇంటి చిట్కాలు ఉన్నాయి, అవి నొప్పి నివారణకు మందులపై ఆధారపడకుండా మరియు నొప్పి పెరుగకుండా చూడడంలో సహాయం చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

ఎముక సమస్యలకై ఇంటి నివారణా చర్యలు:

1. ఎప్సోమ్ ఉప్పు

1. ఎప్సోమ్ ఉప్పు

ఎప్సోమ్ ఉప్పు మెగ్నీషియం మరియు సల్ఫేట్ల మిశ్రమాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. ఈ ఎప్సోమ్ ఉప్పుకు నొప్పిని మంటను తగ్గించే గుణాలు కలిగి ఉన్న కారణంగా కండరాల నొప్పులకు సత్వర ఉపశమనాన్ని ఇవ్వగలదు

స్నానం చేయు నీళ్ళలో 2 కప్పుల ఎప్సోమ్ ఉప్పును వేసి 20 నిమిషాలు అందులో మునుగునట్లు ఉండండి, లేదా 2 కప్పుల ఎప్సోమ్ ఉప్పును కలిపి ఉన్న నీటిలో టవల్ ను ముంచి నొప్పి కలిగిన భాగంలో అద్దడం ద్వారా అయినా తక్షణ ఉపశమనాన్ని పొందవచ్చు.

2. హాట్ మరియు కోల్డ్ ప్యాక్స్

2. హాట్ మరియు కోల్డ్ ప్యాక్స్

వెంటనే నొప్పి ఉపశమనం కోసం, ఒక చల్లని ఐస్ ప్యాక్ మరియు లేదా వేడి నీళ్ళ కాపడం బాగా పని చేస్తాయి. ఇది జాయింట్ పెయిన్స్ కి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

మొదట, 20 నిమిషాలు బాధిత ప్రాంతంలో వేడి నీళ్ళలో ముంచిన తువాలుతో కాపడం చేయండి.

తరువాత, 20 నిమిషాలు చల్లని ఐస్ ప్యాక్ తో ఆ ప్రాంతాన మర్ధనలా చేయండి.

రోజులో పలుమార్లు దీనిని చేయండి, ఉపశమనంతో పాటు కండరాలు సడలించుటలో సహాయం చేస్తుంది.

3. కాల్షియం తీసుకోవడం పెంచండి

3. కాల్షియం తీసుకోవడం పెంచండి

ఆరోగ్యకరమైన మరియు బలమైన ఎముకలను ఏర్పరచడానికి మరియు నిర్వహించడానికి కాల్షియం అవసరం. కాల్షియం తగ్గు స్థాయిలో ఉన్నప్పుడు ఎక్కువ ఎముక నష్టానికి లోనవ్వడం మరియు ఎముకల సాంద్రత తగ్గడం జరుగుతుంది.

ఆకు కూరలు, బ్రోకోలీ, కాలే వంటివి తీసుకోండి. బీన్స్, టోఫు మరియు ముడి శెనగలు , డ్రై ఫ్రూట్స్ లలో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

4. విటమిన్ D

4. విటమిన్ D

విటమిన్ D శరీరానికి అందడానికి అత్యంత సహజ వనరు సూర్యకాంతి. బలమైన మరియు ఆరోగ్యకరమైన ఎముకలు కోసం విటమిన్ డి అవసరం.

పాలు, తృణధాన్యాలు, నారింజ రసం, రొయ్యలు, గుడ్డు పచ్చ సొనలు మరియు ట్యూనా వంటి ఆహార పదార్ధాలలో విటమిన్ D అధికంగా ఉంటుంది.

5. కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి

5. కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి

కొబ్బరి నూనె మోకాలి కీళ్ళ నొప్పి చికిత్స కోసం ఒక అద్భుతమైన ఇంటి చిట్కాగా చెప్పబడింది.

వేడి కొబ్బరి నూనె 2 టీస్పూన్స్ తీసుకుని నొప్పిగా ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయండి. రోజులో వీలైనన్ని సార్లు చేయడం మంచి ఫలితం ఇస్తుంది.

6.అల్లం టీ

6.అల్లం టీ

అల్లం కీళ్ళ వాపుని నయం చేసే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.

కత్తిరించిన ½ స్పూన్ అల్లం ముక్కలను ఒక కప్పు వేడి నీటిలో చేర్చండి.కొన్ని నిమిషాలు బాగా మరగబెట్టండి. దీనిలో తేనేని కలిపి సేవించండి. దీనిలో టీ పొడి కలుపుకోవడం మీ ఇష్టం. కానీ పాలతో కంటే, నీటితో అల్లం టీ తీస్కోవడం మేలు.

7.రోజ్మేరీ ఆయిల్

7.రోజ్మేరీ ఆయిల్

రోజ్మేరీ చమురు నొప్పు ప్రభావిత ప్రాంతాల్లో సర్క్యులేషన్ పెంచడానికి సహాయపడుతుంది మరియు కీళ్ళలో Synovial ద్రవo హెచ్చుతగ్గులను నియంత్రించడంలో సహాయం చేస్తుంది. తద్వారా ఉపశమనం లభిస్తుంది.

రోజ్మేరీ నూనె కొన్ని చుక్కలను నొప్పి ప్రభావిత ప్రాంతాలలో వేసి కీళ్లపై మసాజ్ చేయండి.

8. ఆపిల్ సైడర్ వెనిగర్

8. ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ ఆరోగ్యకరమైన కీళ్ళను నిర్వహించడానికి ఉపయోగపడే అనేక ముఖ్యమైన ఖనిజాలను కలిగి ఉంటుంది.

ఒక గ్లాసు నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ 1-3 టీస్పూన్లు జోడించండి.

ఈ మిశ్రమాన్ని రోజులో మూడుసార్లుగా త్రాగడం వలన ఎముక సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

9. పసుపు

9. పసుపు

నొప్పులను తగ్గించడం లో జాయింట్ పెయిన్స్ ఉపశమనానికి పురాతనకాలంనుండి మనదేశంలో వాడుతున్న అద్భుతమైన ఔషధం పసుపు.

½ టీ స్పూన్ పసుపు ను ఒక కప్పు వెచ్చని నీటి లో కలపండి.

రోజులో మూడు సార్లు సేవించడం ద్వారా ఉపశమనం పొందగలరు.

10. ఫిష్ ఆయిల్

10. ఫిష్ ఆయిల్

ఎక్కువగా ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్ మరియు విటమిన్ డి పుష్కలంగా ఉన్నందువలన చేప నూనె ఎముకల సాంద్రతను ఆరోగ్యకర రీతిలో పెంచుటకు సహాయం చేస్తుంది.

మీ భోజనం ముందు రోజుకు ఒకసారి సాల్మోన్ వంటి మంచి నీటి చేపలు తినండి లేదా చేప నూనె మందులు తీసుకోవడం మేలు.

English summary

10 Home Remedies For Bone Problems

According to the Arthritis Foundation, joint pain can develop in the jaw, knees, hips, the neck and top of the back or spine. Research shows that about one-third of adults experience some type of joint pain. The home remedies for treating bone problems are apple cider vinegar, epsom salt, calcium, ginger tea, coconut oil, rosemary oil, etc.
Story first published: Monday, March 26, 2018, 12:15 [IST]