పని తర్వాత కాళ్ళ నొప్పులు భాధిస్తున్నాయా? అయితే మీకోసమే ఈ చిట్కాలు

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

రోజంతా పనిలో కాళ్ళ మీదే ఉంటున్నారా? మీ కాలి వేళ్ళపైన, పాదాల పైన పడుతున్న అధిక ఒత్తిడి మీ కాళ్ళ నొప్పులకు కారణం అవుతుంది. ఒక్కోసారి ఇవేకాకుండా మీకు సరికాని ఒత్తిడికి గురిచేసే పాదరక్షలను ధరించడం వలన కండరాలకు, నరాలకు మరియు చీలమండల పై మరియు పాదాలపై ప్రభావాన్ని చూపి తద్వారా కాళ్ళ నొప్పులకు కారణం అవుతున్నాయి. ఈ వ్యాసంలో ఈ నొప్పికి విరుగుడు తెలుసుకుంటారు.

ఇలాంటి భాధాకరమైన నొప్పి అనేది, వయసు ప్రభావం వలన కానీ, సరైన పాద రక్షలు ధరించకపోవడంవలన కానీ, ఎక్కువ నడకకు పూనుకున్నా కానీ, ఎక్కువ సేపు నిలబడి ఉన్నా కానీ , ఏదేని ఇతర గాయాల వలన కానీ సంభవించవచ్చు.

మీకు ఆశ్చర్యంగా అనిపించినా కూడా ప్రతి పాదంలో 26 ఎముకలు, 33 కీళ్ళు, 107 స్నాయువులు(లిగెమెంట్స్), 19 కండరాలు, మరియు అనేక కండరాలను పాదాలకు కలిపే tendons అను నరాలు కూడా ఉంటాయి.

చాలామంది లిగ్మెంట్స్, టెండన్స్ రెండూ ఒకటే అనుకుంటారు. లిగ్మెంట్స్ ఎముకల మద్య సంబంధం కోసం నిర్మించబడి ఉంటుంది, కానీ టెండన్స్ వంపు ధర్మాన్ని(flexibility) కలిగి ఉండి అస్థిపంజరానికి , కండరాలకు , పాదాలకు , కళ్ళకు మద్య వాహన కర్తగా ఉంటాయి. ఈ తేడాని గమనించగలరు.

సగటు వ్యక్తి రోజులో 8 వేల నుండి పది వేల అడుగులు వేస్తాడని అంచనా, ఈ ఒత్తిడి తో కూడుకున్న నొప్పి వారి వారి శరీర ధర్మాలను ఉద్దేశించి ఉంటుంది. అదృష్టవశాత్తూ అలాంటి నొప్పులకు సాధారణ ఇంటి చిట్కాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

 1.వెనిగర్:

1.వెనిగర్:

వెనిగర్ పాదాల నొప్పులను హరించుటలో ప్రధమంగా సూచించబడుతుంది. ముఖ్యంగా ఇది మంటను అదుపు చేయడం లో ప్రభావాన్ని చూపిస్తుంది . ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో డిష్ వాషింగ్ లిక్విడ్ ఒక చుక్క వేసి, ఆపై ఒక కప్పు తెల్ల వెనిగర్ ని కలపండి. ఈ మిశ్రమంలో మీ కాలిని 30 నిమిషాలు ఉంచండి. తర్వాత చల్లని నీటితో కడిగేయ్యండి.

2. బేకింగ్ సోడా:

2. బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా, కాళ్ళ నొప్పులను హరించుటలో మరొక ఉత్తమమైన మార్గంగా చెప్పబడుతున్నది.

సగం కప్పు బేకింగ్ సోడాని ఒక గాలన్( 1 గాలన్ = 3.78 ltrs) నీటిలోవేసి బేకింగ్ సోడా పూర్తిగా కరుగునట్లు కలిపి ఆ నీటిలో మీ కాళ్ళను 30 నిమిషాలు ఉంచడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

3. లోషన్

3. లోషన్

ఇది కూడా ఒక మంచి చిట్కానే. నిద్రపోవు ముందు లేదా విశ్రాంతి సమయంలో మీకు నచ్చిన ఏదైనా లోషన్ లేదా పెట్రోలియం జెల్లీ లేదా వర్జిన్ ఆలివ్ నూనె తో సున్నితంగా మర్ధన చేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. లోషన్ తో మర్ధన చేశాక మంచి కాటన్ సాక్సులను ధరించడం మంచిది.

4. ఐస్ ప్యాక్

4. ఐస్ ప్యాక్

చాలా సులువైన ఇంటి చిట్కా గా ఐస్ పాక్ మర్ధన ఉపయోగ పడుతుంది. మీకు నొప్పిగా ఉన్న ప్రాంతంలో ఐస్ పాక్ ఉంచడం ద్వారా ఉపశమనాన్ని పొందగలరు. ఏవైనా ద్రవాలు నొప్పిగల ప్రాంతంలో చేరి ఉంటే, అవి బయటకు వెళ్ళేలా ఐస్ పాక్ ప్రోత్సహిస్తుంది.

5. కొన్ని నూనెలు

5. కొన్ని నూనెలు

యూకలిప్టస్ నూనె , పెప్పర్మింట్ నూనె మరియు రోజ్మెరీ నూనె లతో చేయు మర్ధన వలన కాళ్ళ నొప్పి నుండి సత్వర ఉపశమనాన్ని పొందవచ్చు. ఒక్కొక్క నూనె 4 చుక్కల చొప్పున నీటిలో వేసి ఆ నీటిలో 10 నిమిషాలు కాళ్ళను ఉంచడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.

6. ఎప్సోమ్ సాల్ట్:

6. ఎప్సోమ్ సాల్ట్:

ఎప్సోమ్ ఉప్పు మీ కాళ్ళ నొప్పుల నివారణకు సహాయ పడుతుంది. ఇందులో ఉన్న మెగ్నీషియం నొప్పి తగ్గుదలకు తోడ్పడుతుంది.

2,3 టేబుల్ స్పూన్ల ఎప్సోమ్ ఉప్పును ఒక టబ్ నీళ్ళలో కలిపి అందులో కాళ్ళను 10 నుండి 15 నిమిషాలు ఉంచడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

7. లవంగాల నూనె

7. లవంగాల నూనె

కీళ్ల నొప్పుల ఉపశమనానికి తక్షణ ఉపాయంగా లవంగాల నూనె సూచించబడుతుంది. ఈ లవంగాల నూనెలో రక్త సరఫరా పెంచే గుణాలు ఉన్న కారణంగా నొప్పి తగ్గుదలలో కీలక పాత్ర పోషిస్తుంది.

నొప్పిగా ఉన్న పాదాలను సున్నితంగా లవంగాల నూనెతో మర్ధన చేయండి. రోజులో అనేక సార్లు చెయ్యడం మంచిది.

8. కేయాన్ పెప్పర్( కాప్సికమ్ నుంచి చేసే పొడి)

8. కేయాన్ పెప్పర్( కాప్సికమ్ నుంచి చేసే పొడి)

ఇందులో కాప్సైసిన్ అనే పదార్ధం ఉన్న కారణంగా ఇది కండరాల నొప్పులకు, కీళ్ల నొప్పిలకు ఆర్థరైటిస్ వంటి వాటికి ఉపశమనంగా చెప్పబడుతున్నది.

అర బక్కెట్ నీళ్ళలో అర టీ స్పూన్ కాయెన్నీ పెప్పర్ వేసి కలిపి కొన్ని నిమిషాలు ఉంచడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

9. ఆవాల విత్తనాలు

9. ఆవాల విత్తనాలు

ఆవాల విత్తనాలు కూడా నొప్పి నివారణా చర్యలలో భాగంగా పనిచేస్తాయి. ఇది శరీరంలోని విషతుల్య రసాయనాలను తొలగించుటలో మరియు మంటను తగ్గించుటలో సహాయం చేస్తుంది. కొన్ని ఆవాల విత్తనాలను గ్రైండ్ చేసి అర బక్కెట్ నీళ్ళలో కలిపి , కొన్ని నిమిషాలు అందులో కాళ్ళు ఉంచడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

English summary

10 Home Remedies For Sore Feet After Work

Too much of pressure on the toes and feet can cause sore feet. Also, wearing a wrong footwear can wreak havoc on the muscles, ligaments, and tendons in each ankle and foot, causing pain. There are simple home remedies to treat sore feet like vinegar, Epsom salt, mustard seeds, lotion, ice pack, baking soda, etc.
Story first published: Tuesday, March 27, 2018, 16:00 [IST]