For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఊహించని ఈ పది కారణాలు కూడా మలబద్దకానికి దారితీయొచ్చు

|

ప్రతిరోజూ టాయిలెట్ సీటు మీద ఎక్కువ సమయాన్ని గడుపుతున్నా కూడా, సత్ఫలితాలు ఇవ్వడం లేదా ? మరియు బలవంతంగా ప్రయత్నించినప్పుడు నరాల నొప్పి అనుభూతికి లోనవుతున్నారా ? అయితే మీరు ఖచ్చితంగా మలబద్ధకంతో బాధపడుతున్నారనే అర్ధం.

మలబద్దకం జీవనశైలికి సంబంధించిన వ్యాధి, ఈ వ్యాధి ప్రధాన లక్షణం ప్రేగులలో స్టూల్స్ (మలం) గట్టిపడడం. దీని కారణంగా సమయానుసారం మల విసర్జన అనేది ఉండదు కూడా. ఒక వ్యక్తి సుదీర్ఘకాలం మలబద్ధకంతో బాధపడుతున్న పరిస్థితుల్లో, అది ఇతర వ్యాధులకు కూడా కారణమవుతుంది. పొట్టలో పుండ్లు, వాపు, కడుపు నొప్పి, ఆకలి ఒడిదుడుకులు, పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా మొదలైన సమస్యలు ప్రధానంగా తలెత్తుతాయి.

అనేక కారణాలు మలబద్దకానికి కారణం కావచ్చు, వాటిలో ఒక వ్యక్తి యొక్క ఆహారం మరియు వ్యాయామ అలవాట్లు ప్రధాన కారణంగా ఉంటాయి. అనగా అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మరియు వ్యాయామ ప్రణాళిక సరిగ్గా లేకపోవడం వంటి జీవన శైలి సంబంధిత పరిస్థితుల మూలంగా మలబద్ధకం వంటి వ్యాధులకు గురవుతున్నారని అనేక పరిశోధనా అధ్యయనాలలో కనుగొనబడింది.

ఇప్పుడు, మలబద్ధకానికి గల అసాధారణ మరియు ఆశ్చర్యకరమైన కారణాల గురించి తెలుసుకుందాం.

ఎక్కువ సమయం ఒకే చోట కూర్చుని ఉండడం :

ఎక్కువ సమయం ఒకే చోట కూర్చుని ఉండడం :

ముఖ్యంగా ఎక్కువగా కూర్చుని పనిచేసే ఉద్యోగులు, అనగా డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్స్, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, డెస్కుల ముందు గంటల తరబడి కూర్చుని ఉండే ఆఫీసు ఉద్యోగులు, టైలర్లు, లేదా మొబైల్, కంప్యూటర్ గేమ్స్ ఆడుకునే యువతలో అధికంగా ఈ మలబద్దక సమస్య ఉన్నట్లు తేలింది. కేవలం ఒక వయసుకే పరిమితం కాకుండా, అన్ని తరగతుల వారిని ఈ సమస్య వేధిస్తుంది.

ఎందుకంటే ఒక వ్యక్తి ఎక్కువ సమయం ఒకే చోట కూర్చుని ఉన్నప్పుడు శరీరం యొక్క మెటబాలిక్ రేటు (జీవ క్రియలు) నెమ్మదిగా మారుతాయి. క్రమంగా ప్రేగు కదలికలు తగ్గడం ద్వారా మలబద్ధకం ఏర్పడుతుంది.

అధిక పాల వినియోగం :

అధిక పాల వినియోగం :

రోజులో ఎక్కువ మొత్తంలో జున్ను, పాలు, పనీర్, బట్టర్ వంటి పాల ఉత్పత్తులను వినియోగించే వారికి ఈసమస్య తలెత్తుతున్నట్లు తేలింది. పాడి ఉత్పత్తులు కడుపులో అధిక గ్యాస్ ఉత్పత్తికి కారకాలుగా ఉంటాయి మరియు మలవిసర్జనకు ఆటంకాన్ని కలిగిస్తాయి. కడుపులోని ప్రేగులలో, జీర్ణక్రియ సమయంలో, పాల పదార్ధాలలోని లాక్టోస్ మూలంగా కిణ్వప్రక్రియ జరుగుతుంది, క్రమంగా స్టూల్స్ గట్టిపడడం మూలంగా మలబద్దకం ఏర్పడుతుంది.

డిప్రెషన్ :

డిప్రెషన్ :

మానసిక ఒత్తిడి, ఆందోళనలు కూడా మలబద్ధకం సమస్యకు సాధారణ కారణంగా ఉన్నాయి. కొన్ని పరిశోధనల అధ్యయనాల ప్రకారం బుద్దిమాంద్యం కూడా మలబద్ధకం సమస్యకు దారితీస్తుంది. ఒక వ్యక్తి నిరాశతో బాధపడుతున్న సమయంలో, మెదడులో సెరటోనిన్ అనే హాపీ హార్మోన్స్ స్థాయిలు తగ్గిపోతాయి.

క్రమంగా ఇతర హార్మోన్లు, జీవక్రియల మీద ప్రభావం చూపడం కారణంగా మలవిసర్జనకు కారణమవుతుంది. మెదడులో సెరటోనిన్ తగ్గడం మూలంగా, జీర్ణక్రియలు మరియు విసర్జన వ్యవస్థలకు సంకేతాలు పంపడంలో జాప్యం ఏర్పడడం వలన అస్తవ్యస్త పరిస్థితులకులోనై మలబద్ధకం ఏర్పడుతుంది.

Most Read:వయాగ్రా వాడిన తొలినాళ్లలో సెక్స్ బాగా చేశా, ఇప్పుడు చేయలేకపోతున్నా, వాటిని వాడితే ఏమతుంది? Most Read:వయాగ్రా వాడిన తొలినాళ్లలో సెక్స్ బాగా చేశా, ఇప్పుడు చేయలేకపోతున్నా, వాటిని వాడితే ఏమతుంది?

తక్కువ పిండి పదార్ధాలు కలిగిన ఆహారాలు :

తక్కువ పిండి పదార్ధాలు కలిగిన ఆహారాలు :

కీటోడైట్ వంటి, తక్కువ మొత్తం కార్బోహైడ్రేట్ ఆహార ప్రణాళికలు అనుసరిస్తున్న వ్యక్తులు, తరచూ మలబద్ధక సమస్యను అనుభవించవచ్చు. ఎందుకంటే శరీరానికి సమాన మొత్తంలో అన్ని పోషకాలు అందాల్సిన అవసరం ఉంటుంది. పోషకాల అసమతుల్యత మలబద్దకానికి ప్రధాన కారణంగా ఉంటుంది కూడా.

మీరు తక్కువ కార్బోహైడ్రేట్ డైట్లో ఉన్నప్పుడు, శరీరం, పెద్దప్రేగు నుండి మరింత నీటిని గ్రహిస్తుంది, క్రమంగా స్టూల్లో్ప నీటి శాతం తగ్గిపోవడం మూలంగా మలబద్ధకానికి దారితీస్తుంది.

అధిక లాక్సేటివ్ మందులు లేదా పదార్ధాల వాడకం :

అధిక లాక్సేటివ్ మందులు లేదా పదార్ధాల వాడకం :

లాక్సేటివ్ పదార్ధాలు లేదా మందులు, స్టూల్స్ పాసింగ్ (మలవిసర్జన) మృదువుగా అయ్యేందుకు సహకరిస్తాయి. ఒక వ్యక్తి తరచుగా లాక్సేటివ్స్ తీసుకుంటున్న ఎడల, అది పూర్తిగా వాటిమీదనే ఆధారపడే పరిస్థితికి దారితీస్తుంది. చివరికి ప్రేగుల పనితీరు కూడా దారుణంగా తగ్గిపోతుంది. క్రమంగా స్టూల్స్ గట్టిపడి, మలబద్ధకానికి దారితీస్తుంది.

ప్రతిరోజూ చాక్లెట్లు తినడం :

ప్రతిరోజూ చాక్లెట్లు తినడం :

అతితక్కువ చక్కర గల, లేదా అప్పుడప్పుడు డార్క్ చాక్లెట్ ముక్క తీసుకోవడం కాకుండా, రోజువారీ అలవాట్లలో భాగంగా చాక్లెట్లను అధికంగా తీసుకోవడం మూలంగా మలబద్ధకంతో సహా అనేక సమస్యలు తెలెత్తుతాయి.

చాక్లెట్లు అధిక మొత్తంలో చక్కెరలను కలిగి ఉంటాయి, ఇవి ప్రేగులలో స్టూల్స్ గట్టిపడేందుకు కారకంగా ఉంటాయి, వీటిని రోజువారీ అలవాట్లలో భాగంగా తీసుకుంటున్న ఎడల, మలబద్ధకం మరియు కడుపు ఉబ్బరం సమస్యలు తలెత్తుతాయని చెప్పబడింది.

Most Read: మూత్ర సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే హోం రెమెడీస్Most Read: మూత్ర సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే హోం రెమెడీస్

కొన్ని రకాల మందులు :

కొన్ని రకాల మందులు :

యాంటి డిప్రెసెంట్స్, యాంటీబయాటిక్స్, రక్తపోటు మందులు, అదనపు విటమిన్ మాత్రలు వంటి కొన్ని రకాల మందులను క్రమం తప్పకుండా తీసుకుంటున్న ఎడల, అవి ప్రేగులను పొడిగా చేస్తాయి., ఈ పరిస్థితి క్రమంగా మలబద్ధకానికి దారితీస్తుంది.

ఇటువంటి సందర్భాల్లో, మీ వైద్యుని సంప్రదించి, మందుల మొతాదులను మార్చడం కొంతమేర సహాయం చేస్తుంది.

హార్మోన్ డిజార్డర్స్ :

హార్మోన్ డిజార్డర్స్ :

పిసిఒఎస్ (పాలీసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్), హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం మొదలైన హార్మోన్ల లోపాలతో బాధపడుతున్న వ్యక్తి మలబద్ధకం సమస్యను ఎక్కువగా కలిగి ఉంటారని పరిశోధనా అధ్యయనాలు కనుగొన్నాయి.

ప్రేగుల కదలికలు, కొన్ని హార్మోన్ల మీద పూర్తి స్థాయిలో ఆధారపడి ఉంటాయి. హార్మోన్ ఆధారిత వ్యాధులు శరీరంలోని ఇతర హార్మోన్ల విధులకు కూడా అంతరాయం కలిగించగలవు! క్రమంగా మలబద్దకం అనేది సర్వసాధారణమైన సమస్యగా ఉంటుంది.

గర్భనిరోధక మాత్రలు :

గర్భనిరోధక మాత్రలు :

అనేక మంది మహిళలు గర్భధారణకు దూరంగా ఉండే క్రమంలో భాగంగా, లేదా ఇతర ఆరోగ్య పరిస్థితుల కారణంగా గర్భం దాల్చకూడని నేపధ్యంలో గర్భనిరోధక మాత్రలను ఆశ్రయిస్తుంటారు. కానీ ఈ గర్భ నిరోధక మాత్రలు శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. క్రమంగా ప్రేగులో స్టూల్స్ గట్టిపడి, మలబద్ధకం మరియు కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది.

Most Read: ఆ సమయంలో సెక్స్ లో పాల్గొంటే కిక్కే వేరు, ఆ టైమ్ లో మగాళ్లు ఎలాంటి ఆడవారినైనా సుఖపెట్టగలరు Most Read: ఆ సమయంలో సెక్స్ లో పాల్గొంటే కిక్కే వేరు, ఆ టైమ్ లో మగాళ్లు ఎలాంటి ఆడవారినైనా సుఖపెట్టగలరు

అధిక వ్యాయామం (పరిధి దాటి) :

అధిక వ్యాయామం (పరిధి దాటి) :

వ్యాయామం లేకపోవడం కారణంగా మలబద్దకం సమస్యలు తలెత్తుతాయని అందరికీ తెలుసు. కానీ అధిక వ్యాయామం కూడా, మలబద్ధకానికి కారణం కావచ్చునని పరిశోధనలు తేల్చాయి.

ఒక వ్యక్తి పరిమితి దాటి అధికంగా వ్యాయామం చేసిన ఎడల, శరీరంలో ఎలెక్ట్రోలైట్స్ మరియు నీటి నష్టం అధికంగా జరగడం కారణంగా ప్రేగులలో నిర్జలీకరణం ఏర్పడుతుంది. క్రమంగా మలబద్ధకానికి దారితీస్తుంది.

English summary

10 Surprising Causes For Constipation You Must Know

Constipation is a digestive ailment in which a person finds it difficult to pass stools. There are a number of surprising causes for constipation that one must know in order to prevent it. Some of the major causes are sitting for too long, depression, low carb diet, eating chocolates every day, etc.