For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన స్కిన్ క్యాన్సర్ లక్షణాలివే

మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన స్కిన్ క్యాన్సర్ లక్షణాలివే

|

అకస్మాత్తుగా ఫ్లూ జ్వరం బారిన మీరు పడ్డారు. కానీ లక్షణాలు కాస్తంత విచిత్రంగా ఉన్నాయి. మీరు వెంటనే ఆందోళన చెందటం ప్రారంభించారు. ఎందుకంటే, ఇది ఏదైనా ప్రాణాంతక వ్యాధికి చెందిన చిహ్నంగా మీరు భావించి ఉండవచ్చు.

ప్రాణాంతక వ్యాధుల గురించి విన్నప్పుడు కూడా కాస్తంత ఆందోళన కలగడం సాధారణ విషయమే. అదే సమయంలో ఆయా వ్యాధుల లక్షణాలను గుర్తించడం ప్రారంభించినప్పుడు మరింత ఆందోళన పెరుగుతుంది. ఇవి, వ్యక్తుల జీవితాన్ని అతలాకుతలం చేయడంతో పాటు ప్రాణాపాయ స్థితిని కూడా కలిగించే ప్రమాదం ఉంది. అటువంటి కొన్ని ప్రాణాంతక వ్యాధులు మనుషుల ప్రాణాలను నిమిషంలో హరిస్తాయి.

6 Skin Cancer Symptoms You Should Know

మరికొన్ని ప్రాణాంతక వ్యాధుల బారిన పడినప్పుడు ఆ రోగి నెలలపాటు మంచానికే అంకితమైపోయి క్రుంగి కృశించి పోతూ ఉంటాడు. ఆయా వ్యాధుల లక్షణాలు చివరికి ఆ వ్యక్తి ప్రాణాన్ని హరిస్తాయి. క్యాన్సర్ వంటి వ్యాధులు ఈ కోవలోకే వస్తాయి.

క్యాన్సర్ ను ట్రీట్ చేయడం అలాగే క్యూర్ చేయడం సాధ్యమే అయినా క్యాన్సర్ తిరిగి సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందువలన క్యాన్సర్ బారిన పడినప్పుడు ఆర్గాన్ ఫెయిల్యూర్ డెత్స్ సంభవించే ఆస్కారం కూడా ఎక్కువే.

మనకు తెలిసినట్లుగానే, క్యాన్సర్స్ ఎన్నో రకాలున్నాయి. వాటిలో స్కిన్ క్యాన్సర్ కూడా ఒకటి.

ఇప్పుడు స్కిన్ క్యాన్సర్ కి సంబంధించిన లక్షణాలను తెలుసుకుందాం.

1. సన్ బర్న్ :

1. సన్ బర్న్ :

సాధారణంగా ఎండాకాలంలో బయటకు వెళ్ళినప్పుడు సన్ బర్న్ సమస్య తలెత్తుతుంది. ఎండ వేడికి చర్మం కమిలిపోయి సన్ బర్న్ సమస్య ఎదురవుతుంది. అయితే, మెలనోమా రీసెర్చ్ ఫౌండేషన్ స్టేట్ వారి స్టడీస్ ప్రకారం సన్ బర్న్ అనేది స్కిన్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదాన్ని పెంచే ప్రమాదం ఎక్కువని తేలింది. క్యాన్సర్ కారక కణాల వృద్ధి గణనీయంగా పెరిగేందుకు సన్ బర్న్ దారితీస్తుందని వెల్లడైంది. కాబట్టి, ఎల్లవేళలా సన్ స్క్రీన్ ను అప్లై చేసుకోవడం మంచిది. తద్వారా, స్కిన్ క్యాన్సర్ కి గురయ్యే ప్రమాదాన్ని కొంత మేరకు తగ్గించుకోవచ్చు.

2. ఫెయిర్ స్కిన్ :

2. ఫెయిర్ స్కిన్ :

సాధారణంగా ఫెయిర్ స్కిన్ ఉంటే అందంగా ఉంటారన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. అందుకే, స్కిన్ కాంప్లెక్షన్ ను మెరుగుపరచుకోవటం కోసం సాధారణంగా ఎన్నో క్రీమ్స్ పై ఆధారపడుతూ ఉంటారు. ఇక్కడొక షాకింగ్ విషయం గురించి ప్రస్తావించుకుని తీరాలి. ఫెయిర్ స్కిన్ కలిగిన వారు స్కిన్ క్యాన్సర్ కి గురయ్యే ప్రమాదం ఎక్కువని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. డార్కర్ స్కిన్ టోన్ కలిగిన వారి కంటే ఫెయిర్ స్కిన్ టోన్ కలిగిన వారు స్కిన్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువని తెలుస్తోంది. ఫెయిర్ స్కిన్ టోన్ కలిగిన వారిలో మెలనిన్ (చర్మానికి రంగును అద్దే పిగ్మెంట్) శాతం తక్కువగా ఉంటుంది. మెలనిన్ అనేది సూర్యుని యొక్క హానీకర కిరణాల నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది. కాబట్టి, ఫెయిర్ స్కిన్ టోన్ కలిగిన వారు సూర్యుని నుంచి తమ చర్మానికి ప్రొటెక్షన్ ను అందించుకునేందుకు కాస్తంత అదనపు శ్రద్ధను కనబరచాలి.

3. పర్వత ప్రాంతాలలో నివసించే వారు :

3. పర్వత ప్రాంతాలలో నివసించే వారు :

సూర్యుని నుండి విడుదలయ్యే అల్ట్రా వయొలెట్ రేస్ అనేవి స్కిన్ క్యాన్సర్ కు దారితీసే ప్రమాదం ఎక్కువ. కాబట్టి, నివసించే ప్రదేశం కూడా స్కిన్ క్యాన్సర్ కి దారి తీయడానికి తన వంతు పాత్ర పోషిస్తుంది. హై ఆల్టిట్యుడ్ రీజన్స్ లో అంటే మౌంటెయిన్స్ అలాగే హిల్ స్టేషన్స్ లో నివసించే వారు స్కిన్ క్యాన్సర్ ను డెవెలప్ చేసుకునే ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే, లోయర్ ఆల్టిట్యుడ్ రీజన్స్ లో నివసించే వారికంటే వీరు ఎక్కువగా యూవీ రేడియేషన్స్ బారిన పడతారు.

4. వారసత్వం:

4. వారసత్వం:

అనేక వ్యాధులు తరతరాలకు వ్యాప్తిస్తూ ఉంటాయి. కొన్ని ప్రాణాంతక వ్యాధులు వారసత్వంగా కూడా సంభవిస్తాయి. వాటిలో డయాబెటిస్ మరియు హేమోఫిలియా వంటివి ఉన్నాయి. అలాగే, క్యాన్సర్ విషయానికి కూడా ఈ అంశం వర్తిస్తుంది. అయితే, అన్ని రకాల క్యాన్సర్లు వారసత్వంగా వస్తాయని చెప్పలేము. కానీ, స్కిన్ క్యాన్సర్ విషయంలో మాత్రం వారసత్మనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పూర్వీకులకెవరికైనా స్కిన్ క్యాన్సర్ ఉండుంటే భవిష్యత్తులో మీరు కూడా అదే వ్యాధి బారిన అప్పడే ప్రమాదం 50 శాతం ఉంటుంది.

5. విమాన ప్రయాణాలు చేసే వారిలో:

5. విమాన ప్రయాణాలు చేసే వారిలో:

విమాన ప్రయాణాలు ఎక్కువగా చేసే వారు స్కిన్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువ. 2014లో కేలిఫోర్నియా యూనివర్సటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైంది.

ఇవి స్కిన్ క్యాన్సర్ గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు. ఈ ఆర్టికల్ మీకు నచ్చితే షేర్ చేయండి.

English summary

6 Skin Cancer Symptoms You Should Know

Cancer is one of the most dangerous diseases that can affect human beings & its symptoms can be devastating. In fact, the relapse rates of most types of cancers are very high. The unusual causes for skin cancer are one single sun burn, fair skin, living in mountainous regions, heredity, flying in planes very often and travelling for long hours.
Desktop Bottom Promotion