For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెంగ్యూ మరియు చికెన్ గున్యాల మద్య గల ముఖ్యమైన తేడాలు, నివారణా చర్యలు.

డెంగ్యూ మరియు చికెన్ గున్యాల మద్య గల ముఖ్యమైన తేడాలు, నివారణా చర్యలు.

|

డెంగ్యూ జ్వరం మరియు చికెన్ గున్యా అనేవి రెండు వైరస్ ప్రభావిత వ్యాధులు, ఎయిడెస్-ఎజైప్టి రకాలకు చెందిన ఏ దోమలైనా కారకాలుగా మారొచ్చు. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఎయిడెస్-అల్బోపిక్టస్ ద్వారా కూడా చికెన్ గున్యా వ్యాప్తి చెంది – రక్తప్రసరణ ద్వారా వైరస్లను శరీరంలోకి పంపిస్తుంది.

ఈ వ్యాధులు సాధారణంగా ఎక్కువ తేమ, లేదా సాధారణ వాతావరణ పరిస్థితులు కలిగిన ఉష్ణమండల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అధికంగా ప్రభావితం చేస్తాయి. తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో దోమలకి సంతానోత్పత్తి కష్టమవుతుండటం దీనికి ప్రధాన కారణం. దోమలు ఎక్కువగా కలుషితమైన మరియు నిల్వ ఉంచిన నీళ్ళలో ఎక్కువగా సంతానోత్పత్తికి పూనుకుంటాయి.

7 Major Differences Between Dengue And Chikngunya

దశాబ్దాలుగా, ఈ రెండింటినీ ఒకేరకంగా పరిగణించడం జరిగింది, ఎందుకంటే వాటి లక్షణాల సారూప్యత కారణంగా. నేటికి కూడా, ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహిస్తే తప్ప రెండింటిలోనూ తేడాలను గుర్తించడం చాలా కష్టం.

వ్యక్తి రెండు వ్యాధులను ఒకేసారి కలిగి ఉన్న అరుదైన సందర్భాలు కూడా ఉన్నాయి. క్రమంగా పరిస్థితులు మరింత దిగజారుతుంటాయి. వీటి నివారణలో భాగంగా ప్రపంచవ్యాప్త గుర్తింపు లేదా ఆమోదించిన టీకా అయితే ప్రస్తుతానికి లేదు.

అంతేకాకుండా, ఈ వ్యాధులకు చికిత్స చేయడానికి ఉద్దేశించిన నిర్దిష్టమైన ఔషధాలు కూడా లేవు. రోగనిర్ధారణ తరువాత జరిగే ఏకైక చికిత్స, జాయింట్ పెయిన్స్, జ్వరం, మొదలైన లక్షణాల ప్రభావాలను తగ్గించడమే. యాంటీబయాటిక్స్ వాడకం, రోగ నిరోధక శక్తిని పెంచడం, ఆహారప్రణాళికలో మార్పులు తీసుకుని రావడం మొదలైనవి ఇందులో భాగం.

ఈ రెండు వ్యాధులకు సకాలంలో సరైన చికిత్స తీసుకోని ఎడల, శరీరంలో తీవ్ర ప్రభావాలను కలగజేయడమే కాకుండా, అవయవ నష్టానికి కూడా కారణమవుతుంది. వీటినుండి బయటపడాలంటే, సకాలంలో వైద్యం తీసుకోవడమే సరైన మార్గం.

ఈ వ్యాసంలో, ఈ రెండు వ్యాధుల గురించిన వివరాలతో పాటు వాటి లక్షణాల మధ్య తేడాలను కూడా పొందుపరచబడినవి.

1. కారణం

1. కారణం

డెంగ్యూ - ఫ్లావివిరిడే కుటుంబానికి చెందిన ఫ్లేవివైరస్ జాతికి చెందిన వైరస్ వల్ల డెంగ్యూ సంభవిస్తుంది. ఇది ఎయిడెస్ -ఎజైప్టి రకానికి చెందిన ఆడదోమలు చేసే వైరస్ వ్యాప్తి కారణంగా మాత్రమే కలుగుతుంది.

1. కారణం

1. కారణం

చికెన్ గున్యా - ఇది టొగవిరిడే కుటుంబానికి చెందిన అల్బావియస్ అనే జాతి వైరస్ల వలన సంభవిస్తుంది. ఈ వైరస్ ఎయిడెస్-ఎజైప్టి రకానికి చెందిన ఆడదోమల కాటు వలన సంక్రమిస్తుంది. ఇది చికెన్ గున్యా కలగడానికి సాధారణ కారకం అయినా, అడేస్-ఆల్పోపిక్టస్ దోమల కాటు మూలంగా కూడా, అరుదైన సందర్భాలలో ఈ వ్యాధి కలిగే సూచనలు ఉన్నాయి.

జికా, ఎల్లో-ఫీవర్ వంటి ఇతర వ్యాధులకు కూడా ఎయిడెస్ ఎజైప్టి రకం దోమలు ప్రధాన కారకాలు(వెక్టార్) గా ఉన్నాయి.

2. లక్షణాలు

2. లక్షణాలు

డెంగ్యూ:

• తీవ్రమైన తలనొప్పి

• వికారం మరియు/లేదా వాంతులు

• 103 ° F లేదా అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు (అప్పటికే ఉన్న సంక్రమణ వలన ఇది సంభవించదు) నమోదవ్వడం. అకస్మాత్తుగా అధిక జ్వరం వచ్చి, 2 నుండి 4 రోజుల వ్యవధిలోనే తగ్గడం మరియు అసాధారణంగా ఎక్కువ మొత్తంలో చెమటపట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

• నుదిటి ప్రాంతాల్లో, మరియు కళ్ళు వెనుక ప్రాంతాల్లో నొప్పి (ముఖ్యంగా కళ్ళు కదిలే సమయంలో)

• బలహీనత లేదా బలహీనమైన ఫీలింగ్

• శరీరం మరియు కీళ్ళనొప్పులు

• తక్కువ హృదయ స్పందనల రేటుతో పాటు శ్వాస తీసుకోవడంలో కష్టం(టాచీకార్డియా)

• రక్తపోటు తగ్గడం(లో-బిపి)

• మెడ మరియు గజ్జల్లో విస్తరించిన గవద బిళ్ళలు ఏర్పడుట.

2. లక్షణాలు

2. లక్షణాలు

చికెన్ గున్యా:

• తలనొప్పి

• గొంతు మంట

• వికారం మరియు/లేదా వాంతులు

• 103 ° F లేదా అంతకంటే అధిక జ్వరం

• చర్మంపై దద్దుర్లు మరియు గడ్డలు (మాక్యులోపాపులర్ రాష్) (ముఖ్యంగా అరచేతులు, ముఖం, మొండెం, చేతులు మరియు కాళ్ళు)

• కళ్ళలో నొప్పి తరచుగా కండ్లకలక మరియు తీవ్రమైన నొప్పి / కాంతికి గురికావడం అసౌకర్యంగా కూడా అనిపించడం (కాంతివిపీడనం)

• తీవ్రమైన వెన్ను నొప్పి (ప్రత్యేకంగా వెనుక దిగువ భాగంలో)

• తీవ్రమైన కండరాల మరియు కీళ్ళ నొప్పులు (ముఖ్యంగా మణికట్టు, చీలమండలు, చేతులు మరియు కాళ్ళు). కొన్నిసార్లు తేలికపాటి వాపుతో కలిసి ఉంటాయి కూడా. నొప్పి సాధారణంగా ఉదయం సమయంలో ఎక్కువగా ఉంటుంది.

• అలసట అనుభూతి.

3. ఈ లక్షణాలను చూపించడానికి తీసుకునే సమయం

3. ఈ లక్షణాలను చూపించడానికి తీసుకునే సమయం

డెంగ్యూ - పరిస్థితి లక్షణాలను ప్రస్పుటంగా చూపడానికి తీసుకునే కాల వ్యవధి, 3 నుండి 7 రోజులు.

3. ఈ లక్షణాలను చూపించడానికి తీసుకునే సమయం

3. ఈ లక్షణాలను చూపించడానికి తీసుకునే సమయం

చికెన్ గున్యా- పరిస్థితి లక్షణాలను ప్రస్పుటంగా చూపడానికి తీసుకునే కాల వ్యవధి, 1 నుండి 12 రోజులు.

4. ఎంతకాలం వ్యాధి లక్షణాలు శరీరంలో ఉంటుంది లేదా కొనసాగుతుంది?

4. ఎంతకాలం వ్యాధి లక్షణాలు శరీరంలో ఉంటుంది లేదా కొనసాగుతుంది?

డెంగ్యూ - ఈ వ్యాధి 4 నుంచి 7 వారాల పాటు కొనసాగుతుంది.

4. ఎంతకాలం వ్యాధి లక్షణాలు శరీరంలో ఉంటుంది లేదా కొనసాగుతుంది?

4. ఎంతకాలం వ్యాధి లక్షణాలు శరీరంలో ఉంటుంది లేదా కొనసాగుతుంది?

చికెన్ గున్యా - ఈ వ్యాధి 1 నుండి 2 వారాల వరకు కొనసాగుతుంది, అయితే కీళ్ళ నొప్పులు వంటి లక్షణాలు తగ్గుటకు సంవత్సరాల పడుతుంది.

4. ఎంతకాలం వ్యాధి లక్షణాలు శరీరంలో ఉంటుంది లేదా కొనసాగుతుంది?

4. ఎంతకాలం వ్యాధి లక్షణాలు శరీరంలో ఉంటుంది లేదా కొనసాగుతుంది?

చికెన్ గున్యా కంటే డెంగ్యూ అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది మరియు సకాలంలో చికిత్స చేయని పక్షంలో ప్రాణహానికి అవకాశం ఉంది. అంతేకాకుండా, వ్యాధి సమయంలో, లక్షణాలు మరింత తీవ్రంగా మారవచ్చు. ఉదాహరణకు, భారీ రక్తస్రావం, శ్వాస తీసుకోవడంలో కష్టపడటం మొదలైనవి ఉండవచ్చు. లక్షణాలే కాకుండా, రక్తంలోని ప్లేట్లెట్ గణన కూడా నియంత్రణలో ఉంచడానికి నిరంతర పర్యవేక్షణ ఉండాలి.

చికెన్ గున్యా, డెంగ్యూ వలె ప్రాణాంతకం కాదు. కానీ వ్యక్తి ఈ వ్యాధికి గురైన సమయంలో వికారమైన నొప్పులతో ఎక్కువగా విశ్రాంతికే అంకితమవుతూ ఉంటారు. మరియు వ్యాధి తగ్గినా లక్షణాల తీవ్రత మాత్రం సంవత్సరాలు కొనసాగుతుంది. ముఖ్యంగా బాడీ పెయిన్స్ అత్యంత కష్టంగా ఉంటుంది, ఇవి నెలలు లేదా సంవత్సరాల తరబడి కొనసాగుతుంది. అరుదైన సందర్భాలలో, నరాలసంబంధ సమస్యలకు కూడా కారణమవుతుంది.

దోమల వెనుక కథ?

దోమల వెనుక కథ?

ఎందుకని కేవలం ఆడదోమల కారణంగానే ఈ వ్యాధి విస్తరిస్తుంది? ఎందుకంటే ఆడ దోమలు గుడ్లు ఉత్పత్తి చేయడానికి రక్తం అవసరం. మగ దోమలు సాదు స్వభావాన్ని కలిగి ఉంటాయి, పూలలో తేనెను ఆహారంగా స్వీకరిస్తుంటాయి. మరియు హాని చేయని తత్వాన్ని కలిగి ఉంటాయి. కానీ ఆడదోమలు రక్తం కోసం కాటు వేసినప్పుడు, తన లాలాజలాన్ని కొద్ది మోతాదులో శరీరంలోకి విడుదల చేస్తుంది - ఇది ప్రతిస్కంధకంగా పనిచేస్తుంది – క్రమంగా రక్తప్రసరణ ద్వారా శరీరంలోకి వ్యాపిస్తుంది, కానీ కొన్ని సందర్భాలలో ఈ లాలాజలం వైరస్లను కూడా కలిగి ఉంటుంది.

దోమకాటు వలన వ్యాధులు సరే, అలాగని అన్ని దోమలూ కారకం కాదు, ఎందుకు?

దోమకాటు వలన వ్యాధులు సరే, అలాగని అన్ని దోమలూ కారకం కాదు, ఎందుకు?

అన్ని దోమలు తమ శరీరంలో వైరస్లను కలిగి ఉండవు ఎందుకంటే - అవి ఈ వైరస్లతో పోరాడగలిగే రోగనిరోధక వ్యవస్థను కలిగి ఉంటాయి. అంతే కాకుండా వైరస్ కలిగి ఉన్న దోమల కాటు వలన కూడా వ్యాధులు సంక్రమించకపోవచ్చు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

క్రమంగా రక్తం ఎక్కవగా తీసుకోవడం పునరుత్పత్తికి వినియోగించుకోవడం వంటి చర్యల ద్వారా ఈ చక్రం పునరావృతమవుతూ ఉంటుంది.

చికెన్ గున్యా మరియు డెంగ్యూ వ్యాధులకు నివారణ ఎలా?

చికెన్ గున్యా మరియు డెంగ్యూ వ్యాధులకు నివారణ ఎలా?

వ్యాధులు నివారించడానికి వేయాల్సిన మొదటి అడుగు వాటి కారకాలను నిరోధించడo - అనగా ప్రధానంగా దోమల నివారణ మీద దృష్టి సారించడం. ప్రతి సంవత్సరం, ప్రభుత్వం కంటైనర్లు మరియు ఇతర బహిరంగ మరియు అంతర్గత ప్రదేశాలలో నిల్వ ఉంచిన నీటిని నిరోధించడానికి వాణిజ్య ప్రకటనలు చేయడమే కాకుండా, కరపత్రాలను కూడా విడుదల చేస్తూ ఉంది. కానీ ప్రజల ఆలోచనల్లో మార్పులు మాత్రం తక్కువగా ఉంటున్నాయన్నది మాత్రం సహించలేని నిజం.

ప్రభుత్వం చెప్పడమే కాదు, ప్రజల్లో ఆచరణ వచ్చేలా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఊరి చివరల్లో ఉన్న డంపింగ్ యార్డుల కారణంగా, ఇళ్ళ చుట్టూ నిల్వ చేరుతున్న నీటి కారణంగా ఓపెన్ డ్రైనేజ్ సిస్టం మూలంగా దోమల నివారణ కష్ట సాధ్యమవుతూ ఉంది. చివరికి వాటిని అరికట్టడానికి వినియోగించే పరికరాలు తెలీని ఆరోగ్య సమస్యలను తీసుకుని రావడం కడు శోచనీయం.

అంతేకాకుండా, ఒక ఆడదోమ ఒక ఒక్క ప్రత్యుత్పత్తి చక్రంలో సుమారు 100 లేదా అంతకన్నా ఎక్కువ గుడ్లను పెడుతుంది మరియు వాటి జీవితకాలంలో కనీసం 3 ప్రత్యుత్పత్తి చక్రాలను 3 వారాల నుండి 6 వారాల మద్యన, పర్యావరణంపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల వీటిని అరికట్టడంలోనే కాకుండా, ఇవి కుట్టకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.

• కంటైనర్లు లేదా బహిరంగ ప్రదేశాల్లో నిల్వ నీటిని అనుమతించవద్దు.

• బహిరంగ ప్రదేశాల్లో ఎటువంటి వ్యర్థ పదార్థాలు లేకుండా నివారణా చర్యలు తీసుకోవడం.

• పొడవాటి స్లీవ్లు ధరించడం లేదా మీ శరీరాన్ని ఎక్కువగా కప్పివేయడం వంటివి చేయాలి. ముఖ్యంగా మీరు అటువంటి వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉన్న దేశాలలో / ప్రదేశాలలో ఉన్నప్పుడు, ప్రత్యేకంగా వర్షాకాలంలో.

• దోమల వికర్షణ క్రీమ్లులను వర్తించండి.

• యూకలిప్టస్ నూనె ఉపయోగించండి.

• డి.డి.టి స్ప్రేలను ఉపయోగించండి

పైన చెప్పిన లక్షణాలలో ఏ ఒక్క లక్షణం కనిపించినా ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించడం మంచిది.

పైన చెప్పిన లక్షణాలలో ఏ ఒక్క లక్షణం కనిపించినా ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించడం మంచిది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలు, జీవన శైలి , ఆరోగ్య, ఆహార, ఆధ్యాత్మిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

7 Major Differences Between Dengue And Chikngunya

Dengue & chikungunya have been affecting millions around the globe every year; these can be deadly too, especially because there is no preventive vaccine or medicine. The two vector-borne diseases were considered to be one and the same because of the similarity in their symptoms like severe headache, nausea, sudden high fever, etc.
Desktop Bottom Promotion