మీ శరీర - నాడీవ్యవస్థ దెబ్బతిన్నాదని చెప్పే 8 అసాధారణమైన సంకేతాలు!

Subscribe to Boldsky

పిల్లలుగా, మనము స్కూల్స్లో జీవశాస్త్రాన్ని నేర్చుకునేటప్పుడు, మానవ శరీరంలో నాడీ వ్యవస్థ అనేది ఉంటుంది, అదిగానీ లేకపోతే మానవ మనుగడ సాధ్యం కాదని మనము తెలుసుకున్నాము.

ఈ నాడీవ్యవస్థలో మన శరీర భాగాలు ఒకదానినుండి మరొకదానికి సమాచారాన్ని మరియు సంకేతాల వంటి అన్ని రకాల (మానసిక & శారీరక) చర్యలను అందిపుచ్చుకుంటాయి.

ఈ నాడీవ్యవస్థ ద్వారా పంచుకోబడిన సంకేతాల ద్వారా మాత్రమే, మన శరీరానికి అవసరమయ్యే అతి చిన్న పనితీరు కూడా సాధ్యపడతుంది.

ఉదాహరణకు:- మన మెదడులోని ఒక భాగం మాత్రమే జీర్ణవ్యవస్థకు సంకేతాలను అందించినప్పుడు జీర్ణరసాలను ఉత్పత్తి చేస్తాయి, అలా మనకి ఆకలి కలిగిన భావన పుడుతుంది.

మెదడు, మన కాళ్ళకి తగిన సంకేతాలను అందించినప్పుడు మాత్రమే మనము నిలబడటానికి & నడవడానికి వీలుగా ఆస్కారముంటుంది.

కాబట్టి, నాడీవ్యవస్థ అనేది చాలా క్లిష్టమైనది, అలాగే వాటిలో జరిగే చిన్న పొరపాట్ల వల్ల కూడా ప్రజలలో ప్రధానమైన వ్యాధులు సంభవించడానికి దారి తీస్తుంది.

మన శరీరంలో నాడీవ్యవస్థ దెబ్బతింటునప్పుడు, మెదడు నుండి ఇతర శరీర భాగాలకు అందించబడే సమాచార - సంకేతాలలో ఏర్పడిన లోపం కారణంగా, మనకు ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి కారణమవుతుంది.

గాయాలు, రోగనిరోధకత లోపం వల్ల కలిగే వ్యాధులు, మెదడుకు నష్టం వాటిల్లడం, ఇన్ఫెక్షన్లు & నరాల వాపులు మొదలైన వంటివి నాడీవ్యవస్థలో ఏర్పడిన లోపాల వల్ల కలుగుతాయి.

కాబట్టి, ఇక్కడ మీ శరీర నాడీవ్యవస్థను దెబ్బతినేలా చేసే కొన్ని అసాధారణమైన సంకేతాలు ఉన్నాయి, అలాంటి వాటిని గూర్చి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చెయ్యకూడదు. అవి :

1. 'పిన్స్ - సూదులతో' గుచ్చినట్లుగా ఉండటం :

1. 'పిన్స్ - సూదులతో' గుచ్చినట్లుగా ఉండటం :

సరైన కారణం లేకుండా, మీ చేతులు & పాదాలలో పదునైన సూదులతో గుచ్చనట్లుగానూ (లేదా) మంటలను కలిగి ఉన్నట్లుగా మీరు బాధపడుతున్నట్లయితే, అది మీ శరీర నాడీవ్యవస్థ దెబ్బతిన్నాదని తెలియజేసే ఒక సంకేతమని మీరు భావించవచ్చు. మీ మెదడుకు, చర్మానికి మధ్య షేర్ చెయ్యబడే సంకేతాలలో లోపాలు తలెత్తినప్పుడు మీకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీనిని "పెరిఫెరల్ న్యూరోపతి" అని పిలుస్తారు.

2. మొద్దుబారుట :

2. మొద్దుబారుట :

మీరు ముఖ్యంగా చేతులు, పాదాలలో మొద్దుబారుటమనే సమస్యను అనుభవిస్తున్నట్లయితే, ఇది మీ శరీర నాడీవ్యవస్థ దెబ్బతిన్నదని తెలియజేసే మరొక సంకేతం. దెబ్బతిన్న నాడీవ్యవస్థ మొద్దుబారుటానికి కారణం అవటంవల్ల - మీ శరీర భాగాలలో కొన్ని చోట్ల సంచలనాన్ని కోల్పోతుంది. ఈ సమస్య సాధారణంగా చేతులు, కాళ్లలో మొదటగా ప్రభావితం కాబడుతుంది, అలాంటి సమయంలో సరైన చికిత్సను అందించకపోతే ఈ మొద్దుబారే సమస్య శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాప్తి చెందుతుంది.

3. సమతుల్యతను నష్టపోవడం :

3. సమతుల్యతను నష్టపోవడం :

మనము అనేకసార్లు లో జ్వరం బారిన పడినప్పుడు (లేదా) అలసటను కలిగి ఉన్నప్పుడు, మనము మైకము కలిగిన భావనలో ఉంటూ - మన శరీర సమతుల్యాన్ని కోల్పోవచ్చు. సరైన కారణం లేకుండా మీరు ఈ విధంగా తరచుగా అనుభూతి చెందినట్లయితే, మీరు ఎక్కువ మైకాన్ని కలిగి పడిపోవడానికి, అలాగే మీకు గాయాలు తగలడానికి దారితీస్తుంది. అలాంటప్పుడు ఇది కూడా మీ శరీర నాడీవ్యవస్థ దెబ్బతిన్నదని సూచించే సంకేతంగా భావించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో తలెత్తే ప్రమాదాలను నివారించడానికి మీరు తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలి.

4. కండరాల బలహీనత :

4. కండరాల బలహీనత :

ఒక చిన్న పనికి కూడా మీరు తరచుగా కండరాల వాపులు (లేదా) నొప్పులతో బాధపడుతున్నట్లయితే, అది కండరాల బలహీనత వల్ల కావచ్చు. మెదడుకి, కండరాల సమూహాలకి మధ్యలో సరఫరా కాబడే సమాచార సంకేతాలు తీవ్రస్థాయిలో ప్రభావితమయినప్పుడు, అది నిర్దిష్ట కండరాల సమూహాన్ని కాలక్రమేణా బలహీనం చేయగలదు, మీ రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా కదిలేటప్పుడు, నడిచేటప్పుడు మీకు చాలా కష్టంగా ఉంటుంది. కండరాల బలహీనత వల్ల కొన్ని సందర్భాలలో మీరు కండరాలపై నియంత్రణను కోల్పోయేలా చేస్తుంది.

5. తిమ్మిర్లు :

5. తిమ్మిర్లు :

మన శరీర కండరాలు ఎక్కువ పనిని చేసినప్పుడు, వ్యాయామాన్ని చేసినప్పుడు చాలా నొప్పులకు గురవుతుంది (లేదా) మనబడి హైడ్రేషన్ కు గురైనప్పుడు 1 లేదా 2 రోజులు తిమ్మిర్లను అనుభూతి చెందడం సర్వసాధారణం. అయినప్పటికీ, మీరు తరచుగా కండరాలలో సంచలనాన్ని కలిగిన తిమ్మిర్లను ఎదుర్కొన్నట్లయితే, అదికూడా మీ శరీర నాడీవ్యవస్థ దెబ్బతిన్నదని తెలిపే సంకేతము కావచ్చు.

6. అసాధారణమైన హృదయ స్పందన :

6. అసాధారణమైన హృదయ స్పందన :

రన్నింగ్ (లేదా) వ్యాయామం చేసిన తర్వాత, మనము ఆందోళన చెందటాన్ని కలిగి ఉన్నప్పుడు, ఒక్కసారిగా మన హృదయ స్పందన అసాధారణమైన స్థితిలో ఉండటాన్ని గమనించవచ్చు. అయితే, మీరు అసాధారణమైన హృదయ స్పందన రేటును అనగా సాధారణ స్థితి కంటే ఎక్కువ (లేదా) తక్కువ హృదయ స్పందనను కలిగి మీరు చాలా అలసటతో బాధపడుతున్నట్లుగా భావిస్తే, అది మీ శరీర నాడీవ్యవస్థ దెబ్బతిన్నదని తెలిపే సంకేతము కావచ్చు. మెదడు సరైన సంకేతాలను గుండెకు పంపడంలో విఫలమైనప్పుడు - గుండె శరీరానికి కావలసిన రక్తాన్ని సరఫరా చేయలేకపోవడమే దీనికి ప్రధాన కారణం.

7. మైకము :

7. మైకము :

మీరు తరచుగా మైకమును ఎదుర్కొంటున్నట్లయితే అది డీహైడ్రేషన్, అలసట చెందటం, మెదడులో కణితి, రక్తహీనత వంటి మొదలైన సమస్యల వల్ల ఎదురైనట్లుగా సూచిస్తుంది. అయినప్పటికీ, మీరే ఈ రకమైన సమస్యలన్నింటినీ పరీక్షించుకున్న తర్వాత కూడా అలాంటివేవీ లేవని తెలిసిన తర్వాత కూడా మీరు మైకమును ఎదుర్కొన్నట్లయితే, అది మీ శరీర నాడీవ్యవస్థ దెబ్బతిన్నదని తెలిపే సంకేతము కావచ్చు.

8. జీర్ణ సమస్యలు :

8. జీర్ణ సమస్యలు :

సాధారణంగా మనము అసిడిటీ, అజీర్ణం, ఆకలి మందగించడం, వికారం వంటి మొదలైన జీర్ణ సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు, మనము కడుపు (లేదా) ప్రేగులలో సమస్యలను కలిగి ఉన్నామని దానర్థం. అయితే, జీర్ణ సమస్యలు కూడా నాడీవ్యవస్థ దెబ్బతిన్న ఫలితంగానే మనకి ఎదురవుతాయి, ఎందుకంటే నాడీకణాలు తమ పనితీరును సమర్థవంతంగా పాటించడానికి అనుగుణమైన సంకేతాలను మెదడు నుంచి పొందలేకపోవడమే ప్రధాన కారణం.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    8-Unusual-Signs-That-Say-You-Could-Have-Nerve-Damage!

    The nervous system is very complex and all the bodily functions take place with the help of the signals it sends to other body parts, which makes it one of the most important parts of the human body. There are a few unusual signs of nerve damage that you must never ignore like numbness, cramps, dizziness, digestive problems, etc.
    Story first published: Saturday, March 31, 2018, 17:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more