పెదవులపై కోల్డ్ సోర్స్ ను తగ్గించేందుకు అద్భుతమైన హోమ్ రెమెడీస్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

పెదవుల చుట్టూ ఉండే చిన్న చిన్న ఎర్ర బొబ్బలను గమనించారా? అవి పెయిన్ ఫుల్ గా ఉన్నాయా? అయితే, మీరు కోల్డ్ సోర్ సమస్య వలన ఇబ్బంది పడుతున్నారు. కోల్డ్ సోర్స్ ను ఫీవర్ బ్లిస్టర్స్ అనంటారు. ఇవి హెర్ప్స్ సింప్లెక్స్ వైరస్ (HSV) వలన ఏర్పడతాయి. ఇది ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు పెదవులపై ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కోల్డ్ సోర్స్ కనిపించే ఆస్కారం ఉంది.

పెదవులపై కనిపించే కోల్డ్ సోర్ బ్లిస్టర్ లా ఉంటుంది. ఇది కనీసం వారం నుంచి పదిరోజుల పాటు ఉంటుంది. ఇది కంటాజియస్. కోల్డ్ సోర్ ఇన్ఫెక్షన్ తీవ్రమైన ఆరోగ్య సమస్య కాకపోయినా ఇది రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. కోల్డ్ సోర్ తగ్గిపోయిన తరువాత కూడా హెర్ప్స్ వైరస్ శరీరంలో ఉండిపోయి మళ్ళీ మళ్ళీ అవే ప్రదేశాల్లో నోటి చుట్టూ అలాగే ముఖంపై సమస్యను కల్గించే ప్రమాదం ఉంది.

Home Remedies For Cold Sores Around Lips

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ప్రకారం 50 ఏళ్ళ వయసు పైబడిన వారిలో మూడింట రెండు వంతుల మంది కోల్డ్ సోర్ సమస్య బారిన పడుతున్నారు. ఫీవర్, గొంతు నొప్పి, తలనొప్పి వంటి వన్నీ కోల్డ్ సోర్ తో అనుసంధానమైన లక్షణాలు. ఒత్తిడి, హార్మోన్లలో హెచ్చుతగ్గులు, సర్జరీ, ఫివర్స్, అనారోగ్యం లేదా ఎండలో ఎక్కువగా ఉండటం వంటివి కోల్డ్ సోర్ కి దారితీసే కొన్ని కారకాలు.

ఈ సమయాకు ప్రస్తుతం చికిత్స అంటూ ఏదీ లేదు. అయితే, ఈ సమస్యని రాకుండా అరికట్టేందుకు అలాగే సమస్య తీవ్రతను తగ్గించేందుకు కొన్ని హోమ్ రెమెడీస్ ఉన్నాయి.

ఐస్:

ఐస్:

ఐస్ అనేది స్వెల్లింగ్, రెడ్ నెస్ అలాగే కోల్డ్ సోర్ ద్వారా కలిగే పెయిన్ ను తగ్గించేందుకు తోడ్పడుతుంది. ప్రభావిత ప్రాంతాన్ని నిమిషాల్లో ప్రశాంతపరుస్తుంది.

కొన్ని ఐస్ క్యూబ్స్ ని శుభ్రమైన టవల్ లో ఉంచాలి.

దీనిని కోల్డ్ సోర్ పై పది నుంచి పదిహేను నిమిషాలపాటు ఉంచాలి.

ఈ పద్దతిని మూడు లేదా నాలుగు గంటలకు ఒకసారి పాటించాలి.

గార్లిక్:

గార్లిక్:

గార్లిక్ లో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ మరియు యాంటీ ఫంగల్ ఏజెంట్స్ ఉన్నాయి. ఇవి కోల్డ్ సోర్స్ ను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతేకాక, ఇది యాంటీ ఇంఫ్లేమేటరీ నేచర్ కూడా కలిగి ఉంది. తద్వారా, స్వెల్లింగ్ మరియు ఇంఫ్లేమేషన్ త్వరగా తగ్గుముఖం పడతాయి.

ఒక వెల్లుల్లి రెబ్బను క్రష్ చేసి ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయండి.

పది నిమిషాల పాటు అలాగే ఉంచండి.

ఈ పద్దతిని రోజుకు మూడు నుంచి ఐదు సార్లు పాటించండి.

అయితే, పచ్చి వెల్లుల్లిను అప్లై చేసినప్పుడు బర్నింగ్ సెన్సేషన్ కలిగే ప్రమాదం ఉంది.

లికోరైస్ రూట్:

లికోరైస్ రూట్:

లికోరైస్ రూట్ అనే హెర్బ్ లో కోల్డ్ సోర్స్ కు చికిత్స నందించి సమస్యను అరికట్టే సామర్థ్యం కలదు. ఇందులో గ్లైకిర్హిజిన్ అనే పదార్థం కలదు. ఇందులో యాంటీ వైరల్ అలాగే యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీలు పుష్కలంగా కలవు.

ఒక టేబుల్ స్పూన్ లికోరైస్ రూట్ పౌడర్ లో అర టీస్పూన్ నీళ్లను కలపండి.

ఈ పేస్ట్ ను కోల్డ్ సోర్ పై ఒక కాటన్ శ్వాబ్ తో లేదా ఫింగర్ టిప్ తో అప్లై చేయండి.

ఈ ప్రాసెస్ ని ప్రతి కొన్ని గంటలకు ఒకసారి పాటించండి.

కోల్డ్ సోర్స్ సమస్య మీకు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పుడు లికోరైస్ రూట్ ను తరచూ తీసుకుంటే అవుట్ బ్రేక్స్ అనేవి తగ్గుతాయి.

లెమన్ బామ్:

లెమన్ బామ్:

లెమన్ బామ్ అనేది హీలింగ్ ప్రాసెస్ ను వేగవంతం చేసి చర్మాన్ని ప్రశాంతపరుస్తుంది. ఇన్ఫెక్షన్ విస్తరణను అరికడుతుంది. లెమన్ బామ్ లో ట్యానిన్స్ మరియు పోలీ ఫెనోలిక్ కాంపౌండ్స్ కలవు. వీటిలో యాంటీ వైరల్ ఎఫెక్ట్స్ కలవు.

రెండు టీస్పూన్ల ఎండిన లెమన్ బామ్ లీవ్స్ ను ఒక కప్పుడు వేడి నీటిలో పదినిమిషాల పాటు స్టీప్ చేయండి.

వడగట్టిన తరువాత తాగండి.

ఈ హెర్బల్ టీను రోజుకు నాలుగు కప్పులు తీసుకోవాలి.

చల్లటి పాలు:

చల్లటి పాలు:

పాలలో ఇమ్మ్యూనోగ్లోబలిన్స్ లభిస్తుంది. ఇది కోల్డ్ సోర్స్ ని కలుగచేసే వైరస్ కు అడ్డుకట్ట వేస్తుంది. అలాగే, పాలలో యాంటీ వైరల్ ఎఫెక్ట్స్ కూడా కలవు. ప్రభావిత ప్రాంతంలో కలిగే అసౌకర్యాన్ని అలాగే టింగ్లింగ్ సెన్సేషన్ ను తగ్గించి ప్రశాంతపరచేందుకు చల్లటి పాలు తోడ్పడతాయి.చల్లటి పాలలో కాటన్ బాల్ ను ముంచండి.

కాటన్ బాల్ తో ప్రభావిత ప్రాంతంపై అప్లై చేసి పదినిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి.

ఈ పద్దతిని రోజుకు రెండు సార్లు పాటించండి.

రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారాలను తీసుకోండి:

రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారాలను తీసుకోండి:

బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వారిలో కోల్డ్ సోర్స్ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఇమ్యూన్ సిస్టమ్ ను పెంపొందించే ఆహారాలను తీసుకోవడం మంచిది. యోగర్ట్, పాలు మరియు ఆపిల్ సిడర్ వినేగార్ లలో ఇమ్యూన్ సిస్టమ్ ను సహజంగా పెంచే సామర్థ్యం కలదు. విటమిన్స్ తో పాటు మినరల్స్ అనేవి ఇన్ఫెక్షన్స్ పై పోరాటం జరిపేందుకు అద్భుతంగా తోడ్పడతాయి. ఇవి కూరగాయలలో పుష్కలంగా లభిస్తాయి.

విటమిన్ సి:

విటమిన్ సి:

విటమిన్ సి అనేది వైట్ బ్లడ్ సెల్ కౌంట్ ను పెంచేందుకు తద్వారా శరీరంపై దాడిచేసి బాక్టీరియాపై పోరాడేందుకు తోడ్పడుతుంది. విటమిన్ సి క్యాప్సూల్ ను తీసుకుని శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందించుకోండి. స్కిన్ హెల్త్ ను మెరుగుపరుచుకోండి. కోల్డ్ సోర్స్ సమస్యను తగ్గించుకోండి.

ఆరెంజెస్, రెడ్ పెప్పర్స్, గ్రీన్ పెప్పర్స్, కాలే, బ్రస్సెల్స్ స్ప్రౌట్స్, బ్రొకోలీ, స్ట్రా బెర్రీస్, గ్రేప్ ఫ్రూట్ మరియు కివీలలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.

ఈ ఆర్టికల్ ను షేర్ చేయండి!

English summary

Home Remedies For Cold Sores Around Lips

A cold sore appears like a blister around the lips, and it usually lasts for 7 to 10 days, during which it becomes contagious. Although a cold sore infection is generally not serious, it can be a major problem for people with weak immune system. The home remedies for treating cold sores are garlic, lemon balm, immune boosting foods, etc.
Story first published: Wednesday, April 18, 2018, 20:30 [IST]