ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ఎసిడిటీని అవాయిడ్ చేయడమెలా? !

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ఫాస్టింగ్ అనేది ఆరోగ్యానికి మంచిదన్న అభిప్రాయాన్ని ఈ మధ్యకాలంలో హెల్త్ కాన్షియస్ కలిగిన వారు వ్యక్తపరుస్తున్నారు. కొన్ని ఆధ్యాత్మిక కారణాలతో కూడా ఫాస్టింగ్ ముడిపడి ఉంటుంది.

ఎన్నో కల్చర్స్ లో అలాగే రిలీజన్స్ లో ఫాస్టింగ్ కి గొప్ప స్థానం ఉంది. కొన్ని సార్లు ఆరోగ్యం కోసం కొన్ని సార్లు ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం ఫాస్టింగ్ ని ఎంచుకుంటారు.

ఫాస్టింగ్ వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే, ఫాస్టింగ్ కి శరీరం అలవాటు పడేవరకు కొన్ని ఛాలెంజెస్ ని ఎదుర్కోవలసి వస్తుంది. ఫాస్టింగ్ సమయంలో అసిడిటీతో బాధపడటాన్ని గుర్తించవచ్చు.

how to avoid acidity during fasting

ఫాస్టింగ్ సమయంలో సాలిడ్ ఫుడ్స్ ని దూరంగా ఉంచుతారు. పండ్లు మరియు పానీయాలని తీసుకుంటారు. ఫాస్టింగ్ ద్వారా హానికర టాక్సిన్స్ అనేవి శరీరం నుంచి బయటకు పోతాయి.

ఫాస్టింగ్ చేస్తున్న ప్రారంభ దశలలో, కడుపులో యాసిడిక్ ఎటాక్ ని గుర్తించవచ్చు. ఇది ఫాస్టింగ్ ని అసాధ్యమైన ప్రక్రియగా మార్చే అవకాశాలుంటాయి. ఎసిడిటీ వలన హార్ట్ బర్న్ అలాగే అప్పర్ అబ్డోమెన్ ఏరియాలో అసౌకర్యం కలుగుతుంది.

అసిడిటీ అనేది సాధారణ సమస్య అయిపొయింది. అయితే, కోన్ని జాగ్రత్తలతో ఈ సమస్యపై పోరాటం జరపవచ్చు. ఫాస్టింగ్ సమయంలో ఎసిడిటీని నియంత్రించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. వేడి నీళ్లు:

1. వేడి నీళ్లు:

ఫాస్టింగ్ సమయంలో హైడ్రేటెడ్ గా ఉండటం తప్పనిసరి. వెచ్చని లేదా వేడి నీటిని తీసుకోవడం మంచిది. చన్నీళ్ళ కంటే వేడినీళ్లు లేదా వెచ్చని నీళ్లు ఈ సమయంలో ఉపశమనం కలిగిస్తాయి. అలాగే నీటిని కొద్దీ మోతాదులో తరచూ తీసుకోవాలి. సిప్ చేస్తూ నీటిని తీసుకుంటే ఇంకా మంచిది. కడుపుని నీటితో ఒకేసారి నింపితే అసిడిటీ సమస్య మరింత పెరిగే సూచనలు కలవు.

2. చల్లని పానీయాలు

2. చల్లని పానీయాలు

ఫాస్టింగ్ సమయంలో చల్లని పానీయాలను తీసుకోవడం మంచిదే. మజ్జిగా మరియు చల్లని పాలు ఫాస్టింగ్ సమయంలో ఎదురయ్యే ఎసిడిటీ సమస్యలను నివారించడానికి ఉపయోగపడతాయి. చల్లటి పాలను షుగర్ లేకుండా తీసుకోవడం వలన ఫాస్టింగ్ సమయంలో ఎసిడిటీ వలన ఎదురైయ్యే బర్నింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతుంది.

3. పండ్లు

3. పండ్లు

బనానా మరియు మస్కమేలన్ వంటి పండ్లు కూడా ఫాస్టింగ్ లో మీకు ఉపశమనం కలిగిస్తాయి. బనానాలో పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఎసిడిటీతో పోరాడుతుంది. ఇందులో లభించే ఫైబర్ అనేది ఫాస్టింగ్ సమయంలో శరీరానికి మంచిది. శరీరంలోని పిహెచ్ లెవెల్స్ ను బాలన్స్ చేయడానికి తోడ్పడుతుంది.

అదేవిధంగా, మస్కమేలన్ కి అసిడిటీతో పోరాడే గుణం కలదు. ఈ ఫ్రూట్స్ ని ఫాస్టింగ్ సమయంలో తీసుకుంటే మంచిది.

4. కొబ్బరి నీళ్లు

4. కొబ్బరి నీళ్లు

కొబ్బరినీళ్లు సహజసిద్ధమైన ఆరోగ్య నిధి. ఎసిడిటీపై సమర్థవంతంగా పోరాడుతుంది. పిహెచ్ లెవెల్స్ బాలన్స్ లో ఉంటాయి. శరీరం నుంచి హానికర టాక్సిన్స్ వెలుపలకు పోతాయి. ఎసిడిటీని తగ్గిస్తుంది.

5. సిట్రస్ ఫ్రూట్స్ ని అవాయిడ్ చేయండి:

5. సిట్రస్ ఫ్రూట్స్ ని అవాయిడ్ చేయండి:

ఫాస్టింగ్ సమయంలో సిట్రస్ ఫ్రూట్స్ ని అవాయిడ్ చేయాలి. నాన్ అసిడిక్ ఫ్రూట్స్ పై ఆధారపడాలి. ఆరంజ్, గ్రేప్ ఫ్రూట్, లెమన్స్ వంటి ఫ్రూట్స్ కి దూరంగా ఉండాలి . అటువంటి యాసిడిక్ ఫ్రూప్ట్స్ వలన ఎసిడిటీ సమస్య మరింత ఎక్కువగా మారుతుంది.

6. ఫాస్ట్ ని బ్రేక్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండండి:

6. ఫాస్ట్ ని బ్రేక్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండండి:

ఫాస్టింగ్ హవర్స్ అయిపోయిన తరువాత నీళ్లతో అలాగే పండ్లతో ఫాస్ట్ ని బ్రేక్ చేయడం మంచిది. అలా కాకుండా ఒకేసారి భారీగా భోజనం చేస్తే జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యంగా తినాలి, తినేటప్పుడు ఆహారాన్ని బాగా నమలాలి. ఈ విధంగా చేయడం ద్వారా ఫాస్టింగ్ తరువాత కలిగే అసిడిటీని తగ్గించుకోవచ్చు.

ఫాస్టింగ్ సమయంలో పైన చెప్పిన మార్గాలు మీకు సూతింగ్ గా ఉంటాయి. వీటిని పాటించి ఎసిడిటీను తగ్గించుకుని శరీరాన్ని డీటాక్స్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా ఫాస్టింగ్ సమయంలో ఇబ్బందులు తగ్గుతాయి. సరైన ఫాస్టింగ్ వలన శరీరానికి అలాగే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. హ్యాపీ ఫాస్టింగ్! హ్యాపీ డిటాక్సింగ్!

English summary

How To Avoid Acidity During Fasting?

The most common concern which comes with fasting is an acidic stomach. Acidity can cause a lot of discomfort to the body. Few ways to avoid acidity during your fasting period are drinking hot water, having cold beverages like buttermilk, having fruits, coconut water and avoiding citrus fruits.
Story first published: Saturday, March 10, 2018, 7:00 [IST]