జివ్వుమనే మీ దంతాలకు సరైన పరిష్కారం ఏమిటి ?

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మీరు కొన్ని చల్లని పదార్థాలను తినడం వల్ల, అవి మీ పంటిని చికాకు పెడుతున్నట్లుగా ఉందా? ఇది "దంతాల సున్నితత్వము" అని పిలువబడే సాధారణ దంత సమస్య కావచ్చు. కొన్ని పదార్ధాలను చల్లని ఉష్ణోగ్రతలో ఉంచి, తినడం వల్ల మీ పళ్ళలో అసౌకర్యం (లేదా) నొప్పిని కలిగి ఉంటాయి. ఈ వ్యాసాన్ని పూర్తిగా మీరు చదివినట్లయితే, ఒక్క రాత్రిలో దంతాల సున్నితత్వమును వదిలించుకోవటం ఎలాగో మీకు తెలుస్తుంది.

ఒక అధ్యయనంలో, దాదాపు 53% మంది భారతీయులు దంతాల నుంచి రక్తం కారడం, సున్నితమైన దంతాలు, దంతాలు పుచ్చిపోవడం, చెడుశ్వాస వంటి సాధారణ పంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. క్లీవ్లాండ్ క్లినిక్ తెలిపిన దాని ప్రకారం, పైన తెలిపిన సమస్యలన్నీ మీ దంతాల చివర్లో ఉన్న నరాలలో నొప్పిని కలుగజేసే అంశాలు కావచ్చు, ఈ నొప్పులు తరచుగా బాధతో కూడుకుని ఆకస్మికంగా వచ్చేవిగా ఉంటాయి.

How To Get Rid Of Sensitive Teeth Overnight

సున్నితమైన దంతాల సమస్యల ఎవరికైనా ఎదురవ్వచ్చు. ఆరోగ్యకరమైన పళ్ళలో ఉండే ఎనామెల్, డెంటిన్లో ఉన్న అంతర్లీన పొరను కాపాడుతుంది, ఇది ఎనామెల్ కంటే మెత్తగా ఉంటుంది. దంతాల మూలాలు, చిగుళ్ళ ద్వారా రక్షించబడతాయి కానీ ఎనామెల్ (లేదా) చిగుళ్ల పరిమాణం బాగా తగ్గిపోయినట్లయితే, డెంటిన్ బయటకు కనిపిస్తుంది.

కావిటీస్, దంతాల పగుళ్లు, ఎనామెల్, మరియు దంతాల మూలాలు ఒరుసుకు పోవడం వంటి కారణాల చేత మీ పళ్లు బహిర్గతం కాబడతాయి. అలాగే ఈ సున్నితమైన పళ్ళలో కలిగే నొప్పిని ప్రేరేపించే నరాలు ఈ డెంటిన్తో అనుసంధానించబడి ఉంటాయి.

గాలికి, చల్లదనానికి, తియ్యదనానికి, ఆమ్లత్వముకు & వేడి పదార్థాలను తీసుకునేటప్పుడు మీ దంతాలలో హఠాత్తుగా జివ్వుమనే బాధను సాధారణంగా కలిగి ఉంటారు.

ఇలాంటి సమస్య నుండి బయట పడటం కోసం మీరు ఏం చేయాలో అన్నది ఈ క్రింది విషయాలను చదివి తెలుసుకోండి.

1. ఉప్పు నీరు :

1. ఉప్పు నీరు :

ఉప్పునీరు నోటిలో pH సమతుల్యాన్ని మెరుగుపరుస్తున్నందున వెంటనే మీ దంతాలకు చికిత్సను చేయగలదు. ఇది ఒక ఆల్కలీన్ పర్యావరణాన్ని సృష్టిస్తుంది, ఇందులో హానికరమైన బ్యాక్టీరియా ఏదీ జీవించి ఉండదు.

½ టీ స్పూన్ ఉప్పుని ఒక కప్పు వేడి నీటిలో బాగా కలపాలి.

ఈ మిశ్రమంతో మీ నోటిని బాగా శుభ్రం చేయండి.

అలా ఈ మిశ్రమాన్ని కొన్ని నిముషాల పాటు మీ నోటితో బంధించి ఉంచండి.

ఆ తర్వాత ఈ ద్రావణాన్ని బయటకు ఊసి, మామూలు నీటితో మీ నోరుని బాగా శుభ్రం చేయాలి.

ఇలా రోజుకు 2 సార్లు రిపీట్ చేయండి.

2. లవంగాలు & లవంగాల ఆయిల్ :

2. లవంగాలు & లవంగాల ఆయిల్ :

దంతాల నొప్పులను కలగజేసే వ్యాధులతో పోరాడటానికి సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియా & మత్తుపదార్థ లక్షణాలను లవంగాలను కలిగి ఉండటం వల్ల మీ దంతాలకు ఉన్న సున్నితత్వాన్ని నయం చేయడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి.

2 లవంగాలను బాగా గ్రైండ్ చేయండి, దానికి కొద్దిగా ఆలివ్ నూనెను కలపండి, అలా తయారైన పేస్టును 30 నిమిషాలు పాటు మీకు సమస్య ఉన్న పళ్ళ ప్రాంతంలో అప్లై చేయండి.

(లేదా) మీరు లవంగాల నూనెలో ఒక దూది బంతిని బాగా ముంచి, 20 - 30 నిముషాల వరకు మీ దంతాలలో నేరుగానే అప్లై చేయవచ్చు.

అంతేకాక, మీరు ½ గ్లాసు గోరువెచ్చని నీటిలో 6 చుక్కల లవంగాల నూనెను కలపవచ్చు.

ఈ మిశ్రమంతో రోజుకు 2 సార్లు చెప్పున మీ నోటిని శుభ్రం చేసుకోవడం వల్ల మంచి పరిష్కారాన్ని పొందగలుగుతారు.

 3. కొబ్బరినూనె :

3. కొబ్బరినూనె :

కొబ్బరి నూనె మీ పళ్ళ సున్నితత్వాన్ని చికిత్స చేయడంలో బాగా సహాయపడుతుంది. ఇది మీ నోటిలో ఉండే స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా సంఖ్యను తగ్గిస్తుంది, అలాగే ఇది మీ దంతాల సున్నితత్వాన్ని కూడా తగ్గిస్తుంది. కొబ్బరినూనెలో ఉండే సహజసిద్ధమైన యాంటీబాక్టీరియా ఏజెంట్గా ఉండటం వల్ల మీ పళ్ళలో ఉన్న ఫలకాన్ని తగ్గిస్తుంది.

మీ నోటిలో 1 టేబుల్ స్పూను సేంద్రీయ కొబ్బరినూనెను ఉంచండి.

దీనిని 20 నిమిషాల పాటు బాగా నోటితో పుక్కిలించండి.

ఆ తర్వాత నోటిలో ఉన్న నూనెను బయటకు ఊసి, గోరువెచ్చని నీటితో మీ నోటిని శుభ్రం చేయాలి.

అలా చేసిన తర్వాత, మీ దంతాలను బ్రష్తో బాగా శుభ్రం చేసుకుంటారు.

ఇలా మీ దంతాలను ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత, బ్రష్ చేయటానికి ముందు బాగా శుభ్రపరచుకోవడానికి ప్రయత్నించండి.

4. వెల్లుల్లి :

4. వెల్లుల్లి :

వెల్లుల్లి, మసాలా దినుసుగా ప్రఖ్యాతి గాంచినదిగా ఉంది, ఇది మీ దంతాల సున్నితత్వమును వదిలించుకోవడానికి సహాయపడుతుంది. వెల్లుల్లి ఒక శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ ఏజెంట్, అది సహజసిద్ధంగా మత్తును కలిగించే ఆల్సిన్లను ఎక్కువగా కలిగి ఉంటుంది.

వెల్లుల్లిలోని ఒక చిన్నపాయను బాగా ముద్దగా చేసి, దానికి 3 నీటి చుక్కలను & కావలసినంత ఉప్పును కలిపి, బాగా మిక్స్ చేయాలి.

దెబ్బతిన్న పంటి భాగంలో నేరుగా ఈ పేస్ట్ను అప్లై చేసి, దానిని కొన్ని నిమిషాలు పాటు అలానే వదిలేయండి.

ఆ తర్వాత గోరువెచ్చని ఉప్పు నీటితో మీ పళ్ళను బాగా శుభ్రం చేసుకోండి.

ఇలా రోజుకి రెండుసార్లు రిపీట్ చేయండి.

5. జామ ఆకులు :

5. జామ ఆకులు :

ఆయుర్వేదము ప్రకారం, పంటి సమస్యలకు & ఇతర నోటి సమస్యల కోసం జామ ఆకులను ఉపయోగించవచ్చని సిఫార్సు చేస్తోంది. దంతాల సున్నితత్వం కారణంగా మీరు తీవ్రమైన నొప్పిని ఎదుర్కొంటున్నప్పుడు, దాని ఉపశమనం కోసం ఈ పురాతనమైన నివారణ ఉపాయాన్ని తప్పక ప్రయత్నించండి. ఈ ఆకులలో క్వెర్శిటిన్ & శోథ నిరోధకత & అనాల్గేసిక్ వంటి ఫ్వావానాయిడ్ల లక్షణాలను కలిగి ఉంటాయి.

1 కప్పు నీటిలో 5 జామ ఆకులను చేర్చి, 5 నిముషాల పాటు బాగా మరగకాచండి.

దీనిని చల్లబరిచిన తర్వాత, కాస్త ఉప్పు వేసి, మౌత్ వాష్గా ఉపయోగించుకోండి.

6. ఉల్లిపాయ :

6. ఉల్లిపాయ :

ఉల్లిపాయలో క్వెర్శిటిన్ ఫ్వావానాయిడ్లను వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది పంటికి కారణమైన తీవ్రమైన నొప్పి నుంచి సత్వరమే ఉపశమనాన్ని అందిస్తుంది. ఉల్లిపాయలో ఉండే యాంటీమైక్రోబయాల్ లక్షణాలు నోటిలో హానికరమైన బ్యాక్టీరియాను చంపటానికి సహాయపడతాయి.

ఒక చిన్న ఉల్లిపాయ ముక్కను కత్తిరించి మీ నోటిలో ఉంచండి.

దానిని అలానే 5 నిముషాల పాటు మీ పంటి భాగంలో ఉండేలా అనుమతించండి.

ఉల్లిపాయతో కూడిన శ్వాసను నివారించడానికి, ఉప్పు నీటితో పూర్తిగా మీ నోటిని శుభ్రపరచుకోండి.

మంచి ఫలితాల కోసం ఇలా రోజుకీ మూడుసార్లు చేయండి.

7. నోటి శుభ్రతను పాటించండి :

7. నోటి శుభ్రతను పాటించండి :

పంటి సున్నితత్వాన్ని కలిగించే చిగుళ్ల వ్యాధులు, పంటిలో పగుళ్లు & పళ్ళపై ఏర్పడిన ఫలకాన్ని నిరోధించడానికి సహాయపడేలా మీ నోటిని పరిశుభ్రంగా నిర్వహించడం చాలా ముఖ్యం.

మృదువైన ఉన్న టూత్ బ్రష్ను ఉపయోగించి మీ దంతాలను బాగా శుభ్రం చేయండి.

దంతాల సున్నితత్వాన్ని తగ్గించడంలో సహాయపడే టూత్పేస్ట్ను ఉపయోగించుకోండి.

మీ నోటిలో అధిక యాసిడ్ పదార్ధాల స్థాయిని తగ్గించడానికి, ఫ్లోరైన్డ్ మౌత్ వాష్ని ఉపయోగించండి.

8. ఆమ్లసంబంధమైన ఆహారాల వినియోగాన్ని బాగా తగ్గించాలి :

8. ఆమ్లసంబంధమైన ఆహారాల వినియోగాన్ని బాగా తగ్గించాలి :

అధిక ఆమ్లసంబంధమైన ఆహారాలు & పానీయాలు తరచుగా వినియోగించడం వల్ల మీ దంతాల ఎనామెల్ను నాశనం చేస్తుంది, దీంతో డెంటిన్ను బయటకు కనపడేలా చేస్తుంది.

కార్బోనేటేడ్ పానీయాలు, సిట్రస్ పండ్లు & వైన్ వంటి ఆమ్ల సంబంధమైన ఆహారాలను & పానీయాల వినియోగాన్ని తక్షణమే నివారించండి.

ఆమ్ల ఆహారాలను / పానీయాలను తీసుకున్న తర్వాత మీ దంతాలను బ్రష్ చెయ్యడం మానుకోండి, ఎందుకంటే అది మీ పంటి ఎనామెల్ను దెబ్బతినేలా చేయవచ్చు.

మీ దంతాలను బ్రష్తో శుభ్రం చేయడానికి ముందు కనీసం 30 నిమిషాలు వేచి ఉండటం చాలా మంచిది.

English summary

How To Get Rid Of Sensitive Teeth Overnight

In healthy teeth, the enamel protects the underlying layer of the dentin, which is softer than the enamel. If the enamel is worn down or if the gum line has receded, then the dentin becomes exposed. The home remedies to get rid of sensitive teeth overnight are cloves and clove oil, salt water, coconut oil, garlic, oregano oil, onion, etc.