For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ చేతులు కూడా థైరాయిడ్ సమస్యను సూచించగలవు, ఎలాగో తెలుసుకోండి.

మీ చేతులు కూడా థైరాయిడ్ సమస్యను సూచించగలవు, ఎలాగో తెలుసుకోండి.

|

థైరాయిడ్ గ్రంథి మన మెడ స్థావరానికి దగ్గరగా ఉంటుంది. మరియు శరీర జీవక్రియలను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేసే బాధ్యతను కలిగి ఉంటుంది. ఈ గ్రంధి ఒక చిన్న సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. ఇది అన్ని గ్రంధుల సమకాలీన అనుసంధాన వ్యవస్థలో భాగంగా ఉంటుంది, దీనిని ఎండోక్రైన్ వ్యవస్థగా కూడా సూచిస్తారు. ఈ గ్రంధిని గుర్తించడానికి, థైరాయిడ్ హార్మోన్ (T4 లేదా థైరాక్సిన్) మరియు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (TSH) స్థాయిలని కొలవడం జరుగుతుంది. ఈ స్థాయిలను కొలవడానికి రక్త పరీక్ష నిర్వహించబడుతుంది.


థైరాయిడ్ గ్రంధి విడుదల చేసే హార్మోను మితిమీరినప్పుడు, ఈ పరిస్థితిని హైపర్ థైరాయిడిజంగా సూచిస్తారు, అలాగే హార్మోను స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు, ఈ పరిస్థితిని హైపో థైరాయిడిజంగా వ్యవహరిస్తారు.

How Your Hands Can Indicate Thyroid Problem

హైపోథైరాయిడిజం అంటే ఏమిటి?

థైరాయిడ్ గ్రంధి పనితీరు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, తగినంత హార్మోన్లు ఉత్పత్తి చేయబడవు. అదేప్రకారం, థైరాక్సిన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు, TSH స్థాయిలు ఎక్కువగా ఉంటాయి, ఈ పరిస్థితిని హైపోథైరాయిడిజం అని అంటారు. (హైపర్ థైరాయిడిజం యొక్క స్థితికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది).

పిట్యూటరీ గ్రంధి TSH ను విడుదల చేయడానికి బాధ్యత వహిస్తుంది, తద్వారా తగిన హార్మోన్లను ఉత్పత్తి చేసేక్రమంలో థైరాయిడ్ గ్రంధిని ప్రేరేపిస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళలే థైరాయిడ్ సమస్యలను ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పబడింది.

హైపోథైరాయిడిజం కొన్నిసార్లు హషిమోటో వ్యాధి కారణంగా కానీ, థైరాయిడ్ గ్రంధిని తొలగించే శస్త్రచికిత్స జరిగినప్పుడు సంభవించే అవకాశాలు ఉన్నాయి. రక్త పరీక్ష ద్వారానే కాకుండా, మీ డాక్టర్ థైరాయిడ్ స్కాన్ పరీక్షను కూడా సిఫార్సు చేయవచ్చు. ఈ పరీక్షలో భాగంగా, రేడియోధార్మిక ట్రేసర్ వినియోగించి మీ థైరాయిడ్ పనితీరును అంచనా వేయడం జరుగుతుంది.

మరోరకమైన పరీక్షగా రేడియోధార్మిక అయోడిన్ పరీక్ష జరుపబడుతుంది. మీ నోటి ద్వారా రేడియోధార్మిక అయోడిన్ ఇవ్వబడుతుంది. తద్వారా మీ థైరాయిడ్ తీసుకోగల అయోడిన్ సామర్థ్యం అంచనా వేయబడుతుంది. మీరు మూత్ర విసర్జన చేసిన తర్వాత మీ శరీరం నుండి ఈ ట్రేసర్ తొలగించ బడుతుంది.

చల్లని చేతులు:

చల్లని చేతులు:

మీ చేతులు చల్లగా మారినప్పుడు, అది రక్త ప్రవాహం లేకపోవడాన్ని సూచిస్తుంది. హైపోథైరాయిడిజం సమస్యతో భాదపడుతున్న సమయంలో, థైరాయిడ్ గ్రంధి యొక్క పనితీరు తక్కువగా ఉంటుంది. ఇది అధిక హోమోసిస్టీన్తో ముడిపడి ఉంటుంది. హోమోసిస్టీన్ అనేది ఒకరకమైన అమినో ఆమ్లం వర్గానికి చెందింది. ఇది రక్తం యొక్క పేలవ ప్రవాహాన్ని సూచిస్తుంది. ఈ సమస్య ప్రధానంగా నరాలు గట్టిపడే సమస్యలకు మరియు గుండె వ్యాధులకు దారితీస్తుంది. దీనికి ప్రధాన కారణo, రక్తంలో నిర్వహించబడే ముఖ్యమైన పోషకాలు చేతులు మరియు కాళ్ళను చేరలేకపోవడమే.

చేతిలో ముడుతలు:

చేతిలో ముడుతలు:

హైపోథైరాయిడిజంతో భాదపడేవారు, చేతులలో అదనపు గీతలను మరియు ముడుతలను అధికంగా కలిగి ఉంటారు. క్రియారహితమైన థైరాయిడ్ గ్రంధి, వృద్దాప్య ఛాయలను కూడా పెంచుతుంది. క్రమంగా ముడుతలతో కూడిన చర్మానికి కారణమవుతుంది. పొడిచర్మానికి కూడా క్రియారహిత థైరాయిడ్ గ్రంధి కారణంగా ఉంటుంది. క్రమంగా ఇటువంటి అసాధారణ పోకడలకు చర్మం గురవుతుందని అనుమానం వచ్చిన ఎడల తక్షణమే వైద్యుని సంప్రదించడం మేలని సూచించబడింది.

చర్మం పసుపు రంగులోకి మారడం:

చర్మం పసుపు రంగులోకి మారడం:

హైపోథైరాయిడిజం కారణంగా చర్మం లేతగా మరియు పసుపు రంగులోకి మారుతుంది. కొన్నిసార్లు చర్మం రంగు, నారింజ రంగును కూడా తలపిస్తుంది. క్రియారహిత థైరాయిడ్ హార్మోన్ కారణంగా చర్మం పాలిపోయిన పేలవంగా మారుతుంది. చర్మం కొన్ని సందర్భాలలో ఎరుపు, పసుపు రంగులోకి మారడమే కాకుండా, పొరలు పొరలుగా కూడా కనపడవచ్చు. క్రమంగా ఇది దురదతో కూడిన అసౌకర్యానికి కారణంగా మారుతుంది. ఈ రంగు మారడం వంటి సమస్యలు అధికంగా అరచేతుల్లో కనిపిస్తుంటుంది .

గోర్లు పసుపు రంగులోకి మారడం, మరియు గోరు చుట్టు వంటి సమస్యలు:

గోర్లు పసుపు రంగులోకి మారడం, మరియు గోరు చుట్టు వంటి సమస్యలు:

హైపో థైరాయిడిజం కారణంగా చర్మం రంగు మారడమే కాకుండా, మీ గోర్లు కూడా అనేక సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. ముఖ్యంగా గోరుచుట్టు వంటి సమస్యలు అధికంగా తలెత్తడం, చర్మం సున్నితంగా మారడం, రంగు మారడం మొదలైన లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. దీనికి కారణం, అంత్య భాగాలకు రక్త ప్రవాహం సరిగ్గా లేకపోవడమే. రక్త ప్రవాహం సరిగ్గా లేని కారణంగా, ఆయా ప్రాంతాలు పాలిపోవడం క్రమంగా రంగుమారడం, సమస్యాత్మకంగా పరిణమించడం జరుగుతుంది.

గోర్లు పెళుసుగా మారడం:

గోర్లు పెళుసుగా మారడం:

పెళుసైన గోర్లు అధికంగా పొడిబారి ఉంటాయి, క్రమంగా సులభంగా విరిగిపోయే తత్వాన్ని కలిగి ఉంటాయి. ఒక వ్యక్తి హైపో థైరాయిడిజం సమస్యను కలిగి ఉన్నప్పుడు, గోర్ల అంత్యభాగాలకు రక్తసరఫరా తగ్గడం మూలాన, పోషకాలు సరిగ్గా అందని కారణాన, రంగు మారడం, పెళుసుగా తయారవడం జరుగుతుంది. అంతేకాకుండా విరిగిపోవడం, తిరిగి పెరగకుండా సమతౌల్యాన్ని కోల్పోవడం వంటివి జరుగుతాయి. అందవిహీనంగా కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా గోరు ఫలకం (ఓనికోలిసిస్ లేదా నెయిల్ ప్లేట్) దెబ్బతిని, ఒక్కోసారి గాయాలు కూడా కనపడడం జరుగుతుంది.

ఓనికోలిసిస్ :

ఓనికోలిసిస్ :

చేతులు మరియు కాళ్ళ అంత్యభాగాలకు ప్రధానంగా రక్త ప్రవాహం లేని కారణంగా గోర్ల యొక్క ఆరోగ్య క్షీణతకు దారితీస్తుంది. క్రమంగా గోర్లు ఫంగల్ ఇన్ఫెక్షన్లకు గురవడం జరుగుతుంది. ఈ రుగ్మతను ఓనికోలిసిస్ వలె సూచిస్తారు. ఈ వ్యాధి గోళ్ళపై తీవ్ర ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఈ పరిస్థితి గోరుచుట్టు, లేదా పెళుసుగా మారే తత్వాలను కలిగి ఉన్న, హైపెర్కేరటోసిస్ లక్షణాలను కలిగి ఉంటుంది. మరియు ఇది గోర్లకు రక్త ప్రవాహాన్ని తగ్గించి, జీవo పోయేలా చేస్తుంది కూడా. ఈ సమస్య గోరు ఫలకం పసుపు రంగులోకి మారడానికి కారణం అవుతుంది. క్రమంగా గోర్లు శిధిలాల వలె అందవిహీనంగా మారడమే కాకుండా ఆహారం తీసుకోడంలో కూడా అసౌకర్యంగా పరిణమిస్తుంది.

మీరు పైన చెప్పిన సూచనల ప్రకారం,

మీరు పైన చెప్పిన సూచనల ప్రకారం,

మీరు పైన చెప్పిన సూచనల ప్రకారం, హైపో థైరాయిడిజంతో కూడిన సంకేతాలను కలిగి ఉన్న ఎడల, తక్షణమే వైద్యుని సంప్రదించడం మేలు. తద్వారా సరైన మందులు మరియు చికిత్సను అందించవచ్చు. ఈ సమస్య యొక్క నియంత్రణాస్థితిని కొనసాగించటం ముఖ్యం. పరిస్థితిని అనుసరించి, నోటి ద్వారా, ప్రతిరోజూ టాబ్లెట్ల రూపంలో హార్మోనుల స్థాయిలను క్రమబద్దీకరించవలసిన అవసరం ఉంటుంది. ఈ మోతాదులు, రక్త పరీక్ష ద్వారా వైద్యునిచే నిర్ధారించబడుతుంది. రక్తపరీక్షలు సమయానుసారం, వైద్యుని సూచనల మేరకు చేయిస్తూ ఉండాలి. అవసరానికి మించిన వాడకం హైపర్ థైరాయిడిజం సమస్యకు దారితీయవచ్చు. క్రమంగా అధిక రక్తపోటు, జీవక్రియలు అతివేగం, జీర్ణ సంబంధ సమస్యలు, హార్మోనుల అసమతౌల్యం వంటి తీవ్ర సమస్యలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కావున ఎటువంటి సంకేతాలను చూసినా, ఏమాత్రం నిర్లక్ష్యం కూడదు అని గుర్తుంచుకోండి.

English summary

How Your Hands Can Indicate Thyroid Problem

Hypothyroidism is sometimes caused by Hashimoto's disease or a surgery is performed to remove the thyroid gland. The general symptoms of hypothyroidism are getting tired often, constipation, feeling depressed, hair loss etc. Dry skin is also one of the reasons why wrinkles tend to become excessively visible when one has an underactive thyroid gland.
Desktop Bottom Promotion