ఇర్ఫాన్ ఖాన్ భాధపడుతున్న న్యూరోఎండోక్రిన్ ట్యూమర్ వ్యాధి గురించి తెలుసుకోవలసిన నిజాలు

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

గత కొన్ని రోజులుగా, ఇర్ఫాన్ ఖాన్ యొక్క 'అరుదైన వ్యాధి' గురించి చర్చలు జరిగాయి. దీనికి కారణం ఇర్ఫాన్ ఖాన్ తన అన్నీ పనులను పక్కన పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ మద్యనే తన ట్విట్టర్ అకౌంట్ లో అతను న్యూరోఎండోక్రిన్ కణితితో బాధపడుతున్నట్లు పేర్కొన్నాడు. ఈ ట్వీట్ ఇండస్ట్రీ నివ్వెరపోయేలా చేసింది.

నేషనల్ మరియు ఇంటర్నేషనల్ చిత్రాలలో నటించిన బాలీవుడ్ నటుడు ఈ వ్యాధి నివారణకై దేశాలను దాటి వెళ్లాల్సిన పరిస్తితి వచ్చింది.

ఈ ఆర్టికల్లో, న్యూరోఎండోక్రిన్ కణితి గురించిన పూర్తి వివరాలను మీకు అందిస్తున్నాం.

Irrfan Khan Diagnosed With Neuroendocrine Tumour: Everything You Need To Know

ఎండోక్రైన్ సిస్టం

ఎండోక్రైన్ వ్యవస్థ హార్మోన్లను ఉత్పత్తి చేసే కణాలతో తయారు చేయబడిన శరీరంలోని ఒక భాగం. హార్మోన్లు రక్తకణాలు లేదా ప్లాస్మా ద్వారా వెళుతున్న రసాయన పదార్ధాలు, ఇవి శరీరం యొక్క ఇతర అవయవాలు మరియు కణాలపై ఒక ప్రత్యేక కార్యాచరణను కలిగి ఉంటాయి.

ఎండోక్రైన్ ట్యూమర్ అంటే ఏమిటి?

శరీరం యొక్క ఆరోగ్యకరమైన కణాలు వాటి పరిమితిని దాటి మారుతూ నియంత్రణ స్థాయి నుండి పెరుగుతాయి, ఈ సామూహిక రూపాన్ని కణితి అని పిలుస్తారు. కణితి నిరపాయమైనది లేదా క్యాన్సరు కావచ్చు. ఒక నిరపాయమైన కణితి అంత ప్రమాదకారి కాదు, ఇది పెరుగుతుంది కానీ వ్యాప్తి చెందదు. కానీ ఒక క్యాన్సర్ కణితి ప్రాణాంతకం, ఇది పెరుగుతుంది మరియు శరీరం యొక్క ఇతర భాగాలకు వ్యాపిస్తుంది.

హార్మోన్లను ఉత్పత్తి మరియు విడుదల చేసే శరీర భాగాలలో ఎండోక్రైన్ కణితి పెరుగుతుంది. హార్మోన్లను ఉత్పత్తి చేసే కణాల నుండి కణితి అభివృద్ధి చెందుతున్నందున, కణితి కూడా హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తుంది.

న్యూరోఎండోక్రిన్ ట్యూమర్ అంటే ఏమిటి?

న్యూరోఎండోక్రిన్ ట్యూమర్ అంటే ఏమిటి?

ఈ విధమైన కణితి శరీరంలోని న్యూరోఎండోక్రిన్ వ్యవస్థ యొక్క హార్మోన్లను ఉత్పత్తి చేసే కణాలలో ప్రారంభమవుతుంది. NET అని కూడా పిలవబడే న్యూరోఎండోక్రిన్ కణితి అనేది ఒక తీవ్రమైన స్థితి, దీనిలో అసాధారణo గా హార్మోన్స్ లో పెరుగుతున్న కణజాలం, ఉత్పత్తి చేసే నాడీ కణాలు లేదా శరీరం యొక్క న్యూరోఎండోక్రిన్ కణాలతో పెరుగుతుంది. ఇటువంటి న్యురోఎండోక్రిన్ కణాలు కడుపు మరియు ప్రేగులు సహా ఊపిరితిత్తులలో, జీర్ణశయాంతర ప్రేగులలో కనిపిస్తాయి.

న్యురోఎండోక్రిన్ కణాలు, ఊపిరితిత్తుల ద్వారా రక్తం మరియు వాయు ప్రవాహాన్ని క్రమబద్దీకరించడం మరియు జీర్ణశయాంతర ప్రేగుల ద్వారా త్వరితగతిన ఆహారాన్ని పంపడంలో సహాయo చేస్తాయి.

న్యూరోఎండోక్రిన్ ట్యూమర్ రకాలు

న్యూరోఎండోక్రిన్ ట్యూమర్ రకాలు

అనేక రకాల న్యూరోఎండోక్రిన్ కణితులు ఉన్నాయి, వీటిలో ఫెరోక్రోమోసైటోమా, మెర్కెల్ కణ క్యాన్సర్ మరియు న్యూరోఎండోక్రిన్ క్యాన్సర్ ఉన్నాయి.

ఫెయోక్రోమోసైటోమా

ఇది అడ్రినల్ గ్రంథి యొక్క క్రోమాఫిన్ కణాలలో సంభవించే అరుదైన కణితి. ఈ రకమైన కణితి హార్మోన్ల ఉత్పత్తిని అసాధారణ రీతిలో పెంచుతుంది - ఆడ్రినలిన్ మరియు నారాడ్రినలిన్ రెండు కూడా హృదయ స్పందనల రేటును మరియు రక్తపోటును అధికంగా పెంచుటలో దోహదం చేస్తాయి. ఇది నిరపాయమైన కణితి అయినప్పటికీ, ఇది ఎప్పటికైనా ప్రాణాంతకమవుతుంది.

మెర్కెల్ సెల్ క్యాన్సర్

ఇది కణాలలో మొదలవుతుంది, ఇది చర్మం కింద మరియు వెంట్రుకల పుటల వద్ద హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది సాధారణంగా మెడ మరియు తల ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది.

న్యూరోఎండోక్రిన్ కార్సినోమా

ఈవిధమైన కణితి ఊపిరితిత్తులు, మెదడు మరియు జీర్ణశయాంతర ప్రేగు వంటి శరీర ఇతర ప్రాంతాలలో ప్రారంభమవుతుంది.

న్యూరోఎండోక్రిన్ ట్యూమర్ లక్షణాలు మరియు సంకేతాలు

న్యూరోఎండోక్రిన్ ట్యూమర్ లక్షణాలు మరియు సంకేతాలు

న్యూరోఎండోక్రిన్ కణితులతో బాధపడుతున్న ప్రజలు క్రింది లక్షణాలను కలిగి ఉండవచ్చు:

అధిక రక్తపోటు, తలనొప్పి, ఫీవర్, చమటలు పట్టడం, ఆందోళన , వికారం, పల్స్ సరిగ్గా లేకపోవుట , హృదయ స్పర్శలు, వాంతులు, ఆకలి లేదా బరువు కోల్పోవడం, విరేచనాలు, గ్యాస్ట్రిక్ అల్సర్ వ్యాధి, అసాధారణ రక్త స్రావం, కామెర్లు.

న్యూరోఎండోక్రిన్ ట్యూమర్స్ చికిత్స ఎలా

న్యూరోఎండోక్రిన్ ట్యూమర్స్ చికిత్స ఎలా

చికిత్స ఎంపికలు క్రింద ఇచ్చిన పలు అంశాలపై ఆధారపడి ఉంటాయి.

న్యూరోఎండోక్రిన్ .యే రకమైన కణితి రకం? అది ఒక క్యాన్సర్ కణితి నా ? కాదా ?. అన్న ప్రశ్నపై ఆధారపడి చికిత్సకి పూనుకుంటారు వైద్యులు.

సాధ్యమైన దుష్ప్రభావాలు

రోగి శరీరం మొత్తం ఆరోగ్య క్షీణతకు లోనవుతుంది

English summary

Irrfan Khan Diagnosed With Neuroendocrine Tumour: Everything You Need To Know

Irrfan Khan has been diagnosed with neuroendocrine tumour and is going out of the country to seek treatment. A neuroendocrine tumour is a condition in which an abnormal tissue grows in the hormone-producing nervous cells or neuroendocrine cells of the body. The neuroendocrine cells are found in the lungs, gastrointestinal tract, including the stomach and intestines.
Story first published: Saturday, March 17, 2018, 18:00 [IST]