For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెజైనా పొడిబారటం లక్షణాలు, కారణాలు

వెజైనా పొడిబారటం లక్షణాలు, కారణాలు

|

సాహిత్యం ప్రకారం ఆడవారు బలహీనులు. ప్రజలు కూడా దాన్ని పట్టుకుని సాధారణంగా స్త్రీలు సున్నితమైనవారని అనేసుకుంటారు.

శారీరకంగా చెప్పాలంటే, ఇది దాదాపు అందరూ ఒప్పుకునే విషయం. మనందరం సాధారణంగా స్త్రీలు ఇంటి మొత్తంలో కుటుంబ అవసరాలు తీరుస్తూ, సంరక్షిస్తూ, తమ శరీరాలను, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం చూస్తూనే ఉంటాం. తన సున్నిత శరీరంలో ఎన్నో అసౌకర్యాలు కలిగినా ఆమె ఏరోజూ ఒక్క మాట అనదు.

చాలా విషయాలపై తన మౌనానికి కారణాలు ఏవైనా, 21 వ శతాబ్దంలో ఏ మనిషి మౌనంగా అనారోగ్యంతో బాధపడకూడదన్నది నిజం.

Vaginal Dryness Symptoms And Causes

ఈ ఆర్టికల్ లో మనం వెజైనా పొడిబారడం గురించి చర్చిద్దాం. నివేదికల ప్రకారం,ఈ స్థితి ప్రతి ముగ్గురు భారతీయ స్త్రీలలో ఒకరికి వచ్చినా, దీన్ని ఎప్పుడూ ఎక్కువగా ఎవరూ చర్చించరు.

ఈ ఆర్టికల్లో వెజైనా పొడిబారటం లక్షణాలు, కారణాలు చర్చించబోతున్నాం, అలా స్త్రీలకు దీనితో పోరాడటానికి సరైన అవగాహన వస్తుంది.

- తక్కువ ఈస్ట్రోజెన్

- తక్కువ ఈస్ట్రోజెన్

యోని (వెజైనా)లోని కణజాలాలను ఆరోగ్యంగా, తేమతో ఉంచే పని ఈస్ట్రోజెన్ హార్మోన్ ది. శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గితే వెజైనా పొడిబారుతుంది. కొన్నిసార్లు మీరు ఇంకేదానికో తీసుకునే మందులు ఈస్ట్రోజెన్ స్థాయిని తగ్గించవచ్చు. అందుకని మీరు ఏదన్నా మందులు వేసుకుంటుంటే, వెజైనా పొడిబారుతుంటే, వెంటనే డాక్టరుకి ఈ విషయం తెలియచేయండి. చాలామటుకు గర్భాశయ ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియాసిస్ ల చికిత్సలలో ఈస్ట్రోజెన్ తగ్గించే మందులను వాడమని సూచిస్తారు.

-అలర్జీ తగ్గడానికి మందులు

-అలర్జీ తగ్గడానికి మందులు

దాదాపు అన్ని అలర్జీలు, జలుబు,ఆస్తమా మందుల్లో ముఖ్యంగా యాంటీ హిస్టమైన్ ఉంటుంది. యాంటీ హిస్టమైన్ సాధారణంగా శరీరమంతా పొడిబారేలా చేస్తుంది. దీనివల్ల వెజైనాలో కూడా తేమ తగ్గిపోతుంది. కొన్ని యాంటీ డిప్రెసెంట్ మందులు కూడా యోనిపై ఇదే ప్రభావం చూపిస్తాయి.

-క్యాన్సర్ చికిత్స

-క్యాన్సర్ చికిత్స

మానవాళికి క్యాన్సర్ నిజంగానే ఒక పెద్ద మహమ్మారి. మనిషి ఎంత సాంకేతికంగా ముందుకెళ్ళినా క్యాన్సర్ కి ఇంకా మందు కనుగొనలేదు.

రేడియేషన్, కీమోథెరపీని క్యాన్సర్ కి చికిత్సగా వాడుతున్నారు. ఈ చికిత్సల్లో సైడ్ ఎఫెక్ట్ గా యోని పొడిబారిపోవడం పరిశీలించారు.

-లైంగికంగా కోరిక తగ్గిపోవడం

-లైంగికంగా కోరిక తగ్గిపోవడం

ఇది విడదీయలేని ఒక ముడిలాంటిది. సెక్స్ మీద ఆసక్తి తగ్గిపోయేలా చేసే అనేక సెక్స్ సమస్యలు ఉన్నాయి. అన్నిటికన్నా సాధారణమైనది తక్కువ లిబిడో. దీనికి మరోవైపు వెజైనా ఎక్కువగా పొడిబారిపోవడం తక్కువ లిబిడోకి కారణం. అందుకని రెండువైపుల నుండి ముడిపడ్డ ఈ సమస్యకి మీరు వెంటనే వైద్యసాయం తీసుకోవడం మంచిది.

నిజానికి, కొంతమంది ఆడవాళ్ళ కేసుల్లో కేవలం సెక్స్ చేస్తే సరిపోదు. ఈ పొడిబారే వెజైనా కష్టం నుంచి తప్పించుకోటానికి, మీరూ, మీ భాగస్వామి సెక్స్ ముందు ఎక్కువ ఫోర్ ప్లేలో పాల్గొనటం అవసరమని సూచిస్తారు. ఇది ఆనందదాయకమే కాదు, మీ శరీరానికి ఆరోగ్యం కూడా.

-అండాశయాన్ని సర్జరీతో తొలగించటం

-అండాశయాన్ని సర్జరీతో తొలగించటం

ఏదో ఆరోగ్యసమస్య వలన స్త్రీలకి అండాశయాలను తొలగించాల్సి వస్తుంది. దీనివల్ల కూడా వెజైనా పొడిబారుతుంది. యోనిలో పొడిదనం ఓవరీస్ తీసేసిన వెంటనే రావచ్చు లేదా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా రావచ్చు.

-పెరిమెనోపాజ్

-పెరిమెనోపాజ్

మనలో చాలామందికి తెలుసు, స్త్రీలలో ఒక వయస్సు దాటాక నెలవారీ పిరియడ్స్ ఆగిపోతాయి, ఇది మెనోపాజ్ అనే సహజమైన స్థితి. ఇతర శరీర ప్రక్రియల్లాగానే మెనోపాజ్ ప్రారంభదశ కూడా ఒక్కో స్త్రీలో ఒక్కోలా ఉంటుంది.

మెనోపాజ్ మొదలయ్యే ముందు సమయాన్ని పెరిమెనోపాజ్ అంటారు, అలాగే మెనోపాజ్ లక్షణాల్లో మొదటిది వెజైనా పొడిబారటం.

అందుకని మీ వయస్సు 50 పైబడితే, ఎక్కువగా వెజైనా పొడిబారటాన్ని గమనిస్తే, మీకు త్వరలో మెనోపాజ్ మొదలవబోతోందని అర్థం. పిరియడ్స్, ప్రెగ్నెన్సీలాగానే మెనోపాజ్ కూడా శరీరంలో సహజమైన మార్పు,దీనితో కూడా టన్నుల కొద్దీ మార్పులు వస్తాయని అర్థం చేసుకోండి.

-వాతావరణం, మానసిక ఆందోళన సంబంధిత కారణాలు

-వాతావరణం, మానసిక ఆందోళన సంబంధిత కారణాలు

ఆధునిక జీవనవిధానంలో మానసిక వత్తిడి,ఆందోళన నిండివున్నాయి. వాతావరణంలో పెరిగిన కాలుష్యం మరింత సమస్యని పెంచింది. అలాంటి స్థితిలో, ఈ రెండు కారణాలు కలిసి ఇంటికి బయట ఎక్కువసేపు పనిచేసే స్త్రీలపై ప్రభావం చూపించి వెజైనా పొడిబారే సమస్యకి దారితీస్తున్నాయి.

-ప్రసవం, పాలివ్వడం

-ప్రసవం, పాలివ్వడం

తన కడుపులో మోసి బిడ్డను కనే ఆ తొమ్మిది నెలల్లో ఒక స్త్రీ శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయని మనందరికీ తెలిసిందే. తర్వాత కూడా,బిడ్డ పుట్టాక కూడా శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. బాలింతగా ఉన్నప్పుడు, పాలిచ్చే దశలో ఆడవారి శరీరంలో వచ్చే ఈ మార్పుల్లో వెజైనా పొడిబారటం కూడా ఒకటి.

ఇక్కడ ఒక్క మంచి విషయం ఏంటంటే ఈ చిరాకు తెప్పించే స్థితి తల్లి పాలివ్వడం ఆపిన వెంటనే దానంతట అదే తగ్గిపోతుందని పరిశీలించారు.

-డూషింగ్

-డూషింగ్

మగవారి శరీరం కన్నా స్త్రీ శరీరం చాలా సున్నితమైనదని మీరు తెలుసుకోవటం చాలా ముఖ్యం. మీ శరీర భాగాలన్నీ ఒకే రకపు సున్నితత్వాన్ని కలిగివుండవు. మీ శరీరంలో వెజైనా అన్నిటికన్నా సున్నితమైన భాగం.

అందుకే ఆ ప్రాంతంలో వాడే ఉత్పత్తులపట్ల మీరు అదనంగా కూడా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సబ్బులు, పర్ఫ్యూమ్స్, లోషన్లు, డూష్ లు వెజైనా ప్రాంతంలో పిహెచ్ బ్యాలెన్స్ ను మార్చి అక్కడంతా పొడిబారేలా చేస్తాయి.

-జోగ్రెన్స్ సిండ్రోం

-జోగ్రెన్స్ సిండ్రోం

ఈ వ్యాధి చాలా అరుదుగానే వస్తుంది కానీ దీనిని కూడా వదిలించుకోవడం చాలా కష్టం. ఇది ఒక ఆటోఇమ్యూన్ స్థితి, ఇందులో కళ్ళు, నోరు, వెజైనా పొడిబారతాయి.వెజైనా పొడిబారటంలో కూడా ఇలాంటి రకాన్ని నయం చేయటం చాలా కష్టం. ఇది ఎందుకంటే ఈ వ్యాధి శరీరంలో తేమని సృష్టించే కణాలపై దాడిచేస్తుంది.

English summary

Vaginal Dryness Symptoms And Causes

One out of three women suffer from vaginal dryness. This conditionis caused due to various reasons likelow estrogen levels, anti-allergic medication, cancer treatment, low sexual desire, surgical removal of ovaries, perimenopause, environment- and anxiety-related factors, child birth and breastfeeding, douching, and Sjogren's syndrome.
Story first published:Saturday, July 14, 2018, 16:53 [IST]
Desktop Bottom Promotion