For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీ దంతాలను నాశనం చేసే 10 ఆశ్చర్యకరమైన విషయాలు

  |

  ఈరోజుల్లో దంతవైద్యుల ఫీజులు అమాంతం పెరిగిపోవడానికి ఒకరకంగా మనమే కారణం, దీనికి వారిని నిందించలేము. మీ దంతాలను సహజసిద్దమైన పద్దతులతో కాపాడుకొనుట ద్వారా దంత వైద్యులను చీటికి మాటికీ సంప్రదించనవసరం లేకుండా చేస్తుంది.

  దంతక్షయానికి గురిచేసే కొన్ని ఆహారాలను పానీయాలను నిరోధించడం ద్వారా మీ జాగ్రత్త అనేది ప్రారంభమవుతుంది. హాని కలిగించే ఈ రెండు ప్రధాన అంశాలే కాకుండా, మీ దంతాలను నాశనం చేసే అనేక ఇతరములైన విషయాలు కూడా ఉన్నాయి.

  things that ruin your teeth

  చాలాకాలంగా నిపుణులు చెప్తున్న వివరాల ప్రకారం, దంత క్షయానికి మొదటి కారణం పళ్ళను సరిగ్గా తోమకపోవడమే. కఠినమైన బ్రష్షుల వినియోగం ద్వారా లేక పళ్ళను ఎక్కువ రాపిడికి గురిచేసేలా తోమడం మూలంగా చిగుర్లు రక్తస్రావానికి గురవ్వడమే కాకుండా అనేకములైన నోటివ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ తప్పులను సవరించుకొనుట ద్వారా దంత వైద్యులను సంప్రదించే అవసరాలు తగ్గుతాయి అని నిపుణులు చెప్తున్నారు.

  టూత్ పిక్స్ వాడడం:

  టూత్ పిక్స్ వాడడం:

  చాలామందికి పళ్ళ మద్య వ్యర్ధాలను తొలగించుకోవడానికి , మరియు వ్యాపకంలా టూత్ పిక్ ని వినియోగించే అలవాటు ఉంటుంది. పైగా ఇవి రకరకాల రూపాల్లో, ఫ్లేవర్లలో కూడా లభిస్తుంటాయి. కాని వీటిని అధికంగా వాడడం వలన చిగుర్లు దెబ్బతినడం మరియు పళ్ళ మీద ఉన్న ఎనామిల్ గం అరిగిపోవడం వంటివి జరుగుతాయి. తద్వారా దంతక్షయానికి గురవుతారు. మన చేతులారా మనకి మనమే తెచ్చుకునే సమస్యలలో ఇది ఒకటి.

  flossing

  flossing

  భోజనం చేసిన తర్వాత సన్నటి నైలాన్ లేదా టెఫ్లాన్ దారంతో పళ్ళ మద్యలో flossing చెయ్యడం ద్వారా, టూత్ బ్రష్ వెళ్ళలేని ప్రదేశాలు సైతం శుభ్రం చేసుకోవచ్చు. ఈ అలవాటు మీకు లేనట్లయితే తక్షణమే ఈ అలవాటు చేసుకోండి.

  మీ నాలుక శుభ్రంగా ఉండడం మంచిది

  మీ నాలుక శుభ్రంగా ఉండడం మంచిది

  మీ నాలికని సుద్ది చెయ్యడానికి నాలికను శుభ్రం చేసే క్లీనర్స్ (tongue cleaner) ని ఉపయోగించడం చాలా ముఖ్యం. మీరు ఈ పని చేయనట్లయితే అది నోటి దుర్వాసనకి కూడా కారణం అవ్వొచ్చు. మరియు రోజుకి ఒక్కసారే నాలికని శుభ్రం చేసుకునే వారు ఉంటారు, కాని కనీసం 2 ,3 సార్లయినా నాలిక శుభ్రం చెయ్యాలని డాక్టర్లు చెబుతుంటారు. ఎంచుకునే క్లీనర్లు కూడా సున్నితంగా ఉండేలా చూసుకోవాలి మరియు సున్నితంగా క్లీన్ చేసుకోవాలి. లేనిచో నాలిక గాయాల పాలయ్యే అవకాశం ఉంది.

  పుక్కిలించుట అన్నిటికన్నా ముందు

  పుక్కిలించుట అన్నిటికన్నా ముందు

  చాలామంది అన్నం తిన్న తర్వాత నోరు పుక్కిలించడం వంటివి చెయ్యరు , దీనికారణాన ఎన్నో రకాల క్రిములు నోటిలో చేరి అనేక సమస్యలకు తావిస్తుంది. కావున ఏం తిన్నా కూడా, ఎప్పటికప్పుడు నోరు పుక్కిలించడం చేస్తుండాలి. ఈవిధంగా రిన్సింగ్ మరియు పుక్కిలించడం అలవాటుగా చేయడం ద్వారా దంత క్షయం రాకుండా మరియు పళ్ళు పుచ్చిపోకుండా కాపాడుకోవచ్చు.

  పళ్ళు పుచ్చిపోవడం(కావిటీస్)

  పళ్ళు పుచ్చిపోవడం(కావిటీస్)

  ఈరోజుల్లో పళ్ళు పుచ్చడం అనేది సాధారణమైపోయిన, భయం అవసరంలేని సమస్య. మీ దంతాలకు ఒక రంధ్రం ఏర్పడి, క్రిములు చేరి నొప్పితో భాదిస్తుంటే, విస్మరించకుండా డాక్టరుని సంప్రదించడం మంచిది. దంత వైద్యుడు, ఆ పుచ్చుని శుభ్రం చేసి, వేరే ప్రాంతాలకు విస్తరించకుండా చేసి, ఆ రంధ్రాన్ని పూడ్చుతారు(రూట్ కెనాల్ ట్రీట్మెంట్). తద్వారా ఉపశమనం లభిస్తుంది. మీరు తీసుకునే జాగ్రత్తపైనే మీ పళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

  దంత వైద్యుని సంప్రదించుట

  దంత వైద్యుని సంప్రదించుట

  ముందు చెప్పినట్లు దంతవైద్యుని సంప్రదించుట ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయినప్పటికీ ప్రతి 6 నెలలకు ఒకసారి దంత వైద్యుని సంప్రదించుట మంచిది. తద్వారా పళ్ళకు సంబంధించిన సమస్యలు తెలుసుకోవడం ద్వారా, ఒక వేళ సమస్య ఉంటే తీవ్రతరం కాకుండా కాపాడుకోవచ్చు.

  చాలామంది పళ్ళు తెల్లగా రావాలన్న ఆలోచనతో ప్రకటనలను చూసి టూత్ బ్రష్, టూత్ పేస్ట్ ఎంపిక చేసుకోవడం చేస్తుంటారు. వీటిలో పంటిపై ఉన్న ఎనామిల్ ని నాశనం చేసేవే ఎక్కువ, పైగా ఇవి దీర్ఘకాలిక నష్టాన్ని కలిగిస్తుంది. ఎక్కువమంది తెలియకుండా చేసే తప్పిదం ఇది. టూత్ పేస్ట్, టూత్ బ్రష్ ఎంపికలో కూడా దంత వైద్యుని సూచనలు ముఖ్యం.

  మంచి టూత్ బ్రష్ ను ఎన్నుకోండి

  మంచి టూత్ బ్రష్ ను ఎన్నుకోండి

  మీ టూత్ బ్రష్ నందు తల పెద్దదిగా, bristles (ముళ్ళు) పొడవుగా ముందుకు వచ్చి ఉన్నాయా. అయితే తక్షణమే మీరు ఆ టూత్ బ్రష్ ని పడెయ్యండి. టూత్ బ్రష్ ఎప్పుడూ తల చిన్నదిగా ఉండేలా, సున్నితమైన bristles ను కలిగి ఉండేలా తీసుకోవాలి.

  రాత్రి భోజనం తర్వాత బ్రష్ చేస్తున్నారా

  రాత్రి భోజనం తర్వాత బ్రష్ చేస్తున్నారా

  చాలామంది రాత్రి భోజనం తర్వాత బ్రష్ చేయడానికి ఇష్టపడరు. కాని బ్రష్ చేయకపోవడం వలన దంతాలపై ఆహారపదార్ధాలు పేరుకుని పోయి నోటిలో క్రిముల సంఖ్య పెరగడంతో పాటు పళ్ళలో ఇరుక్కున్న ఆహారంలోని చక్కర నిల్వలను చక్కర ఆమ్లాలుగా మారేలా చేస్తుంది అని నిపుణులు చెప్తున్నారు. ఈ చక్కర ఆమ్లాలు దంతాల ఎనామిల్ పై దాడి చెయ్యడం మూలంగా తెలుపు రంగు పళ్ళు, లేత పసుపుపచ్చ రంగులోకి మారే అవకాశాలు ఉన్నాయి.` కావున రాత్రి వేళ భోజనం అయ్యాక బ్రష్ చెయ్యడం తప్పనిసరి.

  అయ్యో మీకు తెలుసా

  అయ్యో మీకు తెలుసా

  ఒక టాయిలెట్ ఫ్లష్ 10 అడుగుల దూరం లోని మీ టూత్ బ్రష్ పై బాక్టీరియా పెరిగేలా చెయ్యగలదని మీకు తెలుసా. ఇది మీ దంతాలను నాశనంచేసే నమ్మశక్యంకాని విషయాలలో ఒకటి. కావున మీ బాత్రూమ్ వెలుపల మీ బ్రష్ను ఉంచడం ఉత్తమం, లేదా టాయిలెట్ మూతతో మూసివేసి ఫ్లష్ చెయ్యడం సూచింపదగినది.

  English summary

  Surprising Things That Ruin Teeth | Things That Spoil Teeth | Oral Health Care | Oral Tips

  These are a few things that ruin your teeth. Take a look at these mistakes we all make every day that spoil our pearly white teeth.
  Story first published: Monday, March 12, 2018, 7:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more