For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పడుకోగానే నిద్ర రావాలంటే ఏం చెయ్యాలో తెలుసా? అలా చేస్తే సెకన్లలో నిద్రపోతారు

నిద్ర సరిగ్గా రాకపోవడాన్ని ఇన్సోమ్నియా అంటారు. దీనికి చాలా కారణాలుంటాయి. కొందరికి బెడ్ పైకి వెళ్లాక ఎంతకూ నిద్ర రాదు. అటువైపు పొర్లి ఇటువైపు పొర్లి సతమతమవుతుంటారు.

|

నిద్ర సరిగ్గా రాకపోవడాన్ని ఇన్సోమ్నియా అంటారు. దీనికి చాలా కారణాలుంటాయి. కొందరికి బెడ్ పైకి వెళ్లాక ఎంతకూ నిద్ర రాదు. అటువైపు పొర్లి ఇటువైపు పొర్లి సతమతమవుతుంటారు.
చాలా మందికి బాగా నిద్రపోవాలని ఉంటుంది. కానీ కొందరికి ఎంత ప్రయత్నించినా కూడా నిద్రరాదు. కంటి నిండా నిద్రపోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలా చేస్తే కచ్చితంగా మీరు బాగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది.

కొందరు పని ఒత్తిడి వల్ల సరిగ్గా నిద్ర పోలేరు. మరికొందరు ఇంటికొచ్చాక కూడా ఆఫీస్ కు సంబంధించిన విషయాలనే ఆలోచిస్తూ ఉండడంతో నిద్రపోలేరు. ఈ కారణాలన్నీ కూడా నిద్రలేమికి కారణం అవుతాయి.

ఒకే టైమ్ కు పడుకోండి

ఒకే టైమ్ కు పడుకోండి

రోజూ మీరు ఒకే టైమ్ కు పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఒక రోజు ముందుగా ఒక రోజు లేట్ గా పడుకోవడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. పడుకునే ముందు టీ తాగడం, టీవీ చూడడం చేయకూడదు. అయితే పుస్తకాలు చదివే అలవాటు పడుకునే ముందు చదవడం మంచిదే.

మద్యం తాగకండి

మద్యం తాగకండి

తిన్న వెంటనే నిద్రపోవడానికి ప్రయత్నించకూడదు. అలాగే నిద్రకు ఉపక్రమించే ముందు సిగరెట్స్, కూల్ డ్రింక్స్ తాగకూడదు. కొందరు మద్యం తాగిన తర్వాత నిద్ర బాగా వస్తుందని అనుకుంటారు. కానీ మొదట మీకు నిద్ర బాగా వచ్చినా తర్వాత మీరు చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ పడుకునే ముందు మద్యం తాగకుండా ఉండడం మంచిది.

మంచి అలవాటును పాటించండి

మంచి అలవాటును పాటించండి

మీరు డైలీ నిద్రకు ఉపక్రమించే ముందు ఒక మంచి అలవాటును పాటిస్తే నిద్ర అనేది ఈజీగా వస్తుంది. మధ్యమధ్యలో లేవండా కూడా ఉండదు. రోజూ బుక్ చదివి పడుకోవడం లేదా మంచి సంగీతం విని పడుకోవడం, పాలు తాగడం వంటివి చేస్తే మంచిది.

లూజ్ గా వేసుకోండి

లూజ్ గా వేసుకోండి

నిద్రకు ఉపక్రమించే ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లో మాట్లాడుతూ ఉండకండి. ఒక గంట ముందే మీరే ఫోన్ మాట్లాడడం ఆపేయండి. నిద్రపోయేటప్పుడు ఒంటికి బిగుతుగా ఉండే బట్టలు వేసుకోకండి. బాగా లూజ్ గా ఉండి సౌకర్యంగా ఉండేవాటినే వేసుకోండి.

నచ్చిన పొజిషన్ లో పడుకోండి

నచ్చిన పొజిషన్ లో పడుకోండి

అలాగే మీ బెడ్ ను మీకు సౌకర్యంగా మార్చుకోండి. బాగా మెత్తగా ఉంటేనే మీకు నిద్ర వస్తుందనుకుంటే మీ బెడ్ ను ఆ రకంగా మార్చుకోండి. కొందరికి ఫ్యాన్ ఉంటేనే నిద్ర వస్తుంది. అలాంటి వారు కచ్చితంగా ఫ్యాన్ ఆన్ చేసుకుని నిద్రపోండి. అలాగే బెడ్ రూమ్ ల్యాంప్ కూడా డార్క్ కలర్ లో ఉంటే నిద్ర బాగా పడుతుంది. మీకు నచ్చిన పొజిషన్ లోనే పడుకోవడానికి ప్రయత్నించండి.

 మెలటొనిన్

మెలటొనిన్

ఇక పడుకునే ముందు మీరు పాలు తాగితే కచ్చితంగా వెంటనే గాఢ నిద్రలోకి వెళ్తారు. మెలటొనిన్ అనే హార్మోను వల్లే మనకు నిద్ర బాగా పడుతుంది. ఇది పాలలో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బాగా నిద్రపోవాలంటే పాలు తాగడం మరిచిపోకండి.

English summary

these simple steps to getting a good night's sleep

these simple steps to getting a good night's sleep
Story first published:Thursday, August 30, 2018, 16:32 [IST]
Desktop Bottom Promotion