For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రానిక్ పెయిన్ సిండ్రోమ్ అంటే ఏమిటి ? దాని లక్షణాలు ఏమిటి?

క్రానిక్ పెయిన్ సిండ్రోమ్ అంటే ఏమిటి ? దాని లక్షణాలు ఏమిటి?

|

నొప్పి అనేది దెబ్బ లేదా గాయo కారణంగా మీరు భాధపడుతున్నారు అనడానికి సూచన. శరీరం కోలుకున్న కొలదీ, నెమ్మదిగా నొప్పి దూరమై తద్వారా ఉపశమనం లభిస్తుంది. కానీ కొన్ని అసాధారణ గాయాలవలన కానీ, రోగాల కారణంగా కానీ నొప్పి తగ్గకుండా కొనసాగింపబడుతూ ఉంటుంది. ఆ నొప్పి 3 లేదా 6 నెలలకు మించి ఉన్నట్లయితే ఆ నొప్పిని క్రానిక్ పెయిన్ గా గుర్తిస్తారు. దీని ప్రభావం మీ భౌతిక మరియు మానసిక పరిస్థితులపై ప్రభావం చూపిస్తుంది. రోజూవారి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అలాంటి మానసిక, శారీరిక ప్రభావాలతో కూడిన క్రానిక్ పెయిన్ ని క్రానిక్ పెయిన్ సిండ్రోమ్ గా పిలుస్తారు. ఈ క్రానిక్ పెయిన్ సిండ్రోమ్ తగ్గించడం చాలా క్లిష్టమైన ప్రక్రియ అయినా కూడా , దీనికి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది.

Chronic pain syndrome can affect people of all age groups

అసలు ఈ క్రానిక్ పెయిన్ సిండ్రోమ్ కి గల కారణాలు ఏమిటి?

కొన్ని సార్లు ఈ క్రానిక్ పెయిన్ సిండ్రోమ్ కి గల కారణాలు పూర్తిగా తెలియనప్పటికీ, ఇది తరచుగా ఏదైనా గాయం కారణంగా కానీ, ఆర్ధరైటీస్, వెన్ను నొప్పి, జాయింట్ పెయిన్స్, తలనొప్పులు, కండరాల నొప్పులు, ఒత్తిడి, నరాల సమస్యలు, కాన్సర్, ఎముకలు విరుగుట, జీర్ణాశయ సమస్యలు, కడుపులో ఆమ్ల ప్రభావాలు మొదలైన సమస్యల కారణంగా ఈ క్రానిక్ పెయిన్ సిండ్రోమ్ ప్రారంభమవుతుంది. వీటి కారణంగా ఒత్తిడికి గురయ్యే నరాలు మరియు గ్రంధుల అసమతౌల్యం వలన ఈ సమస్యలు వస్తున్నట్లు నిపుణుల అంచనా. ఈ క్రానిక్ పెయిన్ సిండ్రోమ్ కి ఒక వయసు పరిమితి అంటూ లేదు, పసిపిల్లల నుండి వృద్దుల వరకు ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా మహిళలలో మరియు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు గురైన వారిలోనే ఈ సమస్య కనిపిస్తున్నట్లు నివేదికల సారాంశం.

Chronic pain syndrome can affect people of all age groups

ఈ క్రానిక్ పెయిన్ సిండ్రోమ్ సూచనలు:

క్రానిక్ పెయిన్ సిండ్రోమ్ మీ భౌతిక శరీరాన్ని ప్రభావితం చెయ్యడమే కాకుండా మానసిక మరియు సామాజిక జీవితాన్ని సైతం ప్రభావితం చేస్తుంది. ఈ క్రానిక్ పెయిన్ సిండ్రోమ్ ఆందోళన, డిప్రెషన్, నిద్ర లేమి, చిరాకు, అపరాధభావం, అలసట, మద్యపానం, డ్రగ్స్, సంబంధాలలో అనాసక్తి, నిరుద్యోగం, ఆత్మహత్య ప్రేరేపిత ఆలోచనలు, మరియు అనేక కుటుంబ సమస్యలకు కూడా దారి తీస్తుంది.

Chronic pain syndrome can affect people of all age groups

ఈ క్రానిక్ పెయిన్ సిండ్రోమ్ కి చికిత్స ఉందా?

మీరు ఈ నొప్పిని భరించలేని స్థాయిలో ఉంటే, లేక ఎక్కువ కాలం నొప్పి కొనసాగుతూ వస్తూ ఉంటే, ఆలస్యం చేయకుండా డాక్టరుని సంప్రదించడం మేలు. తద్వారా మీకు ఏమైనా వాపులు , జాయింట్ పెయిన్స్ లేదా ఏదేని ఇతరసమస్యల వలన ఈ క్రానిక్ పెయిన్ సిండ్రోమ్ వచ్చిందో అనలైస్ చేసి పరీక్షల ద్వారా తెలియజేస్తారు. computed tomography, magnetic resonance imaging (MRI) మరియు x-ray పరీక్షలు దీనికి ముఖ్యంగా అవసరం. కొన్ని సార్లు పరిస్థితులను బట్టు occupational therapy, physical therapy, counselling, ఉపశమన పద్దతులు, spinal cord stimulation, nerve blocks, ఔషదాలు , సర్జరీలను సంప్రదించవలసి ఉంటుంది.

Chronic pain syndrome can affect people of all age groups

క్రానిక్ పెయిన్ సిండ్రోమ్ ఉపశమనానికి సత్వర మార్గాలు:

నడక అనేది క్రానిక్ పెయిన్ సిండ్రోమ్ ఉపశమనానికి ముఖ్యంగా సూచించబడుతుంది. నడకవలన శరీరంలో ఎండార్ఫిన్స్ విడుదల చేయబడుతాయి, ఇవి శరీరానికి సహజ నొప్పి నివారణా ఔషదం గా పనిచేస్తాయి. కావున రోజుకి కనీసం 30 నిమిషాలు నడక ఆరోగ్యానికి చాలా సహాయం చేస్తుంది. తద్వారా క్రానిక్ పెయిన్ సిండ్రోమ్ తో సహా నిద్ర లేమి కూడా దూరమవుతుంది. కచ్చితమైన సమయాన్ని నిద్రకి కేటాయించండి. క్రాస్వోర్డ్స్ , పజిల్స్ , సంభాషణలు , పుస్తకం చదవడం వంటి వాటి ద్వారా కూడా ఈ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయండి. ఒక్కోసారి పరద్యానం (Distraction) కూడా సహాయం చేస్తుంది.

డైటీషియన్ లేదా డాక్టర్ సలహామేరకు ఆహార ప్రణాళికలలో మార్పులు చేయడం ద్వారా, మరియు వ్యాయామ క్రియలలో మార్పుల ద్వారా నెమ్మదిగా క్రానిక్ పెయిన్ సిండ్రోమ్ ని దూరం చేయవచ్చు.

English summary

What Is Chronic Pain Syndrome And What Are Its Symptoms

About 25 percent of people with chronic pain will start having a condition called chronic pain syndrome. That is when people will have symptoms like depression and anxiety, which interfere with their daily lives. Experts believe that people with this condition have a problem with the system of nerves and glands that the body uses to handle stress.
Story first published:Thursday, March 29, 2018, 18:32 [IST]
Desktop Bottom Promotion