For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యాసెక్టమి అంగస్తంభనకు కారణం అవుతుందా?

|

వాసెక్టమీ అనేది వైద్యుని చేత చేయబడే సులభమైన శస్త్రచికిత్సగా ఉంటుంది. ఇది గర్భధారణ నుండి శాశ్వత ప్రాతిపదికన సంరక్షించడం కొరకు పురుషులకు చేయబడుతుంది. దీనిని మేల్ స్టెరిలైజేషన్ అని కూడా వ్యవహరిస్తారు. ఈ ప్రక్రియలో, వీర్య కణాలను తీసుకెళ్లే స్క్రోటమ్ దగ్గర ఉండే ద్వారాలను బ్లాక్ చేయడం (కట్ ఆఫ్) జరుగుతుంది. ఈ విధంగా వీర్య కణాలు పురుష శరీరం నుండి వచ్చే మార్గంలేని కారణాన, స్త్రీ గర్భం దాల్చే అవకాశం ఉండదు.

ఈ శస్త్రచికిత్సను గర్భ నిరోధానికి శాశ్వత రూపంగా పరిగణించడం జరుగుతుంది మరియు ఒక్కసారి శస్త్రచికిత్స జరిగిన ఎడల తిరిగి యధాస్థితికి తీసుకుని రావడం కష్టతరంగా ఉంటుంది. వాస్తవానికి అసాధ్యమనే చెప్పాలి. ఇది ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది: ఒకటి గాటు పద్ధతి, మరియు మరొకటి గాటులేని పద్ధతి. గాటులేని పద్ధతిలో ఇన్ఫెక్షన్స్ కలిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మరియు శస్త్ర చికిత్స నుండి కోలుకోడానికి కూడా తక్కువ సమయం పడుతుంది. అయితే, అనేకమంది వ్యక్తులు తమ తమ నమ్మకాల కారణంగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సను అనుసరించడానికి భయపడుతుంటారు. ముఖ్యంగా, ఈ వాసెక్టమీ ఫలితంగా అంగస్థంభన సమస్యలు తలెత్తుతాయని అపోహ చెందుతుంటారు. ఈ వాసెక్టమీ శస్త్రచికిత్స గురించిన మరిన్ని వాస్తవాలను తెలుసుకోడానికి వ్యాసంలో ముందుకు సాగండి.

erectile dysfunction

వాసెక్టమీ శస్త్రచికిత్సకు ముందు, ఈ ప్రక్రియ మూలంగా అంగ స్థంభన సమస్య కలగవచ్చుననే ఆలోచనలతో పురుషులు అత్యంత ఆతురత మరియు సందిగ్ధ పరిస్థితికి లోనవుతూ ఉంటారు. అయితే, పరిశోధనల ప్రకారం ఇటువంటి సమస్యలు అత్యంత అరుదైన ఘటనలు చూపించబడ్డాయి. మరియు ఇటువంటి అంశాల కారణంగా ఈ కుటుంబ నియంత్రణ పరంగా పురుషులు అనాసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు కూడా. కానీ శస్త్రచికిత్స ఒక్కటే అంగ స్థంభన సమస్యకు కారణమని చెప్పడానికి లేదు. అలా ఎందుకు జరుగుతుందో పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, వాసెక్టమీ సమయంలో వాస్తవంగా జరిగే అంశాలను లోతుగా, క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది.

వాసెక్టమీ అనేది సాధారణ గర్భ నిరోధక ప్రక్రియలలో ఒకటిగా ఉంటుంది. ఈ శస్త్ర చికిత్సను అనుసరించడం ద్వారా, శుక్ర కణాలు పురుష దేహాన్ని విడిచిపెట్టని స్థితికి చేరుకుంటాయి. కానీ పురుషుడు శస్త్రచికిత్స తరువాత కూడా, అంగ స్థంభనలను కలిగి ఉంటాడు, మరియు స్కలనం గావించగలుగుతాడు. కాకపోతే వీర్యంలో ఎటువంటి శుక్ర కణాలను కలిగి ఉండదు. అంతకుమించిన సమస్య ఏమాత్రమూ ఉండదు. క్రమంగా లైంగిక భాగస్వామికి గర్భం వచ్చే అవకాశం ఏమాత్రమూ ఉండదు.

ఈ ప్రక్రియ అంగ స్థంభనను ఏమాత్రమూ ప్రభావితం చేయదు. అనగా ఒక వ్యక్తి యొక్క శారీరక లక్షణాల మీద ఈ శస్త్రచికిత్స ఎటువంటి ప్రభావమూ చూపదు. క్లుప్తంగా చెప్పాలంటే, వాసెక్టమీ కారణంగా భావప్రాప్తి లేదా స్కలనం వంటి అంశాల పరంగా ఎటువంటి నష్టమూ ఉండదు. మీ వీర్యం కూడా వాసెక్టమీ శస్త్రచికిత్సకు ముందు ఉన్నట్లుగానే ఉంటుంది. కాకపోతే కేవలం శుక్ర కణాలు మాత్రం అందులో చేరవు.

కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సతో సంబంధం ఉన్న సాధారణ సమస్యలు ఏమిటి ?

కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సతో సంబంధం ఉన్న సాధారణ సమస్యలు ఏమిటి ?

వాసెక్టమీ తరువాత ఎటువంటి గుర్తించదగిన దుష్ప్రభావాలు లేనప్పటికీ, శస్త్రచికిత్స తరువాత కొన్ని సమస్యలు అత్యంత అరుదుగా కనబడవచ్చు;

• రక్తస్రావం

• స్క్రోటమ్ లో రక్తం గడ్డకట్టడం

• స్క్రోటమ్ దగ్గర కమిలినట్లు గాయాలు ఉండడం.

• శస్త్రచికిత్స జరిగిన ప్రాంతం వద్ద ఇన్ఫెక్షన్.

• వాపు

• తేలికపాటి నొప్పి/అసౌకర్యం

కొన్ని సందర్భాలలో వైద్యుని సంప్రదించడం ఆలస్యం చేసిన ఎడల తలెత్తే సంక్లిష్టతలు :

కొన్ని సందర్భాలలో వైద్యుని సంప్రదించడం ఆలస్యం చేసిన ఎడల తలెత్తే సంక్లిష్టతలు :

• దీర్ఘకాలిక నొప్పి

• వీర్యం విడుదల కారణంగా వాపు జనించుట.

• శస్త్రచికిత్స వైఫల్యం చెంది ఫలితంగా లైంగిక భాగస్వామి గర్భందాల్చడం.

• స్కలనం సమయంలో నిస్తేజమైన నొప్పి (వృషణాల భాగంలో ద్రవం పేర్కొనడం)

• వృషణాల పైభాగంలోని నాళం దగ్గరలో సిస్ట్ అభివృద్ధి జరగడం.

• వృషణాల చుట్టూతా ద్రవం నిండినట్లు ఉండటం

వైద్యుని ఎప్పుడు సంప్రదించాలి ?

వైద్యుని ఎప్పుడు సంప్రదించాలి ?

• వాసెక్టమీ శస్త్రచికిత్స తరువాత ఇన్ఫెక్షన్స్ లక్షణాలు ఉన్నట్లు కనిపిస్తూ ఉంటే, వెంటనే మీ వైద్యుని సంప్రదించవలసి ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ సాధారణ సంకేతాలుగా 100.4 డిగ్రీల ఫారన్హీట్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను కలిగి ఉండడం, వాపు మరియు తీవ్రమైన నొప్పితో పాటు శస్త్రచికిత్స చేసిన ప్రదేశం నుండి రక్తం కారడం మొదలైనవిగా ఉంటాయి.

• వాసెక్టమీ శస్త్రచికిత్స చేసిన ఆరు నుంచి పన్నెండు వారాల వరకు కూడా మీరు మీ వైద్యుని తరచూ సంప్రదించవలసి ఉంటుందని మరువకండి. వాసెక్టమీ శస్త్రచికిత్స విజయవంతమైనదా లేదా అని తనిఖీ చేయడం కొరకు వీర్య పరీక్షలు సైతం నిర్వహించవలసి ఉంటుంది. క్రమంగా శుక్ర కణాల గురించిన వివరాలను తనిఖీ చేయడం సాధ్యమవుతుంది. ఫలితాల కోసం వీర్యాన్ని సూక్ష్మదర్శిని(మైక్రోస్కోప్) కింద పరీక్షించడం జరుగుతుంది.

దీర్ఘకాలిక దుష్ఫ్రభావాలు ఏమైనా ఉన్నాయా ?

దీర్ఘకాలిక దుష్ఫ్రభావాలు ఏమైనా ఉన్నాయా ?

సంక్లిష్టతలు అత్యంత అరుదుగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక సంక్లిష్టతలలో భాగంగా కొన్ని అంశాలపట్ల అవగాహన ఉండడం మంచిది, అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం :

• అసౌకర్యం మరియు నొప్పి :

చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే, వాసెక్టమీ తరువాత దీర్ఘకాలిక నొప్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి.

• సర్జికల్ వైఫల్యం :

శస్త్రచికిత్స తర్వాత జరిపే వీర్య పరీక్షలలో శుక్ర కణాల ఉనికి ఉన్న ఎడల, శస్త్రచికిత్స వైఫల్యం చెందినదిగా గుర్తించడం జరుగుతుంది. కానీ లక్షల శస్త్రచికిత్సలలో ఒకటి, రెండు అరుదైన సందర్భాలలోనే వైఫల్యం ఉంటుంది. కాలంతో పాటు కత్తిరించిన భాగం తిరిగి పెరిగే అవకాశముంటుంది. దీని వలన కూడా వాసెక్టమీ విఫలం కావొచ్చు.

• ఎపిడిడైమిటిస్ :

ఎపిడిడైమిస్ అనేది ఒక రకమైన ద్వారంగా ఉంటుంది. ఇది వృషణాల వెనక భాగంలో ఏర్పడుతుంది. ఇది వీర్య కణాలను వాస్ డిఫరెన్స్ ద్వారా ప్రవహించేందుకు అనుమతిస్తుంది. వాసెక్టమీ సమయంలో వాస్ డెఫరెన్స్ కత్తిరించినప్పుడు, ఎపిడిడైమిస్ నుండి వాస్ డెఫరెన్స్ కు ప్రవహించునప్పుడు, వీర్య కణాలు తిరిగి వెనుకకు తరలింపబడుతాయి. దీని వలన ఒక్కోసారి గ్రంధి ఎర్రబారడం, లేదా వాపుకు గురవడం కారణంగా ఎపిడిడైమిటిస్ సమస్య తలెత్తుతుంది.

• వాసో వెనస్ ఫిస్టులా :

వాసెక్టమీ కారణంగా వాస్ డెఫరెన్స్ మీద అంటిపెట్టుకుని ఉండే రక్త నాళాలు గాయాలకు గురికావొచ్చు. ఇది ఫిస్టులా సమస్యకు దారితీసే అవకాశం ఉంది. క్రమంగా అక్కడక్కడ రక్తం పేరుకుని గడ్డలుకట్టవచ్చు కూడా. ఈ పరిస్థితికి సంకేతంగా, మూత్రంలో లేదా స్కలనంలో రక్తం పడడం జరుగుతుంటుంది. ఈ సంక్లిష్టత అత్యంత అరుదుగా ఉన్నప్పటికీ, ఈ పరిస్థితి లక్షణాలను కనుగొన్న ఎడల, తక్షణ వైద్య సహాయం తీసుకోవలసి ఉంటుంది.

• స్పెర్మ్ గ్రాన్యులోమా :

ఈ పరిస్థితిలో వీర్యకణాలు గట్టిపడి గడ్డలుగా ఏర్పడడం జరుగుతుంటుంది. దీని ఫలితంగా బొడిపెల మాదిరిగా చిన్న చిన్న సిస్ట్లు ఏర్పడుతాయి. ఈ సిస్ట్లు సాధారణంగా 1 మిల్లీ మీటర్ పరిమాణం నుండి 1 సెంటీ మీటర్ పరిమాణం వరకు ఉంటాయి. కానీ అందరికీ తీవ్ర పరిస్థితులను కలిగించవు. కొన్ని అరుదైన సందర్భాలలో మాత్రమే గ్రాన్యులోమా పరంగా నొప్పి ఉండొచ్చు. తీవ్రమైన కేసుల్లో కణితి కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. క్రమంగా కణితిని తొలగించేందుకు శస్త్రచికిత్స చేయవలసి రావొచ్చు.

కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స తర్వాత జీవితం :

కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స తర్వాత జీవితం :

• శస్త్ర చికిత్స అనంతరం, మీ స్క్రోటమ్ మీకు సంపూర్ణ మద్దతునివ్వాలి. క్రమంగా కొన్ని రోజుల బాండ్-ఎయిడ్ వేసి ఉంచవలసి ఉంటుంది. వాసెక్టమీ తరువాత కొన్ని రోజుల పాటు బిగుతుగా ఉండే లోదుస్తులను ధరించవలసి ఉంటుంది.

• మొదటి రెండు రోజులు క్రమం తప్పకుండా స్క్రోటమ్ మీద, వైద్యుల సూచనల మేరకు, ఐస్ ప్యాక్స్ అప్లై చేయవలసి ఉంటుంది.

• శస్త్రచికిత్స తరువాత శారీరక కార్యకలాపాలను పరిమితం చేయండి. శస్త్రచికిత్స తరువాత కనీసం 24 గంటలపాటు విశ్రాంతి అవసరం ఉంటుంది.

• వాసెక్టమీ తరువాత కనీసం వారం రోజులపాటు లైంగిక కార్యకలాపాలను పరిహరించవలసి ఉంటుంది.

గమనిక : కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, వైద్యుని సలహాలను పాటించడం ద్వారా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు కూడా. కావున అపోహలను వీడి, వైద్యుని సలహా మేరకు నిర్ణయం తీసుకోవడం మంచిది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Can vasectomy cause erectile dysfunction?

Vasectomy is a form of contraception wherein sperms do not leave the male body. After the procedure, men can still have erection and ejaculate, but the only difference would be that the semen would not contain any sperm. Post surgery there could be discomfort and pain, sperm granuloma, vaso-venous fistula etc.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more