For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Coronasomnia:కరోనా సోమ్నియాతో ఈ సమస్యలు పెరుగుతున్నాయట... దీన్ని ఎలా అధిగమించాలంటే...

కరోనాసోమ్నియా అంటే ఏమిటి? దీని లక్షణాలేంటి? వీటి నివారణకు ఏమి చేయాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఇన్నిరోజులు మనల్ని కరోనా వైరస్ మహమ్మారి కలవరపెడితే.. ఇప్పుడు కొత్తగా కరోనా సోమ్నియా అనే వచ్చింది. ఇది నిద్రలేమి సమస్యలను మరియు నిద్రకు సంబంధించిన సమస్యలను సూచిస్తుంది.

Coronasomnia: Definition, Causes, Symptoms, Risks and Solutions in Telugu

కోవిద్-19 కారణంగా ప్రపంచ మానవాళి జీవన విధానంలోనూ అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు డబుల్ డ్యూటీ.. లేదా బిజీ లైఫ్ కారణంగా నిద్రలేమి సమస్యలు ఎదుర్కొనేవారు.

Coronasomnia: Definition, Causes, Symptoms, Risks and Solutions in Telugu

అయితే కరోనా వల్ల కూడా నిద్రలేమి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని ఓ అధ్యయనంలో తేలిందట. ఇంతకీ కరోనాసోమ్నియా అంటే ఏమిటి? దీని నుండి నిద్రలేమి సమస్యలు ఎలా వస్తాయి? దీన్ని ఎలా అధిగమించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఎక్కువ సమయం ఇయర్ ఫోన్‌లను ఉపయోగించడం వల్ల దుష్ప్రభావాలు!ఎక్కువ సమయం ఇయర్ ఫోన్‌లను ఉపయోగించడం వల్ల దుష్ప్రభావాలు!

కరోనా సోమ్నియా అంటే ఏమిటి?

కరోనా సోమ్నియా అంటే ఏమిటి?

ఆ అధ్యయనం ప్రకారం కరోనా కాలంలో నిద్రలేమి రోగులు సంవత్సరంలో 20 శాతం నుండి 60 శాతం వరకు పెరిగారు. కరోనా మహమ్మారి ప్రజల మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇదంతా వైరస్ సంక్రమణ భయం, దాంతో సంబంధం ఉన్న లక్షణాల వల్ల ఈ ప్రమాదం ఏర్పడింది. వీటితో పాటు ఒత్తిడి, ఆందోళన కూడా పెరిగాయట. ఈ కారణాల వల్ల నిద్రపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని, దీన్నే ‘కరోనా సోమ్నియా'అంటారు.

కరోనా సోమ్నియా లక్షణాలు..

కరోనా సోమ్నియా లక్షణాలు..

జర్నల్ ఆఫ్ క్లినికల్ స్లీప్ మెడిసిన్ లో ప్రచురించిన పరిశోధనల ప్రకారం.. కరోనా సోమ్నియా లక్షణాలను ఇలా వివరించారు.

- నిద్రలేమి లక్షణాలు

- ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయి.

- ప్రతికూల ఆలోచనలు, ఆందోళన

- అలసిపోవడం

- పగటిపూట నిద్ర రావడం, ఏకాగ్రత లేకపోవడం, మానసిక స్థితి తగ్గిపోవడం.

కరోనా సోమ్నియా ఎవరికొస్తుంది..

కరోనా సోమ్నియా ఎవరికొస్తుంది..

కరోనా సోమ్నియా సోకే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే..

- COVID-19 ఉన్న వారికి

- ఫ్రంట్ లైన్ కార్మికులకు

- మహిళలకు

- కార్మికులకు

- యువకులకు

వీరందరికీ నిద్రలేమి సమస్యలు ఎక్కువగా ఉండొచ్చు. అలాగే అనారోగ్యం యొక్క లక్షణాలు కనిపించడం, విశ్రాంతి తీసుకోవడానికి కష్టంగా అనిపించడం, శ్వాస సంబంధిత సమస్యలు, దగ్గు వంటివి రావొచ్చు. సుమారు 75 శాతం మంది ఇలాంటి నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

కరోనా వైరస్ తో పోరాడటానికి విటమిన్ డి; నిపుణులు చెప్పేది ఇదే..కరోనా వైరస్ తో పోరాడటానికి విటమిన్ డి; నిపుణులు చెప్పేది ఇదే..

కరోనా సోమ్నియాకు కారణాలు..

కరోనా సోమ్నియాకు కారణాలు..

కరోనా మహమ్మారి దెబ్బకు చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. విద్యార్థులు తమ విలువైన సమయాన్ని, విద్యను కోల్పోయారు. వీరితో పాటు ఇతరులకు ఎంతో నష్టం జరిగింది. దీని వల్ల విపరీతమైన ఒత్తిడి పెరిగింది. దీంతో నిద్రలేమి సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ ఒత్తిడి వల్ల నిద్రపోతున్నపుడు అకస్మాత్తుగా మేల్కొనే అవకాశం పెరుగుతుంది. ఈ ప్రభావాలు దాదాపు 2 సంవత్సరాల వరకు ఉంటాయని నివేదికలు చెబుతున్నాయి.

జీవన శైలిలో మార్పులు..

జీవన శైలిలో మార్పులు..

కరోనా మహమ్మారి కారణంగా మన జీవన శైలిలో మార్పులు వచ్చేశాయి. ప్రపంచంలోని చాలా దేశాల్లో కర్ఫ్యూ, లాక్ డౌన్ విధించారు. దీంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. అనేక మంది ఇంటి నుండే పని చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. విద్యార్థులు ఇంటి నుండే ఆన్ లైన్ క్లాసులు, ఉద్యోగులు వర్చువల్ మీటింగులు, ఇతర కారణాల వల్ల కొత్త జీవన విధానానికి అలవాటు పడలేకపోతున్నారు. దీని వల్ల నిద్రలేమి సమస్యలు పెరిగిపోతున్నాయి.

కరోనా సోమ్నియా రాకూడదంటే..

కరోనా సోమ్నియా రాకూడదంటే..

కెఫిన్ వంటి విషపదార్థాల వల్ల మన నిద్ర నాశనమవుతుంది. మనలో నిద్రను ప్రధానంగా దెబ్బతీసే టాక్సిన్ కెఫిన్. అందువల్ల రాత్రి వేళలో టీ, కాఫీ వంటి కెఫిన్ పానీయాలను తీసుకోకపోవడం మంచిది. పగటి పూట కూడా వీటిని పరిమితంగా తీసుకుంటే నిద్రలేమి వంటి సమస్యలన అధిగమించొచ్చు.

ప్రాచీన భారతీయులు సుదీర్ఘకాలం జీవించడానికి ఈ అలవాట్లే కారణం ...!ప్రాచీన భారతీయులు సుదీర్ఘకాలం జీవించడానికి ఈ అలవాట్లే కారణం ...!

కంటికి బరువు తగ్గించడం..

కంటికి బరువు తగ్గించడం..

ప్రస్తుతం చాలా పనులు ఆన్ లైనులోనే జరుగుతున్నందున, డిజిటిల్ యుగంలో కంప్యూటర్, ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్లను తరచుగా చూడటం వల్ల మన కంటిపై బరువు పెరుగుతోంది. కాబట్టి మీ కంటికి సాధ్యమైనంత మేరకు ఒత్తిడి తగ్గించండి. ముఖ్యంగా రాత్రి వేళల్లో కంప్యూటర్ మరియు స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని మానేయాలి. అలాగే రాత్రి వేళలో పని చేసే సమయంలో మీరు లైట్లు కూడా పూర్తిగా ఆపేయాలి.

క్రమపద్ధతిలో..

క్రమపద్ధతిలో..

ఇక మీరు ప్రతిరోజూ చేసే పనులను క్రమబద్దీకరించాలి. ముఖ్యంగా సరైన సమయంలో తినడం... అనుకున్న సమయానికే పడకగదిలోకి వెళ్లి బెడ్ పై ఎక్సర్ సైజ్ చేయడం వంటివి చేయాలి. ఇలా మీరు ప్రతిరోజూ మానసిక శ్రమను పెంచుకోవాలి. దీని వల్ల మీకు ఒత్తిడి తగ్గుతుంది. మీకున్న ఖాళీ సమయంలో వీటిని చేసుకోవడానికి ప్రయత్నిస్తే.. నిద్రలేమి సమస్యల నుండి తప్పించుకోవడానికి మీకు సహాయపడతాయి.

English summary

Coronasomnia: Definition, Causes, Symptoms, Risks and Solutions in Telugu

Here we are discussing about the coronasomnia: Definition, causes, symptoms, risks and solutions in telugu. Read on
Story first published:Friday, July 2, 2021, 19:29 [IST]
Desktop Bottom Promotion